శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి గారి పంచాంగం క్యాలండర్ గోదావరి జిల్లాల్లోనే గాక, రాష్ట్రం మొత్తం మీద ప్రసిద్ధి గాంచినది. పంచాంగ కర్త తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతిగా కూడా సేవలందిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని కార్యక్రమాలకు అంటే వసంతోత్సవం, బ్రహ్మోత్సవం వంటి వాటికి కూడా ఆయనే ముహూర్త నిర్ణయం చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద పండుగల తేదీ నిర్ణయ విషయంలో వివిధ సిద్ధాంతుల మధ్య సమన్వయం కుదరని పక్షంలో ప్రభాకర పూర్ణయ్యగారినే సంప్రదించి, రాష్ట్ర ప్రభుత్వం ఆయన చెప్పిన తేదీలనే ఖరారు చేసి ప్రకటిస్తుంది. అంతేగాక ఈనాడు ఆదివారం మ్యాగజైన్‌లో కూడా ప్రతివారం వారఫలాలు అందిస్తున్నారు.
మా ప్రెస్ శ్రీ సత్య ఆఫ్‌సెట్ ప్రింటర్స్‌లో కూడా గత రెండు దశాబ్దాలుగా ప్రభాకర పూర్ణయ్య గారి క్యాలండర్‌ని ప్రింట్ చేస్తున్నాము. ఇంతటి ప్రసిద్ధిగాంచిన క్యాలండర్‌ని ప్రపంచం మొత్తం మీద ఉన్న తెలుగు వారందరూ ఉపయోగించాలనే సంకల్పంతో మేము ప్రింట్ చేసిన పి.డి.ఎఫ్. ఫైల్‌ని యధాతధంగా నెట్‌లో ఉంచుతున్నాము. మీకు ఎవరికైనా ఈ క్యాలండర్ ప్రింటెడ్ కాపీ కావాలనుకుంటే ఈ పి.డి.ఎఫ్. నుండి ప్రింట్ చేసుకోవచ్చు. లేదా అధిక సంఖ్యలో కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు (ఈ సంవత్సరానికి స్టాక్ అయిపోయింది లెండి). ఇప్పటివరకు 4 దేశాల్లో తెలుగువారికి ఈ క్యాలండర్ పంపించడం జరిగింది. మిగతా దేశాలు, రాష్ట్రాల వారు ఈ క్యాలండర్‌ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము.

అందరికీ నూతన సంవత్సర మరియూ సంక్రాంతి శుభాకాంక్షలతో..
Thanks a lot for sharing!
ReplyDelete