Pages

Thursday, April 24, 2014

తెలంగాణా సభలో బయట పడిన రాహుల్‌ అవగాహనా రాహిత్యం

    మొన్న తెలంగాణాలో జరిగిన కాంగ్రెస్‌ సభలో రాహుల్‌ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, తెలంగాణాను ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. వారిని ఉత్తేజ పరిచేలా ప్రసంగించాలని ఎంతో ప్రయత్నం చేస్తూ, చివరికి తెలంగాణాలో ఉత్పత్తి అయ్యే వస్తువులు అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాయని, వాటిపై 'మేడిన్‌ తెలంగాణా' అని ఉంటే చాలు వాటిని జనం కొనేస్తారని, ఆ స్థాయికి తెలంగాణా యువత తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తారని, ఇంకా ఏవేవో చిత్ర విచిత్రమైన సందేశాలు ఇచ్చి పారేశారు. కాని, ఇక్కడ రాహుల్‌ మరచిపోయిన విషయం ఒకటుంది. ఒక దేశంలో తయారైన వస్తువులకు ఆ దేశం పేరునే ముద్రిస్తారు. ఉదాహరణకు జపాన్‌లో తయారైన వస్తువులకు మేడిన్‌ జపాన్‌ అది ఉంటుంది. చైనాలో తయారైన వస్తువులకు మేడిన్‌ చైనా అని దేశం పేరు ముద్రిస్తారు. ఆ వస్తువులు చైనాలో బీజింగ్‌లో తయారైందా, లేదా షాంగైలో తయారైందా ముద్రించరు. అలాగే భారతదేశంలో ఏ ప్రాంతంలో తయారైనా వస్తువుపైన అయినా గాని మేడిన్‌ ఇండియా అని మాత్రమే ముద్రిస్తారు. అంతేగాని మేడిన్‌ తెలంగాణా, మేడిన్‌ ఆంధ్రా అని వేయరు. ఒకవేళ కాంగ్రెస్‌ మరలా అధికారంలోకి వస్తే, తెలంగాణా ప్రజల సెంటిమెంట్‌ మేరకు ప్రత్యేక తెలంగాణా దేశాన్ని ప్రకటిస్తారేమో చూడాలి. అపుడు రాహుల్‌ చెప్పినట్లు మేడిన్‌ తెలంగాణా అని అక్కడ తయారైన వస్తువులపై వేసుకోవచ్చు.  ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా భారతదేశంలాంటి ఒక పెద్ద దేశానికి రాహుల్‌ ఎలా ప్రధాన మంత్రి అవుదామని ప్రయత్నిస్తున్నాడో ఆశ్చర్యం కలుగుతుంది. భారత ప్రజలు అమాయకులే కావచ్చు గాని, మరీ రాహుల్‌ లాంటి వ్యక్తిని ప్రధానిగా చూడాలని ఆశిస్తున్నారని నేను భావించడం లేదు.

6 comments:

  1. Ade kadaa mana dourbhaagyam. 120 kotla mandilo intha kante arhudu dorakadaa pradhaani padaviki?
    sonia koduku kaavadam okkatega veedi arhatha.........moddabbaayi ani voorike analedugaa veedini...
    konninsaarlu "ganapathi" ade chilakamarthi vaari badudhaayi.....vaadecgurthuku vasthaadu mana vaadi ni chuste.

    ReplyDelete
  2. మన రాహుల్ గాంధీ నే చూస్తుంటే... ఈ మధ్య వచ్చిన నితిన్ సినిమా ఇష్క్ లోని విమానం సీన్ గుర్తుకు వస్తుంటుంది....నిత్య మీనన్ రాహుల్ అనే పదానిని ఎలా వాడతారో చెపుతుంది... ఆ description సినిమా లో హీరో కన్నా, బయట మన రాహుల్ గాంధీ కి సరిపోతుంది...:)

    ReplyDelete
  3. ఈ మేధావే ఒకప్పుడు అమ్మ యేడ్చింది అని ఒకసారి, నా యేడుపు గురించి చెప్పొద్దని అమ్మ నన్ను తిట్టింది అనీ వాగాడు.కేసీఆర్ విలీనం చేస్తానని మోసం చేశాడని అంటున్నాడు - నువ్వెందుకు నమ్మావు అని తననే అంటారని కూడా తెలియని ఈ నికమ్మా.

    ReplyDelete
  4. neevu bale arthamu chesukunnavu. neelanti vallu e deshaniki chaaaaaaaaaaaalaaaaaaaa avasaramu. rahul ela cheppado.. endhuku cheppado sariga vinu.

    ReplyDelete
    Replies
    1. అంత సూటిగా చెప్పిన దాంట్లో ఇంకా సరిగ్గా వినడాని కేముంటుందో?శ్రీవారు చెప్పేది యేది యెలా వినాలో దానికి ప్రత్యేకంగా ట్రయినింగ్ యేదయినా మీలాంటి వాళ్ళు ఇస్తే చేరుతాం.

      Delete
    2. మేడ్ ఇన్ తె లంగా నా, మేడ్ ఇన్ హైదరాబాద్ అని అంత గొప్ప క్లారిటీ తో చెబితే అందులో అర్ధం కాకపోవటం ఏమిటి అనామకా!! కొంపదీసి తమరు గాని మీ ఇజియనగరం తాగుబోతు దొర తో పాటు రాహుల్ బాబా భక్తులు కూడానా?

      Delete

Note: Only a member of this blog may post a comment.