Pages

Sunday, June 29, 2008

జీవిత సత్యం:

ఎవరయినా మన జేబులో నుండి ఒక పది రూపాయిలు తీసారనుకోండి. వెంటనే వాడిని పట్టుకుని కొట్టేవరకు వెళ్ళిపోతాము. వీలు దొరికితే కొడతాము కూడా. కాని, ఎవడో తెలిసున్నవాడు వచ్చి వెయ్యి రూపాయిలు అప్పు తీసుకుని ఎగ్గొట్టేస్తాడు. వాడు తీర్చగలిగి కూడా మొఖం చాటేస్తాడు. కాని వాడినేమీ అనలేము. మన అవసరం కొద్దీ వేలాది రూపాయిలు లంచంగా ఇవ్వడానికి కూడా వెనుకాడము. వ్యాపారం చేసే వారయితే అరువులు ఇచ్చి, దర్జాగా సరుకు పట్టుకు పోయి తిరిగి ఇవ్వకుండా ఎగనామం పెట్టే వారిని ఏమీ అనరు. నిజంగా అవసరం కొద్దీ ఆకలి కొద్దీ డబ్బులు అడిగితే ఇవ్వడానికి మనసు ఒప్పదు. ముందు ఘరనాగా డబ్బులు ఎగ్గొట్టే ఇలాంటి వాళ్ళను పట్టుకుని నాలుగు తన్ని, అప్పుడు ఆ డబ్బుతో నాలుగు మంచి పనులు చెయ్యవచ్చేమో ఆలోచించండి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.