Pages

Sunday, February 11, 2018

అత్యున్నత భారతీయ విలువలకు నిలువుటద్దం - పద్మావతి కథ (మూవీ రివ్యూ)

    సమకాలీన సినిమాల్లో చారిత్రక నేపధ్యమున్న చిత్రాలు రావడం కొంచెం అరుదుగానే జరుగుతోంది. వచ్చిన కొన్ని సినిమాలు కూడా చరిత్రను వక్రీకరిస్తూ, కమర్షియల్‌ హంగుల్ని అద్దుకున్నవి అయి ఉంటున్నాయి. కాని, చరిత్రను ఏ మాత్రం వక్రీకరించకుండా, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఏ మాత్రం తక్కువ కాకుండా, అత్యున్నత భారతీయ విలువల్ని, భారతీయులు నమ్ముకున్న ధర్మంపై నిర్మించబడ్డ శిఖర సమానమైన ఆదర్శాలని, ఆ ఆదర్శాలను పాటించే క్రమంలో ప్రాణాల్ని సైతం తృణప్రాయంగా విడిచిపెట్టే మహోన్నత కథా ప్రాభవానికి ఆధునిక సినిమా రూపమే సంజయ్‌ భన్సాలీ దర్శకత్వం వహించిన 'పద్మావతి'.

    మేవార్‌ మహారాణి పద్మావతి అపురూప సౌందర్యవతి. రాజపుత్ర రాజయిన రతన్‌సింగ్‌ను వివాహమాడుతుంది. అదే సమయంలో భారతదేశంపైకి  దండెత్తిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ పద్మావతి సౌందర్యం గురించి విని, ఆమెను ఎలాగైనా పొందాలని చిత్తోడ్‌ఘడ్‌ కోటపైకి దండెత్తుతాడు. కాని, విజయం సాధించలేకపోతాడు. ప్రాచీన భారతీయ ఇంజినీరింగ్‌ నిపుణతతో నిర్మించిన ఆ కోట ముందు, రాజపుత్రుల పరాక్రమం ముందు ఖిల్జీ సేనలు పరాజయం పాలవుతాయి. చివరికి తమకు మాత్రమే సొంతమైన కుతంత్రంతో కోటలోకి ప్రవేశించిన ఖిల్జీకి రాణి పద్మావతి దక్కిందా లేదా అనేది సినిమా కథ.

    నేటి యువత తప్పని సరిగా చూసి, ఎంతో నేర్చుకోవలసిన కథ ఇది. ప్రేమ పేరుతో ప్రతి అడ్డమైన, నీచ మనస్తత్వం కలిగిన వారందరూ దర్శకులుగా అవతారమెత్తి, నానా చెత్తా సినిమాలుగా తీసి, యువతను కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నారు. అటువంటి సినిమా చూసిన వాళ్ళందరూ అదే జీవితం అనుకుంటూ రకరకాల నేరాల్లో చిక్కుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌ని చూడముచ్చటగా, రిచ్‌గా తీర్చిదిద్దారు. మేకప్‌, ఎడిటింగ్‌, డైరెక్షన్‌, బ్యాక్‌గ్రౌండ్‌.. ఒకటేమిటి అన్ని విధాలుగా కూడా అత్యున్నత స్థాయిలో ఒక హాలీవుడ్‌ మూవీని చూసిన ఫీల్‌ని కలిగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఆనాటి కోటగోడలు, వస్త్రధారణ, నగలు, అలంకరణ వంటి ఏ విషయంలోను రాజీ పడలేదు. ముఖ్యంగా క్లైమాక్స్‌ సన్నివేశాల్లో ఒక పక్క నుండి భారతీయులు నమ్ముకున్న ఆదర్శాల గురించి గర్వపడుతూనే, ఒక రాజకుటుంబం పరాయి మతాల మూర్ఖత్వానికి ఎలా బలయిపోయిందో చూస్తూంటే గుండెల్ని మెలిపెడుతున్న బాధ కలుగుతుంది.

    భారతీయులు ప్రతీ విషయాన్ని ధర్మంతో ముడిపెట్టారు. ఆఖరికి యుద్ధం కూడా ధర్మ బద్దంగానే చేసారు. కొన్ని వేల సంవత్సరాలుగా ధర్మంతోనే పెనవేసుకుపోయిన భారతీయులకి, ఎటువంటి ధర్మంతో పనిలేకుండా, ఎదుటి వాడిని కొల్లగొట్టడం, బలవంతంగా దోచుకోవడం, పరాయి వారి భార్యను చెరపట్టడం, అందుకు ఎంతకైనా తెగించి, అడ్డదిడ్డంగా యుద్దం చేయడం వంటివి బొత్తిగా కొత్త. అందుకే అవతలి శత్రువుని కూడా ధర్మబద్దంగా ఎదుర్కోవాలని భావించి, చివరికి వారి కరవాలానికే బలయిపోయారు. ఈ విధంగానే ముస్లిం, క్రైస్తవ పాలకులు హిందూ దేశాన్ని ఆక్రమించి, ఇక్కడి సంపదను, స్త్రీలను, వారసత్వాన్ని దోచుకోగలిగారు.

    సహజంగానే హిందూ జాతి గొప్పదనాన్ని, వారి ఔన్నత్యాన్ని చాటిచెప్పే ఎటువంటి ప్రయత్నానికైనా మీడియాలో ప్రాచుర్యం లభించదు. ఇటీవల విడుదలైన ఒక మానసిక రోగి సినిమా గురించి మాత్రం అటు మీడియాలోనీ, ఇటు వెబ్‌లోను ప్రచారం హోరెత్తిపోయింది. ఆ సినిమా చూడకపోతే అసలు యూత్‌ కాదన్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ నేటి యువత అది కాదు తెలుసుకోవలసింది.. రతన్‌సింగ్‌ స్థానంలో ఉండవలసిన యువతని ఖిల్జీ స్థానంలోకి దిగజార్చేసి, అదే నిజమైన హీరోయిజం అన్నట్లుగా హైలైట్‌ చేస్తున్నారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క యువతీ యువకుడు తప్పని సరిగా చూసి, మన నిజమైన సాంప్రదాయ విలువల్నీ, వాటిని కాపాడడం కోసం పూర్వీకులు పడ్డ తపననీ, చేసిన త్యాగాన్ని తెలుసుకుని, గుర్తుంచుకుని, ఆచరించడమే మన పూర్వీకులకు మనమిచ్చే నిజమైన నివాళి.

17 comments:

  1. పద్మావత్ సినిమా గురించి వచ్చిన రివ్యూలు అన్నింటిలోకి మీ రివ్యూ చాలా న్యాయంగా అనిపిస్తున్నది!అసలు పద్మావత్,రతన్ సింగ్,ఖిల్జీలకి సంబంధించిన వాస్తవాలు వేరేగా ఉన్నాయనీ చరిత్రని వక్రీకరించడం జరిందనీ మనవాళ్ళే అంటే హిందూ మేధావులే బన్సాలీని విమర్శిస్తున్నారు గానీ అది పెదగా పట్టించుకోవలసిన విషయం కాదు.

    ఇంతవరకు ప్రపంచ సినిమా చరిత్రలోనే చారిత్రక కధలతో తెసిన ఇన్ని సినిమాలలోనూ నూటికి నూరుపాళ్ళు వాస్తవికంగ ఔన్న సినిమా ఒక్కటి కూడా లేదు!అసలు సినిమ ఏందుకు తెస్తున్నారో ఆ మెయిన్ పాయింటుని చూడాలి,కల్పన లేకుండా కావ్యం ఉండదు - ప్రతి కళారూపంలోనొ అది ఉండి తెరాలి.

    ఢిల్లె సులాను సైన్యం లక్ష మంది బాబరు యొక ప్దివేఅల మంది సైన్యం ముందిఉ ఓడిపోవడానికి కూడా మీరు ఇక్కడ చెపిన "భారతీయులు ప్రతీ విషయాన్ని ధర్మంతో ముడిపెట్టారు. ఆఖరికి యుద్ధం కూడా ధర్మ బద్దంగానే చేసారు. కొన్ని వేల సంవత్సరాలుగా ధర్మంతోనే పెనవేసుకుపోయిన రతీయులకి, ఎటువంటి ధర్మంతో పనిలేకుండా, ఎదుటి వాడిని కొల్లగొట్టడం, బలవంతంగా చుకోవడం, పరాయి వారి భార్యను చెరపట్టడం, అందుకు ఎంతకైనా తెగించి, అడ్డదిడ్డంగా యుద్దం చేయడం వంటివి బొత్తిగా కొత్త. అందుకే అవతలి శత్రువుని కూడా ధర్మబద్దంగా ఎదుర్కోవాలని భావించి, చివరికి వారి కరవాలానికే లయిపోయారు. ఈ విధంగానే ముస్లిం, క్రైస్తవ పాలకులు హిందూ దేశాన్ని ఆక్రమించి, ఇక్కడి సంపదను, స్త్రీలను, వారసత్వాన్ని దోచుకోగలిగారు." వల్లనే జరిగిందనేది లుసుకుంటే సినిమాలో ఉన్న కల్పనలని సమర్ధించవచ్చు!

    ReplyDelete
    Replies
    1. కృతజ్ఞతలు హరి బాబు గారు.. అసలు ఎవరూ రివ్యూలు కూడా రాయలేదు.. మీరు గమనించారో లేదో... ఎందుకంటే ఎక్కడ ఎక్కువ మంది ఆ సినిమా చూస్తే, భారతీయ సంస్కృతి గొప్పదనం అందరికీ ఎక్కడ తెలిసిపోతుందో అన్న భయం కావచ్చు లేదా ఇది ప్రజలకి చెప్పాల్సినంత ముఖ్య విషయం (వాళ్ళ దృష్టిలో) అనుకుని ఉండొచ్చు.

      Delete
  2. యుద్ధం చేతకానివాడే ధర్మం గురించి మాట్లాడతాడని ఏదో సినిమాలో మహేష్ బాబు అంటాడు. అలా ఎందుకన్నాడా అని రోజూ ఆలోచిస్తూనే ఉంటాను. మీకేవన్నా అర్ధం అయితే నాకు చెపుతారా ?

    ReplyDelete
    Replies
    1. ఎవడో ఒక సినిమాతారడు ఏదో తెరమీద అన్నాడని దాని గురించి మరీ ఆలోచించ వలసిన పని ఉందనుకోనండీ.

      భీష్మపితామఃహుడు ఎల్లప్పుడూ ధర్మంగురించే మాట్లాడేవాడన్నది సర్వలోకవిదితమే. ఆయన యుధ్ధం చేయటం చేతకాని వాడు కాదే.

      ధర్మప్రబోధకుడై అర్జునునకు సమయానికి కర్తవ్యోపదేశం చేసిన శ్రీకృష్ణభగవానుడు యుధ్ధం చేయటం చేతకాని వాడా? కాదే.

      రామో విగ్రహవాన్ ధర్మః అని సాక్షాత్తూ మారీచుడనే రాక్షసుడు రావణాసురుడితో అన్నాడుకదా. ఆ శ్రీరామచంద్రమూర్తి యుధ్ధం చేతకాని వాడా?

      అందుచేత నా విజ్ఞప్తి యేమిటంటే ఎవడో అవకతవక డైలాగు వ్రాసియిస్తే దాన్ని తెరమీద వల్లించిన ఒక సినిమానటుడి గురించి ఆలోచించటం మాని ధర్మాన్ని అవగాహన చేసుకొనే ప్రయత్నం చేయటం మంచిదని. ధర్మాన్ని ఆచరించి చూపిన పెద్దల నడవడినుండి దానిని గ్రహించటం కొరకు యత్నించటం శ్రేయస్కరం.

      ఈ విషయంలో నా అభిప్రాయం మీకు నచ్చని పక్షంలో మన్నించండి.

      Delete
    2. యుద్ధం చెయ్యలేనివాడే ధర్మం గురించి మాట్లాడతాడని చెత్త డైలాగ్ చెప్పించాడు ఆ దర్శకుడు. దీనికి సమాధానం అప్పుడే నా బ్లాగులో ఆ సినిమా రివ్యూ లో వ్రాసాను. మీరు చదవవచ్చు.
      "అసలు యుద్ధం చేసేదే ధర్మం కోసం" అని తెలియకపోవడం వాళ్ల దురదృష్టం.

      Delete
    3. https://bonagiri.wordpress.com/2012/01/21/బిజినెస్‌మేన్-వై-దిస్-కొ/

      Delete
    4. ఆ మాట మహేష్ బాబు తో చెప్పించిన డైరెక్ట్రు, తన తర్వాత సినిమాలో ఇలా అంటాడు (పాటలో).

      యుద్ధం గెలిసెటోడు వీరుడు శూరుడు
      యుద్ధం ఇడిసేటోడే దేవుడు

      కథ కోసం పాత్రలు, పాత్ర కోసం మాటాలు. అవి వేదాంతాలు కావు.

      Delete
    5. యుద్ధం గెలిసెటోడు వీరుడు శూరుడు
      యుద్ధం ఇడిసేటోడే దేవుడు

      భలే వ్రాసారండీ ...ఏ సినిమాలోదీ పాట !

      Delete
  3. నా ఫేస్‌బుక్‌లో ఒక సోదరుడు మంచి ప్రశ్న వేశాడు. దానికి నా జవాబు కూడా ఇస్తున్నాను...
    Phanikumar Reddy Satti Nice review Jagadeesh!!
    But I don't agree with below point
    భారతీయులు ప్రతీ విషయాన్ని ధర్మంతో ముడిపెట్టారు. ఆఖరికి యుద్ధం కూడా ధర్మ బద్దంగానే చేసారు. కొన్ని వేల సంవత్సరాలుగా ధర్మంతోనే పెనవేసుకుపోయిన భారతీయులకి, ఎటువంటి ధర్మంతో పనిలేకుండా, ఎదుటి వాడిని కొల్లగొట్టడం, బలవంతంగా దోచుకోవడం, పరాయి వారి భార్యను చెరపట్టడం, అందుకు ఎంతకైనా తెగించి, అడ్డదిడ్డంగా యుద్దం చేయడం వంటివి బొత్తిగా కొత్త.
    As per our ancient epics, what king of gods Indra did to someones wife what about vaali, what about Ravana Brahma and what Lord Rama did to Valli.
    All I want to say is even in olden days all Indians are not innocents and pure. And religion is nothing to do with one person's good or bad attitude.
    My answer for that:
    చాలా మంచి ప్రశ్న వేసావు ఫణీ... నీలాంటి వాళ్ళు చాలా మంది ఇలాంటి ప్రశ్నే నన్ను చాలా సార్లు అడుగుతూ ఉంటారు. ఇక్కడ నేను మంచి, చెడు గురించి మాట్లాడడం లేదు. కాని సమాజాన్ని సరైన దారిలో పెట్టడానికి భారతీయులు ఎన్నుకున్న మార్గం ధర్మం. ధర్మాన్ని తప్పిన వారి గతి ఏమిటి? వారు ఎటువంటి కష్టాల్ని ఎదుర్కొన్నారు అనేది నువ్వు చెప్పిన ఇంద్రుడు, వాలి, రావణుడు, దుర్యోధనుడు వంటి పాత్రల ద్వారా సమాజానికి సందేశం అందజేసారు. అంతేగాని ధర్మం తప్పి ప్రవర్తించమని ఎవరూ చెప్పలేదు. కాని మిగతా పాశ్చాత్య మతాల్ని పరిశీలించినట్లయితే, ఎవరో ఒకర్ని నమ్మితే చాలు, నువ్వు ఎన్ని పాపాలు చేసినా క్షమించబడతాయని చెబుతోంది. అందుకే ఆ మతం ఎక్కువగా ఉన్న దేశాల్లో నేరాల రేటు ఎక్కువగా ఉంటోంది. సమాజంలో అల్లకల్లోల పరిస్థితులు ఉండడం మనం చూస్తూ ఉంటాం. నీ మతం కాని వారికి ఎంత మందిని చంపినా పర్లేదు - నీకు స్వర్గంలో స్థానం లభిస్తుంది అని చెబుతుంది. ఆ మతం ఎక్కువగా ఉన్న దేశాల్లో మనుషుల్ని ఎంత కిరాతకంగా ఒకరినొకరు చంపుకుంటున్నారో రోజూ చూస్తూనే ఉన్నాము. ఈ సినిమాలో డైరెక్ట్‌గా ఖిల్జీ చేతనే ''మాకు నీతి నియమాలతో పనిలేదు - గెలవడం మాత్రమే ముఖ్యం'' అనిపించారు. మతం పేరు చెప్పి మారణహోమం సృష్టించడం భారతీయులు ఎన్నడూ చేయలేదు. ధర్మాన్ని తప్పిన వారిని శిక్షించడం మాత్రమే జరిగింది. అది కూడా ధర్మ సంస్థాపనార్థం మాత్రమే అని గుర్తుంచుకోవాలి.

    ReplyDelete
  4. చక్కని విశ్లేషణ

    ReplyDelete
  5. లెస్స పలికితిరి శ్యామలీయం గారు, బోనగిరి గారు (మీ టపా లింక్ నాకూ కావాలండి). అయినా “కన్యాశుల్కం” నాటకంలో రామప్ప పంతులు “గుంటడి వెకాశ్యాలు నిజమనుకుంటావేమిటి?” అని మధురవాణితో అంటాడు చూసారా, అలాగ సినిమా వాళ్ళు సినిమాల్లో వల్లించే “సూక్తి ముక్తావళి”ని మనం సీరియస్ గా తీసుకుంటే ఎలాగ? వాళ్ళు తమ “అభిమానుల” కోసమూ, సరే కలెక్షన్ల కోసమూ డైలాగులు వ్రాయించుకుంటారు కదా. పైగా వాటికి “పంచ్ డైలాగులు” అని పేరొకటి. అవి ఎంతగా “పేలితే” సీను అంత బాగా “పండింద” న్నమాట (వాళ్ళ పడికట్టు మాటల్లో చెప్పాలంటే). అటువంటి వాటిని నిజమనుకోవడం ప్రజల అమాయకత్వం. సినిమాని రూపొందించడంలో బాధ్యతారాహిత్యం బాగా పెరిగిపోయిన సినిమా వాళ్ళ ధోరణిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, మన నిజ జీవితంలోకి రానివ్వకూడదు. అరుదుగా వచ్చే ఈ “పద్మావత్” లాంటి మూవీలని ఆదరించాలి.
    రివ్యూ చక్కగా వ్రాసారు జగదీష్ రెడ్డి గారూ.

    ReplyDelete
    Replies
    1. అడగ్గానే మీ టపాకి లింకిచ్చినందుకు ధన్యవాదాలు బోనగిరి గారూ.

      Delete
  6. >>>>మతం పేరు చెప్పి మారణహోమం సృష్టించడం భారతీయులు ఎన్నడూ చేయలేదు. ధర్మాన్ని తప్పిన వారిని శిక్షించడం మాత్రమే జరిగింది. అది కూడా ధర్మ సంస్థాపనార్థం మాత్రమే అని గుర్తుంచుకోవాలి.>>>>>

    బాబ్రీ మసీదు అల్లర్లు ఏ మతం చేసింది ? ఎవరు ధర్మం తప్పారు ? ఏ ధర్మ సంస్థాపనార్ధం చేసారు ?

    >>>>ఇంద్రుడు, వాలి, రావణుడు, దుర్యోధనుడు వంటి పాత్రల ద్వారా సమాజానికి సందేశం అందజేసారు. అంతేగాని ధర్మం తప్పి ప్రవర్తించమని ఎవరూ చెప్పలేదు. >>>>

    Yes, You are right same principle apply to khiljI, baabar, aurangjeb etc...

    I agree with these golden words....All I want to say is even in olden days all Indians are not innocents and pure. And religion is nothing to do with one person's good or bad attitude.

    >>>ఈ సినిమాలో డైరెక్ట్‌గా ఖిల్జీ చేతనే ''మాకు నీతి నియమాలతో పనిలేదు - గెలవడం మాత్రమే ముఖ్యం'' అనిపించారు. >>>

    బుద్ధా మురళి గారు చెప్పినది కూడా అదే ధర్మం ఎపుడూ గెలవదు గెలిచినదానే ధర్మం అని అనుకుంటాం. ధర్మం అనేది యుగాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

    ReplyDelete
  7. @ Bonagiri garu,

    అసలు యుద్ధం చేయాల్సిందే ధర్మం కోసమని మరిచిపోతే ఎలా?

    కురు వృద్ధుల్... కురు బాంధవుల్ అనేకులున్న ఈ బ్లాగుల్లో ధర్మం గురించి మాట్లాడుతుంటే మా(చను)రీచుడు వ్రాసిన వ్రాతలు గుర్తుకొస్తున్నాయి.

    ReplyDelete
  8. ఈ సినిమా గురించి నా అభిప్రాయం.
    సినిమా చాలా బాగా తీసాడు, కాని నిడివి ఎక్కువయ్యి కొన్ని చోట్ల బోర్ కొట్టింది. దీపిక, రణ్ వీర్ సింగ్ బాగా చేసారు. షాహిద్ ఆ పాత్రకి సరిపోలేదు. మన ప్రభాస్ అయితే బాగుండేది. రణ్ వీర్ ఖల్ నాయక్ లోని సంజయ్ దత్ ని గుర్తుకు తెచ్చాడు. ఈ సినిమా కి 3డి అవసరం అంతగా లేదు.
    ఇక మీరు ఉదహరించిన మరో సినిమా గురించి చెప్పాలంటే, అది ఒక "అసమర్ధుని పచ్చి ఫాంటసీ యాత్ర". అది విమర్శకులకి ఎందుకు నచ్చిందో నాకు అర్థం కాలేదు.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.