Pages

Tuesday, July 15, 2008

ఇంగ్లీష్ భాష యొక్క సంస్కృత భాషా మూలాలు.

ప్రపంచలో అతి ప్రాచీనమయిన భాష సంస్కృతం. దేవ భాషగా ప్రసిద్ది చెందిన ఈ భాషలోనే మన మహర్షులు వేదాలు, పురాణాలు, మానవ సమాజ సంస్కృతీ వికాసానికి కావలసిని అనేక గ్రంధాలను రచించారు. ప్రపంచంలో అనేక భాషలకు తల్లి వంటిది సంస్కృతమే. ఇండొ- యూరోపియన్ భాషల్లో అత్యంత శాస్త్రీయంగా, సంపూర్ణముగా, వ్యాకరణబద్దమయిన మొట్టమొదటి భాష కూడా సంస్కృతమే. ఇంగ్లిష్ భాషలోనే కాక అనేక యూరోపియన్ భాషల్లో అనేక పదాలు సంస్కృత భాషా మూలాలకు సంబందించినవే అయి ఉంటాయి.


మానవులు సామాజిక జీవనం గడిపే తొలినాళ్ళలో మానవ సంబంధాల యొక్క పేర్లన్నీ సంస్కృత భాషలోనే ఉంటాయి. (కింద పట్టిక గమనించండి) మాత, పిత, సూన, దుహిత, ఇలా అన్ని మానవ సంబంధాలన్ని సంస్కృత భాషా సమాజంలోనే ఏర్పడ్డాయని మనకి అర్దం అవుతుంది. అసలు మనందరము మానవులం అనే మాట కూడా ఆ సమాజంలోనే ఆవిర్భవించింది. వేదాల ప్రకారం భూమిపై మనుషులందరము మనువు సంతతి. ఒక్కొక్క మహా యుగంలో ఒక్కొక్క మనువు ద్వారా మనుష్య సంతతి వ్యాపిస్తుంది. ప్రస్తుత యుగంలో వైవశ్వతుడు అనే మనువు మూలపురుషుడు. అందుకే ప్రస్తుత కాలాన్ని వైవశ్వత మన్వంతరంగా వ్యవహరిస్తారు. ఆ మనువు శబ్దం నుండి వచ్చిందే మానవ (MAN) అనే పదం.


ఇవే కాక, మనం నిత్య జీవితంలో ఉపయోగించే అనేక వస్తువుల, జంతువుల పేర్లు ఇవన్ని సంస్కృతం నుండి వచ్చినవే. ఏదయినా కాదు లేదా వద్దు అనే విషయాన్ని సూచించదానికి ఇంగ్లిష్‌లో No అనే శబ్దాన్ని ఉపయోగిస్తారు. అది సంస్కృతంలో "న" అనే శబ్దం యొక్క రూపాంతరం. వ్యతిరేక అర్ధాన్ని సూచించేలా మనం వాడే Non- Un అనేవి కూడా వ్యతిరేక పదాలే. ఉదాహరణకు అభయం అంటే భయం లేక పోవడం. న+భయం= అభయం అయింది. un-expected అనే పదాన్ని తీసుకోండి. న+ ఆపేక్షిత = అనాపేక్షిత.


ఇవే కాక కొన్ని ముఖ్యమయిన పదాలు వాటి సంస్కృత మూలం కింద పట్టికలో ఇచ్చాను. ఇంగ్లిష్ భాష అంతా సంస్కృతం నుండి వచ్చింది అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు గాని, ప్రస్తుతం మనం చూస్తున్న సమాజ మౌలిక నిర్మాణం అంతా ఒకే భాషా, సాంస్కృతిక కుటుంబానికి చెందిందని భావిస్తున్నాను. వసుదైక కుటుంబం అనే మాటకి అర్ధం ఇదేనేమో. (All universe is one family)

ఇంగ్లీష్ - సంస్కృతం - తెలుగు
Mother - మాతృః - అమ్మ

Father - పితృః - నాన్న

Brother - భ్రాతః - అన్న/ తమ్ముడు

Sister - సహోదరి - అక్క/ చెల్లి

Son - సూన - కుమారుడు

Daughter - దుహిత - కుమార్తె

Man - మానవ - మానవుడు

Name - నామ - పేరు

Three - త్రయ - మూడు

Decimal - దశ - పది

Door - ద్వార - తలుపు

Divine - దివ్య - దైవ సంబందమయిన

Path - పథ - దారి

Dental - దంత - దంతము

Nerve - నర - నరము

Tree - తరు - చెట్టు

Me/my - మై - నేను

Naval - నావ - నౌక/ఓడ

Heart - హృద్ - హృదయము/ గుండె

Cruel - కౄర - కౄరమయిన

Location - లోక - లోకము/ప్రదేశము

Axis - అక్ష - అక్షము

Yes - అసి - నిజం

No - న - లేదు/కాదు

Hunt - హంత - చంపు

Vehicle - వాహన్ - వాహనం

Mouse - మూషక్ - ఎలుక

Owl - ఔల్యూక - గుడ్లగూబ

10 comments:

 1. మంచి ప్రయత్నం. ఇప్పటికీ ప్రపంచ భాషా శాస్త్రవేత్తలందరూ మల్లగుల్లాలు పడుతున్న విషయాల్ని చాలా సులువుగా ప్రతిపాదించేసారు!

  ReplyDelete
 2. మొన్న డిస్కవరీ వాళ్ళు భారత దేశ చరిత్ర చెబుతూ

  సంసృతం మూలం భారతదేశానిది కాదు అని అది ఆర్యులతో పాటు గా ఐరోపా నుండి వచ్చిందని అన్నారు.

  మీరు చెప్పిన విషయాన్నే మరోలా విశ్లేషించారు.

  ReplyDelete
 3. @dileep:
  Recent reserches into the Indian history have revealed that the entire norman thoery (that the Normans came on an exodus from the central Europe is baseless and is work of fiction by a mercinary -- I am afraid I don't remember his name followed by Romilla Thapar and some communist dramatists ok... historians). Kindly refer to "EdI caritra - MV Sastri"

  ReplyDelete
 4. >> సంసృతం మూలం భారతదేశానిది కాదు అని అది ఆర్యులతో పాటు గా ఐరోపా నుండి వచ్చిందని అన్నారు.

  ఇదంతా బూటకమని ఇంకొందరు చెబుతారు. ఐరోపా నుండి సంస్కృతము వస్తే, మరి అక్కడ ఒక్క సంస్కృత తాళ పత్ర గ్రంథం కూడా దొరకలేదేం?

  ReplyDelete
 5. I thought most of english etymology is borrowed from Greek/Latin.

  ReplyDelete
 6. చాలా మంచి విషయాలు వ్రాశారు. ఆర్యులు మధ్య ఆసియా (లేక మధ్య ఐరోపా) నుండి వచ్చారన్న వాదనకు కాలం చెల్లిపోయినట్లే. కాక పోతే ప్రాచీన భాషలైన సంస్కృతం, గ్రీకు, లాటిన్, పారశీక భాషలు ఒకే ప్రోటోలాంగ్వేజి నుండి వచ్చాయన్నది చాలామంది నమ్ముతున్నారు. చాలా భారతీయ భాషలు సంస్కృతం నుండి వచ్చినట్లే, ఇంగ్లీషు లాంటి ఐరోపా భాషలు లాటిన్ నుండి, కాకుంటే గ్రీకు నుండి వచ్చాయి. కనుకనే మీరు చూపిన పోలికల్లాంటివి కన్పిస్తాయి. ఉదాహరణకు మీరు వ్రాసిన 'Daughter' అన్న పదాన్ని తీసుకొంటే జర్మన్ భాషలో 'టోహ్టర్' అనీ, పర్షియన్ లో 'దుఖ్తర్' అనీ, లిధువేనియన్ (ఇదే ఆర్యభూమి అని చాలామంది నమ్మకం) భాషలో 'దుక్తి 'అని, గ్రీకులో 'థుగాతెరా' అనీ,స్పానిష్ భాషలో 'ఇహా' అనీ అంటారు. కానీ అదే సమయంలో లాటిన్ కి బాగా దగ్గరైన ఇటాలియన్ భాషలో 'ఫిల్యా' అని, పోర్చుగీసు లో ' ఫీల్యా' అని, రష్యన్ లో 'దుచీ' అని, రొమానియన్ లో 'ఫికా' అనీ అంటారు. కనుక కొన్ని పదాల పోలికలనుబట్టి భాషల దగ్గరితనాన్ని అంచనావెయ్యలేం. సంస్కృతం ప్రతిపదానికీ వ్యుత్పత్తిని సూచిస్తుంది. "దుహతి ఇతి దుహితా" అని వ్యుత్పత్తి. అంటే పాలు పితికేది అని. బహుశ వేదకాలంలో ఇంట్లో పాలు పితికే పని కూతురిది అయి వుండవచ్చు. ఇతర భాషలలో ఇలాంటి అర్థఛాయలో ఈ పదాన్ని ఉపయోగించడం లేదు.

  ఏదేమైనా ఆసక్తికరమైన విషయ చర్చ చేశారు. అభినందనలు.

  -చంద్రమోహన్

  ReplyDelete
 7. ఆర్యులు బయటినుండి రాలేదనుకుందాం. అప్పుడు ఆర్యులు రాసిన మహాకావ్యాల్లో సింధు లోయ నాగరికతకి సంబంధించిన ఒక్క నగరం వర్ణనా లేదే? అలాగే సింధు లోయ తవ్వకాల్లో ఆర్యుల సాహిత్యంలో ఉటంకించిన ఏ ఒక్క విషయానికీ ఆధారాలు లభించలేదేమి? Vedic Civilization, Indus Valley Civilization రెండూ ఒక్కసారే, ఒక్క చోటే, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పరిఢవిల్లాయి. వింతగా లేదూ!?! ఆర్యుల వలస సిద్ధాంతానికి ప్రాతిపతిక ఈ ప్రశ్నలే.

  @నవీన్,
  ఆర్యులు వలసొచ్చింది ఐరోపా నుండి కాదు. మధ్య ఆసియా నుండి. వలస సిద్ధాంతానికి ఎంత బలమైన ప్రాతిపదికలున్నాయో, దాన్ని వ్యతిరేకించటానికీ అంతే బలమైన ప్రాతిపదికలున్నాయి. ఏతావాతా, ఇది ఇప్పుడిప్పుడే తెగని గొడవ.

  @indianminerva,
  మీరనదలచుకుంది nomads అనుకుంటాను. మీకు గుర్తురాని పేరు Max Muller కావచ్చు.

  ReplyDelete
 8. @ చంద్రమోహన్ గారు...
  మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. 'దుహితా అనే పదాన్ని అన్ని ఆసియా, యూరోపియన్ భాషల్లో ఏయే విధంగా పలుకుతారో, అది ఏ విధంగా రూపాంతరం చెందిందో చక్కగా వివరించారు. కొత్తగా ఎన్నికయిన రష్యన్ ప్రధాన మంత్రి పేరు 'మెద్వెదెవ్'. ఈ పదానికి రష్యన్ భాషలో 'ఎలుగుబంటీ అని అర్ధం. ఈ పదం సంస్కృతంలో 'మధువేధీ అనే పదం నుండి వచ్చింది. అంటే తేనె కోసం వెదికే ప్రాణి అని అర్ధం. మీరు చెప్పినట్లు ప్రపంచంలో మిగతా భాషల్లో లేని, సంస్కృతానికి మాత్రమే వున్న మరో ప్రత్యేకత ఏమిటంటే, ప్రతీ అక్షరానికి, ప్రతీ పదానికీ కూడా వ్యుత్పత్తి అర్ధాన్ని వివరిస్తుంది. దాని వల్ల పదం యొక్క మూలాలు, వాడుకలో దాని అర్ధం మారి పోకుండా ఉంటాయి. ప్రస్తుతం సంస్కృతాన్ని ప్రత్యేకంగా మాట్లాడే జాతి అంటు ఏదీ లేకపోయినా, అదింకా అంతరించిపోకుండా సజీవంగా ఉందంటే ఈ ప్రత్యేకత మూలంగానే అనవచ్చు.

  @ అబ్రకదబ్ర గారు...
  మనం ఎంత సేపూ ఎవరో చెప్పిందే వింటూ, వారు చెప్పిందే నిజమని నమ్మేస్తున్నాము. మన పురాణాలనే ప్రాతిపదికగా చేసుకుంటే, ఆర్యులు, సింధు నాగరికత ఒకదానికొకటి సంబంధం లేనివి. మన చరిత్రకారులు ఊహించినట్లుగా, ఆర్య నాగరికత కేవలం 5,000- 10,000 సంవత్సరాలనాటిది కాదు. అంత కంటే ఎంతో పురాతనమయినది. ఏదేమయినా, ఈ విషయంపై మరింత లోతయిన పరిశొధన జరగాలి.

  @ మహేష్ కుమార్ గారికి, దిలీప్ గారికి, ఇండియన్ మినర్వా గారికి, SGSగారికి, నవీన్ గారికి నెనర్లు

  ReplyDelete
 9. This comment has been removed by the author.

  ReplyDelete

Note: Only a member of this blog may post a comment.