Pages

Sunday, June 29, 2008

చిరంజీవి పార్టీ

వెండి తెరపై తిరుగులేని కధానాయకుడు చిరంజీవి ఇపుడు నిజ జీవితంలోను హీరో పాత్ర పోషించడానికి సిధ్దం అవుతున్నారు. గత రెండు దశాబ్దాలుగా అభిమానుల గుండెల్లో హేరోగా సుస్తిరమయిన స్తానాన్ని సంపాదించుకున్న ఆయన రాజకీయాల్లోకి రావడం ద్వారా జనం గుండెల్లో శాశ్వతమయిన స్తానాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యన ఎవరయిన ఇద్దరు కలుసుకుంటే చాలు. "చిరంజీవి పార్టీ పెడతాడా? పెట్టినా గెలుస్తాడా?" సంభాషణ అంతా ఇలా గడిచిపోతుంది. ఏది ఏమయినా ఒక్కటి మాత్రం నిజం. చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాక మునుపే వేరే హీరోలు ఎవ్వరూ చెయ్యని విధంగా చక్కటి సమాజిక కార్యక్రమలు చేసారు. రక్తదానం, నేత్రదానం వంటివి వెండి తెరపై ఆయన అభిమానులు కానివారి ప్రశంసలు కూడా అందుకున్నాయి. బహుశా అదే అభిమానం ఆయనను రాజకీయాల వైపు ఆకర్షించి ఉంటాయి.
ప్రస్తుత పరిస్తితిని గమనించినట్లయితే చిరంజీవి గారు రాజకీయ పార్టీ గురించి ఎందుకు late చేస్తున్నారో అంతుబట్టని విషయంగా మారిపోయింది. దీని వల్ల ఆయన పార్టీకి పరోక్షంగా నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలోని ఆయన అభిమాన సంఘాలు ఇప్పటికే వివిధ గ్రూపులుగా మారిపోయి, సీటు తమకే వస్తుందని ప్రచారం చేసుకుంటూ జనాన్ని అయోమయంలో పడేస్తున్నాయి. పెద్ద పెద్ద బానర్లు, హోర్డింగులతో హడావుడి చేస్తున్నాయి. ఒకవేళ ఏ గ్రూపులలో ఎవరికయినా సీటు దక్కక పోతే ఎలక్షన్లలో పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం లేక పోలేదు.
ప్రచారం విషయంలో కూడ, అట్టడుగు ప్రజనీకంతో పాటుగా, సమాజంలో మిగిలిన వర్గాల వారిని కూడా కలుపుకు వెళితే బాగుంటుది. ఏదయినా ఒక చిన్న విషయం జరిగితే చిరంజీవి అభిమానులు వ్యవహరించే తీరు కూడా విమర్శలకు పాత్రమవుతుంది. అభిమానులు కొంచెం హుందాగా ఉంటే సమాజంలో చిరంజేవిపై అభిమానం ఇంకా పెరుగుతుంది.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.