Pages

Wednesday, May 4, 2011

పైసా ఖర్చు లేకుండా ఇల్లంతా ఎ.సి. కావాలనుందా?

మీరు చదివింది నిజమే. అసలే వేసవి. ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతలు మొదలయ్యాయి. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉండబోతున్నాయట. అది సహజం. ప్రతీ సంవత్సరం వేసవిలో వేడి గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటున్నది. ఓజోన్‌ పొరకు తూట్లు పడుతున్నాయి. మరి వేడి తగ్గించే మార్గం లేదా? లేకేం? ఉంది... సింపుల్‌గా ఒక ఎ.సి. కొనుక్కోవచ్చు. మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఎ.సి. కొనుక్కుంటాం. దానికి బిల్లు కట్టుకుంటాం.  మరో గదిలో ఎ.సి. కావాలంటే? మళ్ళీ డబ్బు కావాలి. అలా కాకుండా ఇల్లంతా ఒక్కసారిగా ఎ.సి. చేస్తే వదిలిపోతుంది కదా? అమ్మో చాలా డబ్బు కావాలి. కరెంట్‌ బిల్లు కూడా చాలా ఎక్కువ వస్తుంది. మన సంపాదనంతా ఎ.సి.కే సరిపోతుంది కదా. ఇప్పుడెలా? అక్కడికే వస్తున్నా... ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇల్లంతా ఎ.సి. చెయ్యాలంటే...

    దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్ళండి... అదేనండి.. మొక్కలు అమ్మే చోటు... వాటిలో నుండి బాగా గుబురుగా పెరిగే  చక్కటి మొక్కల్ని తీసుకోండి. పసుపు రంగు పువ్వులు ఉండే మొక్కలు గాని, వేప, రావిచెట్లు గాని, త్వరగా, దట్టంగా పెరిగే ఏ మొక్కల్నయినా నాలుగు తీసుకోండి. ఇంటికి నాలుగువైపులా, వీలు కాకపోతే, మీ యింటి ముందు రోడ్డు వారనయినా నాటండి. ఒక్క సంవత్సరం కష్టపడి, మొక్కకి రెండు పూటలా నీరు పోయండి. దీనితో రెండు పనులు అవుతాయి. ఒకటి - పైసా ఖర్చులేకుండా, ఆ మొక్క చల్లదనంతో ఇల్లంతా ఎ.సి.గా మారుతుంది. రెండు - సన్నబడడానికి స్కైషాప్‌కి వెళ్ళి ఎక్సర్‌సైజ్‌ పరికరాలు కొనుక్కోనవసరం లేకుండా ఒంట్లో అనవసరంగా పేరుకున్న కొవ్వంతా కరిగిపోతుంది. వావ్‌... గ్రేట్‌ ఐడియా కదా...

మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని సర్వ నాశనం చేస్తున్నాడు. ప్రకృతిని ఎంత నష్టపరిస్తే అంత అభివృద్ధి అనుకుంటున్నాం. ఫలితం.... విధ్వంసం. ఇంటికి చల్లబరుచుకోవడానికి ఎ.సి. కావాలనుకుంటున్నామే గాని... ఒక పచ్చటి మొక్క కూడా అంతే చల్లదనాన్ని ఇస్తుందని మరచిపోతున్నాం. ఇంటి ముందు పచ్చగా ఒక చెట్టు ఉంటే, గాలికి దాని ఆకులు రాలి, గుమ్మంలో చెత్త పేరుకుపోతుందని, చెట్టుని నరికేస్తున్నాం. మళ్ళీ మనమే ఎ.సి.ల కోసం వెంపర్లాడుతున్నాం. ఒక చెట్టుని కొట్టివేస్తే ప్రకృతికి ఎంత నష్టమో మనకీ అంతే నష్టం. మనం పీల్చే గాలిలలోని ఆక్సిజన్‌ పెరగాలంటే చెట్లు కావాలి. మనం తాగే నీళ్ళు వర్షం కురవాలంటే చెట్టు ఉండాలి. మనకు చల్లటి నీడ కావాలంటే చెట్టు ఉండాలి. చెట్టు మన తల్లి లాంటిది. అది మరచిపోయి, తల్లిని కాదని, మరొకరి వెంట పడుతున్నాం. అందరూ మొక్కలు నాటితే... అవి చెట్లుగా మారితే... మ ఇల్లు మాత్రమే కాదు... మన ఊరంతా ఎ.సి. అవుతుంది. అందరూ హాయిగా ఉంటారు.. సర్వే జనాస్సుఖినోభవంతు..

8 comments:

  1. మాష్టారూ! ఈ కాల౦లో చెట్లు పె౦చట౦ అ౦త చవకే౦ కాదు.

    రె౦డు చెట్లు పె౦చటానికి అయ్యే ఖర్చు. చిన్న పాటి టౌన్లో.
    చెట్లు - ప్రీ
    మట్టి - 200/-
    స్థల౦ - కనీస౦ ౩౦ చదరపు అడుగులు - 1,50,000
    నీళ్ళు - మూడునెలలకు ఒక టా౦క్ చొప్పున - 1200/year
    రక్షణ/ఇతర ఖర్చులు - 500/year

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. బాబూ మాస్టారూ... మీరు చెప్పే లెక్క బాగానే ఉంది. అందుకే గవర్నమెంట్‌ ఇప్పుడు కొత్తగా లే అవుట్‌ చేసే ప్రతి స్థలానికి రోడ్‌ నుండి కనీసం 10 అడుగులు సెట్‌ బ్యాక్‌ వదలమని రూల్స్‌ పెట్టారు. ఆ ఖాళీ స్థలంలో మొక్కలు పెంచుకోమని అర్థం. అలాగే సైట్‌ డెవలపర్స్‌ కూడా తప్పనిసరిగా చెట్లు నాటి స్థలాన్ని అమ్మాలనే నిబంధన పెట్టారు. అందుచేత స్థలం రేటు, మట్టి రేటు తీసేయొచ్చు. ఇక నీళ్ళ విషయానికొస్తే, మీరు వృదాగా పోసే నీళ్ళలో కనీసం రోజూ ఒక అర బకెట్‌ వేయగలిగినా మొక్క బతుకుతుంది. మీ పేరు చెప్పలేదు... బహుశా పీనాసిరావు అనుకుంటా.. అందరూ మీలాగ ప్రతి విషయాన్ని కమర్షియల్‌గా ఆలోచిస్తే, ఇక ప్రపంచాన్ని ఎవరూ రక్షించలేరు. మనకి వినాశనం కూడా ఎంతో దూరంలో ఉండబోదు.

    ReplyDelete
  4. ఒక్కసారి మా పీఠానికి రండి .గదిలో కూర్చోమన్నా కూర్చోరు. చెట్లక్రింద మంచం వేసుకుని పడుకుంటే చాలని అంటుంటారు వచ్చినవాళ్ళు. ఒక్కచెట్టుపెంచటానికే ఓపికలేకుంటే మనకోసం ఇంత ప్రాణవాయువు నిస్తున్న చెట్లేమనాలి ?

    ReplyDelete
  5. growing plants is such a beautiful hobby. it's the need of the hour in these days of terrible heat caused by global warming. unfortunately we remember about greenery only when summer starts consuming our energy& the world starts looking like hell. Other than the environment part, growing plants is an act of hope& love. it's great fun!

    ReplyDelete
  6. బాగా చెప్పారండి.

    ReplyDelete
  7. బాగా చెప్పారు. ప్రతి వ్యక్తీ కనీసం ఒక చెట్టును నాటి, పెంచి, పోషించ గలిగినా ఈ భూమికి మంచి జరుగుతుంది. మన ఇంటి ముందే కాక ఇంటి పైన కూడా పెద్ద పెద్ద డ్రమ్ములలో వృక్షాలను పెంచవచ్చని విన్నాను. వృక్షో రక్షతి రక్షిత:

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.