Pages

Saturday, July 24, 2010

ప్రపంచంలో తెలుగు వాడంత గొప్ప వాడు లేడు..

నిజమేనండి... మీరు నమ్మి తీరాల్సిందే. ఇప్పటి వరకు తెలుగు వారికి వున్న గొప్పదనాలకి తోడు ఎవరిచేతనయినా తన్నించుకోవాలన్నా, కుమ్మించుకోవాలన్నా, మెడ పెట్టి గెంటించుకోవాలన్నా తెలుగు వారే అందరికీ ఆదర్శం. తెలుగు వారి గొప్పదనం గురించి చెప్పాలంటే ఇంకా చాలా వుంది. ఒక సారి దూరదర్శన్ లో అనుకుంటా, చాలాకాలం క్రితం సంగతి.. జంధ్యాల గారు ముచ్చటిస్తూ... తెలుగువారు ఎప్పుడూ కూడా తాము చెప్పిందే రైటు అంటారట. అది నిజంకాకపోయినా నిజమయ్యేంత వరకు వాదిస్తారట. ఎవరికి వారు తామే రైటు అనుకుంటారట కూడా. అందుకే మన తెలుగు భాషలో ప్రతీ అక్షరానికి నెత్తిమీద "రైట్" మార్క్ వుంటుందట. మీరే చూడండి... క, గ, ర, మ, న ప్రతీ అక్షరానికీ నెత్తి మీద ఒక "రైట్" మార్క్ వుంటుంది.

తెలుగువాడికి వున్న మరో అలవాటు.. ఎలాంటి పరిస్తితిలో అయినా ఇమిడి పోతాడట.. అంటే "అందితే జుట్టు, అందక పోతే: కాళ్ళు" అన్న మాట. అందుకే మన తెలుగు అక్షరాల్లో మరే భాషలోనూ లేని విధంగా ఒక అక్షరం మీద ఒకటి ఎక్కి కూర్చుంటాయి. ఒక పెద్ద అక్షరం కింద మరో చిన్న అక్షరం దూరిపోతుంది. అంటే అవకాశం  దొరికితే ఒకరి మీద పెత్తనం చేస్తాం... అది కుదరక పోతే ఒకరి కాళ్ళ దగ్గర పడి వుండడానికి కూడా వెనకాడమన్న మాట.... అంతా ఎందుకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి డిల్లీ లో పెద్దల దగ్గర వీర విధేయులుగ వున్నది తెలుగువారే అన్నది అందరికీ తెలిసిందే. అందరికన్నా ఎక్కువ ఎం.పీ.లని పపంది మనమే అయినా గాని రాష్ట్రానికి ఒక్క మంచి ప్రాజెక్టునీ దక్కించుకోలేము. మన మాట నెగ్గించుకోలేము. ఆ భయం ఎందుకో అర్ధం కాదు. అది మంచితనమో, చేతగానితనమో మనకి అర్ధం కాదు.

తెలుగువారికున్న మరో లక్షణం... "ఆత్మ నింద, పర స్తుతి" అట. అంటే మనల్ని మనం తిట్టు కోవడంలో, మరొకళ్ళని పొగడడంలోనూ ఎప్పుడూ ముందుంటాం. అలాగే ఎవరయిన మనల్ని గురించి తిడుతూ ఉంటే అదేమిటని అడగం. బదులుగా ఆహా మహ బాగా తిడుతున్నాడురా బాబు అని మహదానందంగా వింటాం. అదే తెలుగు వాడికున్న గొప్పదనం

"ఆంధ్రులు ఆరంభ శూరులు " అన్న సామెత ఎలాగో వుండనే వుంది. ఏ పనయినా మొదలెట్టేప్పుడు వుండే ఉత్సాహం ఆ పని పూర్తి చేసేప్పుడు వుండదు. ఎప్పుడు ఏ పనిని మొదలుపెడతామో ఎందుకు ఆ పని మధ్యలో ఆపేసి మరో పనిలోకి వెళ్ళిపోతామో మనకే తెలీదు. ఒక ముఖ్య మంత్రి వుండగా నీటి ప్రాజెక్టులు, రకరకాల పధకాలు మొదలెట్టేస్తాము. మరో ముఖ్యమంత్రి వచ్చేసరికి కాళ్ళు లాగి మూల పెట్టేస్తారు.

ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఎప్పుడూ తెలుగులో పలకరించుకోరట. చాలాసార్లు అది నిజమే అనిపించింది నా అనుభవంలో. ఇద్దరు తమిళులు కలిస్తే తమిళంలోనే పలకరించుకుంటారు. ఇద్దరు హిందీ వాళ్ళు కలిస్తే హిందీ లోనే పలకరించుకుంటారు. కానీ ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే మాత్రం "Hai, How are you? What are you doing" అని పరాయి భాషలో కులుకు ఒకలబోస్తారు. ఇంటికెవరయినా చుట్టాలొస్తే, మా పాపని పిలిచి "What's your name?" అని అడుగుతారు. నాకు వళ్ళు మండి పోతుంది. కాని తప్పదు కదా.. వచ్చింది Relatives ఆయే.

మరో ముఖ్య విషయం ఏమిటంటే భారతీయ భాషలన్నింటిలోనూ ఎక్కువ పరాయి భాషా పదాలు దొర్లే భాష తెలుగు మాత్రమే. నేను విన్నది నిజమో కాదో తెలుసుకోవడానికి మా సిటీ కేబుల్ లో రోజుకొక చానల్ చొప్పున అన్ని భాషల చానల్స్ చూసాను. ఎన్ని ఇంగ్లీష్ పదాలు దొర్లుతాయో అని. ఆ గంట లోనూ మొత్తం మీద 4 లేక 5 పదాలు మాత్రమే కనిపించాయి... కాదు.. కాదు వినిపించాయి. అదే తెలుగులో చూడండి... తెలుగు ఎక్కడుందో భూతద్దంతో వెతుక్కోవాలి. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్లు వుంటుంది పరిస్తితి.. అదండి సంగతి... ఇలాంటి ఇంకా చాలా వున్నాయి... తరువాతి టపాల్లో ముచ్చటించుకుందాము.... అందాకా....

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా... గతమెంతొ ఘన కీర్తి కలవోడా....

7 comments:

  1. meeru cheppindi chala nijam endukante nenu prastutam saudi lo vunnanu ikkada kerala vallu kaliste vallu malayalam lo matladutaru
    ade manavallu kaliste hindi leda english lo palakaristaru

    inta cheppina nenu kuda english lo type chestunnanu kshaminchali

    ReplyDelete
  2. @ వెంకట్ గారు... మీరు చెప్పింది నిజమేనండి...
    @ శివ గారు... నెనర్లు

    ReplyDelete
  3. చైతన్యJuly 25, 2010 at 2:43 PM

    జగదీశ్ గారు,

    బాగా చెప్పారండి.. తెలుగు వాళ్ళు ఎలాగ ప్రవర్తిస్తారని అన్నారో మీ అలాగే ప్రవర్తించారు.. తెలుగు వారము అనిపించుకోవడానికా???

    "ఆత్మ నింద, పర స్తుతి"

    - చైతన్య

    ReplyDelete
  4. Good observations and thanks
    Ramu
    apmediakaburlu.blogspot.com

    ReplyDelete
  5. Jagadeesh gaaru,

    mee tapaa bavundi ante, choosara telugu vaallu vimarsani enthaa baaga teesukuntaaro antaara?? :P

    inko maata, telugu vaallante evaro kaadandi.. maname! maarpu mana daggare modalavvali!

    ReplyDelete
  6. @ చైతన్య గారు... మన గురించి మనమే చెప్పుకోవాలి కదండి.... బయటి వాళ్ళు తిడితే వూరుకుంటామా ఏమిటి?

    @ రామూ గారు.. థాంక్స్ అండి...

    @ సీతా.... నువ్వు చెప్పింది నిజమేనమ్మా... తిట్టుకున్నా, పొగుడుకున్నా మనల్ని మనమే అనుకోవాలిగాని, బయటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు కదా... తెలుగువాళ్ళ గొప్పదనం గురించి త్వరలో మరో టపా రాస్తాను

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.