Pages

Monday, October 25, 2010

పేరు మార్పు: ఇకపై 'రాజీవ్‌ హైదరాబాద్‌' ఇంకా 'సోనియా సికిందరాబాద్‌'

తెలుగు వారి లలిత కళా తోరణం కాస్తా 'రాజీవ్‌ తెలుగు లలిత కళాతోరణం' అయిపోయింది. 'మన వాళ్ళు వట్టి వెధవాయిలోయ్‌' అన్నట్లుగా మన తెలుగు రాష్ట్రంలో ప్రతీదీ 'రాజీవ్‌', ఇందిర, సోనియాల మయమైపోయింది, అయిపోతుంది, అవ్వబోతున్నది. ఇంకెలాగో దీన్ని మనం కాపాడుకోలేము కాబట్టి, నా ప్రధాన డిమాండ్‌ ఏమిటంటే... హైదరాబాద్‌ నగరాన్ని 'రాజీవ్‌ హైదరాబాద్‌' గా మార్చాలని, సికిందరాబాద్‌ నగరం పేరును 'సోనియా సికిందరాబాద్‌' గా మారిస్తే బాగుంటుందని.... రెండూ జంట నగరాలు కాబట్టి, రాజీవ్‌, సోనియాల పేర్లు చక్కగా నప్పుతాయనుకుంటున్నాను. ఇక హుసేన్‌ సాగర్‌ పేరు కూడా 'ఇందిరా సాగర్‌' గా, ఛార్మినార్‌ను 'రాహుల్‌ మీనార్‌'గా మార్చాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. తెలుగు వాళ్ళకి అసలు ఆత్మాభిమానం లేదని ఎవరైనా అన్నా సరే గాని, తెలుగు వాళ్ళలో అసలు గొప్పవాళ్ళెవరూ లేరని అందరూ ఈసడించినాగాని, పక్కనున్న తమిళ తంబిలను చూసైనా గాని ఏ మాత్రం సిగ్గుపడకుండా మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టయినా సరే, తెలుగు వాళ్ళందరం ఒక్క మాటపై నిలబడి 'అమ్మ భజన' చేద్దాం... అప్పటి వరకు చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా.. గత మెంతొ ఘన కీర్తి కలవోడా....

14 comments:

  1. ఇది అన్నిటికన్నా చాల బాగున్నది ఘనతవహించిన ప్రభుత్వం వారు దీని పై ఒక్క సారి ద్రుష్టి పెడితె సమస్య లేదు. మనకు యెలాగు ప్రజలు ఎమి అన్నా, ఎమి అనుకున్నా పట్టింపులు లేవు కదా.థూ ........... వీళ్ళ బ్రతుకులు చెడ సన్నాసులు .

    ReplyDelete
  2. chaala goppaga undi. ee request nu RajivDabburamireddy dwara CM RajivRosaiah garki vinnaviddam.

    ReplyDelete
  3. టి సుబ్బిరామిరెడ్డి లాటి అతితెలివి చెంచాగాళ్ళు ఉన్నంత కాలం ఇలాంటివి తప్పవు.ఒక womanizer కి ఇలాంటి ఆలోచన రావడంలో ఆశ్చర్యమేమిలేదు.ఇతను,ఇతని కూతురు చాలు బ్రష్టు పట్టించడానికి

    ReplyDelete
  4. రాజీవ్‌బాద్. సోనియాకిందర్‌బాద్..ఓపాలి థింకండి..!

    ReplyDelete
  5. Neme of the state: Indira Andhra Pradesh
    Capital: Rajeev Hyderabad
    Governer: Rahul Narsimhan
    Chief minister: Rajeev Rosaiah
    Official language: Sonia Telugu
    Baanisa nayallu raajakeeya Naayakulu ayithe ilaage untundi mana charithra

    ReplyDelete
  6. డాక్టర్.పి.శ్రీనివాస తేజ గారు, వ్యవస్థను విమర్శించండి అంతే కాని కులాన్ని కాదు.వ్యక్తి తప్పు తెలపండి అంతె కాని కులాన్ని కాదు.ఒక సైక్రియాసిష్ట్ ఆయిన మీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పాలిసిన ఆవసరంలేదు అనుకుంటా .ఆయినా మీ జిల్ల వాడు అయిన "ఆమరజీవి శ్రీ పొట్టిశ్రీరాములు" గారు ఎ కులం అని మీకు ప్రత్యేకంగా తెలుపవలిసిన పనిలెదు .ఆయినా కామెంట్ వ్రాసెట్టప్పుడు మీరు కొద్ది గా నిగ్రహించు కొని వ్రాయండి.మీరు కుల ప్రస్తావన తెచ్చినందుకు నా నిరసన .

    బ్లాగ్ ఓనర్ శ్రీ జగదీష్ గారికి ,కుల ప్రస్తావన వున్న కామెంట్ డిలిట్ చేయగలరని ఆశించటమయినది.

    ReplyDelete
  7. nayallu ...this is not the name of a caste. There should have been one more 'a' after 'ya'.

    ReplyDelete
  8. "భానిస నాయల్లు రాజకీయ నాయకులు అయితే ఇలాగె ఉంటుంది మన చరిత్ర " అని ఆ పైన పెట్టిన కామెంట్లో కుల ప్రస్తావన ఎక్కడౌంది మహాశయా ramesh s......bd? ఒకవేళ మీ దృష్టిలో "బానిస నాయాళ్లు" అనేది ఓ కులానికి చెందిన పేరు అయితే అది ఏ కులమో చెప్పి పుణ్యం కట్టుకుంటారా?

    ReplyDelete
  9. రమేష్ గారు... డాక్టర్ గారిని విమర్శించే ముందు ఒక్క సారి మళ్ళీ చదవండి. ఆయన అన్నది నాయాళ్ళు అని అంతే గాని మీరనుకుంటున్నట్లు కులం పేరు కాదు. ఈ విషయంలో మాధురిగారిని నేను సమర్ధిస్తున్నాను. ఆయన కామెంట్ తొలగించనవసరం లేదని భావిస్తున్నాను.

    ReplyDelete
  10. ఆయనేదో ఇలా కాకా పట్టేసి పాపం విశాఖపట్టణం పేరు సుబ్బిరామిరెడ్డి పట్టణం గా మార్చాలని ఆశ పడుతోంటే మీరు ఇలా మొత్తానికే ఎసరు తెచ్చేస్తే ఎలా ?
    ఇది ఇలానే సాగితే కొన్నాళ్ళకి అన్నీ రాజీవ్, సోనియా, ఇందిరాల మయం అయిపోయి.
    రెండో రాజీవ్ నగర్ లో మూడో సోనియా కాలనీ అనో..
    యాభయ్యో ఇందిరాబాదు లో నలభయ్యో సోనియా నగర్లో ఇరవయ్యో రాజీవ్ రహదారిలో ఉన్న రెండో ఇందిరా పార్క్ కు ఎదురుగా ఉన్న మూడో రాజీవ్ విగ్రహం పక్కనుంచి వెళ్తే అంటూ అడ్రస్ కనుక్కోవాల్సి వస్తుందేమో !
    ఈ విగ్రహ పూజలూ, వ్యక్తీ భజనలూ చేసేవాళ్ళకి భాషాభిమానమా తొక్కా ?
    మీ పోస్ట్ బావుంది !

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.