Pages

Wednesday, July 22, 2009

గ్రహణాలపై జన విజ్ఞాన వేదిక అత్యుత్సాహం.

ఈ శతాబ్దంలోనే అద్బుతమనదగిన సంపూర్ణ సూర్య గ్రహణం ఈ రోజు చోటు చేసుకుంది. ఈ గ్రహణం సామాన్య ప్రజల నుండి, శాస్త్రవేత్తల వరకు అందరి లోనూ అలజడి కలిగించింది. శాస్త్రవేత్తలు తమకు ఎంతో కాలం తరువాత చేతి నిండా పని దొరికింది, సూర్యుడి గురించి మరిన్ని కొత్త విషయాలు పరిశోధన చేయవచ్చని అనుకుంటే, సామాన్య ప్రజలు తమ తమ విశ్వాసాలననుసరించి తగు జాగ్రత్తలు పడ్డారు.

ఈ సందడి చాలదన్నట్లు మద్యలో జన విజ్ఞాన వేదిక వారు ఈ అరుదయిన సంఘటన ద్వార జనాల్లో పాపులారిటీ సంపాదించుకోవాలనుకున్నారో ఏమో తెలీదు కాని, కొత్త వివాదాలని తెరపైకి తీసుకు వచారు. గ్రహణం రోజున దేవాలయాలు మూయవద్దని, తెరిచేవుంచమని, గ్రహణం జరిగే సమయంలో భోజనాలు చెయ్యమని ఇలా కొత్త ప్రయోగాలు చెయ్యమని జనాలకి ఊదరగొడుతున్నారు. గ్రహణం వలన ఎటువంటి ప్రమాదము లేదని
చెప్పడం వీరి వుద్దేశం కావచ్చు. వీటివల్ల వుపద్రవాలు, యుద్దాలు, సునామీలు, వుప్పెనలు వస్తాయనే అపోహలనించి సామాన్య ప్రజల్ని బయట పడేయాలనుకోవడం మంచిదే. కాని ఈ సారి మాత్రం కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించినట్టు కనబడుతుంది. మానవ శరీరంపై కూడా గ్రహణాల వల్ల ఎటువంటి ప్రభావం లేదని చెప్పడానికి ప్రయత్నం చేసారు. పూర్తిగా ౠజువుకాని, పరిశోధనలు జరగని, ప్రజల విశ్వాసాలకి సంబందించిన ఇటువంటి విషయాలలో తలదూర్చే ముందు కొంచెం ఆలోచించుకుని వుండాల్సింది.

గ్రహణం వల్ల మనిషిపై ఎటువంటి ప్రభావం లేదని అంటున్నారు. అది నిజమే అయితే గ్రహణం ఏర్పడినప్పుడు సూర్యుడిని డైరెక్ట్‌గా చూడవద్దని చెబుతున్నారు? కంటిలో వుండే సున్నితమయిన పొరలు దెబ్బతిని అంధత్వం వస్తుందనే కదా. అంటే ఆ సమయంలో ఏర్పడిన కిరణాల రేడియేషన్ ప్రభవం మన మీద పడినట్లే కదా? మరి అలాంటి సున్నితమయిన అవయవాలు శరీరంలో ఎన్ని వున్నాయో మీకు తెలుసా? వాటి మీద రేడియేషన్ ప్రభావం ఎంత ఉందో ఎవరయినా అధ్యయనం చేసారా? వాటి వివరాలు మీ దగ్గర వున్నాయా? గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలను బయటకి రావద్దనడానికి కూడా వెనుక ఇటువంటి శాస్త్రీయ కారణం వుండొచ్చు కదా? ఇప్పుడు గొప్ప కోసం, మీ ప్రాచుర్యం కోసం సామాన్య ప్రజల్ని గ్రహణం సమయంలో భోజనం చెయ్యమని చెబుతున్నారు. మీరు తింటున్నారు. దీర్ఘ కాలంలో ఆ ఆహారం వల్ల ఏదయినా జరగరానిది జరిగితే మీరు దానికి బాధ్యత వహిస్తారా?

సూర్యుడి నుంచి గ్రహణం సమయంలో వచ్చే రేడియేషన్ ప్రభావాన్ని మన పూర్వీకులు సరిగ్గానే అంచనా వేసారనే విషయాన్ని మర్చిపోవద్దు. పూర్వం నుంచి ఒక జాతి మొత్తం అనుసరిస్తున్న విధానాన్ని విమర్శించే ముందు మనం దానికి సమర్దులమా కాదా అన్న విషయాన్ని ఆలోచించుకోవాలి. గ్రహణ సమయాన్ని, సూర్య కేంద్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించిన ఆర్యభట్టు మన దేశానికి చెంది వాడేనని, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఖగోళ అంశాలపై భారతీయులు పట్టు సాదించారని మరచిపోతే ఎలాగ?

ప్రజలలో మూడ నమ్మకాలని పారద్రోలాలనుకుంటే మంచిదే. దొంగ బాబాలు, స్వాముల నుంచి, గుడ్డిగా అనుసరిస్తున్న మూఢ నమ్మకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలనుకోవడం మంచి ప్రయత్నమే. దాన్ని అందరూ స్వాగతిస్తారు కూడా. కాని, జీవన విధానంలో అనుసరించే ప్రతీ విశ్వాసాన్ని, ప్రతీ ఆలోచనని తప్పు పడుతూ కూర్చుంటే, సామాన్య ప్రజలు తాము అనుసరిస్తున్నది ఏది నిజమో, ఏది అబద్దమో తేల్చుకోలేని చిక్కుల్లో పడతారు.

15 comments:

  1. Very Vell said - if only those morons can understand the logic in your post

    ReplyDelete
  2. ఈ రోజు గ్రహణం అని తెలిసే నేను వెజెటెబల్ బిర్యాణీ తిన్నాను. నాకు ఏమీ కాలేదు. గ్రహణం నాడు బిర్యాణీ తిన్నా, బర్గర్ తిన్నా ఏమీ కాదు. రేడియేషన్ ప్రభావం ఆహారం మీద పడదు కదా. గ్రహణం పేరు చెప్పి భోజనం చెయ్యకూడదు అనడం ఏమిటి? అది కూడా మన పూర్వికులకి రేడియేషన్ గురించి తెలుసు అనడం ఏమిటి?

    ReplyDelete
  3. @rowdy, check above comment..
    I think this sharma is the your fav... :)

    I don't know why he loves to use the caste names and area names which do not belong to ..

    @MR Praveen, if they don't know anything how did they gave the exact time and day on which we get Grahanam on the first day of the Year itself.

    if someone proposes something you don't have to believe that. but you can't opppose that till you prove yourself to be more knowledgeble than them.

    ReplyDelete
  4. గ్రహణాలు ఎన్ని రోజులకి ఒకసారి వస్తాయో, జ్యోతిష్యులు ఖగోళ శాస్త్రం నుంచి కొన్ని పాయింట్లు ఎలా కాపీ కొట్టారో ఇన్నయ్య గారి బ్లాగ్ లో చాలా రోజుల క్రితమే చర్చ జరిగింది. ఆవు వ్యాసం లాగ మళ్ళీ అడగడం ఎందుకు?

    ReplyDelete
  5. vadevadu? vaadi blog evadiki telusu.

    ReplyDelete
  6. తాను ఆవు వ్యాసాలు వ్రాస్తూ ఇతరులవి ఆవు వ్యాసాలని విమర్శించే భరద్వాజ మహర్షిని అడగండి. చెపుతాడు.

    ReplyDelete
  7. ఒక ఆవు వ్యాసం కూడ సరిగ్గా రాయలేని ఒక పనికిమాలిన శాల్తీ గ్రహణం టైములో భోజనం చేశాడు. వేంటనే బ్రెయిన్ దెబ్బతిని మార్తాండగా మారి విశఖపట్నం పిచ్చాసుపత్రిలో చేరాడు.

    ReplyDelete
  8. గ్రహణం టైంలో భోజనం చేస్తే మనుషులకి మతి భ్రమించి పిచ్చెక్కుతుంది అనేదానికి మన మార్తాండే సాక్ష్యం :))

    I told you - if you attack me, you are bringing diaster on yourself.

    ReplyDelete
  9. roudy garu idem baagaledu
    27 samvatsarala mundu grahanam padinda appudu thinte inka vuntundaa

    ReplyDelete
  10. నీకు తెలియనంత మాత్రాన గ్రహణ సమయం లో తినేతిండి లో జరిగేమార్పులు ఆగవు . నాఇష్టం నేను తింటానంటే ఎవడొద్దంతాడు?
    వెనుక బహిర్భూమికి ఊరుబయటకెల్లేవాల్లు .అక్కడ్ ఆపనిచెస్తూ ఒకడు రొట్టెతింటున్నడట .చూసిన ఒకాయన చా ! ఏమిట్రా అది అలాతినకూడదు అన్నాడట . వాడికి వల్లుమండి నాఇష్టం ,ఇలాతింటా .ఇంకా అద్దుకుని దీంట్లో అద్దుకుని కూడా తింటా అని అన్నాడట .అటువంటివాని కెవరు చెబుతారు నాయనా కానివ్వు తినెయ్ . నీఇష్టం ప్రవీన్

    ReplyDelete
  11. @"అది కూడా మన పూర్వికులకి రేడియేషన్ గురించి తెలుసు అనడం ఏమిటి?"

    ఆధునిక శాస్త్రవేత్తలు రేడియేషన్ అనే పేరు పెట్టారని, పూర్వీకులు కూడా అదే పేరు పెట్టాలనడం హాస్యాస్పదం.


    ఇక భోజనం విషయానికొస్తే, పూర్వకాలంలో ఇప్పుడున్నట్లుగా కాంక్రీటు భవనాలు కాకుండా, ఎక్కువమంది ప్రజలు భోజనం ఆరుబయటనే చేసేవారు. అలాగే ఆరుబయటనే కట్టెల పొయ్యిమీద వండేవారు. అందుకే గ్రహణ సమయంలో భోజనం చెయ్యడం మంచిది కాదని చెప్పారు.

    ReplyDelete
  12. ఏవయ్యా ప్రవీణ్ శర్మ/వర్మ/టాల్క్స్/మార్తాండ/మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఫెమినిస్ట్ రెవొల్యూషనిస్ట్/నాడేన్డ్ల/ఎక్స్.వై.జి -
    ఆడెవడో అనగా ఇన్నయ్య చెప్పేది వేదం అని ఎలా అనుకోవాలి? ఆయన నిజంగా హ్యూమైన్స్ట్ ఐతే -
    వాళ్ళబ్భాయిని అమెరికాలో ఎందుకుంచాడు? భారతం లో పెట్టి సమాజ సేవచేయించొచ్చుగా?
    అంటే డాలర్లు సంపాదించటానికి హ్యూమనిజం అక్కర్లేదు.
    ఏందయ్యా అంటే, ప.మ లేక భగవత్ గీత అసలు రహస్యం, సన్యాసే సత్యం పలికితే, మట్టీ మషాణం అని ఎవడో పనికిమలినోడు అంటే నార్ల లాంటోడు రాస్తే దాన్ని తెలుగీకరించటం. దానికి కత్తి, నీలాంటి సుత్తి గాళ్ళు ఆహా ఓహో.
    బాగుంది మీ కధ.
    ఇలా జనాలమీద ఊరకుక్కల్లా పడెబదులు,
    ౧. లంచగొండితనం పై పోరాడండి.
    ౨. తలాక్ తలాక్ తలాక్ అని మూడూసార్లు అంటే విడిపోయినట్టే అనే దురాచారం పై పోరాడండి
    ౩. మదరసాల్లో జరిగే కార్యక్రమాలపై పోరాడండి
    ౪. మనమీద దాడులు చేసే వారిపై పోరాడండి.
    ౫. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయ్ కదా. అవి జరక్కుండా ఎలా చేయొచ్చు చూపండి.
    అండ్ సో ఆన్.
    అంతే కానీ గ్రహణం రోజు బిర్యానీ తిన్నా. రాత్రిపూట మట్టి తిన్నా. ఎవడిక్కావాలి బాసు నువ్వు ఏ అశుద్ధం తిన్నావో.
    పనికొచ్చే పన్లు చేయండ్రా సచ్చినాళ్ళారా.

    ReplyDelete
  13. మదరసాలలో జరిగే కార్యక్రమాల గురించి నాకు తెలుసు. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా నేను తెలుగు వికీపీడియాలో వ్రాస్తే నా ఐ.పి. అడ్రెస్ లు బ్లాక్ చేశారు. అహ్మద్ నిస్సార్, రహంతుల్లా అనే ఇద్దరు మెంటల్ కేస్ బాబులని కీర్తించారు. Satanic verses (సైతాను వచనాలు) గురించి నేను అడిగిన ప్రశ్నలకి ఆ ఇద్దరు బాబులు సమాధానం చెప్పలేకపోయారు. నేను కేవలం హిందూ మతాన్ని విమర్శిస్తున్నానని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు?

    ReplyDelete
  14. నాకు 1999 నుంచీ ఇంటర్నెట్ తెలుసు. ప్రముఖ ఇస్లాం వ్యతిరేక బ్లాగర్ మొబీన్ చుగ్టాయ్ (విద్రోహి) నా ఫ్రెండే. ఈ మధ్య నే బురఖాలని నిషేధించాలనే వ్యాసాన్ని తన బ్లాగ్ లో ప్రచురించాడు http://reddiarypk.wordpress.com/2009/07/20/burqadebate

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.