Pages

Tuesday, June 1, 2010

సృష్టిలో అందమయినది ఎవరు? ఆడా? మగా?

ఇదేమి ప్రశ్న? నిస్సందేహంగా ఆడవాళ్ళెగా అని మీ సమాధానం చెప్పవచ్చు. మన కవులందరూ, మగ వాళ్ళే కాబట్టి ఆడవారి అందాన్ని తెగ వర్ణించి పడేసారు. ఏ కధ తీసుకున్నా, ఏ కావ్యం చదివినా ఏమున్నది గర్వ కారణం. నరజాతి సాహిత్య సమస్తం స్త్రీ సౌందర్య వర్ణనం. అందుకే మనకి ఈ అభిప్రాయం స్తిరపడిపోయి వుండవచ్చు. ఇక కవయిత్రులెవరూ, రచయిత్రులూ మగవారి అందాన్ని గురించి వర్ణించినట్టుగా ఎక్కడా నేను చదివినట్టు గుర్తు లేదు. అంత మాత్రం చేత మగవారు అందంగా లేకుండా పోతారా? ఈ మధ్యన కొంత ట్రెండ్ మారి మగవారికి కూడా ఫేస్ క్రీములు, సౌందర్య సాధనాలు వచ్చినవి గాని, ఇప్పటి వరకు సౌందర్యం అంటే అది స్త్రీలకే పరిమితమయిన విషయంగా అందరూ భావిస్తున్నారు.

కాని ప్రకృతిని పరిశీలిస్తే అసలైన  అందాన్ని మగవారికే ఇచ్చాడు ఆ దేవుడు. ఏమిటి మీరు నమ్మట్లేదా? అయితే ఇది చదవండి. పక్షులన్నిటిలోకీ అందమయినది నెమలి. నెమలి పించం విప్పి నాట్యమాడుతూ వుంటే ఆ సౌందర్యానికీ, అందానికి పరవశులు కాని వారెవరూ వుండరు. కాని విషయమేమిటంటే, మగ నెమలికే ఆ పించం వుంటుంది. ఆడ నెమలిని ఆకర్షించడానికే ఈ ఏర్పాటు. ఆడ నెమలి చాలా మామూలుగా కొంచెం పెద్ద కోడి లాగా వుంటుంది. పించం లేకుండా..

కోకిల ఎంత అద్బుతంగా పాడుతుంది? వసంత వేళలో కోయిల గానం లేకుండా ప్రకృతికి శోభ రాదు. అటువంటి అందమయిన స్వరం కూడా మగ కోయిలదే. పాపం ఆడ కోయిల అసలు కూయలేదట. కోడి పుంజుని చూడాండి. అందమయిన తురాయితో ఎంత ఠీవీగా నడుస్తుంది. వెనక చక్కని తోక, నెత్తిమీద తురాయితో చాలా అందంగా వుంటుంది. కాని ఆడ కోడి మాత్రం ఎటువంటి హంగులు లేకుండా మామూలుగా వుంటుంది.

జంతువుల్లో చూడండి. మృగ రాజయిన సింహం నెత్తి మీద జూలుతో పెద్ద పెద్ద మీసాలతో ఎంత అందంగా వుంటుంది... అదే సివంగిని చూడాంది. జూలు లేకుండా చాలా సాదాగా వుంటుంది. "జూ"లో మగ సింహాన్ని చూసి ఆనందిస్తారే తప్ప, ఆడ సింహం వైపు కన్నెత్తి కూడా చూడరు. ఏనుగు చూడండి పెద్ద దంతాలో వుంటుంది. ఆ దంత సిరి మగ ఏనుగుకే సొంతం. ఆడ ఏనుగుకి మామూలుగా చిన్న చిన్న దంతాలుంటాయి.

అలాగే మనుషులలో కూడా మగవారికే చక్కటి మీసకట్టు, అందమయిన గెడ్డం వుంటాయి. పై వుదాహరణల వల్ల ఏతా వాతా తేలిందేమిటంటే మగవారు మాత్రమే సహజసిద్దంగా అందంగా వుంటారు అని. అందుకే ఆడవారికి లేని సౌందర్యం తెచ్చిపెట్టుకోవడానికి రకరకాల సౌందర్య సాధనాలు వాడుతారు అని. అయితే ఆడవారి పట్ల మగవారికి వుండే సహజ బలహీనత వల్ల వారి అందాన్ని అదే పనిగా పొగుడుతూ వుండి వుండవచ్చు. అది వారి తప్పు కాదు. ఇప్పుడు మీరేమంటారు? ఎవరి అందం గొప్పదంటారు? ఆడవారిదా? మగవారిదా?

22 comments:

  1. చప్పట్లు , విసిల్స్ , చిటికెలు

    ReplyDelete
  2. avanni vunDEdi aaDadaanni aakarshinchaDaanike kaadaa.

    ReplyDelete
  3. ఎవరి అందమ్ వెనుకనైనా అదృశ్య అగాదాలున్టై./జయదేవ్-చెన్నై

    ReplyDelete
  4. abbaile andamga unte enka ammaila venta padatam enduku vallani edipinchadam enduku?? ala anukunte ammaile abbaila venta padila ;-)

    ReplyDelete
  5. ఈ పోల్చుకొని చప్పట్లు కొట్టి చిన్న పిల్లల్లా సంబరపడ్దం ఏంటండీ మరీను.

    అందం అన్నది కళ్లతో ఎంచదగ్గదే అయినా దానికి కొన్ని పరిమితులున్నాయి..
    ఎంత బాహ్య సౌందర్యం కన్నుల కు విందు అయినా, ఆడయినా మగయినా ఆత్మ సౌందర్యం లేనిదే పరిపూర్ణత పొందలేదు.
    ---
    సుధ

    ReplyDelete
  6. @ శ్రీనివాస్ గారు... కేకలు కూడా....
    @ అనానిమస్ గారు... నిజమే నండి... మగవాళ్ళని ఆకర్షించడానికే కదా ఈ మేకప్పులు, కొప్పులున్నూ....
    @జయదేవ్ గారు... బాబోయ్ నేను అంతటి అగాధాల్ని ఈదలేను.
    @ (2) అనానిమస్ గారు... మీ ఊహ కరెక్ట్ కాదు... మగవాళ్ళు తమ అందాన్నంతా ఆడవాళ్ళని ఆకర్షించడానికే ఉపయోగిస్తారు.

    ReplyDelete
  7. super keke
    అది లేక్క మీరు కేకలో కేక అంతే

    ReplyDelete
  8. denini batti emi ardamayyindi ante,

    magavallu, janthuvulu iddaru okkate.

    ReplyDelete
  9. pai agnatha nuvvu puttadaaniki aa jantuvu pashukreeda karanam ani telsuko .

    ReplyDelete
  10. జంతువుల్లోనూ పక్షుల్లోనూ మగవి అందంగా వుంటాయి ఎందుకంటే ఆడవాటిని ఆకర్షించాలి కాబట్టి, మరి మనుషుల్లో ఆడవారు అందంగా వుంటారు ఎందుకం.....

    ReplyDelete
  11. good post. funny and interesting. earlier thought only about peacock.

    ReplyDelete
  12. సూపర్ అండి. చక్కగా వ్రాశారు. మీ పరిశీలనాశక్తి అద్భుతం :-)

    ReplyDelete
  13. మీరు కేకసలు .. కేకంతే :-))

    ReplyDelete
  14. Hmm.. " The best and the most beautiful things in the world cannot be seen, nor touched, but are felt in the heart "
    అని ఎవరో చెపినట్టు అందం అందం అని మనం అనుకుంటామే కాని అందం అనేది చూసే వాటిలో లేదు...

    ఒక మనసుకి ఒక అనుభూతికి సంబంధించే ఈ అందం
    మనకి ఎన్నో విధాలు గా కనిపిస్తుంది కానీ మనం అంత తొందరగా గుర్తించలేము..
    మచ్చుకి కొన్ని
    తీయని పలకరింపు లో ఒక అందం
    ఆప్యాయం గా నవ్వే నవ్వు లో ఒక అందం
    చూపించే అభిమానం లో ఒక అందం
    మొత్తం గా చెప్పుకోవాలి అంటే
    స్వచ్చమయిన ప్రేమ లో మాటలకి అందని అందం
    అది అమ్మాయి ది అవవ్చు అబ్బాయిది అవ్వచు
    మనసు కి ప్రశాంతతని ఇస్తూ నిన్ను నువ్వు మరిచేలా చేసేదే అందం...

    baaabooyi chaala cheppesaanu final gaa enti ante..!!

    సింహం ని చూసినప్పుడు ఏమి చేస్తాము?? Ans: బయపదతాము KadhaA.
    మరి అందం గా ఉంటే ఎందుకు బయపదతాము.. :-P

    ReplyDelete
  15. @ సుధ గారు... మీరు చెప్పింది 100% నిజమండి... మనసులో అందం లేకపోతే, బయటి అందం ఇనుమడించదు. దీని గురించి మరో పోస్ట్ రాస్తాను.

    @ కతపవన్, మాధురి, సందీప్, మంచుపల్లకి, కార్తీక్ గార్లు... అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.

    @ మిగిలిన అనానిమస్‌లు అందరూ... నాకు తెలిసి, నా ఊహ ప్రకారం, అమ్మాయిలు. పేర్లు చెప్పకుండా అలా వుడుక్కుంటే ఎలాగండి? నేనేదో సరదాగా జనరలైజ్ చేసి రాసాను గాని, అందమయిన ఆడపిల్లని చూసి ముచ్చట పడనిదెవరు చెప్పండి? కొంతమంది పిచ్చిన కూడా పడతారు కదండి... ఇది చాలదా ఆడవారి అందం గొప్పదనం చెప్పడానికి?

    @ ఆఖరి అనానిమస్ గారు... మీరు అందం గురించి చెప్పిన విషయం కవితాత్మకంగా వుంది. నేను సింహం గురించి మాత్రమే చెప్పలేదు. గమనించండి. సింహం ఎదురుగా నిలబడితే దాని అందం ఎవరికి కావాలి. ముందు మన ప్రాణాలు దక్కించుకోవాలి గాని.. నేను చెప్పేది డిస్కవరీ చానల్లో చూపించే సింహం గురించి...

    ReplyDelete
  16. ఎన్ని చెప్పుకున్నా మనం అంటే మగవాళ్లం ఈ నెమళ్లతో, కోళ్లతో, సింహాలతో జీవితం గడపలేంకదా మాష్టారు. సావాసం చేసేవాటిలో ఏవరు అందంగావుంటారు...ఆడాళ్లేగా!!

    ఈ అడ-మగ కాస్పెప్టు పక్కన పెడితే సృష్టిలో అందమైనది... ప్రకృతి.ఇందులో వాదాలకు ప్రతివాదాలకు ఆస్కారం ఉండదని నా అనుకోలు, మీరేమంటారు

    ReplyDelete
  17. లాస్ట్ పేరా కేక, కేకంతే ... :)

    ReplyDelete
  18. idi maaku eppudo thelusandee.ayithe naa laage alochinche vallu unnarannamaata.

    ReplyDelete
  19. @ నాగార్జున గారూ... ఈ విషయంలో వాదానికి అవకాశమెక్కడిది? మీరేమిటంటే నేనూ అదే అంటాను.

    @ ధరణిజ గారు.. మీలాగే ఆలోచించే వాళ్ళం మేమున్నాము కదండి...

    ReplyDelete
  20. అందం చూసే దృష్టిలోనే వుంటుంది. ఇరువురిలోనూ సౌందర్యం లేకపోతే ఆకర్షణ వుండదు కదా? యిందులో ఎవరు గొప్ప అని కాదు. అసలు బాహ్య సౌందర్యం ఆకర్షణను మేల్కొలిపే వరకే, కానీ ఆ తరువాత అంతఃసౌందర్యం ఆ ఆకర్షణను ప్రేమగా మార్చి వారి బంధాన్ని చిరకాలం నిలిచేలా చేస్తుంది. ఇది అర్థంకానివే ప్రేమ వైఫల్య వివాహాలు etc.. మీ చర్చలో ఇది అసంబద్ధంగా అనిపించవచ్చు కానీ మీ అందరికీ తెలిసినదైనా యిలా పంచుకోవాలనిపించి... ఇబ్బంది కలిగిస్తే సారీ....

    ReplyDelete
  21. em cheppav guru adiripoyindi........ee ma chusi naku gnyanodayam ayyindi...........

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.