Pages

Saturday, September 15, 2012

మంత్రాలకు చింతకాయలు రాలవు గానీ ప్రార్థనతో రోగాలు తగ్గిపోతాయా?

    'మంత్రాలకు చింతకాయలు రాలవు' అనే సామెతను మనం చాలా తరచుగా ఉపయోగిస్తుంటాము. నిజమే.. చింతకాయలు రాలడానికి మంత్రమేమీ లేదు. ఒకవేళ ఉన్నా దాన్ని ప్రయోగించే వాడికి ఎంతో ఆత్మశక్తి ఉండాలంటారు.  కానీ విచిత్రమైన విషయమేమిటంటే, క్రైస్తవులు మాత్రం ప్రార్థన ద్వారానే సకల రోగాలు తగ్గిస్తామని చెబుతారు. దానికి నిలువెత్తు నిదర్శనం ఈ రోజు 'సాక్షి' పేపర్‌లో ఒకనాటి సినీ కథానాయిక దివ్యవాణితో ఇంటర్వ్యూ.  బాధలు, కష్టాలు, వ్యాధులు అనేవి ప్రతీ మనిషి జీవితంలో సహజం. భగవంతుడిని నమ్మడం ఎందుకంటే, ఎంత గొప్పవాడయినప్పటికీ, కష్ట సమయంలో మనో ధైర్యాన్ని కోల్పోతాడు. అది సహజం. ధైర్యం లేనపుడు చిన్న చిన్న ఇబ్బందులు కూడా చాలా పెద్దవి కనిపించి, మరో ఆలోచనకు తావు లేకుండా చేస్తాయి. అటువంటి సమయంలో గుర్తుకు వచ్చేది అత్యంత శక్తివంతుడైన భగవంతుడి గురించే. కొన్నిసార్లు సాటి మనిషి ఓదార్పు మాటలు కూడా ఆయుధంలా, మంత్రంలా పనిచేస్తాయి.

    సరిగ్గా ఈ పాయింట్‌నే క్రైస్తవులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎవరైనా కష్టంలో ఉన్న మనిషి, లేదా వ్యాధులతో బాధపడుతున్న వారు మన దగ్గరకు రాగానే ఏవో కొన్ని ఓదార్పు మాటలు చెబుతాము. లేదా దైవాన్ని ప్రార్థించమని చెబుతాము. ఎదుటి మనిషి మరో మతానికి చెందినవారయితే వారు నమ్మిన దేవుడిని ప్రార్థించమని చెబుతాము. కాని, ఎవరైనా క్రైస్తవుల దగ్గరకు వెళ్ళినట్లయితే, వెంటనే కాసిని మంచి మాటలు చెప్పి, ప్రార్థన మొదలుపెడతారు. అది తప్పుకాదు. ఒకవేళ ఆ వ్యక్తికున్న బాధలు లేదా వ్యాధులు నయమయితే, ఇక వెంటనే బ్రెయిన్‌ వాష్‌ మొదలుపెడతారు. దేవుడిని నమ్మడం వల్లనే ఇది నయమయింది కాబట్టి నీవు వెంటనే మతం మారు అని చెబుతారు. ఒకవేళ వినకపోతే, మా దేవుడిని ప్రార్థించడం వల్లనే నీకు నయమయింది కాబట్టి నీవు మతం మారాల్సిందే. మారకపోతే మరలా నీకు కష్టం / వ్యాధి తిరిగి వస్తుంది అని బ్లాక్‌మెయిల్‌ చేస్తారు. ఇక చేసేదేముంది? ఇష్టం ఉన్నా లేకున్నా మతం మారాల్సిందే. ఈ సకల సృష్టిలో ప్రతీ జీవిలోను, రాయి, రప్పలోను, ఆకాశంలోను, అగ్నిలోను, భూమిలోను, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, గురువులు.... ఇలా ప్రతీ జీవిలోను దైవత్వాన్ని దర్శించే విశాలతత్వం నుండి, దేవుడంటే ఒకడే అనే భావనకు మార్చేస్తారు. అక్కడి నుండి తనకు తానుతో సహా ప్రపంచంలో అందరూ అలా మారిన వారికి శత్రువులే. ఇలా మత మౌఢ్యాన్ని వ్యాప్తి చేసే హక్కు వారికెవరిచ్చారు? ప్రపంచంలో గత 25 వేల సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న సంస్కృతి హిందూ సంస్కృతి మాత్రమే. అటువంటి ఘనమైన నాగరికతకు వారసులుగా మెలగవలసిన వారిని వారి సంప్రదాయాల నుండి వేరు చేసి, వారి కుటుంబాల నుండి, సమాజం నుండి, ఆచార వ్యవహారాల నుండి వేరు చేసే దుర్మార్గం ఇంకెన్నాళ్ళు సాగుతుంది?

    నాకు తెలిసిన ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి స్నేహితుని ప్రోద్బలంతో మతం మారాడు. ఇక అప్పటి నుండి ఆ ఇంటిలో వారందరినీ శత్రువులుగా చూడడం మొదలుపెట్టాడు. ఇంటిలో ఏదైనా శుభకార్యం జరిగితే దూరంగా ఉంటాడు. ఇంటిలో ఏదైనా పండుగకి పిండివంటలు వండితే, అది దేవుని ప్రసాదం నాకు వద్దు అంటాడు. చివరికి భార్య పూజ చేసి, గంట మోగిస్తే, అది నాకు వినబడకూడదు అంటూ ఆ అమ్మాయిని హింస పెట్టాడు. చివరికి అతనితో భరించలేక భార్య పుట్టింటికి వెళ్ళిపోతే, నాకు దేవుడు ముఖ్యం.... భార్య పోయినా పర్వాలేదు అంటూ మంకు పట్టు పట్టాడు. ఆదివారం వచ్చిందంటే మా వూర్లో అది సంత రోజు. వ్యాపారాలన్నీ చాలా బిజీగా ఉంటారు. ఎక్కువ టర్నోవర్‌ నమోదు అయ్యేది ఆ ఒక్క రోజే. ఈ మతం తీసుకున్న తరువాత ఆదివారం వచ్చిందంటే  అంత వ్యాపారాన్ని వదులుకుని, చర్చికి పోవడం మొదలుపెట్టాడు. అంటే ఆర్థికంగా కూడా నష్టపోతున్నాడు. కుటుంబ సభ్యులందరూ కుమిలిపోతున్నారు. ఇంత నష్టం జరుగుతున్నా, దేవుడే కావాలంటాడు. ఇక అతని జీవితం నాశనయినట్లే. ఎన్ని సార్లు ఎంతో మంది నచ్చచెప్పినా, తన వైఖరి మార్చుకోవట్లేదు.

    దేవుడి పట్ల భక్తి ఉండొచ్చు, కాని మూర్ఖత్వం ఉండకూడదు. క్రైస్తవ దేశాల్లోనే ఎంతో మంది వాస్తవం తెలుసుకుని, చర్చి పట్ల విముఖత ప్రదర్శించడమో, లేదా హిందూ మతమో, బౌద్ధమతమో తీసుకోవడం చేస్తున్నారు. అటువంటిది ఇంతటి మౌఢ్యాన్ని నూరిపోయడం ఈ మతంలో వారికి ఎలా సాధ్యమవుతుందో నాకు అర్థం కావడం లేదు.

    దివ్యవాణి విషయమే తీసుకుంటే ఆవిడ ఎన్నో కష్టాల్లో ఉండి ఉండవచ్చు. కొడుక్కి మందులతో నయం కాని జబ్బు వస్తే సిస్టర్‌ కొన్ని స్వాంతన మాటలు చెప్పిఉండవచ్చు. అంతమాత్రం చేత ప్రార్థన వల్లనే నా కొడుక్కి తగ్గిందని పత్రికా ముఖంగా ప్రకటన ఇవ్వడం ఎంత వరకు సమంజసం? అది ఎంత మందిని ప్రభావితం చేస్తుంది? సెలబ్రిటీలు స్టేట్‌మెంట్లు ఇచ్చే ముందు కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అది సమాజానికి తప్పుడు సంకేతాలు ఇవ్వకుండా చూసుకోవాలి. కేవలం ప్రార్థన వల్లనే జబ్బులు నయమయ్యే వీలుంటే, ఇన్ని హాస్పిటల్స్‌, ఇంతమంది డాక్టర్లు, వైద్య వ్యవస్థ, కొన్ని వేల కోట్ల రూపాయిల ఖర్చు.... ఇవన్నీ ఎందుకు? పైగా మిషనరీలే హాస్పిటల్స్‌ నడుపుతాయి. నర్సుల్ని తయారు చేస్తాయి. వైద్యం చేస్తూ, మందులు వాడుతూ, డాక్టర్లు చికిత్స చేస్తూ, వ్యాధి దేవుడి వల్లనే నయమయింది అనే వాళ్ళని ఏమనాలి?

    హిందూ స్వాములు, బాబాలు ఏదైనా మహిమ చేసారని చెప్పగానే అదంతా 'మ్యాజిక్‌' అంటూ గొంతు చించుకునే 'సమాజ సేవకులు', క్రైస్తవంలో పబ్లిక్‌గా ఇటువంటి పనులు చేస్తుంటే, నోరు మెదపరెందుకు? టి.వి.లో డజనుకు పైగా క్రైస్తవ చానళ్ళలో కళ్ళెదురుగా గుడ్డి వాళ్ళకు చూపు తెప్పిస్తున్నారు. కుంటివాళ్ళను పరిగెట్టిస్తున్నారు. ఇదంతా నిజమేనా? నిజమైతే ఇక హాస్పిటల్స్‌ మూసేద్దాం. డాక్టర్స్‌ని ఇళ్ళకి పంపేద్దాం. ఇంత జరుగుతున్నా, మీడియాగాని, ప్రభుత్వం గాని సుప్త చేతనావస్థలో ఉంటుంది. ఇది మన ప్రారబ్ధం.

    ఇదంతా నేను క్రైస్తవం పట్ల ద్వేషంతోనో, మరో దానితోనో రాయడం లేదు. ఎవరి మతాన్ని వారు అనుసరించే హక్కు ప్రతీ వారికి ఉంది. ఎవరి ఆరాధనా పద్దతులు వారివి. కాని ఆ పేరు చెప్పి ఎదుటి వారి విశ్వాసాల్ని, నమ్మకాల్ని అగౌర పర్చే హక్కు వారికి లేదు. బ్లాక్‌మెయిల్‌ చేసి, అంధవిశ్వాసాల్ని వ్యాప్తి చేసే హక్కు ఎవరికీ లేదు. ప్రపంచంలోనే పురాతన నాగరికతలోని ప్రజల్ని వారి సంప్రదాయాల నుండి శాశ్వతంగా దూరం చేసే సాంస్కృతిక దురాక్రమణ నుండి తమను తాము రక్షించుకునే ఆలోచనను ప్రతి ఒక్కరి హృదయంలోను రగిలించాలనేదే నా ప్రయత్నం.

22 comments:

  1. మీరు చెప్పేది నిజం. మా దేవుడు బాధలు నయం చేస్తాడని, ఉద్యోగాలు ఇస్తాడని ఇలా కాళ్ళ బొల్లి కబుర్లు చెప్పే వాళ్ళు ఎంతో మంది కనపడుతున్నారు చుట్టూ. అంతేనా ప్రార్ధనల సభల్ని, సువార్తా సభలని, ఒక రాజకీయ పార్టీ చేసే సభలా తీర్చిదిద్దుతున్నారు. ఎంత సొమ్ము విదేశాల నుండి వస్తుందో ఈ మధ్యన ఆంధ్రజ్యోతి లో ప్రచురించారు. ఎవేరెంని చెప్పిన డబ్బులకి ఆశపడే దౌర్భాగ్యం ఉన్నప్పుడు, ఈ కులాల లంపటం పోయే వరకు ఇవి ఆగేల లేవు.
    ఈ మధ్యన బ్లాగుల్లో కూడా మొదలెట్టారు. ఒక బ్లాగ్ లో ఒకావిడ వ్యాఖ్య చుస్తే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే .....
    క్రైస్తవ మతం లో చేసే ప్రార్ధనలు నిజమైనవి అంట, హిందూ మతం లో ప్రార్ధనలు నటించినట్టు ఉంటాయంట. క్రైస్తవ మతం లో మానవత్వం ఉంటుందంట అది హిందూ మతం లో కనిపించదంట, How ridiculous these comments are...
    :venkat

    ReplyDelete
    Replies
    1. క్రైస్తవంలో ఎంత మానవత్వం ఉంటుందో మధ్య యుగాల్లో క్రూసేడ్ల గురించి తెలుసుకుంటే అర్ధమవుతుంది. మతం పేరు చెప్పి, ఎంత మంది అమాయకుల్ని ఊచకోత కోసారో, ఎన్ని నాగరికతల్ని నామరూపాల్లేకుండా చేరారో, ఎంతమందిని మంత్రగాళ్ళని సజీవ దహనం చేసారో, పసికందులని చూడకుండా, తలల్ని గోడ కేసి కొట్టి వారికి విముక్తి కలిగించామని పైశాచికానందం పొందారో, తెలుసుకుంటే ఇంకెప్పుడూ అలాంటి మాటలు మాట్లాడరు..

      Delete
    2. /ఒక బ్లాగ్ లో ఒకావిడ వ్యాఖ్య చుస్తే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ...../
      ఎవరా మూర్ఖిణి వెంకట్ గారు?
      లింక్ ఇవ్వండి, ఆ ప్రజ్ఞాపాటవాలు దర్శించుకుని తరిస్తాము. :)

      SNKR

      Delete
    3. http://jajimalli.wordpress.com/2012/09/04/%E0%B0%B9%E0%B0%BF%E0%B0%82%E0%B0%B8-%E0%B0%92%E0%B0%95-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82/#comments

      Comments are not related to that post.

      :Venkat

      Delete
    4. ఇప్పటికే కేరళలోని చర్చులలో హిందూమతం మాదిరిగానే హారతులు, అష్టోత్తారాలు సాగుతున్నాయట. ఎంతోమంది క్రైస్తవ మేదావులు ఆమతంలోని లొసుగులను తెలుసుకొని హైందవంవైపు మళ్ళుతున్నారు. ఈ మధ్య రాజమండ్రిలోని ఇస్కాన్ గుడికి వెడితే అక్కడ కొందరు కృష్ణభక్తులైన విదేశీయులు కనిపించారు వారి పెద్దలు క్రైస్తవంలోనే ఉన్నారు, ఆదిశంకరులు బౌద్ధాన్ని హైందవంలో కలిపేసి బుద్ధున్ని దశావతారాల్లో చేర్చినట్టే క్రైస్తవవం కూడా ఎప్పుడో ఒకప్పుడు హైందవంలో కలిసిపోతుంది"నదీనాం సాగరోగతిః"నదులన్నింటికి సముద్రమే దిక్కు ఐనట్టు అన్నిమతాలకు హైందవమే దిక్కు. నేనైతే ఎప్పుడో క్రీస్తును హైందవంలో చేర్చి దశావతార శ్లోకంలో ఎక్కించాను
      శ్లో|| మత్స్యకూర్మ వరాహశ్చ
      నారసింహశ్చ వామనః
      రామోరామశ్చ రామశ్చ
      బౌద్ధౌ కల్కి తదేసుచ

      Delete
    5. Ravi chandra Gaariki Dhanya vaadhaalu pai slokam vraasi

      Delete
  2. బాగా వ్రాశారు. సాక్షి దినపత్రిక చాలా బహిరంగంగా క్రైస్తవ మతప్రచారం చేస్తున్న మాట వాస్తవం.

    ReplyDelete
  3. కేవలం ప్రార్థనతో రోగాలు తగ్గే మాటయితే ఇంత పెద్ద వైద్యకళాశాలలూ, ఆస్పత్రులూ, వైద్యులూ, శ్కానింగులూ, డయాగ్నసిస్సులూ ఇవన్నీ ఎందుకు ? ఈ పోచుకోలు కబుర్లు యూరోపులోనూ, అమెరికాలోనూ జనం వినడం మానేశారు. అందుకని ఇక్కడ చెబుతున్నారు, "అందఱికంటే బుద్ధిలేనివాళ్ళు భారతీయులే గదా ?" అనుకొని !

    ReplyDelete
    Replies
    1. అది కాదు విచిత్రం... మిషనరీ వాళ్ళే సేవ ముస్గులో హాస్పిటల్స్ నడుపుతూ, M.B.B.S,, M.D డాక్టర్లతో వైద్యం చేయిస్తూ, ప్రభువు వల్లే రోగం తగ్గుతుందని చెప్పడం మోసం కాక మరేమిటండి? పాస్టర్లకి జబ్బు చేస్తే వాళ్ళు ప్రార్ధన చేయరు, వాళ్ళకి డాక్టర్లు కావాలి మరి..

      Delete
    2. క్రైస్తవులు వైద్యుల దగ్గరకు వెళ్ళవచ్చా

      Delete
  4. వ్యాపారం జరగాలంటే ప్రచారం కావాలి /దానికి సెలబ్రెటీలైతే ఊపు వస్తుంది కనుక డబ్బిచ్చి ఇటువంటి వారిచే ప్రచారం చేపించటం ఆమతబేహారుల వ్యూహం. ఇది బహిరంగ రహస్యమే. ఏసత్యసాయిబాబాగూర్చో ఓచిన్న కథనం వస్తే అశ్శరభశరభా అని రంకెలు పెట్టి గోలచెసే కిరాయి నాస్తికుల కళ్లకు ఇవి మాత్రం కనపడవు.

    ReplyDelete
    Replies
    1. అవునండి దుర్గేశ్వర్ గారు... వ్యాపార మతం నుంఛి అంతకంటే ఎక్కువ ఆశించగలం స్వామీ?

      Delete
  5. నాకు తెలిసిన ఓ కుటుంబంలో జరిగిన సంఘటన.వారు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు.వారి పిల్లలకు చిన్నవయసులో ఆయాసంతో చాలా బాధపడేవారు.వారి మానసిక పరిస్థితిని పసిగట్టి వారి ఇంటి ప్రక్కనే ఉన్న ఓ క్రైస్తవ కుటుంబం మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తామని చెప్పి ప్రతిరోజూ చేసి వారి మనసును మార్చి మతం పుచ్చుకునేటట్లు చేశారు.వీరి పిల్లల కోసం ప్రార్థన చేసే వారి ఆరోగ్యమే సరిగ్గా లేదు లేని రోగమంటూ లేదు కాలుతీసి కాలుపెట్టాలంటేనే ఇబ్బంది. మతం మారిన వారు ఈ విషయాన్ని గురించి ఆలోచించలేక పోవడం చాలా బాధాకరం.ఇంతా చేస్తే మతం మారిన వారు టీచర్లు.చదువుకున్నవారి పరిస్థితే ఇలా ఉంటే విద్యలేనివారి పరిస్థితి అర్థం చేసుకోండి.కొసమెరుపేమిటంటే ఈ మతం మారిన కుటుంబం అప్పుడప్పుడు(పర్వదినాల్లో) దేవాలయంలో కూడా కనిపిస్తుంటారు.

    ReplyDelete
    Replies
    1. ఒక్క రెడ్లు మాత్రమే కాదండి... అన్ని కులాల వారు, ఆఖరికి బ్రాహ్మణులు కూడ ఈ రొంపిలో చిక్కుకుంటున్నారు. మా జిల్లాలో ఒకాయన తన పేరు మార్చుకుని, పాప్లెట్లలో పేరు చివర శాస్త్రి అని తగిలించుకుని, "మారు మనసు పొందిన బ్రాహ్మణుడు" అని వేయించుకుంటున్నాదు... అటువంటి వాళ్ళని చూస్తే జాలేస్తుంది...

      Delete
  6. మదర్ థెరెసా బీటిఫికేషన్ ప్రహసనాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. మోనికా బెస్రా అనే అవీడకు పొట్టలోని కణితిని తెరెసా మహత్తుతో కరిగించివేశారని ప్రచారం చేసి, థెరెసాకి సయింట్‌హుడ్ ఇచ్చేశారు. ఆ తరువాత కొన్నేళ్ళకు, మహత్తు స్టేట్మెంట్ తాలూకుపూర్తి డబ్బు ఇవ్వకుండా సిస్టర్ నొక్కేశారని బెస్రా పత్రికలకెక్కింది.
    బొత్తిగా కానీ వేషాల్లేని ఈ దివ్యవాణి, మరో మోనికా బెస్రా కాదంటామా? కూటికోసం కోటి తిప్పలు.

    ReplyDelete
  7. false christianity

    ReplyDelete
  8. no christianity is false.....

    ReplyDelete
  9. నీ భాష చూస్తోంటే అది యండమూరి భాషలాగ ఉంది. "కాష్మోరా అనేది ఉందట, దాన్ని వెయ్యేళ్ళ క్రితం ప్రయోగించేవారట, ఈ రోజుల్లో దాన్ని ప్రయోగించేవాళ్ళు ఒకరో ఇద్దరో మాత్రమే ఉన్నారట" ఇది యండమూరి గారి ప్రవచనం. మంత్రాలకి చింతకాయలు రాలవనుకుంటే అలా రాల్చే శక్తి ఎవరికీ ఉండదనే దాని అర్థం. అంతే కానీ ఎంతో ఆత్మ శక్తి ఉన్నవాళ్ళకే ఆ శక్తి ఉంటుందనే అర్థం ఎక్కడి నుంచి వస్తుంది?

    ReplyDelete
    Replies
    1. బ్లాగుల్లో ఒక్కటే వుంది, అదే మార్తాండ. కిసుక్కు కిసుక్కు

      Delete
  10. ఈ చీడ తొలగాలంటే ముందు వేరుకు మందు వేయాలి...

    కనీస విద్య (ప్రాధమిక విద్య), కనీస వైద్యం (ప్రాధమిక వైద్యం ) ఇవి ఏ సమాజానికైనా తీర్చవలిసిన కనీస అవసరాలు.... ఎక్కడైతే మన సమాజం (ప్రభుత్వం) ఆ అవసరాలని కూడా తీర్చ లేక పోయిందో అక్కడి నుండే ఆ అవసరాలని ఎరగా చూపి మత మార్పిడులు మొదలౌతాయి....

    ఆలాంటి ఎరనే ఈ రాజశేఖర్ రెడ్డి మొలలెట్టాడు... ఫీజు-రీ ఎంబర్స్మెంటు, ఆరోగ్య శ్రీ అల్లాంటివే .. ఇప్పుడు అందరం వాటి పార్ష్వ ప్రభావాలని ఆనుభవిస్తున్నాం.

    -సత్య

    ReplyDelete
  11. ప్రార్ధన వలన లేక పూజ వలన రోగాలు తగ్గవు.రోగ కారణాన్ని కనుక్కొని వైద్యంచేసినపుడు రోగాలు తగ్గుతున్నాయి.మిగతా వన్నీకధలే, బ్రతుకు తెరువు కోసం పడే కష్టాలే-డా.కొల్లా రాజమోహన్

    ReplyDelete
  12. ప్రార్ధన వలన లేక పూజ వలన రోగాలు తగ్గవు.రోగ కారణాన్ని కనుక్కొని వైద్యంచేసినపుడు రోగాలు తగ్గుతున్నాయి.మిగతా వన్నీకధలే, బ్రతుకు తెరువు కోసం పడే కష్టాలే-డా.కొల్లా రాజమోహన్

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.