Pages

Monday, August 4, 2008

తెలుగు భాషకి ప్రాచీన హోదా కల్పించాలి


తెలుగు భాషకి ప్రాచీన హోదా కల్పించాలని కోరుతూ, తాడేపల్లిగూడెంలో తెలుగు సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, తహశిల్దారుకి ఒక వినతి పత్రం సమర్పించాము. ఆ సంఘటన యొక్క వివరాలు "సాక్షి" పేపర్లో ప్రచురించినప్పటిదీ క్లిప్పింగ్. ఈ ఫోటోలో ఎడమవైపు మొదట వున్నది నేను. సమాఖ్యలో గత పది సంవత్సరాలుగా సభ్యునిగా వున్నాను. మిగతా సాహితీ మితృలతో కలిసి తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలని కోరుతూ, పట్టణంలో ఒక ర్యాలీ నిర్వహించాము. అనంతరం తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని గురించి, దాన్ని ప్రాచీన భాషగా గుర్తించదానికి గల అర్హత గురించి సమావేశంలో చర్చించడం జరిగింది.

4 comments:

  1. నేను చెప్పేది తప్పనిపిస్తే క్షమించగలరు. ఇది నా మదిలో చాలాకాలంగా ఉన్న ప్రశ్న.

    తెలుగుకి ప్రాచీన హోదా ఒకరు ఇవ్వవలసిన అవసరం ఏంటి? ఇది కేవలం ప్రభుత్వనిధులను అందించటం తప్ప మరేవిధంగానూ ఉపయోగం లేదు. ఈ మధ్య ప్రతి భాష వారూ ఈ హోదా కోసం ఉద్యమాలు చేస్తున్నారు. పది మంది చేరి గొడవ చేస్తే ఎదైనా సాధించగలిగే మన ప్రజాస్వామ్యంలో దేశంలోని ప్రతిభాషా ఈ హోదా సులభంగా సంపాదించగలుగుతుంది.

    మీ సాహిత్య సమితి ద్వారా ఇంతకంటె మెరుగైన సేవలను మీరు తెలుగుకి అందించవచ్చు. ఒకవేళ మీరు నిజంగా ప్రాచీన హోదా తెప్పించాలనుకుంటే, మీరనుసరించిన మార్గం ఏ విధంగాను ఉపయోగ పడదు. ఒక తహసిల్దారు(కలెక్టరు కూడా) ఏ విధంగానూ మీకు ఆ హోదా తెచ్చివ్వలేరు. ఒకవేళ RTI ఏమైనా పనికొస్తుందేమో ప్రయత్నించగలరు.

    ReplyDelete
  2. తెలుగుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రాచీన హోదా’ కల్పించడం మూలంగా కొన్ని కోట్ల రూపాయలు భాషాభివృద్ధికి ఇవ్వడం తప్ప మనకొరిగేదేమీ లేదు. ఆ మాత్రం డబ్బులు కావాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం అందించొచ్చు.

    ఇక్కడ మనకసలు కావసింది తెలుగు భాష వాడకాన్ని పెంచడం ప్రాచీన హోదా కల్పించడం వలన ఆ ఆశయానికి వచ్చే లాభం నాకైతే కనిపించడం లేదు.

    ReplyDelete
  3. ఇప్పుడున్న ప్రకారమే తెలుగు అమలు మరో పాతికో ముప్పయో ఏళ్లు కొనసాగితే అది మీరు వద్దన్నా ప్రాచీన భాషల్లో చేరిపోటం ఖాయం.

    ReplyDelete
  4. Official recognition is very important. So I support ఎస్పీ జగదీష్ and his fellow సాహితీ సమాఖ్య friends. At times constitutionally guaranteed rights are denied to citizens. For example Article 25 of Indian Constitution guarantee "Religious Freedom", but prominent Hindu Tempels all over India are in the hands of Governemnt and they mis-use the Temple funds.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.