Pages

Monday, May 17, 2010

చిన్నారి చిట్టి కూతుళ్ళంటే నాకు చాలా ఇష్టం.. ఎందుకంటే...

కూతుళ్ళు మాత్రమే వున్నవాళ్ళు చాలా అదృష్టవంతులు.. నమ్మకం లేదా... వీరిని చూడండి... బిల్ క్లింటన్ (అమెరికా మాజీ అధ్యక్షుడు), జార్జ్ బుష్ (అమెరికా మాజీ అధ్యక్షుడు), ఒబామా (అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు), బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్ అధినేత), డా. ప్రతాప్ సి. రెడ్డి (అపోలో హాస్పిటల్స్), డా. అంజి రెడ్డి (డాక్టర్ రెడ్డి ల్యాబ్స్), వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి,  ఎస్పీ జగదీష్ రెడ్డి. (అంటే నేనే, నాక్కూడా ఇద్దరు కూతుళ్ళు). ఇప్పుడు చెప్పండి నేను చెప్పింది కరెక్టేనా?    
 

చిన్నారి చిట్టి కూతుళ్ళని సృజియించువేళ
కడు శ్రద్ధ వహించె ఆ సృష్టికర్త
లోకమెల్ల గాలించె విలువయిన నిధుల కోసం
తను ఇవ్వబోవు అపురూప వరముల కొరకు.

దేవ కన్యల చిరునవ్వులని వారికిచ్చె
అందమయిన నీహారికల వెతికితెచ్చె
ముచ్చటయిన నక్షత్ర ధూలిని
మెరిసే, మైమెరిపించే ఆ కనులలో పెట్టె...

ఆయన బహు మధురమయిన వాటితో
వారిని నింపె, చక్కని చక్కెరతో, నవరస ఫలములతో
సూర్య కాంతిని వారి నవ్వులలో ఇమిడ్చె
ఆహా అతడే చమత్కారి..

చిరునవ్వు ఉదయించె ఆయన మోముపైన
ముద్దులొలుకు బంగారు తల్లిని తయారుచేసినపుడు
ఏలననగా ఆయనకు తెలుసు... ప్రతీ అమ్మకీ, నాన్నకి
ప్రేమని, ఆనందాన్ని ఇవ్వబోతున్నానని..  


పై పద్యం నా స్వేచ్చానువాదం... దానికి ఇంగ్లిష్ మాతృక... ఎప్పుడో చిన్నపుడు రాసుకున్నది..

When God created daughters
He took very special care
To find the precious treasures
that would make them sweet and fair...
 
He gave them smiles of angels,
then explored the midnight skies
And took a bit of stardust
to make bright and twinkling eyes...
 
He fashioned them from sugar
and a little bit of spice,
He gave them sunny laughter
and everything that is nice...
 
He smiled when He made daughters,
because He knew He had
Created love and happiness
for every mom and dad.

9 comments:

  1. బాగుందండీ కవిత.

    ReplyDelete
  2. @ కృష్ణ ప్రియ గారు.. పద్మార్పిత గారు... చాలా సంతోషమండి నా కవిత నచ్చినందుకు..

    ReplyDelete
  3. If i am not wrong Anji reddy has a son - Mr. Satish reddy

    ReplyDelete
  4. నాకు ఇద్దరు కూతుర్లు. ఈ లెక్కన నేనూ అదృష్టవంతుడినే :)

    ప్రస్తుత యు ఎస్ అధ్యక్షులు జార్జ్ బుష్ కాదు. ఒబామా. తనకూ ఇద్దరు కూతుర్లే!

    పిక్ బావుంది. మా పెద్దమ్మాయి లాగే వుంది.

    ReplyDelete
  5. కవిత ఇప్పుడే చదివాను. చాలా బావుంది. పిల్లల గురించి ఇంతమంచి కవిత చదవడంతో మనస్సు ఆహ్లాదపడింది. ధన్యవాదాలు.

    ReplyDelete
  6. @ శరత్ గారూ.. మీరు చెప్పింది నిజమే.. మార్చాను.. పిల్లల గురించి నేనే కాదు ఎవరు కవిత అల్లినా, ఎవరు ఫోటో పెట్టినా అది మనసుకి ఆహ్లాదాన్నిస్తుంది. కవిత చదివి మెచ్చుకున్నందుకు ధన్యవాదములు.

    ReplyDelete
  7. నాకు ఇద్దరు కూతుర్లు. ఈ లెక్కన నేనూ అదృష్టవంతుడినే :)
    @ శరత్ గారూ.. మీకూ ఇద్దరు కూతుర్లయితే మీరు కూడా అదృష్టవంతులే... అనుమానం లేదు... ఆడపిల్లల తండ్రుల సంఘంలోకి హృదయపూర్వక స్వాగతం.

    ReplyDelete
  8. ఎస్పీ జగదీష్ గారూ...,

    నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
    ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
    నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
    మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

    తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
    తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
    హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

    మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

    - హారం ప్రచారకులు.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.