Pages

Saturday, October 27, 2012

దేవుడా! మనీ తీసుకుని మానవత్వాన్ని మాకివ్వు - మతాన్ని తీసుకుని మంచితనాన్ని మాకివ్వు





మనసు మూగబోయింది

మాటలు రాక కాదు - మాటలు లేక

చిట్టితల్లి సాన్వి ఇకలేదని తెలిసాక

చదువుకుంటానన్నందుకు మొన్న మాలాల

ఏపాపం తెలియని వయసులో నేడు సాన్వి

దేశాలు మారినా, మతాలు మారినా

మానవ మృగాల దారుణాలు

కన్నీటితో నిండిన శోకతప్త హృదయాలు...

విముక్తిలేదా చిన్నారులకు


దేవుడా! మనీ తీసుకుని మానవత్వాన్ని మాకివ్వు

మతాన్ని తీసుకుని మంచితనాన్ని మాకివ్వు

1 comment:

  1. ""మతాన్ని తీసుకుని మంచితనాన్ని మాకివ్వు"

    ఒక ప్రక్క దేవుడిని వేడుకుంటూ, మరొక ప్రక్క మతంని త్యజించాలనుకోవటం అర్థం కాలేదు. మానవత్వ హీనమైంది మతం కాజాలదు.అది వ్యాపారం కావచ్చు. నిజమయిన మతానికి, వ్యాపారానికి ఎప్పుడు పొసగదు.మతాన్ని సైతం వ్యాపారం చేసారు.దానిని సమర్దిస్తున్నారు మత వ్యతిరేకులు.ఎందుకంటే వారికి మత నాశనం అవసరం.వీరి బరతం పత్తే వాడు ఆ భ్గవదవతారమే

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.