Pages

Sunday, July 25, 2010

పిల్లల్ని ప్రేమించాలి గాని, కామించకూడదు

గత రెండు రోజులుగా రామూ గారికి, తాడేపల్లి గారికి జరుగుతున్న మాటల యుద్దాన్ని చూస్తున్నాను. ఇద్దరికీ మద్దతుగా మిగిలిన బ్లాగర్లు ఎగదోస్తున్న వత్తుల్నీ చూస్తున్నాను.ఏదేమయినప్పటికీ ఈ విషయంలో నేను రాము గారిని నూటికి నూరుశాతం సమర్ధిస్తున్నాను. ఆయన అభిప్రాయ పడుతున్నట్టుగా ఒక పురుషుడికి ఒక స్త్రీ అనే సిద్దాంతమే న్యాయమయినది. ఈ విషయంలో మరో సందేహానికి తావులేదు. బహుభార్యాత్వం, బహు భర్తృత్వ సిద్దాంతాలని తోసి రాజని ఏక పత్ని వ్రతం ఎందుకు అమల్లోకి వచ్చిందో చరిత్ర చదివిన ప్రతిఒక్కరికీ, ముఖ్యంగా Sociology, Anthropology విద్యార్ధులకి బాగా తెలుస్తుంది. ఎవరిని బడితే వారితో శృంగారం జరపడమనేది జంతు సమాజాల్లో చెల్లుబాటవుతుందేమో కాని మానవ సమాజంలో చెల్లుబాటు కాదు.

పిల్లల్కి విద్యాబుద్దులు నేర్పి, వారిని మంచి మార్గంలో పెట్టవలసిన గురువే, బుద్ది లేకుండా, గడ్డి తిని, తాడేపల్లివారి మాటలు పుచ్చుకుని పిల్లలతో సరస సల్లాపాల్లోకి దింపితే, అందరూ కలిసి తంతారు. అది గ్రహించాలి. అదీ కాకపోయినా, తమ వద్దకు విద్యాబుద్దులు నేర్వడానికి వచ్చిన విద్యార్ధినుల పట్ల పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే, తమ వద్ద పనిచెయ్యడానికి వచ్చిన ఆడవాళ్ళని లొంగదీసుకోవాలని చూస్తే మక్కెలిరగదంతారు. (కొంచెం అంపార్లమెంటరీ భాష వాడుతున్నాను. క్షమించాలి. తప్పదు మరి). పిల్లల్ని సొంత కూతురిగా భావించగలిగిన వాడే వారిని సరయిన దారిలో పెట్టగలరు. అంతే గాని కామ వికారాల్ని కలిగివున్న వాడు వాళ్ళకేమి విద్యాబుద్దులు నేర్పించగలుగుతాడు? అది చదువయినా కానివ్వండి... ఆటలయినా కానివ్వండి... కంప్యూటర్స్ కానివ్వండి.. మరింకేదయినా కానివ్వండి..

పెళ్ళనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతని నెరవేర్చలేకపోతే, మరొకరిని చూసుకుంటాను అంటే, అసలా బాధ్యతలోకే ప్రవేశించకూడదు. మరో ఆడపిల్ల జీవితాన్ని పాడు చెయ్యకూడదు. రాము గారు చెప్పినట్లు అచ్చోసిన ఆంబోతుగా వుంటే మేలు. అప్పుడిక ఎవరికీ ఎటువంటి అడ్డంకులు వుండవు. ఎవరికీ అభ్యంతరాలుండవు. చివరికి ఎయిడ్స్ వస్తే పట్టించుకోవడానికి దిక్కు లేక దికుమాలిన చావు చస్తారు. ఎందుకంటే ఇన్ని రోగాలొచ్చిన తరువాత పట్టించుకోవడానికి ఎవ్వరూ వుండరు కనుక. మనం ఒకరి పట్ల బాధ్యతగా వుంటే, మరొకరు మన పట్ల అదే బాధ్యత వహిస్తారు. ఎవ్వరితో నాకేమిపని అనుకుంటే ఎవ్వరికీ కాకుండా పోతారు.

సమాజం అనేది ఒక వ్యవస్త. ఇది అందరికీ ఆమోదయోగ్యమయిన సుత్రాలతో పనిచేస్తుంది. సమాజానికి అందులో ప్రతి వ్యక్తీ సమానమే. ఏ ఒక్కరూ సమాజ రీతికి వ్యతిరేకంగా నడవజాలరు. ఒక వేళ సమాజ సూత్రాలు ఎక్కువ మందికి నచ్చకపోతే, వారిని ఇబ్బందికరంగా వుండి వుంటే ఇన్ని వేల సంవత్సరాలుగా మనగలిగి వుండేవి కావు. కొన్ని వేల సంవత్సరాలుగా మానవ సమాజం ఎన్నో ప్రయోగాలు చేసి ఇప్పుడు మనం చూస్తున్న స్తితికి వచ్చింది. బుద్దిగా తలొంచుకు పోవడానికి, రాము గారిలాగా రాముడు మంచి బాలుడే కానక్కర్లేదు. కాస్త ఇంగిత జ్ఞానం వున్నవాడు, సంస్కారం వున్నవారెవ్వయినా చాలు. సమాజాన్ని మనమేమీ వుద్దరించనక్కర్లేదు. వున్నదాన్ని మన కలుషిత ఆలోచనలతో, అర్ధంలేని వితండ వాదంతో పాడు చెయ్యకుంటే చాలు. 

17 comments:

  1. మొన్నటి వరకు మతం లేకపోతే నీతినియమాలు, వావివరసలు ఉండవు అని చెప్పిన తాడేపల్లి గారు ఇప్పుడు కీచక కోచ్ కౌశిక్ ని జస్టిఫై చెయ్యడం చూసి ఆశ్చర్యపోయాను. నేను నాస్తికుడినే కానీ కౌశిక్ లాంటి రియల్ లైఫ్ కీచకులని జస్టిఫై చెయ్యడం లేదు. కొంత మందికి అవసరమైతే మతం, అవసరం లేకపోతే నాస్తికత్వం ఒంటబడతాయి.

    ReplyDelete
  2. @ ప్రవీణ్ గారు... నిజమే.. నేను కూడా ఆయన రాసిన దాన్ని చదివి చాలా ఆశ్చర్యపోయాను... మనుషులు సందర్భాన్ని బట్టి మారతారన్న మాట.

    @ రమణ గారు... Thank U

    ReplyDelete
  3. chaala bagundi andi...andarilonu ituvanti moral values raavali....chetta upanyaasalu icche tadepalli lanti vaariki doorangaa undali....

    ReplyDelete
  4. జగదీష్,
    మీరు రాసిన ఊకదంపుడు ఉపన్యాసం చూసి మార్తాండ లాంటి వారు ముచటపడాతారంతే. ఊరకనే తాడేపల్లి గారిని విమర్సిన్ చటం చూస్తుంటె నవ్వొస్తున్నాది. ఒకసారి కోర్టులకి వెళ్ళి చూడు ఎన్ని విడాకుల కేసులు ఉన్నాయొ అందులొ మగ వారిని ఎలా ఇరుకున పేడుతున్నారో తెలుస్తుంది. ఉండ్డురు కదలకుండా కుచొని ఇటువంటి బాతాఖాని కబుర్లు అందరు గొప్ప గా చెప్తారు. ఎమీ తెలుసు ప్రస్తుతం మగ వారు పడుతున్న వ్యథ.

    * పిల్లల్కి విద్యాబుద్దులు నేర్పి, వారిని మంచి మార్గంలో పెట్టవలసిన గురువే ....*
    నువ్వు ఎర్ర బస్సు ఎక్కెవాడి మాటలు మాట్లాడుతున్నావు. ఎప్పటి గురువుల గురించి మీరు మాట్లాడేది ఒకప్పుడు రూ 3000 కి పరమాందం తో టిచర్స్ విసుగు అనే పదం లేకుండా 58 సం వరకు ఓపిక గా చెప్పెవారు. ఎందుకంటె నేను 10వ తరగతి చదివే రోజులో నాకు చెప్పిన టిచర్స్ వయసి 55 సం ఉండేది ఐనా వారు కొత్త గా ఉద్యోగం లొ చేరి నప్పుడు ఎంత ఉత్సహం తో చెప్పె వారో అంతె ఊపుతో చెప్పెవారు. అప్పుడు మా టిచర్స్ లో అధిక భాగం బ్రహ్మణులు ఉండేవారు మిగతా వర్గాల వారు వివిధ కారణాల వలన వారి సంఖ్య తక్కువ గా ఉంటటం వలన వీరిని అనుసరిస్తూ ప్రభుత్వ పాఠ శాలలో పిల్లకి మంచి విద్య్ద చెప్పె వారు. ఇప్పుడు అసలికి ప్రభుత్వ పాట శాలలో పిల్లలు లేరు అంతా కార్పోరేట్ మయం. అటువంటప్పుడు గురువు శిష్య సంబందమే లేదు. మా వూరిలో ఒక ప్రైవేట్ స్కులు టిచర్ అమ్మయికి కడుపు చేస్తె అమ్మాయి తల్లిదండ్రులు కొట్ట లేదు సరికదా డబ్బు తిసుకొని సర్దుకున్నారు. ఇప్పటికు ఆ స్కూలు బాగా నడుస్తున్నాది.

    ReplyDelete
  5. @ మొదటి అనానిమస్ గారు.... అందరిలోనూ మార్పు రావాలని, ఆ మంచి రోజు తొందరగా రావాలని కోరుకుందాం...

    @ రెండో అనానిమస్.... నేను ఊకదంపుడి రాయలేదు.... ధాన్యాన్ని దంచుతున్నాను. అయితే పశువులకి ధాన్యానికి, ఊకకీ తేడా తెలీదు కదా.. వారిగురించే నేను బాధ పడేది... ఇక గురువుల విషయానికి వస్తే... నేను ఎర్ర బస్ ఎక్కినా, ఎయిర్ బస్ ఎక్కినా విలువలు మారకూడదంటాను.. ఎవరో కొద్దిమంది గోతిలో పడి, బురద అంటించుకుని అందరికీ అంటిస్తాను అంటే ఎలా కుదురుతుంది? మీరన్నదాంట్లోనూ కొంత నిజం వుంది. అన్ని రంగాల్లాగానే విద్యారంగం లోనూ విలువలు పడిపోయాయి. అయితే మనలాంటి వాళ్ళం అన్నీ తెలిసుండి, తప్పుచేసే వాళ్ళని సమర్ధించకూడదు.

    ReplyDelete
  6. ఆ కీచక గురువులు మగవాళ్లు కనుకే వాళ్లని జస్టిఫై చేస్తున్నారు. ఒక ఆడ గురువు మగ విద్యార్థిని అలా చేసి ఉంటే సమాజం ఎంతో మారిపోయిందని, నైతిక విలువలు ఎంతో దిగజారాయని బాధపడేవారు. ఓ బడిలో ఒక ఆడ గురువు ఒక మగ విద్యార్థితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమెని ఉద్యోగం నుంచి పీకేశారు. ఒక మగ గురువు ఆడ విద్యార్థినిని రేప్ చేస్తే స్కూల్ పరువు పోతుందని ఆ గురువు తప్పుని స్కూల్ యజమానులు కప్పి పుచ్చి విద్యార్థిని తల్లితండ్రులని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి.

    ReplyDelete
  7. మార్తాండా....

    ఇప్పుడు ఆడ గురువు మగ పిల్లవాడిని రేప్ చేస్తే నీ ఎమోషనల్ దెయ్యం చల్లారుతుందేమో
    అదే కదా నీకు కావాల్సింది final గా

    ReplyDelete
  8. lite boss enni cheppina janam maararu.. evaro anonymous comment chuste navvochindi ayana cheppedi ela undante pillalni rape chesina tappu ledantademo??

    ReplyDelete
  9. చూడు జగదీష్ బాబు ప్రాథమికం గా మనిషి ఒక జంతువు అన్న సంగతి అనే విషయం మరచి పోయినట్టు ఉన్నావు. మీరు మాట్లాడె నీతి నియమాలన్ని అక్వైరెడ్ గుణాలు అందువలన అవి అందరి విషయం లో సమానం గా వర్తించవు. నువ్వు గగ్గోలు పేట్టినంత మాత్రనా ఎమీ మారదు.
    -------------------------------
    *పిల్లల్ని రేప్ చెసిన తప్పు లేదంటాడెమొ?? *
    నూవు ఎక్కడికో వేళ్ళుతున్నావు. నీ వయసు, చదువు లాంటి వివరాలు తెలిసి ఉంటె కొంచెం ఓపికగా సమాధానం చెప్ప వచ్చు. కొంతమంది పిల్లలు 20-30సం|| ఒక బ్లాగు పెటుకొని ఎదో తెలిసినవారిలా ఒక కామేంట్ రాస్తారు. జీవితానుభవం లేని వారికి సమాధానం చెప్పాలంటె చాల విసుగు ఎందుకంటె వారి దగ్గరా థీయరి ఎక్కువ ప్రాక్టికాలిటికి తక్కువ గా ఉంట్టుంది. రాము గారి బ్లాగులో ఒక చిన్న అమ్మాయి (శ్రీదివ్య భొద్దికురి ) ఆరిందానిలా/అన్ని తెలిసినదానిలా నోటికొంచిది రాస్తున్నాది( లం|| కొడుకు ). ఐతె ఆ అమ్మయి ఒక మంచి పనిచేసింది. ఆమే విషయాలు ముఖ్యం గా వయసు రాసింది. కనుక నేను చిన్న పిల్ల అని సమధానం చెప్ప లేదు. ఈ వివరాలు తెలియక పోతె నా వర్షన్ నేను రాస్తాను వారి కి ఇంకొక విధం గా వయసు,అనుభవం బట్టి అర్థమౌతుంది.

    ReplyDelete
  10. @ ప్రేమిక గారు.. మీరు చెప్పింది నిజమేనండి... మనం చెపితే మారతారు అనుకోవడం శుద్ద దండగ... ఎవరి అభిప్రాయాలు వారివి.. మన ఆలోచన మనది... ఈ విశాల ప్రపంచంలో ఎవరికి ఎలాగయినా ఆలోచించే, మాట్లాడే హక్కు స్వేచ్చ వుంటాయి. అయితే మన అభిప్రాయం చెప్పడంలో తప్పులేదుగా..

    @ అనానిమస్ గారు.. ముందు మీ పేరుతో కామెంట్ చేస్తే సంతోషిస్తాను.. ఎదుటివారిని వయసు, చదువు అడిగే ముందు మన గురించి కనీసం పేరయినా చెపితే బాగుంటుంది కదండి..
    మనిషి ప్రాధమికంగా జంతువే అన్న విషయం నాకూ తెలుసు... అయితే ఆ జంతువు మనిషిగా మారి సమాజాన్ని ఒక క్రమ పద్దతిలో నడిపించడానికి, తద్వారా మానవ సమాజం జంతు సమాజం నుండి విడివడి ఇప్పుడు మనం చూస్తున్న అభివృద్దిని సాధించడానికి ఆ సంఘ నియమాలే కారణం అని మనం మరువకూడదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తే అప్పుడు మానవ సమాజం జంతు సమాజం కన్నా హీనంగా తయారవుతుంది.

    ReplyDelete
  11. జంతువులు గడ్డి తిని కుడితి తాగుతాయి. మనుషులు ఆ పని చెయ్యలేరు. కానీ కొంత మంది దృష్టిలో మనిషి లక్షణం అంటే కేవలం అన్నం తినడం వరకే.

    ReplyDelete
  12. నైతిక విలువలు ఎప్పటికైనా నైతిక విలువలే . ఎర్రబస్సు అని అవమానించడం నాకు తెలిసి పల్లె హీరోలను అవమానించడానికి విజ్ఞానులం , నాగరీకులం అనుకునే అజ్ఞానులు వాడే కుసంస్కారపు భాష. కన్నూ , మిన్నూ తెలియని కావరం. పల్లె లేకుండా ఐ మీన్ పల్లె శ్రామికులు లేకుండా ఒక్కరోజు కూడా ఏ టెక్ టెక్నాలజీ ముందుకు సాగదు ఇప్పటికీ , ఎప్పటికీ. అయినా మంచి ఎవరు చెపితే ఏంటి ? ఉత్పాదక రంగం లేకుండా అనుత్పాదక రంగం ఏమీ నడవదు. మేధావులూ , చరిత్ర పురుషులూ , మానవతా వాదులూ ఉద్భవించింది , ఉద్భవించేదీ పల్లెనుండే. స్త్రీ , పురుషుల సంబంధాలు స్త్రీ , పురుషులలో వ్యక్తిగత బుద్ధులతో , పక్షపాతం తో కొలవలేము. దుర్మార్గులు స్త్రీలలోనూ ఉంటారు. అందులో సందేహం లేదు. కానీ జనరలైజ్ చేసేటప్పుడు ప్రస్తుతం పురుషాధిక్య సమాజం ఉన్నప్పుడు సహజం గా స్త్రీ పక్షపాతం కొంత తప్పదు. అది తప్పూ కాదు. కానీ దానిని దుర్మార్గులైన స్త్రీలను , హత్యలు లేదా ఘోరాలు చేసే స్త్రీలను ఏరి సమర్ధించినట్టు ఆపాదించడం వాదనను పక్క దోవ పట్టించడమే అవుతుంది. ఇక్కడ మరో వితండం , అసహనం జగదీష్ నువ్వు గగ్గోలు పెట్టినంత మాత్రాన మారదు అంటే? మారకూడదనా ? జగదీష్ గారి పై పిచ్చి కోపంతో మీరు విచక్షణ కోల్పోతున్నారా? స్త్రీ అయినా, పురుషుడు అయినా మానవతా విలువలు కాపాడుకోవడం లో ఎవరు తప్పు చేసినా తప్పే. అణగదొక్కేవి తప్ప అవసరమైన కట్టుబాట్లు , సామాజిక విలువలు కాపాడుకోవడంలో అందరూ సమిష్ఠిగా పోరాడాలి. కుళ్లు వ్యవస్థలో విలువలు పతనం కావడానికి మూలమైన అంశాలపై రాజీలేని సంఘటిత పోరాటం చేయాలి.

    ReplyDelete
  13. నీతి నియమాలనేవి అక్వైర్డ్ గుణాలని వాదించేవాళ్ళని ఉద్దేశించి ఈ కథ వ్రాసాను: https://plus.google.com/111113261980146074416/posts/72bpDaw1QdX

    ReplyDelete
  14. "కథ యొక్క నీతి: పిల్లల్ని బెల్ట్‌తో కొట్టి చదివించే తల్లితండ్రుల పిల్లలు పెద్దైన తరువాత ఆఫీసర్‌లు అవ్వరు కానీ దొంగలో, మాఫియా లీడర్లో అవుతారు."

    "నేను గీతాంజలి పబ్లిక్ స్కూల్‌లో చదువుకునే రోజులలో నా క్లాస్ మేట్ ఒకడు నన్ను తిట్టాడని నేను అతని ముఖం వాచిపోయేలా కొట్టాను. అయితే స్కూల్ బయట కొట్టడం వల్ల అతను ప్రిన్సిపల్‌కి కంప్లెయింట్ ఇవ్వలేదు. "మా నాన్న నన్ను బెల్ట్‌తో కొట్టేవాడు, నేను అతన్ని చేతితో కొట్టాను. మా నాన్న చేసిన తప్పుతో పోలిస్తే నేను చేసిన తప్పు చిన్నదే" అని అప్పట్లో నేను అనుకున్నాను."

    నీ కథలో నీతి ప్రకారం ఇప్పుడు నిన్నేమనుకోవాలి ప్రవీనూ?

    (ఇంకో చిన్న రిక్వెస్ట్. ఇలా నీకు నచ్చినట్టు రెండు పేరాలు రాసిపారేసి వాటిని "కథ" అని జనాల మీదకి వదిలే అలవాటు మానుకో నాయనా? చూడలేక చస్తున్నాం.)

    ReplyDelete
  15. *కుళ్లు వ్యవస్థలో విలువలు పతనం కావడానికి మూలమైన అంశాలపై రాజీలేని సంఘటిత పోరాటం చేయాలి.*
    మీరు పోరాటం చేయండి. మేము చూస్తాము. ఒకప్పుడు బ్రాహ్మణులు ఇలా విలువల గురించి చాలా మాట్లాడేవారు. వాళ్లూ సంఘం లో విలువల పరిరక్షణ, దాని బాధ్యత తమనెత్తిన ఉన్నట్టు, తెగ ఫీలయ్యేవారు. కూటికి డబ్బులు లేక్పోయినా, ఆచారాలు,వ్యవహారాలు అంట్టూ పట్టుకొని వేలాడి, ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. మహిళల వలువల సైజే తగ్గి పోతుంటే, విలువల గురించి మగవారికి ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తారా?

    ReplyDelete
  16. ఆడవాళ్ళు తొడలూ, భుజాలూ కనిపించేలా దుస్తులు వేసుకోవడం తప్పే. అలా వేసుకున్నారు కదా అని ఆకలి చూపులు చూడడం కూడా తప్పే కదా. అలా చూసే మగ కంచర గాడిదల దగ్గర పాప్యులర్ అవ్వడానికే కొంత మంది ఆడ కంచర గాడిదలు అలాంటి దుస్తులు వేసుకుంటారు. ఇలాంటి ఎక్కడ తప్పు జరిగినా అక్కడ ఆడదానికీ, మగవానికీ సమానమైన పాత్ర ఉంటుంది. అంతే కానీ అమ్మాయి చేస్తే ఎక్కువ తప్పనీ, అబ్బాయి చేస్తే తక్కువ తప్పనీ అనుకోలేము.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.