Pages

Monday, July 5, 2010

అసలు మనం మనుషులమేనా?

చిన్న పిల్లలతో అర్ధనగ్నంగా పిచ్చి గంతులు వేయించడం, చూడడానికి ఎబ్బెట్టు కలిగించేలా రకరకాల వింత బట్టలు వేయడం మధ్యన టీ.వీ.ల్లో పెద్ద ఫ్యాషనయిపోయింది. పైగా ఈ పైత్యానికి రియాలిటీ షోలని, ఆట అని పేర్లొకటి. దీనిపై రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ తీవ్రంగా స్పందించి టీ.వీ.ల్లో ప్రసారమయ్యే ఇటువంటి షోల వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, వారి హక్కులని కాలరాసినట్టవుతుందని భావిస్తూ, అటువంతి షోలని నిషేదించాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పింది. అయినా, ఇవేమీ తలకెక్కని సదరు షో నిర్వాహకులు, టీ.వీ. సంస్థల వాళ్ళు ఎటువంటి స్పందనా కనబరచక, పైగా చట్టంలో వున్న లొసుగుల్ని ఆసరాగా చేసుకుని, మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుని మరీ, నిర్లజ్జగా తమ కార్యక్రమాల్ని కొనసాగించుకుంటున్నారు. దీనికి తల్లిదండ్రుల మద్దతు కూడా పూర్తిగా వుంది అనే విషయం తెలుస్తూంది.

ఈ నేపధ్యంలో ఈ రియాలిటీ షోల కోసం పిల్లలు ఎంత హింస అనుభవిస్తారో, ఎంతగా నలిగిపోతారో తెలుసుకుంటే కడుపు తరుక్కుపోతుంది, గుండె రగిలిపోతుంది. ఈ షోలకి సిద్దంచేసే పిల్లల్ని రోజుకి  కనీసం 16 నుంచి 20 గంటల పాటు "ప్రాక్టీస్" చేయిస్తారట. ఇక్కడ మనం మాట్లాడుకునేది నిండా పదేళ్ళు కూడా దాటని చిన్న పిల్లల గురించి అని మరచిపోవద్దు. అంత చిన్న పిల్ల చేత అన్నేసి గంటల పాటు ప్రాక్టిస్ చేయిస్తే వాళ్ళు ఎలా తట్టుకుంటారో, ఎంత నరకం అనుభవిస్తారో మనకి ఊహలకి కూడా అందదు. పెద్దవాళ్ళమయిన మనమే రోజుకి ఏదయినా పది పన్నెండు గంటలకి మించి కష్టపడలేము కదా.. అటువంటిది అంత చిన్న పిల్లలు అంత కష్టాన్ని ఎలా భరిస్తారో అందరూ  ఆలోచించాలి.

అసభ్యత ఎంత ఎక్కువ ఉంటే అంత గొప్ప షోగా నిర్వాహకులు భావిస్తారేమో తెలియదు. పిల్లలకి వేసే దుస్తులు ఎంత చండాలంగా వుంటాయంటే, పెద్ద వాళ్ళు కూడా వేసుకోవడానికి సిగ్గుపడేలా వుంటాయి. పాటల విషయానికి వస్తే అన్నీ ముదురు పాటలు, వయసుకు మించిన హావ భావాలతో పరమ దరిద్రంగా వుంటాయి. చిన్న పిల్లల్ని చూసినా, వారి మాటలు విన్నా ఎంతటి వెధవకయినా మనసు కరుగుతుంది. మనిషిలో వున్న పసి మనసు తొంగిచూస్తుంది. వారి ముద్దు ముద్దు మాటలు వింటూ పరవశించాలనిపిస్తుంది. ఆ పసితనపు ఒడిలో ఆడుకోవాలనిపిస్తుంది. కాని ఈ రాక్షసులకి వారిలో ఒక బూతు పాటలకి డ్యాన్స్ వేసే "నటీమణి"  కనిపిస్తుంది. సినిమాల్లోని కామాన్ని ప్రకోపింపచేసే వారి భంగిమలు గుర్తొస్తాయి. చిన్నారు చేసే ఆ చిన్ని కుప్పిగంతుల్ని సినిమా వాళ్ళతో పోల్చి ఇంకా బాగా చెయ్యాలి, ఇంకా బాగా తిప్పుకోవాలి అంటూ పనికి మాలిన చెత్త కామెంట్లొకటి. మళ్ళీ వాళ్ళళ్ళొ వాళ్ళకి పోటీ పెట్టి ఎలిమినేషన్ చేస్తామని చెప్పి, వాళ్ళు ఏడుస్తుంటే ముఖాలని క్లోజప్ లో పెట్టి వారి కన్నీటిబొట్టుని కూడా ప్రసారం చేసి,  అందరి జాలిని, సానుభూతిని పొందడం. చూస్తూనే వళ్ళు జలదరిస్తుంది. ద్వందార్ధపు సాహిత్యం వుండే పాటలకి, చండాలంగా వుండే డ్రెస్సులు వేసి చిన్నారుల చేత వేయించే కుప్పిగంతుల్ని సంస్కారం వున్నవారెవరూ డ్యాన్స్  అనరు, పైత్యపు వికారం అంటారు. ఇటువంటి షోలు చూసి ఆనందించే వారిని సైకాలజీలో "పీడోఫీలియన్స్" అంటారు. అంటే చిన్నపిల్లల పట్ల లైంగిక వాంచ కలిగిన మానసిక రోగులన్నమాట.

ఫ్లడ్ లైట్ల వెలుగులో చిన్నారు జీవితాలు ఎలా మసిబారుతున్నాయో, పిచ్చి పిచ్చి చేష్టలకి చిన్నారుల మనసులు ఎంత కలుషితం  అవుతున్నాయో అటు తల్లిదండ్రులకి, టి.వీ. షో నిర్వాహకులకి పట్టడం లేదు. నాకు తెలియక అడుగుతున్నాను... పిల్లలకి పేరు ప్రఖ్యాతులు రావాలని తల్లిదండ్రులు ఆశ పడడం తప్పు  లేదు. కాని పిల్లల చేత రికార్డింగ్ డ్యన్సులు వేయించాలనుకోవడం ముమ్మాటికీ తప్పే. ఇక్కడ మరో సంగటి చెప్పాలి. రికార్డింగ్ డ్యాన్సులు వేసే వారు వేరే గతి లేక బజారులో బట్ట విప్పుకుని గంతులేస్తారు. అటువంటి వారిమీద పోలీస్ కేసు పెడతారు. టీ.వీ.ల్లో రహస్య కెమేరాలు పెట్టి ఫ్లాష్ న్యూస్ ప్రసారం చేస్తారు. కాని అదే టీ.వీ. చానళ్ళు చిన్నపిల్లల రికార్డింగ్ డ్యాన్సుల్ని స్పెషల్ షోలకిందా చూపిస్తారు. టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి ఇంతగా దిగజారక్కర్లేదనుకుంటాను.
ఇవన్నీ చూస్తూ కూడా, చేష్టలుడిగి చూస్తున్న ఈ సమాజం, ఈ ప్రభుత్వం, ఈ న్యాయ వ్యవస్త, అసలున్నట్లా? లేనట్లా? అసలు మనం వున్నది మానవ సమాజంలోనా, లేదా ఆటవికులు, రాక్షసులు, జంతువులూ వుండే ఆటవిక సమాజంలోనా? అసలు మనం మనుషులమేనా? రాక్షసులమా?

6 comments:

  1. cinima pitchi... pEru raavalanE duraasa.. enthakaina digajaarustaayi.. vaaLLU asalu talli tandRula.. lEka vyaparastulaa???

    ReplyDelete
  2. adi evaru cheppaleani samaadaanam nestam

    ReplyDelete
  3. వోడి పోయిన వాడి తల్లి పిల్లాడి తో ఇలా,
    సిగ్గు పాడు వెధ్వ, నీ కన్నా ౩ ఈళ్ళ చిన్న పిల్ల చలబాగా చేస్తే నువ్వు వెధవలా చేశావు... చాక్లేట్ తింటావు... పంది తిన్నట్టు...
    పిల్లలకు ఈ "విస్ కిడ్" చేద్దాము అణు మనస్తత్వం పోవాలి మన మధ్య తరగతి అమ్మ నాన్నలలో...

    ReplyDelete
  4. @ అనానిమస్ గారు... నిజమే అటువంటి తల్లిదండ్రుల్ని వ్యాపారస్తులనటమే సబబు...
    @ హను గారు.. బాగా చెప్పారు... సమాధానం వుందో లేదో...
    @ శేషు కుమార్ గారు.. "విస్ కిడ్" చేద్దామనుకుంటే తప్పు లేదు కాని దానికోసం పిల్లల్ని హింసించనక్కర్లేదు.
    @ హరీష్ గారు.. కొన్ని విషయాల గురించి మాట్లాడకుండా వుంటే మంచిది. మళ్ళీ అనవసరంగా బూతులొస్తాయి..

    ReplyDelete
  5. అపిల్లల అమ్మనాన్నలను అలాంటి డాన్స్ లేస్తే చూస్తా? మరి మీ విషయం తెలీదు కాని నేను మనిషినే.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.