Pages

Wednesday, July 9, 2008

పశ్చిమ దేశాలకీ మనకీ మధ్య సాంస్కృతిక వైరుధ్యాలు.

ప్రాచీన కాలం నుండి భారత దేశం తనదయిన ప్రత్యేక సంస్కృతిని కలిగి ఉంది. భారతీయుల జీవన విధానం, ప్రకృతికి అనుగుణంగా వారు నిర్మించుకున్న తమదయిన ప్రత్యేక జీవన శైలి, అప్పటి పశ్చిమ దేశాల్లో ప్రజలని భారత దేశం వైపు ఆకర్షితమయ్యేలా చేసింది. చరిత్రకందని కాలం నుండి ఇప్పటి వరకు భారతీయ సంస్కృతి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలుపుకుంటూ, అనేక రకాలయిన ప్రజలు, వివిధ రకాలయిన భాషలు, భిన్న రకాలయిన వాతావరణం ఇవన్ని కలసి మన దేశానికి ఉపఖండం అనే పేరుని సార్ధకం చేసాయి. ఇంత వైవిధ్యమయిన దేశం ప్రపంచంలో మరెక్కడ ఉండదనడం అతిశయోక్తి కాదు. ఇన్ని రకాలయిన వైరుధ్యాలున్నప్పటికీ, అందరమూ ఒకే దేశంగా కలిసే ఉంటాము. దీనికి మూల కారణం మనందరి ఆలోచనల్లో వున్న పాజిటివ్ థింకింగ్. మనం చేసే ఏ పనయినా ఇతరులకు నష్టం కలిగించకూడదనే చూస్తాము. అదే సమయంలో ప్రకకృతికి దగ్గరగా ఉండేలా చూసుకుంటాము. దానివల్ల వ్యక్తిగా ప్రతీ ఒక్కరు సుఖంగా ఉంటారు, ప్రకృతికి హాని చేయ్యకుండాను ఉంటారు.


మా నాన్నగారు ఎప్పుడూ పుట్టిన రోజు ఫంక్షన్లకి గాని, మరే సందర్భంలోనూ కాండిల్స్ ఆర్పడం వంటివి చేయించరు. దీపాలార్పడం మన సంస్కృతి కాదురా అని అంటారు. "తమసోమా జ్యోతిర్గమయా" అనేది ఆయన సిద్ధాంతం. ఆయన మాటలు నాలో బలమయిన ముద్ర వేసి, పాశ్చాత్య దేశాలకి, మనకీ మధ్య వున్న తేడాల గురించి ఆరా తీయడం మొదలు పెడితే, ఎన్నో కొత్త విషయాలు ఆలోచనల్లోకి వచ్చాయి. మీరే చదవండి.


1. పుట్టినరోజు, పెళ్ళిరోజు లాంటి అన్ని సందర్భాలలో వాళ్ళు దీపం (candle) ఆర్పుతారు. మనం దీపారాధన చేసిగాని ఏ పనీ కూడా మొదలుపెట్టం.

2. మనం ఏ పని మొదలుపెట్టేప్పుడయినా, నిర్మించడం లేదా కట్టడంతో ప్రారంభిస్తాము. తాళి కడతాం, సంఖుస్తాపన చేసి ఇల్లు మొదలుపెడతాము. కాని వాళ్ళు మాత్రం తెంచడంతో మొదలుపెడతారు. పుట్టిన రోజ్కి కేక్ కటింగ్, ప్రారంభొత్సవానికి రిబ్బన్ కటింగ్ అలాంటివే.

3. ఎవరయినా ఎదురయితే మనం రెండు చేతులూ జోడించి నమస్కారం చేస్తాము. అదే వాళ్ళయితే shake hand ఇస్తారు. అవతలి వ్యక్తి చేతికి ఎమున్నాగాని అది మన చేతికి అంటుకుపోవలసిందే. రక రకాల రోగాలు చేతి స్పర్శ ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

4. ఆత్మీయులు చనిపోయినప్పుడు, విషాద చిహ్నంగా పువ్వులను పార్ధివ శరీరం మీద పెడతారు వాళ్ళు. మనం పుష్పాలను పవిత్రంగా ఎంచి దేవునికి మాత్రమే సమర్పిస్తాము. శుభ కార్యాలలో వాడుతాము.

5. ఏ స్త్రీనయినా గౌరవించే సంప్రదాయం మనది. తెలియని అమ్మయిగాని, మహిళగాని కనిపిస్తే, గౌరవంగా "అమ్మ" అని సంబోధిస్తాము. తల్లితో సమానమయిన స్థానం కల్పిస్తాము. పాశ్చాత్యుల దృష్టిలో బయటి స్త్రీ ఎవరయినా ఒకటే. తన భార్యతో సమానం.

6. మనది అందరి సుఖం కోరే సంస్కృతి. "సర్వే జనాస్సుఖినో భవంతు". అంటే, లోకంలో అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంతాము. వాళ్ళు ఎప్పుడూ పరాయి దేశాన్ని ఎలా కొల్లగొట్టాలా అని అలోచిస్తూంటారు. (ప్రపంచ యుద్ధాలన్ని పాశ్చాత్య దేశాల వారి వల్లే వచ్చినవి.)

7. మనకుంటే ప్రక్కవాడికి సాయం చెయ్యాలనే ఆలోచన మనది. ప్రక్క వాడితో కూడా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనె ధ్యేయం వాళ్ళది. (భారతీయులెవరూ తాము కనిపెట్టిన వాటితో వ్యాపారం చెయ్యాలని అనుకోలేదు. కాని పడమర దేశాల నుండి కేవలం వ్యాపారం చెయ్యాలనే మన దేశానికి వచ్చారు.)

8. మనది ఆధ్యాత్మిక సంబంధమయిన ఆలోచనలయితే, వాళ్ళది పూర్తి వస్తుగత ఆలోచన. (మన వాళ్ళు వేదాలు రచించారు. భగవంతుడి గురించి ఆలోచించారు. అదే సమయం లో వాళ్ళు పిరమిడ్లు కట్టారు).

9. మనం ప్రకృతిని తల్లిలా భావిస్తాము. మనం పొందే ప్రతి ఉపకారానికి దైవంతో సమానంగా పూజిస్తాము. సూర్యుడు, భూమి, నదులు, చెట్లు ఇలా ఒకటేమిటి, అన్నిటిలోను దైవాన్ని చూస్తాము. కాని వాళ్ళ దృష్టిలో అవన్ని మనుషుల స్వార్ధం కోసం ఉపయోగపడేవి, పరిశోధనకి ఉపయోగపడే వస్తువులు మాత్రమే. మనం ప్రకృతిని ప్రేమిస్తాము, వాళ్ళు కామిస్తారు. అంతే తేడా.

10. మనం మనకి పాలిచ్చే ఆవుని గోమాతగా, తల్లికి ప్రతిరూపంలా భావిస్తాము, పూజిస్తాము. వాళ్ళు అదే ఆవుని తెగనరికి 'బీఫ్' పేరుతో లొట్టలేసుకుంటూ తింటారు.

ఇలా చెప్పుకుంటే పోతే చాలా విషయాలున్నాయి. మరో టపాలో వివరించే ప్రయత్నం చేస్తాను.

చివరిగా ఒక మాట: సాంస్కృతిక పరంగా ఎన్ని రకాలయిన వైరుధ్యాలున్నా, పాశ్చాత్యులలోని నిజాయితీ, శ్రమిచే తత్వం, అనుకున్న సాధించే వరకు నిద్రపోని నైజం, వస్తువు నాణ్యత విషయంలో ఎక్కడా రాజి పడని గుణం, ఇవన్ని నాకు నచ్చుతాయి.

18 comments:

  1. మన సంస్కృతిలో ఇంకో గొప్ప గుణంకూడా ఉంది. మన గొప్ప చూసుకోడానికి ఇంకోళ్ళలో లోపాలు లెక్క పెట్టము.

    ReplyDelete
  2. కొత్త పాళి గారు, చాలా బాగా చెప్పారు

    ReplyDelete
  3. ఇంకొక్కటి, మనమేమో సుబ్బరంగా నీళ్ళూ చేతులు వాడతాము, వాల్లేమో అసహ్యంగా కాగితం ముక్కలూ...

    ReplyDelete
  4. కొత్తపాళీ,

    "మన సంస్కృతిలో ఇంకో గొప్ప గుణంకూడా ఉంది. మన గొప్ప చూసుకోడానికి ఇంకోళ్ళలో లోపాలు లెక్క పెట్టము"

    ఈ పోస్టులో దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది మరి.

    ReplyDelete
  5. ఏడవడి సరిగ్గా పొసగలేదనిపించింది.

    మీ జాబితాకి మరొక్కటి...మనం సొంత ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాం కానీ వీధుల్ని చెత్త చేస్తాం..వాళ్లు సొంతగదిని చెత్తలా పెట్టుకున్నా వీధుల్ని మాత్రం పరిశుభ్రంగా ఉంచుకుంటారు.

    ReplyDelete
  6. please dont mind. but evary samskriti vaariki goppa. manam arranged marriage chesukuntamani, rajasthan laanti area la lo aada vaallu inkaa sati lo chacchipotuntaarani, manam verrollamani, vaalloo anukuntaaremo. ilanti comparisions anavasaram. evari vatavarana paristhitula nunchi aayaa alavaatlu erpadataayi. for eg. manam intiki raagane kaallu kadukkovadam, mana feature ayite, vaallaki intiki ragane, kaalu kadukkovaDam, impossible factor.

    ReplyDelete
  7. వాళ్ళు చేసే ప్రతి చర్యకూ, మనం చేసే ప్రతి విధికీ సహేతుకమైన సాంస్కృతిక, చారిత్రక,వాతావరణ కారణాలున్నాయి. అంతమాత్రానా మనవి గొప్ప వాళ్ళవి ‘దిబ్బ’లా విశ్లేషించడం కాస్త అసంబద్ధంగా ఉంది.కొన్ని విషయాలు taste less గాకూడా ఉన్నట్టనిపించింది.

    ReplyDelete
  8. 11. వాళ్ళు ఇండియా అంటే ఆధ్యాత్మిక దేశమని మనల్ని గౌరవిస్తుంటారు. మనం ఇండియా ఎయిర్‌పోర్టులో దిగగానే మోసాలు చెయ్యడం మొదలుపెడుతుంటాము.

    మాస్టారూ, విషయాలను టూమచ్చిగా జనరలైజ్ చేయడం జరిగిపోయింది!

    ReplyDelete
  9. @ మహేష్‌కుమార్ గారు... మనం మాత్రమే గొప్పవాళ్ళమని నేను ఎక్కడా అనలేదు. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవలసిన మంచి విషయాలను కూడా టపా ఆఖరున వ్రాసాను. గమనించగలరు.

    @ నాగరాజా గారు... మోసాలు చేయడానికి, దొంగతనానికి, చెడ్డ పనులు చేయడానికి మన దేశమే కానక్కర్లేదు. అన్ని దేశాల్లోను ఉంటారు. యూరప్ టూర్ కి వెళ్ళీ సామాన్లు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది తెలుసు నాకు.

    @ సుజాత గారు... నేను చెప్పింది భారతీయ సంస్కృతి గురించి జనరలైజేషన్ మాత్రమే. ఆ మాటకొస్తే, దేశంలో చాలా ప్రాంతాల్లో ఇంకా చాల దురాచారాలు వున్నాయి. మీతో నేను ఏకీభవిస్తున్నాను.

    @ అబ్రకదబ్ర గారు... ఇప్పటి వరకు మనం అలా చేయలేదు, కానీ ఇక మీదట చేద్దామనే నా ప్రయత్నం.

    @ రవి గారు... చక్కటి పాయింట్ చెప్పారు. నెనర్లు.

    @ దుర్గేశ్వర గారు, కొత్తపాళీ గారు, కిరణ్ గారు, అందరికి నా నెనర్లు.

    మరో చిన్న మాట: యూరోపియన్స్ అయితే కేవలం వాళ్ళ సంస్కృతి మాత్రమే గొప్పదంటారు. ఈ విషయంలో మరో చర్చకి కూడా తావివ్వరు. మనం అందరిలో వున్న మంచి విషయాలని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. దానివల్లే మనదేశంలో ఇన్ని రకాల మతాలు, సంస్కృతులు సహజీవనం చేయగలుగుతున్నాయి. నిజమేనంటారా?

    ReplyDelete
  10. కొత్తపాళి గారు,
    "...ఇంకోళ్లలో లోపాలు లెక్క 'పెట్టడము ' అని ఉండాలంటారా లేక కరక్టుగానే రాసారా? మొత్తానికి బాగా చెప్పారు!

    జగదీష్ గారూ, మనవాళ్ల వెధవాయి తనం మీద బోలెడన్ని టపాలు వచ్చాయి ముందు వాటిని చదవండి! ఎవడి సంస్కృతి వాడికి గొప్ప! వాళ్ళంతా హిందువులై పోయి ఆదిత్య హృదయం, గోదావరీ స్తోత్రం చదవమంటారా ఏమిటి?

    మరోటి, వాళ్లకి పరాయి స్త్రీలంతా భార్యతో సమానం అని ఎవరన్నా మీకు చెప్పారా, మీరే ఊహించేసుకుంటున్నారా?

    మనకు మరీ ఆధ్యాత్మికత ఎక్కువయ్యే,ప్రతి అడ్డమైన వాడూ ఆశ్రమాలు స్థాపిస్తున్నాడు.

    పక్కవాడికి సాయం చేస్తామా? మనమా? ఇది మరీ టూ మచ్!

    నాగారాజా గారు చెప్పినట్టు 'జనరలైజేషన్ ' మరీ ఎక్కువై పోయింది జగదీష్ గారు!

    ReplyDelete
  11. మీరు చెప్పినవి కరెక్ట్ గానే ఉన్నాయి.

    మన వాళ్లలో నాకు నచ్చనది ఏమిటంటే మోసకారితనం.
    అవతలి వాడు కొంచెం తింగరిగా వుంటే మనవాళ్లు రెచ్చిపోతారు.

    నిత్యావసర సరుకుల్లో ఎన్ని కల్తీలు జరుగుతున్నాయో మీకు తెలుసు కదా!

    మనం పక్కవాడికి సహాయం చేసినా వాడు వాడి ప్రయోజనాల కోసం మనకి హానిచేసేవాళ్లు ఎక్కువ.

    ReplyDelete
  12. I want to say one thing here... in all the airports except in India you could find pick pocketers.... Truly.... And if any of you had watched Swades Sharukh tells that everyone has there own greatness in their cultures..... but the post is nice... especially the ending.

    ReplyDelete
  13. @sujatha gaaru

    mee aavedana naaku artham avutOndi. mana samskRtE goppadi marE samskRtee goppadi kaadu ani anaDam rachayita uddESam ani cheppaDaaniki ee TapalO aadhaaraalu lEkapOyinaa, antarleenamgaa aa bhaavam kacchitamgaa kaligindi.

    aite okkati gurtu peTTukOvaali, ippuDu manam choostunna bhaaratadESam bhaaratadESam kaadu. It's a shadow of what it used to be.

    rachayita uddEsam mana samskRtula moolaalaku gala bhEdam cheppaDamE kaanee, prastutayathaarthaanni chitreekarinchaDam kaadu ani naa abhipraayam.

    evari samskRti vaaLLaku goppadi annadi oppukunTaanu. "bhaarateeyulu peLLiki mundu laingikasambandhaalu ishTapaDaru", ani nEnu cheptE maa US manager phakkuna navvaaDu. adi vaaLLaku EdO dOsham laagaa unTundi.

    aitE manam, oka universally agreed (spiritual) scale meeda choostE bhaarateeya samskRti (moolamainadi) chaalaa goppadi, migataavaaTi kanTE anE cheppukOvaali. alAgE nEnu islaam samskRti kooDaa goppadanE anTaanu! nEnu, naa samskRtiki Dabbaa vEsukOvaTlEdu, Evi reasonable gaa unnaayi ani anipinchindO cheptunnaanu.

    ReplyDelete
  14. సందీప్ గారు... ఆలస్యంగానయినా స్పందించినందుకు కృతజ్ఞతలు.. నా మనసులో మాట కరెక్ట్‌గా చెప్పారు..

    ReplyDelete
  15. You're so interesting! I don't think I have
    read something like this before. So good to find someone with some genuine thoughts on this issue.
    Seriously.. thanks for starting this up.

    This website is one thing that's needed on the internet, someone with some originality!

    Have a look at my web site; Zahngold Verkaufen

    ReplyDelete
  16. Jagadeesh Gaaru Chaala Baaga Blogu Wraasaaru. Mana Bhaaratha Desam thappa Maanavuni Lakshyam Mooksham ani Prapamcham lo mare desam Gurthinchaledhu. Avi (Bramha Jnaanam Aathma Vidhya) lantivi Chepithe Vaallu Nammaledhu Andhuke Science Avibhavinchindhi

    ReplyDelete
  17. Ikkada Kukshi Kosam Vidhyalu Eppudu Abhyasincha ledhu. Kvalam aa Lakshmi Naarayanudi kosame Vidhyalu Abhyasinchaaru

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.