మాంసాహారం మీద దేశంలో చాలా పెద్ద దుమారం రేగుతోంది. మాంసం తినడాన్ని ఒక పెద్ద ఘన కార్యంగా, ఒక మత కార్యక్రమంగా కొందరు హడావుడి చేస్తుంటే, శాకాహారమే గొప్పదని, మంచిదని మరికొందరు వాదిస్తున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా, కొన్ని వేల సంవత్సరాలుగా మానవులు మాంసానికి అలవాటు పడ్డారని చరిత్ర చెబుతోంది. కాని ప్రకృతి పరంగా చూస్తే, మానవుడు శుద్ద శాకాహారి. మానవులు హోమో సాపియన్స్ అనే వానర జాతికి చెందిన వారని జీవ పరిణామ సిద్దాంతం చెబుతోంది. దీని ప్రకారం చూసుకుంటే, మానవులకి రూపంలో మరొక దగ్గరి జాతి అయిన కోతులు, చింపాజీలు, గొరిల్లాలు వంటివన్నీ పూర్తి శాకాహార జీవులే. అవి అడవులలో నివసిస్తూ, చెట్ల ఆకులను, పళ్ళను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తాయి. అంటే అదే జీవజాతి నుండి పరిణామం చెందిన మానవులు కూడా ప్రకృతి పరంగా శాకాహారులుగానే పరిణామం చెంది వుంటారని భావించవచ్చు. దీనికి తోడుగా మానవుల జీర్ణ వ్యవస్థ కూడా శాకాహారానికి అనువుగా తయారు చేయబడింది అనేది అందరికీ తెలిసిన సత్యమే. మనం ఆకులను, పళ్లను, కాయలను ఎటువంటి పచనం చేయకుండానే, అంటే వండకుండానే హాయిగా తినగలుగుతాము. అవి తేలికగా జీర్ణం కూడా అవుతాయి. కాని, మాంసాన్ని ఉడకబెట్టకుండా / వేపకుండా ఎవరినైనా తినమనండి చూద్దాం... ఒకవేళ బలవంతంగా తిన్నా కూడా అది తేలికగా జీర్ణం కాదు సరికదా కొత్తరకం సమస్యలు పుట్టుకొస్తాయి. మనుషులు ప్రకృతి పరంగా శాకాహారులుగా సృష్టించబడ్డారు అని చెప్పడానికి ఈ ఒక్క కారణం చాలు.
అయితే పరిణామ క్రమంలో మనిషి నిప్పుని తయారుచేయడం నేర్చుకున్న తరువాత, పెద్ద జనావాసాలు పుట్టుకువచ్చి, వారందరికీ, అడవిలో దొరికే పళ్ళు, కాయలు సరిపోని పక్షంలో మాత్రమే వేటాడడం నేర్చుకుని, ఆ జంతు మాంసాన్ని నిప్పులపై కాల్చుకుని తిని బ్రతకడం ద్వారా క్రమంగా మాంసాహారంవైపు మళ్ళారని మనం భావించవచ్చు. దీనికి ఇతమిత్థంగా ఎటువంటి సాక్ష్యాలు చూపించలేము గాని, మానవ శారీరక నిర్మాణ పరంగా ఇది వాస్తవంగా జరిగి ఉండవచ్చునని అనుకోవచ్చు.
కొంత మంది మత పరంగా మాంసం తినవచ్చు అని వాదిస్తున్నారు. అటువంటి పుస్తక మతాల వారు (అంటే ప్రతి దానికి పుస్తకాల్లో వెతుకుతారు, మస్తకాలని ఖాళీగా పెడతారు) తమ పవిత్ర గ్రంధాలలో మాంసం తినమని ఉంది కాబట్టి అందరూ తినవచ్చు అని ఒక చెత్త వాదన చేస్తారు. దీనితో ఎవరూ ఏకీభవించనవసరం లేదు. ఎవరో ఎప్పుడో ఎవరి కోసమో రాసిన దానిని అందరూ ఆమోదించాలని రూలేమీ లేదు. అందుచేత నిరభ్యంతరంగా ఎవరికి నచ్చిన ఆహారాన్ని వారు తినవచ్చు. ప్రత్యేకించి మాంసం తింటేనే స్వర్గంలో చోటు దొరుకుతుంది అని ఎక్కడైనా ఉంటే దాన్ని హాయిగా తిరస్కరించవచ్చు.
పైన చెప్పిన ప్రాకృతిక కారణాలు, మత కారణాలు ఇవన్నీ పక్కన పెట్టి, మనసుతో ఆలోచించడం మొదలు పెడితే, మనం హాయిగా శాకాహారులుగా ఉండడమే సరైన పద్దతని మనకు అనిపిస్తుంది. ఎవరో నేర్పిన ఆలోచనలు, పద్దతులు, ఎక్కడో రాయబడ్డ రాతలు ఇవన్నీ వదిలేయండి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి... ఇప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి... ప్రకృతిలో మనతో పాటుగా సృష్టించబడిన ఒక అందమైన ప్రాణిని ఊహించుకోండి... అది కోడి లాంటి పక్షి కావచ్చు. మేక, కుందేలు, ఆవు లాంటి పెద్ద జంతువు కావచ్చు... లేదా చేప వంటి ఈదే ప్రాణి కావచ్చు. అది కూడా మనిషిలాగానే ఎంతో జాగ్రత్తగా తయారుచేయబడింది. ఎటువంటి లోపాలు లేకుండా... దాని మానాన అది బ్రతుకుతుంది... ఆహారం సంపాదించుకుంటోంది... తన లాంటి పిల్లల్ని తయారుచేసుకుని, సృష్టిక్రమంలో ముందుకు వెళుతోంది. ఎంతో అమాయకంగా ఉంటుంది. దానిలో మన పట్ల ఎటువంటి ద్వేషం, కోపం, అసూయ ఏమీ లేవు. అలాంటి ఒక ప్రాణిని తీసుకువచ్చి, అత్యంత కిరాతకంగా పదునైన కత్తితో నరికి, దాని రక్తాన్ని చిందించి, క్రూరంగా మాంసం కోసి తినడం అవసరమా? కేవలం ఒక పూట మన ఆకలి తీరడం కోసం ప్రకృతి ఎంతో అపురూపంగా సృజించిన చిన్ని ప్రాణిని బలి తీసుకోవడం అవసరమా? మనకు ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలితేనే విలవిల్లాడిపోతాం కదా... అటువంటిది ఆ నిస్సహాయ జీవి గొంతు కోసి, రక్తం ఓడుతూ, గిలగిలా కొట్టుకుంటూ ఉంటే చూసి ఆనందించడం ఎంత హేయమైన చర్య? మనందరం మనుషులమే కదా... కరుణ, జాలి, దయ, ప్రేమ అనేవి మనుషులకు మాత్రమే ఉంటాయి అంటే ఎవరూ నమ్మకండి. సకల జీవరాశులకు అవన్నీ ఉంటాయి. తమ సంతానం పట్ల అవి ప్రేమ కలిగిఉంటాయి. సాటి జంతువు కష్టాల్లో ఉంటే, తమకు చేతనయిన సాయం చేస్తాయి. బాధ వస్తే దీనంగా అరుస్తాయి, సంతోషం కలిగితే చెంగు చెంగు మని గంతులేస్తాయి. ఎవరైనా తమ మీద దాడి చేయాలని చూస్తే ప్రతిఘటిస్తాయి లేదా భయంతో పరుగుపెడతాయి. అంటే వాటికి కూడా మనసు ఉంటుందన్న మాటే కదా... తమ భావాల్ని పైకి మాటల రూపంలో చెప్పలేనంత మాత్రాన, ఎదురు ప్రశ్నించలేనంత మాత్రాన వాటిని చంపి తినడం మా జన్మ హక్కు అంటే సాటి ప్రాణి జీవించే హక్కుల్ని కాలరాసినట్లే కదా...
శాకాహారం మాత్రమే తినాలి అనేది ఒక ఉద్యమంగా ఇప్పుడిప్పుడే పాశ్చాత్య దేశాల్లో మొదలయ్యింది. దీనికి మత పరమైన ప్రాధాన్యత ఏదీ లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్లు సాటి ప్రాణిని హింసించి, చంపి, మన ఆకలిని తీర్చుకోవడం అనేది మనసు ఎంతో బాధ కలిగించే విషయం. సున్నితమైన మనసు ఉన్న వారెవరైనా శాకాహారులుగా మారవచ్చు. ఇది బలవంతంగా తమ ఆహారపు ఆలవాట్లను మార్చుకోవడం కాదు. లేదా ఏదో కారణం చెప్పి, కొన్ని రోజులు మానేసి, తిరిగి తినడం కాదు. మాంసాహారంపై పూర్తి విరక్తి చెంది, మానసికంగా పూర్తిగా వ్యతిరేకించుకుని, జీవితంలో మరెప్పుడే మాంసాహారం వైపు చూడకుండా ఉండడం.
మరొక ముఖ్యమైన ఉద్యమం 'వెగాన్'. పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడిపుడే ఈ ఉద్యమం వేగంగా విస్తరిస్తోంది. వెగాన్‌గా మారిన వారు కేవలం మాంసాహారం మానివేయడం కాకుండా, జంతువుల నుండి వచ్చే ఏ విధమైన ఆహారాన్నయినా, వస్తువునయినా వాడకపోవడం. అంటే పాలు, తేనె వంటివి కూడా తినకపోవడం. జంతు చర్మాలతో చేసిన బెల్టులు, హ్యాండ్ బ్యాగ్‌లు, తోలు చెప్పులు వంటి వాటికి దూరంగా ఉండడం. ఒక సున్నితమైన మనసు కలిగిన మనిషికి ఒక జంతువు చర్మంతో చేసిన చెప్పులపై నడిచినపుడు లేదా బెల్టు పెట్టుకున్నపుడు ఆ జంతువు బాధను తాను ఫీల్ అవ్వగలుగుతాడు. అటువంటి వారు జంతువుల నుండి వచ్చిన ఏ ఉత్పత్తినీ ఆనందంగా ఉపయోగించలేరు. ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖులు ఈ వేగాన్ల జాబితాలో చేరిపోయారు. టైటానిక్, అవతార్ వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు జేమ్స్ కామెరూన్, ప్రముఖ కథానాయిక పామెలా ఆండెర్సన్, డెమీ మూర్ వంటి వారు ఎంతో మంది శాకాహారులుగా మారిపోయారు.
ప్రకృతిలో జంతువులకు లేనిది, మనుషులకు మాత్రమే ఉండేది మనసు, ఆలోచన. జంతువులు కేవలం తమ ధర్మాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటాయి. అంటే లేడి గడ్డి తినడం, పులి లేడి తినడం వంటివి. వాటికి ఆలోచన ఉండదు. ఆకలేస్తే, ప్రకృతిపరంగా తమ ఆహారాన్ని తాము సంపాదించుకుంటాయి. అది శాకమైనా, మాంసమైనా... కాని మనిషి మాత్రమే తనకు ఆకలేస్తే ఏమి తినాలో నిర్ణయించుకోగలడు. అలా సంపాందిచుకున్న ఆహారం ఎలా ఉండాలో మనిషి మాత్రమే కోరుకోగలడు. అందుచేత మనందరం ఏదైనా ఆహారాన్ని తినాలనుకున్నప్పుడు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే, ఏది తినాలో మన మనసుకే తెలిసిపోతుంది. దీనికోసం సిద్ధాంతాలు చేయనక్కర్లేదు, మత గ్రంధాలు తిరగెయ్యనక్కర్లేదు, వాదోపవాదాలకి దిగనవసరం కూడా లేదు.

''అహింసా పరమో ధర్మః''
మనుషులకు కోతులకు పూర్వికుల నుండి వేరు పడి - 40 లక్షల - కోటి సంవత్సరాలు, ఇప్పటి కోతులు అలవాట్ల తో పోల్చడం సమంజసం గా లేదు.
ReplyDeleteజపాను వాళ్ళు సుషీ - ఏ రకంగా వండని చేపను తింటారు.
మనకు నచ్చక పోతే తినద్దు,అంతే కానీ మాంసాహారం నేరం చేయకూడదు.
నేను మాంసాహారం నేరమని ఎక్కడా చెప్పలేదే? అది హాని అని మాత్రమే చెప్పాను. వీలయితే మనసు పెట్టి ఆలోచించమన్నాను. ఎవరి ఇష్టం వాళ్ళది. నా ఇష్టాన్ని నేను చెప్పాను. ఋషి ధర్మం ఇలా చేస్తే మంచిది అని మాత్రమే చెప్పింది. ఆచరించడం ఆచరించకపోవడం, అది వాళ్ళ ఇష్టం. ఆచరిస్తే, ఆరోగ్యంగా జీవించవచ్చు. ఆచరించకపోతే, వాళ్ళ ఖర్మం. అనారోగ్యం కొనితెచ్చుకుని, మందులకి, డాక్టర్లకి డబ్బులు తగలేస్తానంటారా, దానికి నేనేమీ చెయ్యలేను.
Deleteప్రకృతిలో జంతువులకు లేనిది, మనుషులకు మాత్రమే ఉండేది మనసు, ఆలోచన. Is it true? I thought animals can think.
ReplyDeleteజంతువులు కూడా ఆలోచిస్తాయి. కాని వాటి ఆలోచన పరిమితం. ఆ విషయాన్ని పైన కూడా చెప్పాను. కాని మనకున్న ఆలోచనా పరిధి విస్తృతం. ఎదుటి వారి బాధని కూడా మనం ఫీల్ అవ్వగలం. అందుకే ఆలోచించమంటున్నాను.
DeleteHi Sir, are you vegan or you consume animal produces like milk? Please reply to this. thanks.
ReplyDeleteఅవునమ్మా... నేను పూర్తి శాకాహారిని. కాని పాలు తాగుతాను. ఇప్పుడు అది కూడా మానేద్దామని నిర్ణయించుకున్నాను. శాకాహారం గురించి ఇంకా వివరాలు కావాలంటే నాకు మెయిల్ చెయ్యమ్మా. satyaoffset@gmail.com
Deleteపశువులను హింసించకుండా ఉన్నంతవరకూ వాటి పాలను స్వీకరించటంలో తప్పు ఏమీ కనబడటం లేదండీ.
Deleteవాటిని మనం హింసించినట్టు భావించకపోయినా, ఆ నోరు లేని జీవాలు వాటి పిల్లలకోసం తయారుచేసుకున్న పాలని మనం బలవంతంగా తీసుకుంటున్నామేమో అని నాకు అనిపిస్తుంది... నేనే కాదు "వేగాన్" ఆలోచనా విధానం అలానే ఉంటుంది...
Deleteవేగాన్ ఉద్యమం మొదలయ్యింది బౌద్ధ మత ప్రభావంతోనో లేక హిందూ మత ద్వేషంతోనో కాదు. మనుషులు మత ప్రభావం నుండి పూర్తిగా బయటికి వస్తే చివరకు మిగిలేది వైదిక జీవన విధానమే. సనాతన ధర్మాచరణే.... ఈ విషయంలో పాశ్చాత్యులు మనకన్నా ఎంతో ముందున్నారనిపిస్తుంది.
ReplyDeleteఎస్పీ జగదీష్ గారు,
Deleteచాలా విలువైన మాట చెప్పారు ! చీర్స్ జిలేబి
మనుషులు మత ప్రభావం నుండి పూర్తిగా బయటికి వస్తే చివరకు మిగిలేది వైదిక జీవన విధానమే.
Deleteharibabu:
ప్రత్యక్షర సత్యం!?
ధన్యవాదాలండి... జిలేబి గారు, హరిబాబు గారు...
Delete