హాలీవుడ్ సినిమాలంటే ప్రత్యేకించి స్పెషల్ ఎఫెక్టుల కోసమే థియేటర్‌కు వెళ్ళి మరీ సినిమా చూస్తుంటారు. వాల్ పోస్టర్స్ చూసి దారుణంగా మోసపోయిన సినిమా 'స్కెలైన్'. హాలీవుడ్‌లో సినిమాలను ఇంత దారుణంగా, దరిద్రంగా తీస్తారా అనిపించింది. ఎప్పుడు థియేటర్ నుండి బయటకు పారిపోయి వచ్చేద్దామా అనిపించింది. దాన్ని రిలీజ్ చేసింది కూడా రిలయన్స్ బిగ్ పిక్చర్. కేవలం స్పెషల్ ఎఫెక్టుల్ని మాత్రమే నమ్ముకుని సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమా మొత్తాన్ని కేవలం ఐదుగురు ఆర్టిస్టులతో తీసారు. అదీ ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో. ట్రైలర్స్‌లో, వాల్‌పోస్టర్స్‌లో చూపించే కాస్త ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే సినిమా మొత్తం కొన్ని పదుల సార్లు రిపీట్ చేసారు. లాస్‌ఏంజిల్స్ నగరంగాని, అలియన్స్‌తో ఫైట్ చేయడానికి వచ్చిన ఫ్లైట్లుగాని అన్నీ కంప్యూటర్ మీద చేసినవే.
స్టోరీ లైన్: చెప్పడానికి ఏమీ లేదు.
స్పెషల్ ఎఫెక్ట్స్: ఒకే ఎఫెక్ట్‌ని పదిసార్లు రిపీట్ చేసారు
డైరెక్షన్: తీసునోడికే తెలిసుండదు.
చూసినోళ్ళ పరిస్థితి: వెళ్ళేపుడు జండూ బామ్ కొనుక్కోవడమే.
నాలాగా ఇంకెవ్వరూ బాధ పడకూడదని, డబ్బులు పాడుచేసుకోకూడదని ఈ చిన్న రివ్యూ పెట్టారు. దీన్ని టైప్ చేయడానికి నేను తీసుకున్న టైమ్ కూడా వృధా..
thanks !
ReplyDeleteమరోసారి ఎగబడి వెళ్ళకండి !
Thanks for saving me from the ordeal.
ReplyDeletethanks andi jagadeesh gaaru neu inka veladamanukuntunnanu e cinema ki
ReplyDeleteఅయ్యా జగదీశ్ గారు , ఇప్పుడే నేను ఫాస్ట్ షో కి ప్రేపరే అవుతూ, సరదాగా నెట్ లో బ్రౌస్ చేస్తూ మీ బ్లాగ్ చూసాను,
ReplyDeleteసినిమా ఉత్సాహం నీరుగారిపోయింది, మీ రివ్యూ చూసాక ఇక ఏ ఆసతో సినిమాకు వెళ్ళగలను?
ఇప్పుడు నా మూడ్ డిస్టర్బ్ అయింది, మీ మాట విని నేను సినిమా చూడటం మానేస్తున్నాను,
ఒకవేళ సినిమా బాగుంది అని హిట్ టాక్ వస్తే నా ఉసురు మీకు తప్పక కొట్టుకుంటుంది.