Pages

Tuesday, June 15, 2010

భారతీయుల మీద జరిగిన కుట్రకి సాక్ష్యమిదిగో...

భారత దేశ విద్యారంగంలో పెను మార్పులు తీసుకురావడానికి ఆద్యుడు లార్డ్ మెకాలే. ఇప్పటికీ సాంప్రదాయవాదులు ఆయన విద్యావిధానాన్ని దుమ్మెత్తి పోస్తూనే వుంటారు. ఈ మధ్యన ఒక ఫ్రెండ్ దగ్గర నుండి వచ్చిన ఈ మెయిల్ చూసి నేను షాక్ కీ గురయ్యాను. అది నిజమో కాదో నాకు తెలియదు కాని, అందులో వ్యక్తపరచబడిన భావాలు మాత్రం ఖచ్చితంగా నిజమే అని నమ్ముతున్నాను. దాని తెలుగు అనువాదం ఇక్కడ ఇస్తున్నాను. చదవండి..

లార్డ్ మెకాలే 1835, ఫిబ్రవరి 2వ తారీఖున బ్రిటిష్ పార్లమెంటుకి రాసిన  వుత్తరం.

"నేను భారత దేశం నలుమూలలా పర్యటించాను. కాని దేశం మొత్తం మీద ఎక్కడా ఒక బిచ్చగాడు కాని, ఒక దొంగ కాని కనిపించలేదు. ఇంతటి సంపన్నమయిన దేశాన్ని, ఇంతటి నీతిమంతులయిన ప్రజులున్న దేశాన్ని, ఇంతటి సమర్ధులయిన ప్రజలున్న దేశాన్ని మనమెప్పటికయినా జయించగలమని నేను అనుకోవడం లేదు. కాని ఈ దేశానికి వెన్నెముక అయిన ప్రాచీన సంస్కృతిని, సాంప్రదాయాల్ని, అత్యంత  పురాతనమయిన విద్యావ్యవస్తని నాశనం చేయడం ద్వారా, వారి సాంప్రదాయ విద్య స్తానంలో మన ఇంగ్లీష్ విద్యని ప్రవేశపెట్టడం ద్వారా, భారతీయులకి వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకుండా చేసి, వారి ఔన్నత్యాన్ని కోల్పోయేలా చేసి, కేవలం విదేశీయులు మాత్రమే గొప్పవారు, అందులోనూ అంగ్లేయులు ఇంకా గొప్పవారు అనిపించేలా చెయ్యగలిగితే మనం అనుకున్నది సాధించవచ్చు. (భారత దేశాన్ని ఆక్రమించవచ్చు)


పైన వున్న వుత్తరం నిజమయినా కాకపోయినా, ఇప్పుడున్న పరిస్తితి చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. మన బ్లాగర్లలో కొంత మంది భారత దేశ సంస్కృతిని, సంప్రదాయాల్ని పనిగట్టుకుని తిడుతూ, దుష్ప్రచారం చేస్తున్నారు. అటువంటివారందరికీ ఒక మనవి. ఎవరినయినా ద్వేషించేముందు, దూషించే ముందు ఒక్కసారి అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలి. ఎవరో చెప్పింది, ఎవరో రాసింది మాత్రమే సరయినదనే అభిప్రాయాన్ని మార్చుకోవాలి. మనల్ని మనం అవమాన పరచుకోకూడదు. ఎవరి గొప్పదనం వాళ్ళకుంటుంది, ఎవరి లోపాలి వాళ్ళకుంటాయి. అంతే గాని ఇతరులని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుని, అదేదో పెద్ద గొప్ప విషయంలా చూపడం మానుకోవాలి.

ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, భారత దేశ సంస్కృతి అధమ పక్షం 10,000 సంవత్సరాల నాటిది. అంత పూర్వకాలం నుండి అవిచ్చిన్నంగా కొనసాగుతున్న సంస్కృతి, నాగరికత ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు. భారతీయ సంస్కృతితో పరిడవిల్లిన ఈజిప్ట్, పర్షియన్, మాయన్ వంటి నాగరికతలు చరిత్రలో కలిసిపోయాయి. అదీ ఎటువంటి ఆధారాల్లేకుండా... కేవలం వాళ్ళు వాడిన కుండ పెంకులు, సమాధులని తవ్వి తీసి చరిత్ర రాస్తున్నారు. కాని అన్ని ఆధారాలతోను, సుసంపన్నమయిన సంస్కృత భాషలో అప్పటి చరిత్ర గురించి ఆధారాలు లభిస్తుంటే, ఇది నిజం కాదు అని తిరస్కరించడం పర దేశ సంస్కృతి దాసోహమనడం వల్లనే వచ్చింది. ఇంతటి అరుదయిన సంస్కృతిని పొగడనకర్లేదు, కనీసం మిగిలిన వాళ్ళతో కలిసి తిట్టకుండా వుంటే చాలు.

21 comments:

 1. ఇది ఎంతవరకూ నిజమో నాకు తెలియదు కాని, నేను మొదటిసారి చూసింది మాత్రం ఇంటర్నెట్ లో కాదు.
  మేము ఢిల్లీలో ఉన్నప్పుడు మా అమ్మాయి సాకేత్ లోని ఎమిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివేది.
  ఆ స్కూల్ రిసెప్షన్ ఏరియాలో దీన్ని ఫ్రేం కట్టించి పెట్టారు.
  అక్కడే నేను మొదటి సారి చూసాను.

  ReplyDelete
 2. సరదాకని చెప్పి సీరియస్ మాటలు రాస్తున్నావేంటన్నయ్యా?

  ReplyDelete
 3. ee maatala prabhaavam dunna potu meeda jallu kurisinatle, kaaani eppatikainaa eee murkhulloo maarpu vastundani, poruginti pullakura edo oka roju vegatu putti malliii sonthintiki gurche aalochistaarani chinna aasa undi

  ReplyDelete
 4. @ మహేష్ గారు.. మీ టపా చదివాను. మీరు ఎప్పటిలాగే ఇంగ్లిష్ వాళ్ళని సమర్ధించారు. దాని మీద చాలా పెద్ద చర్చ జరిగినట్లు గమనించాను. O.K ఎవరి అభిప్రాయం వరిది. కాని భారత దేశం యొక్క ఔన్నత్యం మీద గుప్తుల కాలంలో మెగస్తనీస్ రాసిన "ఇండికా" అనే గ్రంధంలో కూడా ఇంచుమించు ఇటువంటి అభిప్రాయమే వుంది. "హిందూ దేశంలో దొంగతనం చేసే ఒక పురుషుడు గాని, వ్యభిచరించే ఒక స్త్రీ గాని కనబడలేదు" అని రాసినట్టు చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాము. ఒక వేళ ఆ కాలం నాటికి భారతీయులు ఆకులు అలములు తిని బ్రతుకుతున్నారని మీరంటే నేనేమీ చెప్పలేను. అసలు ప్రపంచంలో భారత దేశానికి వచ్చి ఎందుకు వ్యాపారం చెయ్యాలనుకున్నాయి? ఎప్పుడయినా ఆలోచించారా? అప్పట్లో హిందూ దేశం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం కాబట్టి. పేదవాడితో ఎవ్వరూ వ్యాపారం చెయ్యాలని కోరుకోరు కదా?

  @ బోనగిరి గారు.. థాంక్స్ అండి.. కొత్త విషయం చెప్పారు.

  @ అనానిమస్ గారు.. చూసే వాళ్ళకి లోకమంతా సీరియస్సే... ఆలోచించే వాళ్ళకి లోకమంతా సరదాయే...

  @ అనానిమస్ గారు.. మీరు చెప్పినట్లు వీళ్ళు ఇప్పటికయినా మారతారో లేదో.. లేదా ఎప్పటికీ మారరో.. వేచిచూద్దాం...

  ReplyDelete
 5. http://www.janataparty.org/articledetail.asp?rowid=24


  never existed till the British imperialists put it together, or that Indians have always been ruled by invaders from abroad. There is no such word as Aryan in Sanskrit literature [closest is ‘arya’ meaning honourable person, and ndot community] or Dravidian [Adi Sankara had in his shasthrath with Mandana Mishra at Varanasi, called himself as a ‘dravida shishu’ that is a child of where three oceans meet, i.e., south India]. The theory was deliberate distortion by British imperialists and propagated by their Indian witting and unwitting mental slaves. Incidentally, the Aryan-Dravidian myth has now been exploded by modern research on DNA of Indians and Europeans conducted by Professor C.Panse of Newton, Mass. USA and other scholars. In light of such new research, the British Broadcasting Corporation [BBC] service in it’s October 6, 2005 service completely debunked the Aryan—Dravidian race theory stating that: “Theory was not just wrong, it included unacceptably racist ideas” [www.bbc.co.uk, religion & ethics homepage, Thursday, 6/10/05
  ----------------------------------------
  Even the patriotic and anguished writings of Dr.Ambedkar, and his oration in the Constituent Assembly for a strong united country have been vulgarized to advocate Hindu society’s disintegration. In his scholarly paper presented in a 1916 Columbia University seminar [and published in Indian Antiquary, vol. XLI, May 1917 p.81-95] Dr. Ambedkar stated: “It is the unity of culture that is the basis of homogeneity. Taking this for granted, I venture to say that there is no country that can rival the Indian Peninsula with respect to the unity of it’s culture. It has not only a geographic unity, but it has over and above all a deeper and much more fundamental unity---the indubitable cultural unity that covers the land from end to end”. Ambedkar wrote several such brilliant books, but alas, Nehru and his cohorts so thoroughly frustrated him that in the end bitterness drove him to Buddhism.  Thus, if this degeneration and disconnect are not rectified and repaired by a resolve to unite Hindustanis [Hindus and those others who proudly identify with India’s Hindu past], the Hindu civilization may go into a tail spin and ultimately fade away like other civilizations have for much the same reason.

  ReplyDelete
 6. మహేష్,
  *కొసమెరుపేమిట్రా అంటే, మొదట్లో ఉటంకించిన quote ఒక అంతర్జాల HOAX అని కొన్నాళ్ళకి తేలడం.*
  మీరు చెప్పిందే నిజమైతె ఒక సారీ మీరు ఈ విషయం మీద సుబ్రమణ్య స్వామి ని చాలేంజ్ చేయండి.అతను పైన వ్యాఖ్యలను తన ఉపన్యాసం లో ఉటంకించాడు. మేమంతా ఆయన మాటలు నమ్ముతాం మీ HOAX బ్లాగుని కాదు. అసలికి ఈ బ్లాగు మూసేశారు ఒకసారి మీరే చెక్ చేసుకోండి.
  Please read excerpts from
  http://www.janataparty.org/articledetail.asp?rowid=25

  Making Hindus to lose their self esteem by disparaging their tradition, which also had been the strategy of British imperialists for the conquest of India. Speaking in British Parliament, Lord Macauley said on February 2, 1835 the following:

  “Such wealth I have seen in this country [India], such high moral values, people of such calibre, that I do not think we would ever conquer this country unless we break the very backbone of this nation, which [backbone] is her spiritual and cultural heritage. And therefore, I propose that we replace her old and ancient education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self-esteem, their native self-culture and they will become what we want them, a truly dominated nation”.

  That basic strategy of those who want to see a weak and pliant India remains. Only the tactics have changed. Now the target is the Hindu institutions and Hindu icons, and the route is not the creation of a comprador class to subdue the nation, but fostering a psychological milieu to denigrate the heritage and to delink the Hindu from his past legacy thereby causing a loss of self esteem and a pride in the nation’s past. There are already many examples of this happening.
  --------------------------------

  ReplyDelete
 7. Four decades before Indian independence, a writer raises the question, "Why is England in India at all?" by Jabez T. Sutherland

  http://www.theatlantic.com/doc/190810/nationalist-india

  Why is England in India at all? Why did she go there at first, and why does she remain? If India had been a comparatively empty land, as America was when it was discovered, so that Englishmen had wanted to settle there and make homes, the reason would have been plain. But it was a full land; and, as a fact, no British emigrants have ever gone to India to settle and make homes. If the Indian people had been savages or barbarians, there might have seemed more reason for England's conquering and ruling them. But they were peoples with highly organized governments far older than that of Great Britain, and with a civilization that had risen to a splendid height before England's was born. Said Lord Curzon, the late Viceroy of India, in an address delivered at the great Delhi Durbar in 1901: "Powerful Empires existed and flourished here [in India] while Englishmen were still wandering painted in the woods, and while the British Colonies were a wilderness and a jungle. India has left a deeper mark upon the history, the philosophy, and the religion of mankind, than any other terrestrial unit in the universe."

  ReplyDelete
 8. జగదీష్,
  నేను పైన పేర్కొన్న వాటి గురించి మహేష్ కి తెలిపేది. Ask him to read. నేను ప్రచూరించిన కోట్స్ చాలా అథెంటిసిటి కలవి. ఎవ్వరు కూడా పై వ్యాఖ్యలు చాలేంజ్ చేయ లేరు. నువ్వు చదివితే నీకె తెలుస్తుంది.

  ReplyDelete
 9. @అజ్ఞాత:ఈ మహత్తరమైన విద్య, సంస్కృతి,సాంప్రదాయాల వలన దళితులకు ఒరిగిందేమీ లేదు. They were always kept out of all that is being celebrated now and respected imaginatively then.

  We are better off with Macaulay's form of Education and we care a damn for what you call great tradition of education.

  ReplyDelete
 10. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 11. Jagadish garu,

  there are a set of photographs attatched to the mail. You should have published those,too.

  ReplyDelete
 12. మహేష్,
  నేను ఇక్కడ ప్రచూరించిన కామేంట్ల ఉద్దేశం మీ అభిప్రాయలు మార్చటానికి కాదు. కాని కొందరు ప్రచారం చేసి నట్టుగా ఆర్య ద్రవిడ సిద్దంతం తప్పు అని చెప్పదలుచుకున్నాను. అదేకాక మీరు చూపిన వెబ్ సైట్ లో వాడు రాసినది నిజం కాదు అని చెపాలనుకున్నాను చెప్పాను. అభిప్రాయలు ఎర్పరు చుకోవటం అనేది మీ ఇష్టం.

  జగదీష్,
  *@కత్తి మహేష్ కుమార్ ఇప్పటికె రిజర్వెషన్లు, రింబర్స్మెంట్లు* ఈ వ్యాఖ్య నేను రాయ లేదు. ఇంకొక అనామకుడు రాశాడు. మీరు దీనిని తొలగిస్తారని ఆశిస్తున్నాను.

  ReplyDelete
 13. మంచిగా రాసారు.. ఈరోజుల్లో అలా౦టి.మెకాలే. వాళ్ళని పట్టుకొని ఊగులాడితే కాని కొందరికి పబ్బం గడవదు... కాని ఒక్కమాట.. ఎవరైనా ఈ ఆర్టికల్ ని విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది.. కత్తులు కటార్లు పట్టుకొని వగులడితే వుపయోగం ఉండదు..

  ReplyDelete
 14. మెకాలే మానస పుత్రుల వాదనలు చూశాను. ఇక్కడ ఎవరినో నిందించడానికో, మరెవరినో పొగడడానికో నేను ఈ రాతలు రాయడం లేదు. ఇవన్నీ చదివిన తరువాత నాకు కొంచెం రాయాలనిపించింది.

  మెకాలే విద్యా విధానం లో లోపాలు:

  ఇప్పుడు చదువుతున్న చదువులో 10 సంవత్సరాలు చదివి ఎస్సెస్సీ పాసయితే బ్రతకడానికి ఆ చదువెలా ఉపయోగ పడుతుంది. ఎదో అటెండరు ఉద్యోగం వస్తే తప్ప. అటెండరు ఉద్యోగం కాకుండా ఆ చదువుతో అతను ఎలా బ్రతకగలడు?

  ఇంటర్మీడియేట్ పాసయిన విద్యార్థి ఎలా సంపాదించుకోగలడు? గుమస్తా ఉద్యోగం వస్తే తప్ప.

  15 సంవత్సరాల విలువైన కాలం, ఎంతో డబ్బు వెచ్చించి పూర్తి చేసిన డిగ్రీ అతడికి ఎలా ఉపయోగ పడుతుంది దానికి సంబంధించిన ఉద్యోగం వస్తే తప్ప.

  నేటి ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు కోకొల్లలుగా బ్యాంకు గుమస్తా ఉద్యోగాలు చేస్తున్నారు వారు చదివింది ఏమిటి వారు చేస్తున్నదేమిటి?

  వి.ఆర్.వో ఉద్యోగాలకు ప్రకటన వేస్తే ఒక ఉద్యోగానికి 1500 మంది పోటీనా. వీరిలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారూ, పి.హెచ్.డి పూర్తి చేసిన వారుండడమేంటి???

  డిగ్రీ పూర్తి చేసిన లక్షలాది మంది నేడు ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకు బరువై ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో గమనించారా???

  పెద్ద చదువులు చదివి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న ఎందరో నేటి సమాజం లో వున్నారు.

  ఒక వెల్డింగ్ షాపులో మూడు సంవత్సరాలు పని నేర్చుకున్న వ్యక్తి నెలకు రూ.10 వేలు సంపాదిస్తుంటే 12 సంవత్సరాలు చదివి ఐ.టి.ఐ అదే వెల్డర్ గా చదువుకున్న వ్యక్తి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తుంటాడు.

  చదువుకున్న వాడు ఇంటి దగ్గర వ్యవసాయం చేయలేక బేకారుగా తిరుగుతున్నాడని మా వాడికి ఏదో ఒక ఉద్యోగం చూపించండంటూ ప్రాధేయ పడే తండ్రులు నేడు అడుగడుగున కనిపిస్తుంటారు.

  ఉద్యొగం చేయడమంటే ఒకడి క్రింద పని చేసే జీతగాడనే అభిప్రాయమున్న భారతీయ వ్యవస్థ సమూలంగా తన ఉనికినే కోల్పోయిందంటే ఇది మెకాలే పాపం కాదా?

  ఇక బ్రిటీషు వారి వల్లనే మనం నాగరికులమయ్యామనే భావన వున్న వారికి.

  18వ శతాబ్దం నాటికి ప్రపంచంలోనే అత్యున్నతమైన నౌకలను తయారు చేసిన వారు ఇండియన్స్ అని ఇంగ్లీషు వారు రాసుకున్న రాతలు తెలియవా???

  ప్రపంచ దేశాలను ఆక్రమించుకోవడానికి బ్రిటిషువారు ఇండియన్స్ తో తయారు చేసిన నౌకలు కారణం కాదా.

  అగ్గిపెట్టెలో మడిచి పెట్ట గలిగిన పట్టు చీరను నేసి విక్టోరియా రాణికి బహుమతిగా ఇస్తే ఆ కార్మికుల చేతి వేళ్ళను నరికించిన చరిత్రను మరచిపోతే ఎలా.

  ప్రపంచం లోనే అత్యున్నత ఓడలను నిర్మించిన వారి నుండి నౌకా నిర్మాణం నేర్చుకుని వారందరినీ చంపివేసిన చరిత్రను మరచి పోదామా....

  ఒక యుద్ధ నౌకను నేడు తయారు చేసుకోలేని మెకాలే విద్యా వ్యవస్థను గొప్పదని పొగుడుదామా?

  చదువు అంటే ఏమిటి ???

  అసలు నిజంగా చదువు అంటే ఏమిటి???

  14 యూనివర్శిటీ ల తో ప్రపంచానికే విద్యనందించిన దేశం మనది కాదా.....

  బ్రిటీషు వారు పాలించక పోయి వుంటే చిన్న చిన్న రాజ్యాలుగా.. రాజ్యాల కూటమిగా వుండేదని విశ్లేషకులు అంటున్నారు నిజమే వారికి భారత దేశం గురించి తెలుసా....

  56 దేశాలుగా పిలువబడిన ప్రాంతంలో ఒకే రకమైన చట్టాలు అమలులో వుండేవన్న విషయం నేడు ఎంతమంది చరిత్రకారులకు తెలుసు?

  నేటి ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇండొనేషియా వరుకు, కాశ్మీరునుండి శ్రీలంక వరకు వున్న ప్రాంతాన్ని 56 దేశాలుగా పిలిచేవారు. వీటికి చప్పన్నదేశాలని పేరు.

  ఈ దేశాలకు సంబంధించిన చట్టాలను, కట్టుబాట్లను మహానాడు అని పిలువబడే సదస్సులలో నిర్ణయించేవారు. ఈ సదస్సులు అంతర్జాతీయ సదస్సులు. ఈ సదస్సులలో 56 దేశాలకు చెందిన రాజ ప్రతినిధులు పాల్గొనేవారు. యుద్ధాలతో రాజులు మారినా గ్రామాలలో వున్న పటిష్టమైన వ్యవస్థల వల్ల ప్రజల జీవన విధానం పై ఎలాంటి ప్రభావం వుండేది కాదు.

  మిత్రులను కోరేది ఒకటే వేలాది చేతిరాత పుస్తకాలు చెన్నై ఓరియెంటల్ లైబ్రరీ లో పడి వున్నాయి. వాటిల్లో మనదేశం, మన సంస్కృతి ప్రతిబింబించే రచనలు చాలా వున్నాయి. వాటిని పరిష్కృతం చేసుకుని మన గురించి మనం తెలుసుకుందాం.

  కావేరీ నది పైన వున్న కల్లనై డ్యాం స్పూర్తితో నే ఆర్థర్ కాటన్ గోదావరి బ్యారేజీ నిర్మిచ్మానని రాసుకున్నాడు. మరి ఆయన కంటే 1700 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ బ్యారేజీ ఈ రోజుకూ చెక్కు చెదరకుండా పని చేస్తోంది.మన నుండి బ్రిటీషు వారు ఎంతో నేర్చుకున్నారు. మన చదువు అభివృద్ధి, విజ్ఞానం.అంతే కానీ కుట్రలూ కుతంత్రాలు కాదు.

  అంతర్జాతీయ వ్యాపారం లో శెట్టిసమయాలనే భారతీయ వ్యవస్థల స్పూర్తితో ఈస్టిండియా కంపెనీ ఫుట్టిందనే విషయం ఎంతమందికి తెలుసు.

  భారత దేశానికి పూర్వవైభం రావాలంటే ఖచ్చితంగా ప్రస్తుత విద్యా విధానాన్ని సంస్కరించుకోవాల్సిందే తప్పదు.  ReplyDelete
  Replies
  1. అద్భుతంగా చెప్పారండి... ఇప్పటికీ చాలా మందికి బ్రిటిష్ వాళ్ళని పొగడక పోతే, బానిసత్వాన్ని ప్రదర్శించక పోతే నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసాను కూడా. చాలా చక్కగా చెప్పారు..

   Delete
 15. abhi గారు, నిజాలు చెప్పినారు. అభినందనలు.

  ReplyDelete

Note: Only a member of this blog may post a comment.