Pages

Friday, July 4, 2008

చందమామ మొదటి సంచిక ఎప్పుడయినా చూసారా?

60 సంవత్సరాల క్రితం మన తెలుగు వాళ్ళయిన నాగిరెడ్డి, చక్రపాణి గార్లు చిన్నపిల్లల కోసం ఏదయినా చెయ్యాలనే సంకల్పంతో దివిలో నుండి చందమామను దింపి భువిలో చందమామగా నామకరణం చేసి చక్కటి పిల్లల కధల పుస్తకం ప్రారంభించారు. కేవలం చిన్నపిల్ల కోసం మాత్రమే కాక, పెద్దలకు, అన్ని వయసుల వారికీ ఉపయోగపడె ఎన్నో నీతి కధలు, అందరికీ అర్ధం అయ్యే విధంగా పురాణ కధలు చందమామలో వుంటాయి.


నా మట్టుకు నేను కూడా చందమామ ఫ్యాన్‌నే. నేనే కాదు, మా ఇంటిలో తాత గారి దగ్గర నుండి, నాన్నగరు, నేను, అందరము చందమామ అభిమానులమే. మా ఇంటిలో చందమామ పాత సంచికలన్నీ చక్కగ బైండింగ్ చేసి వుంటాయి. తెలుగు భాష మీద అభిమామనం, కావలసినంత పట్టు కావాలంటే చందమామ చదవాల్సిందే.
కాని 1960కి ముందున్న చందమామ సంచికలు ఎలా వుంటాయో తెలుసుకోవాలన్న కుతూహలం నాలో ఉండేది. కాని www.chamdamama.com చూసాకా ఆ బెంగా తీరిపోయింది. చందమామలో ప్రస్తుతం ప్రచురితమవుతున్న కధలతో పాటుగా, 1947 నుండి 1960 వరకు అన్ని సంచికలనీ pdf ఫార్మాట్లో వుంచారు. మనకు కావలసిన సంవత్సరం, నెల ఎన్నుకొంటే, వెంటనే ఆ సంచిక కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది.


అన్నిటికంటే చక్కని విషయం ఏమిటంటే, కధలతో పాటుగా, ఆ రోజుల్లో ప్రచురితమయిన ప్రకటనలతో సహా pdf లోకి మార్చడం జరిగింది. 1956 నాటి సంచికలో మాయాబజార్ సినిమా ప్రకటన చూడగానే కాల యంత్రంలో ఒకే సారి వెనక్కు వెళ్ళిపోయిన అనుభూతిని చెందాను. మీరూ ఈ అనుభూతిని సొంతం చేసుకోవాలంటే, తప్పకుండా ఆ websiteని సందర్శించండి.
సైట్ చిరునామా: http://www.chandamama.com/telugu/

5 comments:

  1. కంప్యూటర్ Vignanam జూన్ 2008 సంచికలో చందమామ అన్ని సంచికలు ఒకేసారి ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు.

    ReplyDelete
  2. వావ్ అద్భుతం, గౌరీకుమార్ గారు చేసిన పనిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఎంతో శ్రమ తీసుకుని, అన్ని సంచికలకు లింకులను పట్టీ రూపంలో ఇచ్చారు. శ్రీనివాస బాబు గారికి కూడా కృతజ్ఞతలు.

    మీ

    ఎస్పీ జగదీష్

    ReplyDelete
  3. Dear Srinivasababu,

    Can you please explain the article you have mentioned "computer vignanam June 3008" how to download all issues of chandamama - link please...

    Kameswararao
    24-08-08

    ReplyDelete
  4. Please see the link below

    http://www.ulib.org/ULIBAdvSearch.htm

    Title: Chandamama
    Language: telugu

    We can read chandamama telugu after 1960 also. But i can download only one page at a time. Any method to download all pages of a monthly magazine in one attempt?

    regards

    Kameswara Rao
    24-08-08

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.