ఈ మధ్య సినిమాలలో ఒక విషయం స్పష్టంగా చెపుతున్నారు. హీరో తను ప్రేమించిన అమ్మాయి కోసం, తన ముచ్చట తీర్చడం కోసం అడ్డమయిన అగచాట్లు పడతాడు. అప్పటి వరకు ఆవారాగా తిరిగేసిన మన హీరో, ఎప్పుడయితే హీరోయిన్‌తో పరిచయమయిందో, ఆ అమ్మాయిని ప్రేమించానని డిసైడ్ అయిపోయేడో, ఇక చూడండి, తను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నది కూడా గుర్తుకురాదు. లేదా, నక్సలైట్లలో చేరి కూడా వెనక్కి వచ్చేస్తాడు. హీరోయిన్ కోరిక తీర్చడమో, లేక ఆమెకున్న కష్టాల్ని తొలగించడానికో తన జీవితాన్నే త్యాగం చేసేస్తాడు. వచ్చీరాని తెలుగు మాట్లాడే విలన్ గాడితో ఇష్టం వచ్చినట్లు ఫైట్లు అవీ చేసేస్తాడు. చివరికి కధ సుఖాంతమవుతుంది, హీరొ, హీరోయిన్ ఒకటవుతారు. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకుని బయటకి వచ్చేస్తారు. ఇది మామూలుగా సినిమా కధ. అక్కడితో దీనికి శుభం కార్డ్ పడిపోతుంది.
చాలా మంది అనుకుంటున్నట్లు నిజానికి అది ముగింపు కాదు. పెళ్ళయిన తరువాతే మన హీరోకి అసలు కష్టాలు మొదలవుతాయి. మీరు గమనించారో లేదో, హీరోకి పెళ్ళయిన తరువాత ఏమి జరుగుతుంది అనే పాయింటు మీద ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్క పెట్టగలరా? మీ వల్ల కాదు. పైన చెప్పిన్నన్ని కష్టాలు పడి, పెళ్ళి చేసుకున్నాక ఏ మగాడయినా సుఖ పడ్డ దాఖాలాలు వున్నాయా అని ఎవరినయినా ప్రశ్నించండి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అబ్బే అదేమి లెదండి. మేము బాగానే వున్నాము అని సింపుల్‌గా చెప్పేస్తారు. కాని, అదేదో సినిమా పాటలో చెప్పినట్లు, "మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు చాప్టర్" అనే విషయం చాలా మంది పట్టించుకోరు. Don't marry - be happy అని మరో హీరో చేత చెప్పించినా దాని గురించి అసలు మాట్లాడుకోరు. వాస్తవ పరిస్తితి ఎలా వుంటుందో చూద్దాము.
చాలా ఇళ్ళల్లో ఉండేదే. నువ్వొకటంటే నేనొకటి అంటాను అనే నానుడి గుర్తుందా? అంటే భర్త అనుకున్నదానికి పూర్తి రివర్స్ లో చెయ్యడం. ఆయనకి ఏ చిరంజీవి సినిమాకో వెళదామని అనిపిస్తుంది. భార్యని రెడీ అవ్వమని చెపుతాడు. ఏ సినిమాకండి అని అడుగుతుంది భార్యామణి. చిరంజీవి సినిమాకి అని చెపుతాడు. కాదండి, మహేష్ బాబు సినిమాకి వెళదామండి, పక్కింటి పార్వతమ్మ వాళ్ళు చూసారట. చాల బాగుందట, అంటుంది. అప్పటికే ఆఫీస్ నుండి అలసి వచ్చిన ఆయనకి ఇక వాదించే ఓపిక లేక, సరేనంటాడు. ఏమి చీర కట్టుకోమంటారండి అని అడుగుతుంది.
"నీ ఇష్టమే, మంచి చీర కట్టుకో"'
"అలా కాదండి, ఎరుపు చీర కట్టుకోనా, బ్లూ శారీ కట్టుకోనా?"
"సరే, రెడ్ కలర్"
"అలా కాదండీ , బ్లూ శారీలో నేను చాలా అందంగా ఉంటానని మీరే అంటారు కదా"
"నిజమె"
"మరలాగయితే, రెడ్ అని ఎందుకు చెప్పారు, ఈ మద్యన నేను అందంగా ఉండడం మీకు ఇష్టం లేకపోతుంది"
"అది కాదే, ఏదో ఆలోచిస్తూ అన్నానులే, ఇప్పుడేమయింది? ఎందుకలా గొడవ చేస్తావు?"
"అదిగో ముందు గొడవ మొదలుపెట్టింది మీరా, నేనా?"
ఇలా గొడవ పెద్దదవుతుంది. తరువాత సినిమాకి వెళ్ళాలా వద్దా అనేది, ఆ భర్త ఓర్పు, నేర్పుల మీద ఆధార పడి ఉంటుంది. భార్యని బాగా బ్రతిమలాడుకోగలిగి, భార్య కాళ్ళో, కనీసం గడ్డమో పట్టుకోగలిగితే, అప్పటికి ఆవిడ క్షమించగలిగితే, ఆయనకి సినిమా చూసే భాగ్యం కలుగుతుంది. లేకపోతే సినిమా కాదు కదా, తన ముఖం చూసే భాగ్యం కూడా తన పతి దేవునికి అనుగ్రహించదు ఆ ఇల్లాలు.
సంసారమన్నాక, ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. వాటి గురించి తరువాతి భాగంలో...
"తమలపాకుతో నువ్వొకటంటే, తలుపు చెక్కతో నేరెండంటా" అన్న సామెత ఈ భార్యా భర్తల తగువు చూసి జ్ఞప్తికొచ్చింది. తరువాయి ఎప్పుడు?
ReplyDeleteఆర్ధిక స్వాత0త్ర0 లేని ఆడవాళ్ళున్న ఎన్ని ఇళ్ళల్లో ఆడవాళ్ళ మాట నగ్గుతు0దని మీరనుకు0టున్నారు?అయినా ఫలానా సినిమాకి వెళదామని ము0దే అనుకోకు0డా ఇలా అప్పటికప్పడు గొడవపడ0 ఏమిటో?
ReplyDeleteమీరు చెప్పాలనుకున్న పాయింటు ప్రస్తుతానికి అర్థం కాలేదు. బహుశా రెండో భాగంలో ఉంటుందేమో! ఎదురుచూస్తాను.
ReplyDelete