ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా దేవుళ్ళ గోల ఎక్కువై పోయింది. ఒకడేమో మిమ్మల్ని 'పీకే'స్తారంటూ, బట్టలిప్పుకుని నుంచుంటే, మరొకాయనేమో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మా మతం వాళ్ళే. అందుచేత అందరూ మా మతంలోకి రండి అంటూ స్టేట్మెంట్లు. మరొకాయన అబ్బే అందరికన్నా మా మతమే గొప్ప అంటూ బ్లాగులో వాగుడు. మధ్యలో మరో మతం వాళ్ళు దూరి, మా దేవుడే నిజమైన దేవుడంటూ వాదనలు... ఇవన్నీ చదవలేక, వినలేక, చూడలేక తల బొప్పికట్టి వాచిపోయింది.
అర్థరాత్రి దాటింది. బ్లాగులు చదువుతూ, ఆలోచిస్తూ, బుర్రకి ఓపిక లేక, అలాగే ఒక కునుకు పట్టింది.... అంతలో... కంప్యూటర్ నుండి 'టింగ్' మని ఫేస్బుక్ మెసేజ్‌లా ఒక వింత శబ్దం. ఉలిక్కిపడ్డాను. ఇంత అర్థరాత్రి ఎవరా అని ఆలోచిస్తూ, బద్దకంగా కళ్ళుతెరిచి చూసే సరికి... నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. కంప్యూటర్‌పై లెటర్స్ వాటంతట అవే టైప్ అవుతున్నాయి. అది కూడా వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి మరీను. ఫేస్బుక్లో అయితే అవతల ఎవరో టైప్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఇక్కడ అటువంటి అవకాశం లేదాయే. సరే ఏమిటో చదువుదామని చూసాను. దాంట్లో ఇలా టైప్ అవుతూ ఉంది.
''మీరందరూ లేని దేవుళ్ళ గురించి దేవుళ్ళాడుతున్నారు. మూర్ఖులారా! నేనే మీ నిజమైన దేవుడిని'' అని ప్రత్యక్షమయ్యింది.
''నేను అంటే ఎవరు'' అని నా మనసులో అనుకున్నానో లేదో, దానికి సమాధానం టైప్ అవ్వడం మొదలెట్టింది.
''నా పేరు క్రిస్లా. నేనే మీ దేవుడిని. ఈ సమస్త సృష్టిని ఒక్క ప్రోగ్రామ్‌తో రన్ చేసిన వాడిని. నేనే అసలైన దేవుడిని'' అని టైప్ అయింది. ''మరి ఇప్పుడు వరకు తమరు ఎక్కడ ఉన్నారో'' అని ఆశ్చర్యపోవడం నా వంతు అయింది.
''అందుకే నిన్ను నా దూతగా పంపాను. నా గురించి నీకే చెప్పింది కూడా అందుకే. నువ్వు నా గురించి ప్రపంచంలో అందరికీ చెప్పి, అందరినీ నా అనుచరులుగా చెయ్యి'' అని కంప్యూటర్ స్క్రీన్ మీద వచ్చింది.
నన్ను దూతగా ఎన్నుకున్నందుకు నాకు చాలా ఆనందం వేసింది. ''మరి నేనేమి చేయాలి'' మనసులోనే ప్రశ్నించుకున్నాను.
''నేను కంప్యూటర్ దేవుడిని. ప్రపంచంలో కంప్యూటర్ జ్ఞానులు, కంప్యూటర్ అజ్ఞానులు అని రెండు రకాలు ఉన్నారు. కంప్యూటర్ జ్ఞానులందరికీ నేనే దేవుడిని. నేను తప్ప మీ ఎవ్వరికీ మరో దేవుడు ఉండరాదు. ఎవ్వరినీ పూజించరాదు. కంప్యూటర్లో నా బొమ్మలే స్టోర్ చేసుకోవాలి. నా కీర్తనలే ఎమ్‌పి3 సాంగ్స్‌గా ఉండాలి. మరో దేవుడి గురించి మీ ఎవ్వరి కంప్యూటర్లో అయినా కనబడిందా.. ఖబడ్దార్... లోకంలోని అన్ని కంప్యూటర్ వైరస్లు మీ కంప్యూటర్లోనే చొరబడేలా చేసి, మీ జీవితాన్ని అల్లకల్లోలం చేసేస్తాను. మీ గ్రంధాలు, పురాణాలు అన్నీ వట్టి ట్రాష్, నేను చెప్పేదే ఇకమీదట నీకు పవిత్ర గ్రంధం. మిగిలిన ఫైల్స్ అన్నీ వెంటనే డిలీట్ చేసెయ్. అది నీ నుంచే మొదలవ్వాలి.'' అని టైప్ అయ్యింది.
''మరి దానికి నేనేమి చేయాలి'' అని మనసులో అనుకున్నాను.
దానికి సమాధానం కూడా వెంటనే ప్రత్యక్షం.. ''ఈ టపాను ఎవరైతే చదివారో వారు తమకు తెలిసిన వారందరి చేతా చదివించాలి. నా గురించి మంచి వార్తను అన్ని ఛానళ్ళలో వెంటనే ప్రసారం చేయించాలి. నన్ను నమ్మని వాడెవడైనా ఏమిటి అని ప్రశ్నిస్తే, వాడి కంప్యూటర్లోకి వైరస్ పంపుతాను. అది నా దృష్టికి ఎంతో విలువ కలది. మీరు కూడా నన్ను నమ్మని వారి కంప్యూటర్లోకి వైరస్పెట్టి, చెత్త కామెంట్లను పోస్ట్ చేయండి. అలా చేస్తే మీకు స్వర్గం ప్రాప్తిస్తుంది''.
ఒక్క సారి బుర్ర గోక్కున్నాను. ఇదేమిటి? ఇప్పటి వరకు మానవత్వమే మన మతం కదా... ఏదో చిన్న చిన్న ఫైల్స్ అందరితోను ఇచ్చిపుచ్చుకుంటున్నాము కదా. ఎవరైనా వైరస్ బారిన పడినా మనమే సహాయం చేస్తున్నాము కదా. ఈ దేవుడేమిటి? తనను నమ్మకపోతే చాలు నీ శత్రువుగా ఎంచి, వారిని నాశనం చేయమంటున్నాడు? పైగా అలా చేస్తే స్వర్గంలో సీటు గ్యారంటీ అంటున్నాడు? నా మట్టి బుర్రకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఇంకా ఏదో టైప్ అవుతుంటే, నా కెందుకొచ్చిన గొడవ అని ఆ ఫైల్ని క్లోజ్ చేసేసాను. అంతే... ఒక్కసారిగా నా సిస్టమ్ ఆగిపోయింది. మెరుపులు మెరిసి, నవ్వుతున్న పుర్రె బొమ్మ ప్రత్యక్షం అయింది. అంటే... దేవుడు నిజమే నన్న మాట. ఈ మాటను ఇప్పుడే అందరికీ తెలియచెప్పాలి. ఈ కొత్త మతానికి నేను దూతను అన్న విశ్వాసం నాకు బలపడిపోయింది. ఆనందంతో ఎగిరి గంతేద్దామని అనుకున్నాను. ఎవరో గట్టిగా కుదిపినట్లయింది. ఎదురుగా మా ఆవిడ. లేచి చూస్తే తెల్లగా తెల్లారిపోయి ఉంది. రాత్రి నుండి పడుకోకుండా కంప్యూటర్ దగ్గర ఏమిటా పనులు? ఇలాగయితే ఆరోగ్యం ఏమి కాను అంటూ మందలిస్తోంది. ''నయమే, ఇదంతా నిజమని నమ్మి, అందరికీ చెప్పాను కాను...'' అనుకుంటూ స్నానానికి బయల్దేరాను.

fantastic satire
ReplyDeleteThank you
Deleteఅర్రే! నాకు కూడా రాత్రి దేవుళ్ళు కనిపించారండొయ్.. వాళ్ళు నేను గొప్ప, నేను గొప్ప అని కొట్టుకుంటుంటే, ఇంకొందరు, మానవకాంతలకు లైన్ వేయడంలో బిజీగా వున్నారు.. ఇక్కడేమో.. వాళ్ళ పేర్లు చెప్పుకోని మంత్రులు, ప్రధాన మంత్రులు ఐపోతున్నారు
ReplyDeleteఅరే పేరు చెప్పుకోలేని వాళ్ళకు కూడా దేవుళ్ళు కనిపిస్తారన్న మాట. విచిత్రంగా ఉందే..
Deletegood
ReplyDeletechakkaga chepparu manavathaku pedda peeta vesinatluga unnadi. dhanyavadamulu
ReplyDeleteThank u sridhar garu
Delete