Pages

Thursday, August 28, 2008

నైతిక విలువలతో కూడిన లైంగిక విద్య అవసరం.

లైంగిక విద్య గురించి తాడేపల్లి వారు రాసిన టపా చదివాను. చాలా చక్కగా పాజిటివ్ గా రాసారు. ఆయన అభిప్రాయాలతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. భారతీయులు లైంగిక విషయాలలో గోప్యతగా ఉంటారని ఎందుకు అంటారో నాకు అర్ధం కాదు. మన సాహిత్యమంతా శృంగార మయమే కదా. శ్రీ కృష్ణుని భక్తి శృంగారం గురించి తెలియని వారుండరు. శ్రీనాధుని శృంగార నైషధం గానివ్వండి, అన్నమయ్య కీర్తనల్లో వర్ణించి సరస శృంగార కీర్తనలు కానివ్వండి, దేవాలయాల్లో కనిపించే బొమ్మలు కానివ్వండి. ఇవన్నీ స్త్రీ పురుష సృష్టి కార్యాన్ని చక్కగా వర్ణిస్తాయి. అయితే మధ్య యుగాల్లో వచ్చిన సామాజిక మార్పుల వల్ల కానివ్వండి, లేదా, బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏర్పడ్డ విక్టోరియన్ ఆలోచనా ధోరణి వల్ల కానివ్వండి, మన దేశంలో లైంగికత అనేది బూతుకి ప్రత్యామ్నాయంగా స్తిరపడిపోయింది. నిజానికి శృంగారం వేరు, బూతు వేరు, భార్యా, భర్తల మధ్య ఉండేది శృంగారమయితే, పబ్లిక్‌గా నలుగురిలోను వెకిలిగా మాట్లాడేది బూతు అనవచ్చు.


ఇక లైంగిక విద్య విషయానికి వస్తే, లైంగిక విద్యని పాఠశాల స్తాయిలో నేర్పవలసిన అవసరంలేదని నా ఉద్దేశ్యం. ఇంటర్ స్తాయి నుండి నేర్పించవచ్చు. అది కూడా సురక్షితమయిన లైంగిక విద్య గురించి చెపుతూనే, నైతికతని కూడా బోధించాలి. మన సాహిత్యంలో వున్న ఎన్నో ఉదాహరణలను, కధలను విద్యార్ధులకి బోధించి, పర స్త్రీ పట్ల పురుషులు ప్రవర్తించవలసిన తీరు, పర పురుషుడి పట్ల స్త్రీలు ప్రవర్తించవలసిన తీరు గురించి కూడా చెబితే, పిల్లలు ధర్మ బద్దమయిన లైంగిక జీవితానికి, విచ్చలవిడితనానికి మధ్య గల తేడా తెలుసుకుంటారు. నిజానికి వేదాల్లో మానవ జీవితానికి అతి ముఖ్యమయిన పురుషార్ధాలను గురించి చెప్పారు. అవి ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు. వైదిక జీవనం ప్రకారం, మానవులు ముందుగా ఆచరించవలసింది ధర్మం. ఆ ధర్మాన్ని తప్పకుండా , మిగిలిన అర్ధాన్ని, (బ్రతకడానికి అవసరమయిన డబ్బుని,), అదే ధర్మాన్ని తప్పకుండా, వివాహమాడిన స్త్రీ ద్వారా కామన్ని (సంతానం పొండనికి మత్రమే కామం ఉద్దేశించబడింది), మోక్షాన్ని కూడా సాధించమని చెప్పారు. పాశ్చాత్య దేశాల్లో చెప్పినట్లు కేవలం స్త్రీ పురుష బాహ్య అవయవాల గురించి అసహ్య కరమయిన వర్ణనలు , అవి పనిచేసే విధానం, తప్పు చేసేటప్పుడు (అంటే ఎవరితోనయినా శృంగారం చేయండి, కాని ఫలాని జాగ్రత్తలు తీసుకోండి) అనే పిచ్చి ఆలోచనలు పిల్లల మనసులపై దుష్ప్రభావం చూపుతాయి. తప్పు చేసిన పర్వాలేదు, కాని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనే అలోచన సమాజాన్ని, ముఖ్యంగా భావి పౌర మనసుల్ని కలుషితం చేస్తుంది. ఇప్పటి వరకు లైంగిక విద్యని వ్యతిరేకించే వాళ్ళు ముఖ్యంగా చెప్పే విషయం ఇదే. దాని కన్నా, నైతికత, సమాజంపట్ల బాధ్యతగా వ్యవహరించడం, పర స్త్రీ లేదా, పురుషుల పట్ల మర్యాదగా వ్యవహరించడం వంటి వాటికి కూడా లైంగిక విద్యలో స్తానం కల్పించడం వంటివి చేస్తే, అది ఆరోగ్యకరమయిన సమాజానికి దోహదం చేస్తుంది. ప్రజల్లో లైంగికత పట్ల వుండే వ్యతిరేకత కూడా పోతుంది.

9 comments:

  1. "తప్పు చేసిన పర్వాలేదు, కాని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనే అలోచన సమాజాన్ని, ముఖ్యంగా భావి పౌర మనసుల్ని కలుషితం చేస్తుంది."

    చాలా బాగా చెప్పారు. నీతిలేనివాడు కోతికంటె పాడు. అందరమూ తప్పులు చేస్తాం. అంతమాత్రాన "తప్పుచెయ్యడమే సహజం" అనే ధోరణి పనికిరాదు. మనం జీవితంలోని అన్ని విషయాల్లోను పెర్ఫెక్షనిస్టులమూ, లైంగిక విషయాల దగ్గఱికొచ్చేసరికి మాత్రం లూజుగాళ్ళమూ ఎందుకవ్వాలో నాకర్థం కాదు. వ్యవస్థలకు మనసా, వాచా, కర్మణా కట్టుబడకపోవడమే అభ్యుదయమైతే, లంచాలు పుచ్చుకునేవారూ, దేశద్రోహులూ అందఱూ అభ్యుదయవాదులే.

    ReplyDelete
  2. Sorry i don't know how to write in Telugu fonts. so i will be commenting on ur article in English.
    First of all u r contrdicting urself in the article, at one point u agree with the article of "Tadepalli bala subramanyam's" article about sexual behaviour during the ages of kings, where sex is not only normal but divine.
    But u start with ur article by saying that the sex education should be taught from Intemediate, what is the conclusion on which u fix that time. If u look at todays children, lets call them adolescents, by the time they reach Tenth class most of the pupils have good knowledge about sex, through friends, media(books,TV), Internet. If u look at the adolescents of same age in cities most would have experience of it.

    Then what is the point in teaching when they already know and tried to experiment.

    Sex-education is mainly to get knowledge about sex as well as to protect oneself from sexual abuse. It is also to provide knowledge of what to do and what not to do, and how to avoid serious consiquences.

    You seriously contradict in ur statement given below.
    "తప్పు చేసిన పర్వాలేదు, కాని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనే అలోచన సమాజాన్ని, ముఖ్యంగా భావి పౌర మనసుల్ని కలుషితం చేస్తుంది."
    What is wrong here, as u have said sex is a normal things in our culture. Having sex is not a wrong thing, adolescents tend to have attractions for opposite sex. Then where does ur statement stand.

    Regarding ur another statement:
    " నైతికత, సమాజంపట్ల బాధ్యతగా వ్యవహరించడం, పర స్త్రీ లేదా, పురుషుల పట్ల మర్యాదగా వ్యవహరించడం వంటి వాటికి కూడా లైంగిక విద్యలో స్తానం కల్పించడం వంటివి చేస్తే, అది ఆరోగ్యకరమయిన సమాజానికి దోహదం చేస్తుంది."
    These things are not for teaching in sex-education, these things are taught in social, sociology classes. These are separate classes for this. Don't mix sex-education with Social behavioural studies.

    ReplyDelete
  3. Can you be more specific about the term "tappu"?
    I don't understand it really :(

    ReplyDelete
  4. పైన అనానిమస్ గారి కామెంటు చూస్తే తెలుస్తోంది. మన సమాజం లో ఓ సామాన్యుడి పరిస్థితి ఎలా వుందో. ఇది పాశ్చాత్య ప్రభావమా లేక ఇంకేదైనానా?

    -భరత్

    ReplyDelete
  5. బాబూ... అనానిమస్ గారూ.... లైంగిక సంపర్కం పెట్టుకోవడంలో తప్పేమిటి అని మీరు ప్రశ్నిస్తున్నారు... తప్పు లేదు. అలా ఎవరితో పడితే వారితో మీరు చెప్పినట్లు చేస్తే, మనమున్నది సమాజం అనరు. అడవి అంటారు. ఎందుకంటే జంతువులుండేది అక్కడే కాబట్టి. పైగా సమాజ రీతిని గౌరవించని వారు పశుతుల్యులే అవుతారు. మనిషిని జంతువుల నుండి వేరుపరచేది ఆ విచక్షణే. అటువంటి విచక్షణనే పిల్లలకి నేర్పాలి అని అంటున్నాను. చిన్నతనం నుండే నైతికత గురించి పిల్లలకి చెపితే వారు పదవతరగతే కాదు, ఎంతపెద్దవారయినా గౌరవ ప్రదమయిన జీవితం గడుపుతారు..

    @ ఫాలింగ్ ఏంజెల్... తప్పంటే తెలియకపోతే మీకు ఏమి చెప్పినా అనవసరం.

    @ తాడేపల్లి వారు... ఈ చర్చకి మూల కారణం మీరే.. కృతజ్ఞతలు...

    @ భరత్ గారు... మీతో ఏకీభవిస్తున్నాను.

    ReplyDelete
  6. @ Jagadish

    తప్పంటే ఏమిటో తెలిస్తేకదా ఏది రైటో తెలిసేది ??

    When you say "tappu" ... is it Pre-marital sex ?? or Prostitution ?? or any kind of sex which is out of marital scope ???

    Or this 'tappu' is just unprotected sex ???

    మీ దృష్టిలో.. కాదు ఈ వ్యాసం పరిధిలో తప్పంటే ఏమిటో వివరించండిచాలు .

    ReplyDelete
  7. మీరు చెప్పినవాటిలో మూడవదే సరయినది. సమాజం చేత ఏదయితే ఆమోదనీయం కానిదిగా నిషేదించబడినదో అదే ఈ వ్యాసంలో తప్పుగా అభిప్రాయపడ్డాను.

    ReplyDelete
  8. ఓకే. సమాజం అంటే ఏమిటి?

    ReplyDelete
  9. లైంగిక విద్యగురించి పౌరాణిక నేపధ్యం తీసుకుని దానికి నైతికకోణాన్ని జోడించి జడ్జిమెంటులు పాస్ చెయ్యడం అంత ఆమోదనీయమైన విషయంగా అనిపించడం లేదు. బహుశా శరత్,ఫాలింగ్ ఏంజిల్ అభ్యంతరంకూడా అందుకే అనుకుంటాను.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.