Pages

Thursday, May 17, 2018

తిరుమల శ్రీవారి ప్రధానార్చకులు శ్రీ రమణ దీక్షితులు గారికి మద్దతు తెలపడం ప్రతీ హిందువు కర్తవ్యం...

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికే రాష్ట్రంలో భద్రత లేకుండా పోయింది. సిగ్గు లేని రాజకీయాలు దేవాలయంలో కూడా తిష్టవేసుకుని కూర్చున్నాయి. శ్రీవారి ఆలయం గురించి, ఆచారం గురించి, ఆభరణాల గురించి సాక్షాత్తు శ్రీవారి ప్రధాన అర్చకులు శ్రీ రమణదీక్షితుల వారే పొరుగు రాష్ట్రం వెళ్లి మరీ ప్రెస్‌ మీట్‌ పెట్టి చెప్పాల్సి వచ్చిందంటే, పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం అవుతోంది. దేవాలయాల్ని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేసారు. తమకు, పార్టీకి అడుగుకు మడుగులొత్తే తొట్టిగ్యాంగ్‌ని దేవాలయ కమిటీ సభ్యులుగా నియమిస్తే పరిస్థితులు ఇలాగే తయారవుతాయి. ప్రస్తుతం తితిదే  పాలకవర్గ అధ్యక్షుడిని చేయవద్దంటూ ఎంతమంది హిందువులు విమర్శించినా, ప్రభుత్వం తలొగ్గలేదు. ఇతర మతాల జోలికొస్తే, తాట తీస్తారని తెలుసు... కాని హిందువుల జోలికొచ్చినా, వారి దేవాలయాల్ని పరమతస్తులతో నింపేసినా, దేవుడి ఆభరణాలను, ఆస్తుల్ని నిర్లజ్జగా కాజేసినా, వాటిని బయటపెట్టినందుకు అర్చకుల్ని బయటకు గెంటేసినా, రాజకీయ కారణాలతో హిందువులందరూ కిమ్మనకుండా ఉన్నారు. ఇదే ఇతర మతాల్లో జరిగితే రాజకీయాలకు, భాషలకు, దేశాలకు అతీతంగా ప్రపంచమంతా ఆ మతస్థులు ఏకమవుతారు. కాని, హిందూ మతంలో మాత్రం పైవాడు మా కులపోడు కాబట్టి, మా పార్టీవోడు కాబట్టి, మా నాయకుడు కాబట్టి, వాడు ఏమి చేసినా, దైవానికి ద్రోహం చేసినా మేము మాత్రం సిగ్గులేకుండా వాడినే సమర్థిస్తాము. ఎంత సిగ్గులేని తనం? ఎంత బరితెగించిన తెంపరితనం?

    శ్రీ రమణ దీక్షితులుగారు చదువు లేని వాడు కాదు. పరిస్థితులు అర్థం చేసుకోలేని వాడు కాదు. న్యూక్లియర్‌ ఫిజిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసి, విదేశాలలో ఉద్యోగం కూడా కాలదన్నుకుని, దైవం పట్ల అనురాగంతో, వంశ పారంపర్య అర్చకత్వాన్ని చేపట్టిన మహోన్నత వ్యక్తి. ఏ దైవాన్ని రెప్పపాటు కాలంపాటు దర్శించుకున్నా, జన్మ ధన్యమవుతుందని భావిస్తామో, అటువంటి దైవాన్ని జీవితాంతం స్వయంగా అర్చన చేసి, తరించే అదృష్టశాలి. ఆయన మరే ఉద్యోగం చేసుకున్నా ఇంత కంటే ఎక్కువ జీతం వస్తుంది. రాజకీయాల్లో చేరి, ఏ అడ్డమైన గడ్డి కరిచినా ఇంత కంటే ఎక్కువ 'గిట్టుబాటవుతుంది'. అర్చకులకు ఎటువంటి జీతం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉండవు. అది కూడా అర్థం చేసుకోకుండా, సాక్షాత్తు ఆలయ ప్రధాన అర్చకుడిపైనే వేటు వేయాలనుకోవడం ఆలయంపై జరిగిన దాడిగానే అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగులకు గాని, పాలకమండలికి గాని శ్రీవారి ఆలయ చరిత్ర తెలుసా? అసలు ఆగమ శాస్త్రం అనే మాట వినే ఉంటారా? శ్రీవారికి ఎప్పుడెప్పుడు ఎటువంటి కైంకర్యాలు జరుగుతాయో, ఏఏ నైవేద్యాలు సమర్పిస్తారో ఎవరికైనా తెలుసా? ఇవన్నీ 'కనకపు సింహాసనమున శునకాలే' కదా... ఏ అధికారంతో ఆలయ సేవల్లో వేలుపెడుతున్నారు? ఏ తెగింపుతో స్వామి వారి నిధుల్ని తమ సొంత అవసరాలకు మళ్ళించుకొంటున్నారు? ఏ ధైర్యంతో కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వరునితో ఆడుకుంటున్నారు?

    ఏం ఫర్వాలేదు... రావణాసురుడంతటి వాడు కూడా తన పాపం పండేవరకు తనంతటి వాడు లేడని విర్రవీగాడు... శిశుపాలుడిని కూడా శ్రీ కృష్ణుడు నూరు తప్పుల వరకు ఊరుకున్నాడు.... వామనుడు వచ్చే వరకు నేనే గొప్పవాడినని బలి భావించాడు... నరసింహుడు వచ్చే వరకు హిరణ్య కశిపుడు తానే దైవంగా భావించుకున్నాడు. ఏదైనా పాపం పండేవరకే... శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్షదైవం... కేవలం సంకల్పమాత్రాన సకల సృష్టిని సృజించగల ఆయన ముందు పిచ్చి వేషాలేస్తే ఏం జరుగుతుందో చరిత్రలో ఎన్నో సంఘటనలు చూసాం... ప్రత్యక్షంగా కొన్నింటికి మనమే సాక్షులం కదా... ప్రస్తుతానికి శ్రీ రమణదీక్షితులుగారికి మన మద్దతు తెలుపుదాం... అది మన నైతిక బాధ్యత... కాగల కార్యమంటారా... శ్రీవారే చూసుకుంటారు... సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు....

10 comments:



  1. ఇది చాలా విచారకరమైన విషయం. టీటీడీ కుంభకోణాలు బయట పడే రోజులకు చాన్నాళ్లు లేవు.

    రమణ దీక్షితుల వారిని అవమానించిన టీటీడీ చాలా కాలం బతికి బట్టకట్టే అవకాశాల్లేవు.

    ధర్మో రక్షతి రక్షిత: !

    జీయీర్ గారే దిక్కిక

    ReplyDelete
  2. హిందూ మత సంస్థలపైన గుడులపైన ప్రభుత్వ పెత్తనం చెల్లదు.

    శ్రీ రమణ దీక్షితులు గారి ప్రశ్నలకు ప్రభుత్వం
    సమాధానం చెప్పాలి.

    శ్రీవారి నగలున్నాయా? ఎక్కడున్నాయి? ఎన్నున్నాయి? హిందువులకు తెలియాలి.

    శ్రీరమణ దీక్షితులు గారిపై తీసుకునే ఏ చర్య ఐనా కక్ష సాధింపే.

    ప్రభుత్వ వైఖరి మారాలి, మారకపోతే ప్రజలు మార్చే రోజు దగ్గరలోనే ఉన్నది, హిందువుల సహనాన్ని పరిక్షించద్దు.

    ReplyDelete
  3. అసలు దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం ఏమిటి? దేవుడి సొమ్ముని ప్రభుత్వం నడపడానికి ఉపయోగించడం ఏమిటి? ముందు రాజకీయాల నుంచి తిరుమలని తప్పించాలి... అప్పుడే న్యాయం జరుగుతుంది...

    ReplyDelete
  4. ఏ రాజకీయ నాయకుడైన , ఆఖరికి రాష్ట్రపతి అయినా సరే , దగ్గరుండి దర్శనం చేయించేది ఈ దీక్షితులు గారే , ఇప్పుడు ఆయనకి సడన్ గా గుడి లో ఎన్నో లోపాలు కనిపించేస్తున్నాయి . సాగినంత కాలం సాగింది , ఇప్పుడు సాగట్లేదు అందుకే ఈ ఏడుపులు పెడబొబ్బలు .
    65 కి రిటైర్మెంట్ లో తప్పు ఏముంది . ? కొత్థ వాళ్ళు రాకూడదా ? ఒకే ఫామిలీ ఉండటానికి అదేమీ ఫ్యామిలీ బిజినెస్ కాదు. అది గుడి , అందరికి అవకాశం ఉండాలి , ఆ అవకాశం ఇస్తే కళ్ళకి అద్దుకుని పనిచేయడానికి వేల మంది ఉన్నారు. By the way I am Hindu
    : Venkat

    ReplyDelete
  5. ఇదే విషయం మీద ... ప్రభుత్వ అధీనంలో హిందూ దేవాలయాలు అన్న అంశం మీద ... హిందూ మతాన్ని అభిమానించే Stephen Knapp అనే అమెరికన్ ఒక పుస్తకం వ్రాశాడ(ట). దాని సారాంశం (ఆంగ్లంలో) క్రింది లింక్ లో చదవచ్చు. worldhindunews.com సైట్ లో అక్టోబర్ 24, 2015 న వచ్చింది.

    http://www.worldhindunews.com/2015/10/24/49495/control-of-hindu-temples-and-temple-funds-stephen-knapp-book-opens-our-eyes/

    ———————————————————-

    పైన చూపించిన లింక్ లో ఉన్నదే 👇 (రెడీగా చదవడం కోసం) :-

    “Control of Hindu Temples and Temple Funds, Stephen Knapp Book Opens Our Eyes

    Posted on October 24, 2015 by WHN Reporter

    The Hindu Religious and Charitable Endowment Act of 1951 allows State Governments and politicians to take over thousands of Hindu Temples and maintain complete control over them and their properties. It is claimed that they can sell the temple assets and properties and use the money in any way they choose.

    A charge has been made not by any Temple authority, but by a foreign writer, Stephen Knapp, in a book (Crimes Against India and the Need to Protect Ancient Vedic Tradition), published in the United States that makes shocking reading.

    Hundreds of temples in centuries past have been built in India by devout rulers and the donations given to them by devotees have been used for the benefit of the (other) people. If, presently, money collected has ever been misused (and that word needs to be defined), it is for the devotees to protest and not for any government to interfere. This letter is what has been happening currently under an intrusive law.

    It would seem, for instance, that under a Temple Empowerment Act, about 43,000 temples in Andhra Pradesh have come under government control and only 18 per cent of the revenues of these temples have been returned for temple purposes, the remaining 82 per cent being used for purposes unstated.

    Apparently even the world famous Tirumala Tirupati Temple has not been spared. According to Knapp, the temple collects over Rs 3,100 crores every year and the State Government has not denied the charge that as much as 85 per cent of this is transferred to the State Exchequer, much of which goes to causes that are not connected with the Hindu community.

    Was it for that reason that devotees make their offering to the temples?

    Another charge that has been made is that the Andhra Government has also allowed the demolition of at least ten temples for the construction of a golf courses. Imagine the outcry, writes Knapp, if ten mosques had been demolished.

    It would seem that in Karanataka, Rs. 79 crores were collected from about two lakh temples and from that, temples received Rs seven crores for their maintenance, Muslim madrassahs and Haj subsidy were given Rs 59 crore and churches about Rs 13 crore. Very generous of the government.

    Because of this, Knapp writes, 25 per cent of the two lakh temples or about 50,000 temples in Karnataka will be closed down for lack of resources, and he adds: The only way the government can continue to do this is because people have not stood up enough to stop it.

    Knapp then refers to Kerala where, he says, funds from the Guruvayur Temple are diverted to other government projects denying improvement to 45 Hindu temples. Land belonging to the Ayyappa Temple , apparently has been grabbed and Church encroaches are occupying huge areas of forest land, running into thousands of acres, near Sabarimala.

    A charge is made that the Communist state government of Kerala wants to pass an Ordinance to disband the Travancore Cochin Autonomous Devaswom Boards (TCDBs) and take over their limited independent authority of 1,800 Hindu temples. If what the author says is true, even the Maharashtra Government wants to take over some 450,000 temples in the state which would supply a huge amount of revenue to correct the states bankrupt conditions.

    Source: World Hindu News (WHN)”
    ———————————————————

    ReplyDelete
  6. అహ అసలు తెలియక అడుగుతున్నాను లెండి. ఇప్పటివరకూ ఈయన ఉద్యోగానికేమీ ఢోకా లేదు కనక నోరు మూసుక్కూర్చున్నారా? ఇప్పటి వరకూ ఎందుకు మాట్లాడలేదో తెలుసుకోవచ్చా? తన ఉద్యోగానికి ఎసరు రానంతవరకూ ఎలా అయినా ఫర్వాలేదా?

    అసలు తిరుమలలో ఉన్న అవినీతి గురించి తెలియని వాళ్ళెవరు? ఇప్పుడు ఈయన ఇలా పేపర్లలోకి ఏదో ఎక్కిస్తే ప్రళయం వచ్చేస్తుందనుకోవడం పెద్ద భ్రమ మాత్రమే. పూజార్ల దగ్గిర్నుంచి మహా మహా మహులదాకా సొమ్ము చేసుకుంటూంటే ఆ శ్రీహరే ఏమీ చేయట్లేదు. ఈయనా ఏదొ చేసేది? రెండువారాలు ఆగితే ఈయనపేరు కూడా ఎవరికీ గుర్తుండదు.

    ReplyDelete
    Replies
    1. బాబు ప్రభుత్వం ఒక రౌడి ప్రభుత్వం. కె.ఇ. నోటి దూల ఎక్కువైంది. ఈ రౌడి లందరు తిరుమలను ఖాళి చెసి వెళ్లాల్సిందే. వచ్చె ఎన్నికల ఫలితాలు చుసిన తరువాత ప్రళయం తెలుగు దేశం పార్టికి వస్తుంది.ఇది 1950 కాదు,మీడియాను చేతిలో పెట్టుకొని బ్రాహ్మణుల మీద నిందలు వేసి ప్రజలను వెర్రి పువ్వులు చేయటానికి.

      ఆయన పేరు భవిషత్ లో బాగా గుర్తుంట్టుంది భాబు ప్రభుత్వం పడిపోవటానికి కారణమైన వాడిగా

      Delete
  7. మొదటి అజ్ఞాత మంచి ప్రశ్న లేవనెత్తారు. అర్చకులేమో ౬౫ సంవత్సరాలకి పదవి విరమణ చేయాలి, వాళ్ళకి వంశపారంపర్యంగా ఉద్యోగాలివ్వకూడదు. బావుంది. ఇది మొదట రాజకీయుల దగ్గర నుంచి మొదలు పెడితే బావుంటుందేమో? ఏదైనా వ్యవస్థ సనాతన ధర్మంలో ఆరోగ్యంగాను, ధనికంగాను, ఉన్నతంగాను కనిపిస్తే చాలు రాబందుల్లా వాలిపోతున్నారు. సిగ్గుండక్కర్లేదా?

    ReplyDelete
  8. నిన్న కేటీఆర్ గారు ఒక మంచిమాట చెప్పారు. బాజపా కి తెలంగాణాలో మతరాజకీయాలు చేసే ధైర్యం లేదు అని అన్నారు.చంద్రబాబు గారి మీద కక్ష సాధింపు చర్య కాకపోతే వ్యర్ధ ఆరోపణలు చేయడానికి దీక్షితులు గారికి ఇపుడు తీరిక చిక్కిందా?

    ReplyDelete
  9. good information
    www.youtube.com/channel/UCJMx6_3I6oTEC858UVMuyzg/videos
    plz watch our channel

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.