ఇండోనేషియా ప్రభుత్వం అమెరికాతో తన వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరుచుకునే చర్యల్లో భాగంగా ఇటీవల ఒక సరస్వతీ దేవి విగ్రహాన్ని అమెరికాలో ప్రతిష్టించడానికి ఆ దేశానికి బహూకరించింది. ఇండొనేషియా జనాభాలో సుమారు 80 శాతం మంది ముస్లిములు. అయినప్పటికీ, ఆ దేశంలో శతాబ్దాల క్రితమే మరుగున పడిపోయిన ఆ దేశ సాంస్కృతిక వారసత్వం ఇప్పటికీ సజీవంగా ఉండేలా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇండొనేషియా అంతటా, ఆ మాటకొస్తే ఆగ్నేయాసియా దేశాలన్నిటిలోను పూర్వకాలం హిందూ సంస్కృతి వ్యాప్తి చెంది ఉండేది. కాని కాల క్రమంలో చాలా దేశాల్లో బౌద్ధమతం ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఇండొనేషియా, కంబోడియా వంటి దేశాల్లో ముస్లిం మతం వ్యాప్తి చెందింది. కాని ఇప్పటికీ ఆయా దేశాల్లో హిందూ ఆచారాల్ని, దేవీ దేవతల ఆలయాల్ని, విగ్రహాల్ని ఎంతో గౌరవంగా పరిరక్షించడం మనం గమనించవచ్చు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆయా దేశాలు తమ ఘనమైన వారసత్వ సంపదను ఎటువంటి అరమరికలు లేకుండా ప్రపంచానికి చాటి చెప్పడం
ప్రపంచమంతటా ఇలా ఉంటే, అన్ని దేశాల సంస్కృతిని ఇంతగా ప్రభావితం చేసిన మన దేశంలో మాత్రం ప్రాచీన సంస్కృతిపై ఎనలేని నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుంది. ఎక్కడ చూసిన గాంధీ నెహ్రూల జపం వినిపిస్తుంది. మన దేశానికి విదేశీ అతిధులు ఎవరు వచ్చిన ముందుగా వాళ్ళని సరసరి రాజ్‌ఘట్ దగ్గర తీసుకుని పోయి మహాత్మా గాంధీ సమాధికి పువ్వులు జల్లిస్తారు. ఇంకా లోకువ ఎవరైన దొరికితే నెహ్రూ సమాధి దగ్గకి ఇంకా ఇందిరా గాంధీ సమాధి దగ్గరకు కూడా తీసుకువెళతారు. భారతదేశాన్ని సందర్శించిన ప్రతిసారీ ఈ సమాధుల సందర్శన గొడవేమిటో అని కొందరు విదేశీ నాయకులు తిట్టుకున్న సందర్భాలు కూడా మనకు తెలుసు. దేశంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన దేవాలయాలున్నాయి, ప్రపంచంలో ఎక్కడా లేనంత శిల్ప సంపద ఉంది, తాజ్‌మహల్ వంటి అద్భుత కట్టడాలు ఉన్నాయి, సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే మన వాళ్ళకి ఇవేమీ పట్టవు. మన దేశ కరెన్సీ నోట్ల మీద ఓ పది సంవత్సరాల క్రితం వరకు మూడు సింహాల బొమ్మలు ఉండేవి. మన ఘన చరిత్రకు ఆనవాలుగా ఉండేవి. భారత ప్రభుత్వం అధికారిక ముద్ర అది. ఇప్పటి తరం వారికి అవేమీ తెలియవు. ఏ కరెన్సీ నోటు మీద చూసినా గాంధీ గారి బొమ్మే. అసలు గాంధీ బొమ్మ ముద్రించమని రిజర్వు బ్యాంకు వారికి ఎవరు ఆదేశించారో తెలుపమని, ముంబాయికి చెందిన ఒక విద్యార్థిని సమాచార హక్కు చట్టం క్రింద దరఖాసు చేస్తే, బ్యాంకు అధికారులు నీళ్ళు నమిలారు. అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి కరెన్సీ ప్రింటింగ్ విషయంలో ఎవరి సలహాలు, సంప్రదింపులు లేకుండా, కేవలం మౌఖిక ఆదేశాల మేరకు డిజైన్ మార్చారన్నమాట. అలా చేయమని రిజర్వు బ్యాంకు గవర్నర్ గారికి ఎవరు చెప్పి వుంటారో మన ఊహకి అందని విషయం కాదు.
భారతదేశం ఎన్నో కళలకి ప్రసిద్ధి. విభిన్నమైన నాట్య రీతులున్నాయి, ప్రతీ ప్రాంతానికి విభిన్నమైన కళారూపాలున్నాయి, సాంస్కృతిక భిన్నత్వం ఉంది. ఎంతో మంది అద్భుతమైన నాయకులు, చక్రవర్తులు, మహనీయులు ఈ గడ్డమీద జన్మించారు. కరెన్సీ నోట్ల మీద వీటన్నిటినీ ప్రతిబింబించవచ్చు. ప్రధాన కట్టడాలకి ఆయా నాయకుల పేర్లు పెట్టవచ్చు. ప్రధాన కూడళ్ళలో దేశ శిల్పకళను ప్రతిబింబించేలా మహోన్నటమైన శిల్పాలను ప్రతిష్టించవచ్చు. దీని ద్వారా పర్యాటకుల్ని ఆకర్షించవచ్చు. మన దేశ వారసత్వ సంపదను అందరికీ తెలియజేయవచ్చు. కావలసింది సత్ సంకల్పం మాత్రమే. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడితే ఓట్లు రాలవచ్చును. కాని సుసంపన్నమైన దేశ వారసత్వ సంపద భావి తరాలకు అందకుండా పోతుంది.
(ఈ టపా రాయడానికి స్ఫూర్తి నిచ్చిన మిత్రుడు శ్రీ చక్కా ఉమకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు)
(ఈ టపా రాయడానికి స్ఫూర్తి నిచ్చిన మిత్రుడు శ్రీ చక్కా ఉమకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు)

ఇంకా చెప్పాలంటే, మన తెలుగు గడ్డమీద ప్రతిదానికీ రా..గాంధీ పేరు పెట్టడం సిగ్గుచేటు!!
ReplyDeleteఈ మధ్య కాలం లో మహాత్మా గాంధీ పేరుకంటే రాజీవుని పేరే అన్నింటికీ పెట్టేస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన సాంస్కృతిక/స్వాతంత్ర్య యోధులు ఎందరులేరు? అసలు మన దేశం లో గొప్పతనాన్ని ప్రతిబింబించే ప్రతిదాన్నీ కేవలం హిందూత్వానికే లంకెపెట్టేసి.. లౌకికవాదం పేరిట వాటిని దూరం పెట్టేస్తున్నారు.
ReplyDeletewell said
ReplyDeleteఇండోనేషియా లో అతిపెద్ద వాణిజ్యసముదాయం పేరు "రామాయణ"
ReplyDeleteవారి విమానయాన సంస్థ "గరుడ"
మరికొన్ని సంస్థల పేర్లు లేదా వాటి చిహ్నాలు ఇంద్ర, కుబేర వంటి దేవతలు.
బస్ భవన్, రైల్ నిలయం అని పెట్టుకున్నట్లు విద్యా శాఖ సంచాలకుని కార్యాలయానికి "సరస్వతీ భవన్" అని పేరు పెట్టుకోగలమా!
ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా పేరును "అన్నపూర్ణ" గా పలకగలమా!
రేణిగుంట విమానాశ్రయాన్ని బాలాజి విమానాశ్రయమని పిలవగలమా!
ఏ ఒక్క జాతీయ రహదారినైనా "రామ మార్గ్" అని పిలుచుకోగలమా!
మంచి సూచనలు చేసారు రావు గారు... అదే కదా మన దేశ దౌర్భాగ్యం...
ReplyDelete