Pages

Friday, October 26, 2012

'వెర్రి ముదిరింది - రోకలి తలకి చుట్టండి' సామెత ఎందుకొచ్చిందో అర్థం అయింది

    కొన్ని వేల సంవత్సరాలుగా ప్రపంచమంతటా రావణాసురుడిని చంపినందుకు పండుగ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు కంచె ఐలయ్య గారికి మాత్రం రావణాసురుడు హీరోగా కనిపించాడు. 'మూలవాసీ రారాజు రావణాసురుడు' అని కితాబిచ్చారు. అసలు రావణుడు మూలవాసీ ఎలా అయ్యాడో, ఏ చారిత్రక ఆధారం బట్టి ఆ విధంగా నిర్ణయించారో ఎంత ఆలోచించినా అర్థం కాదు. రామాయణమంతా తిరగేసినా రావణుడు వెనుకబడిన మూలవాసీతెగకు చెందిన వాడని వాల్మీకి ఎక్కడా ప్రస్తావించలేదు. రావణుడు సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మ మునిమనుమడు. అందుకే రావణుడిని రావణబ్రహ్మ అని కూడా అంటారు. అంటే రావణుడు శూద్రుడు కాడు, బ్రాహ్మణుడు. సాటి బ్రాహ్మణుడిని దురుద్దేశ పూరితంగా కుట్ర చేసి చంపాల్సిన అవసరం ఏముంటుంది? కంచె ఐలయ్య గారి హ్రస్వ దృష్టి కేవలం ఈ ఒక్క ఉదాహరణ ద్వారా విశదమవుతుంది.

    రావణుడు స్వతహాగా మహాజ్ఞాని, వేదవేదాంగ కోవిదుడు, మహా శివభక్తి సంపన్నుడు. తన భక్తితో శివుడిని ఎన్నో సార్లు ప్రసన్నం చేసుకున్నాడు. అంత మాత్రం చేత రావణుడు గొప్పవాడు, ఆరాధ్యనీయుడు అయిపోడు. అతనికున్న దుర్గుణాల వల్ల మాత్రమే పతనం అయ్యాడు. ఈ సమావేశంలో ఐలయ్యగారు ''రాముడి కంటే రావణుడు నీతివంతమైన పాలన అందించాడని'' సెలవిచ్చారు. అంటే ఏ విధంగానో కూడా చెబితే బాగుంటుంది. రాక్షసుల్ని పాలిస్తూ, వారి దుర్మార్గాలని ప్రోత్సహిస్తూ, కేవలం తన జాతి వారనే అభిమానంతో వారు ఎటువంటి అన్యాయం చేసినా, వారిని కాపాడుతూ ఉండే నేటి రాజకీయ నాయకుల్లాగా పాలించాడు. అన్యాయాన్ని, అధర్మాన్ని ప్రోత్సహించే నాయకులు ఎవరైనా చివరికి పతనంకాక తప్పదు. అదే రావణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం.

    ఇక్కడ మరో ఉదాహరణ కూడా చెప్పవచ్చు. ఒక పెద్దమనిషి ఉన్నాడు. ఆయనకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఎంతో మేధావి, పాండిత్యం కలవాడు. గవర్నర్‌ స్థాయికి వెళ్ళాడు. కాని ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. చివరికి తన పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది. ఆయన పదవి కాని, అనుభవం కాని, తెలివితేటలు కాని ఏవీ ఆయన్ను కాపాడలేకపోయాయి. కేవలం అసభ్యంగా ప్రవర్తించినందుకే ఆయన అంత శిక్ష అనుభవించితే, పరాయి భార్యను అపహరించి, అధర్మంగా ప్రవర్తించి, తన తప్పు తెలుసుకోకుండా యుద్దానికి సిద్దపడ్డందుకే రాముడు రావణుడిని చంపాల్సి వచ్చింది. ఒక మనిషి ఎంత గొప్ప వాడయినప్పటికీ, అతని ప్రవర్తన మీదే అతని గౌరవం ఆధారపడి ఉంటుంది. డబ్బు, పలుకుబడి, హోదా ఇవేవీ మంచి గుణం లేనప్పుడు రాణించవు. అందుకే రావణుడు చరిత్రలో హీనుడయ్యాడు. ఇప్పుడు రావణుడిని ఆదర్శంగా తీసుకోవాలి అని గౌరవనీయ ఐలయ్య గారు ఏ విధంగా చెప్పారో ఆయనకే తెలియాలి.

    చరిత్రను తిరగరాసి, రావణాసురుడు, తాటకి, నరకాసురుడు, శూర్పణఖ వంటి వారి చరిత్రల్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఆయన శెలవిచ్చారు. ఇప్పుడు మనం ఉన్న ఈ చరిత్రలో రాజకీయ నాయకులు చేసిన, చేస్తున్న పనులు చూస్తుంటే, పురాణాలలో వర్ణించిన రాక్షసులే మేలనిపించేలా ఉన్నారు. అంత మాత్రం చేత అప్పటి రాక్షసుల చరిత్రల్ని, ఇప్పటి చరిత్ర హీనులయిన రాజకీయ నాయకుల్ని ప్రజలు పాఠ్యాంశంగా చదవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే, ఇప్పటి వరకు మనం సాధించిన నాగరికతకు, సంస్క ృతికి అర్థం లేకుండా పోతుంది.

    రాముడు కూడా ధర్మ సంస్థాపనార్థం యుద్ధం చేసాడే కాని, రాజ్య కాంక్ష కోసం యుద్ధం చేయలేదు. యుద్దంలో విజయం సాధించిన తరువాత కూడా లంకా రాజ్యాన్ని ఆయోధ్య సామంత రాజ్యంగా కలుపుకోలేదు. రావణుడి తమ్ముడు, ధర్మ బద్ధుడైన విభీషణుడిని చక్రవర్తిగా పట్టాభిషేకం చేసాడు. రావణ వధ అనంతరం యుద్ధభూమికి వచ్చిన మండోదరి కూడా తన పతిని చంపినందుకు రాముడిని శాపనార్థం పెట్టలేదు. ధర్మాన్ని విడవవద్దని చెప్పినా వినకుండా తన పతి చెఎప్పిన మాట విననందుకు ప్రాణం మీదకు తెచ్చుకున్నాడని విచారించింది. ఇదంతా రామాయణం చదివితే తెలుస్తుంది.

    రామాయణం కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని కోట్ల మందికి ఆరాధ్యనీయ గ్రంధం. అటువంటి కావ్యం మీద వ్యాఖ్యానించే ముందు, అందులోని పాత్రలపై తమ అభిప్రాయం వెలిబుచ్చే ముందు కొంచెం అధ్యయనం చేస్తే మంచిది. ఇదే మరో మతంలో చేస్తే ఏమయ్యేదో, ఎన్ని గొడవలకి దారితీసేదో అందరికీ తెలిసిన విషయమే. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, పోయేది మాట్లాడే వారి గౌరవమే. ఆకాశం మీదకి ఉమ్ము వేయాలని ప్రయత్నిస్తే, చివరికి జరిగేదేమిటో కూడా అందరికీ తెలుసు. కాని సమాజంలో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వారు ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడకూడదు. చేతనయితే సమాజంలో మరింత మంచిని పెంచడానికి ప్రయత్నించాలే కాని, విపరీత ఆలోచనల్ని రేకెత్తించకూడదు. మన కులం, మన ప్రాంతం, మన భాష... ఇలా 'మనోడు' అయినంత మాత్రాన వారు ఎన్ని తప్పులు చేసినా, ఎంతటి దుర్మార్గుడయినా వాడిని వెనకేసుకు రావాలా? ఆరాధించాలా? అలా చేస్తే సమాజం భ్రష్టు పట్టిపోతుంది. ఐలయ్య లాంటి వారు ఇకనైనా తమ సంకుచిత దృష్టిని వీడి, విశాల ప్రజాహితం కోరితే బాగుంటుంది.

16 comments:

  1. ఇది కొత్తేమికాదు రావణుడు కర్ణుడు , దుర్యోదనులను హీరోలను చేసి రామారావు ఎప్పుడో సినిమాలు తీశారు . చిన్న తేడ కంచే బడుగు జివి రామారావు బడా జివి

    ReplyDelete
    Replies
    1. అవి డ్రామాలు, ఇవి జీన్స్ వెతుక్కునే ప్రయత్నంలో ఓ అద్భుత ఆవిష్కరణ. ;)

      Delete
  2. ఇటువంటి ఐలయ్యలు చాలా మంది చరిత్రలో పేరు కూడా మిగలకుండా ....... అదంతే, ఏనుగు వెళ్ళేటప్పుడు....అరిస్తే ఎలా వుంటుందో ఇదీ అంతే.

    ReplyDelete
  3. రావణాసురుడు కంచె ఐలయ్య వాళ్ళ తాత. అంటే ఐలయ్య బ్రాహ్మణుడా?

    ReplyDelete
    Replies
    1. ఒట్టి బ్రామ్మడు కాదు, ఏకంగా బెమ్మ దేవుడి ముని మనమడు, అని సమజు సేసుకోవాలని హౌలయ్య ఇన్నపం. :)

      Delete
  4. ఈ కుక్క క్రిస్తియన్.వీడు టివి లో రాముడు దేవుడు కాదు, సైతాన్ అన్నాడు.హిందు దేవతల విగ్రహాలు పూజించ వద్దట.యస్ సి, యస్ టి, బి సి లు హిందువుల చేతిలొ మోస పోయారు, పోతున్నారట. వాడి ప్రకారం క్రీస్తు ని పూజించాలని పరోక్షంగా చెప్పాడు.మేము యస్ సి, యస్ టి, బి సిలము హిందువులం కాదా ? కుక్కా.నీకెవడు ప్రొఫ్ఫెసొర్ పదవి ఇచ్చాడురా? ఇప్పటి రాజకీయాల ప్రకారం వాల్మీకి (ఆయన చెప్పిన రామాయణమె తప్పనే, వీడు ఎంత అబద్దాలు వాగినాడొ తెలుస్తోంది), వ్యాసుల వారు యస్ సి, కృష్ణుడు (గొల్లవారిగ) బి సి. హిందూ మతం దేవతలు, ప్రముఖుల్లో పూజింపబదుతున్న వారు యస్ సి, యస్ టి, బి సి లు చాల మంది ఉన్నారు.జాంబవంతుడిని గౌరవించత్లేద ? శివ దేవుడు పంచముడు గా రాలేద శంకరాచార్యుల వద్దకు.అర్జునుని వద్దకు బోయ వాడి లా అవతరించి రాలేద.వీడిని నా దేవతలను అవమానించినందుకు,సైతానులన్నందుకు ఎవరన్నా చంపితే తప్పేమిటి? ఏవరన్న వీడి పెళ్ళన్నో, కూతుర్నో ఎత్తుకుపోతె అప్పుడు ఈంకెవడన్న్నా ఇంకేమన్న చేస్తే వీడు శాంతి వచనాలు చెప్తాడా లేక ప్రార్ధనలు చేస్తాడా? వీడు మద్దతు చేస్తున్న క్రైస్తవ మతం లో ఎంత మంది దేవుళ్ళు యుద్దాలు చేయలేదు, చంపలేదు. ఆమాయకపు హిందువులను రెచ్చగొట్టి ద్వేషం నింపి విదదీసె కుట్ర ఇది. మా దేవుళ్ళు ఎన్నడు కులము చూదలేదు, మతము చూదలేదు. తక్కువ చేయలేదు.శ్రి మహా విష్ణువు బలి ని చంపలేదు.ఆతని ఉత్తమగుణానికి మెచ్చి పాతాళ లోకానికి అధిపతిని చేయడమే కాక అంత పెద్ద దేవుడు ఆ బలికి గేట్ కీపర్ గా సేవకూదా చేశారు.నువ్వు పూజించమన్న రాక్షసులకు ముక్తిని ఇచ్చారు.రావణుడు విష్ణులొకం చేరినాడు.అతడు జయుడనే హిందూ మతం దెవతయే. ఒరే కుక్క నేను బి సి ని. నీ తప్పుదు మాటలు నమ్మము మేము. మా దేవుల్లు నీ దయ్యాల కన్నా నీ పర మతం కన్నా నువ్వు ఊహించలేనత మంచి వారు. నీ నొరు ముసుకుని కోర్చో.ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయదు? గాంధినో, పి యం నో ,రాష్ట్రపతి నొ తిడితెనే కేసులు పెద్తారే.దేశంలో అస్ద్తిరత, అసత్యాలు ద్వేషాలు పెంచు ​​తున్నదుకు ఏ కోర్టు అన్నా సు మో టో గా కేసు ఫైల్ చేయాలి వీడి మీద.

    ReplyDelete
    Replies
    1. ఇది బాగుంది, వాడు తనని తాను దేవుడంటే ఒప్పుకోరు, రాక్ససుల తాలూకు అంటే కూడా ఒప్పుకోరా? మరీ ఇంత అసహనమా?!
      "నేను హిందువునెట్లయిత?" అన్న మేతావి, తాను ఓ హిందూ గ్రంధాల్లో పేర్కొన్న రాక్షస సంతతిగా గుర్తించుకోవడం ముదావహం, ఏకీభవించాలి. అది తెలుస్తూనే వుంది. అలాంటి మేతావులకు కాణాచి అయిన వూస్ మేనియా ఘనత అజరామరం. వారి కీర్తి కంపు, అలా ఆచంద్రతారార్కమూ, దశదిశలా వ్యాపిస్తూనే వుంటుంది.

      /ఏ కోర్టు అన్నా సు మో టో గా కేసు ఫైల్ చేయాలి వీడి మీద/
      :)సుమోటో అంటే టాటా సుమో లాంటిది కాదు. :) కోర్టు తమంతట తాముగా వేసే కేసు, ఎవరో వేసేది కాదు అని అర్థం.

      Delete
    2. "ఒరే కుక్క నేను బి సి ని. నీ తప్పుదు మాటలు నమ్మము మేము.."
      super annaya nuvvu..bale cheppavu..


      Thanks,
      subrahmanya sharma

      Delete
  5. narakudu SrI hari sonta KoDuke kadA.kAni prajalaku narakam chupADu.AndukE Andariki manchi chEyAlani sonta koduku nE chapmaru.
    Tataki yas si yas ti bi ci brahmalu ani chudakunaDA andaru Manushulanu tinnadi kada. Raajyam antA prajalu leka adavi ayyindi kadaa dAni valla. iLanti vALLanu pUjinchamanE vaLLnu emi cheYalo ade purAnAllO rakshasulu dEvatalanu Kaka prajalu tamanu pUjinchamani bhayapetti, himsinchinappudu spahstamgA chepparu. veeDu kUDA rAkshasudanukunTunnADugaa.

    ReplyDelete
  6. ప్రస్తుతం పిచ్చి సిద్దాంతరూపాలుగా విస్తరిస్తున్నది. పిచ్చికుక్కలదగ్గర శాస్త్రచర్చలు పనికి రావు వాటికోసం వాడవలసిన భాష, చేపట్టవలసిన చర్యలు వేరే ఉంటాయి

    ReplyDelete
  7. I think unnecessarily we are giving much importance to the telugu media... that's why disgusting-useless topics like these are coming in to the picture!!

    రావణాసురుడు బ్రాహ్మణునికి రాక్షసికి పుట్టిన సంకరజాతి ( Hybrid ) వాడు ... అతడిది ఏ జాతీ కాదు.

    -satya

    ReplyDelete
    Replies
    1. Satya,

      How? Rakshas are cross breed? Would explain your definition of cross breed?
      Diti & Aditi were daughters of Daksha Prajapati, son of Brahma married to Kashyapa.

      Delete
  8. పూటకో మనిషిని తన పలహారంగా పాకశాలలో వేయించుకు తినే వీడు ఇలయ్యకు ఆదర్శుడా? పరాయి స్త్రీ కనిపిస్తే చాలు తనపక్కలోకి యెత్తుకుపోయే ఈ తొత్తికొడుకు వీడికి ఆరాద్య దైవమా? ఒప్పుకుంటే వుంచుకుంటాడు, లేకపోతే నంజుకుంటాడు.వీడు గొప్పవాడు.ముల్లోకాలను ముప్పుతిప్పలు పెట్టి,సాధుజనులకు,మానవులకు,మునులకు నిద్రలేకుండా చేసిన వీడిని మట్టికరిపించిన రాముడు వీడికి శత్రువా? రామాయణ భారతాలకు కూడా కులపిచ్చి అంటగట్టే అంట్లగాడికి మీడియా కూడా వత్తాసుపలకడం చోద్యంగా ఉంది.

    ReplyDelete
  9. ప్రియమైన సోదరులారా , అందరు ఎవరికీ తోచింది వారు చాల బాగా చెప్పారు. "రామాయణం" కాని "నేను హిందువునెట్లయిత?" కాని రెండు కుడా గ్రంధాలే . ఒకటి వాల్మికి గారు వ్రాసారు ,రెండవది కంచ ఐలయ్య గారు వ్రాసారు. మనం చదివే పద్ధతి మీద అర్థం తెలుస్తుంది రచయిత యొక్క భావం. నమ్మకంతో చదివితే అ పుస్తకాలలో ఏముందో అదే నిజం అనిపిస్తుంది కాని కారణంతో కాని నీ మనసు వేశ్లేసనత్మకంగా చదివితే ఏది నిజం ఏది అబద్దం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది . రెండు పుస్తకాలు ఒకే ధోరణిలో చదవాలి కాని చాలామంది అల చెయ్యరు . రామయనంను కారణంతో కాని నీ మనసు వేశ్లేసనత్మకంగా చదివితే రావణుడు అహింస వాది గాను రాముడు హింస వాది కనిపిస్తాడు. ఎలాగంటే రాముడు మరియు లక్ష్మణుడు కలిసి సుర్పనఖ యొక్క ముక్కు కోసి ఒక ఆడవారి మీద హింస ప్రవృత్తి అని చెప్పవచు , అదే ఈరోజు అయితే మహిళాలోకం రాముని కటకటాల పలు చేసే వారు. అదే రావణుడు చిసింది చుస్తే , సీతా ని అపహరించినాడు (kidnap ) చేసాడు తన చెల్లె కి చేసిన అపమానానికి , కాని సీతా మీద ఎలాంటి మాన , ప్రాణాలను , శారీరక హింసలు కాని పెట్టలేదు , రావణుడు ఒక ప్రజాసామ్య పాలనను పాలించాడు కాబట్టి మహిళలకు ఉద్యగాలు ఇచ్చినాడు ఆరోజులలో , లంకిణి ఒక security officer , ఆమెను చంపి లంక కాలు పెట్టినారు , అంటే మహిళలను హిమ్చ్సించే నాటే .
    ఫై విధనగా ఎవరికీ తోచింది వారు చెప్పడానికి ఒక కారణం వుంది నీను ఎవరిని తప్పు పట్టాను ఎందుకంటే మనం చదేవే చదువు మీద బ్రాహ్మన్ వాదాం రుద్దబడి వుంది . మనిషి మనిషి గ బతకండి , ఎ పుస్తకమైన నమ్మకం తో చదవకండి , మీ మనసు తో వేశ్లేసనత్మకంగా చదివితే ఏది నిజం ఏది అబద్దం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది . జై భీమ

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. ఒక మతం లో ఉంటూ, ఒక మతానికి సంబందిచి Sheppard (పశువుల కాపరి) గా ఉంటూ, వేరే మతానికి సంబంధించిన కులాల మీద విడి విడి గా దాడి చేస్తూ అంతర్లీనంగా హిందూ మతం మీద కంచ ఐలయ్య గారు దాడి చేయటం గర్హనీయం.

    ఇది ఉగ్రవాడుల బౌతిక దాడుల కన్నాప్రమాదకరమైన సంకేతం. గౌ||కంచ ఐలయ్య గారికి సంబందించిన మత పెద్దలు కుడా అతని దోరణిని కండించవలసిన పరిస్టితి ఉంది.

    ఫైగా ప్రస్తుతం ఒక వైశ్య కులానికి చెందినవారు మాత్రమే కాకుండా, హిందూ మతస్తులందరూ కండించవలసిన విషయం

    కొన్ని కులాలు కలిస్తే ఒక మతం అని చదువుకున్నాం! మనది మానవతా కులం అనుకున్నాం!

    ఒక కులాన్ని గాని మతాన్ని గాని విమర్శించే హక్కు ఎవరికుంది, కనీసం ఆ కులం కాదు మతం అంతకన్నా కాదు,
    నువ్వెలా విమర్శిస్టావ్!

    కులాలు వేరైనా మతం ఒక్కటే!!!

    నీది కాని మతం గురించి నీకేల, ఇదేనా విద్యాదికులు చేయవలసిన పని, హిందూ మతం లోని ఒక కులం గురించి అన్యేతరులు మాట్లాడటం అసమంజసం.

    దేశం లో అత్యదికులు ఉన్న ఒక హిందూ మతం లోని ఒక కులం గురించి నువ్వు ఎలా మాట్లాదతావ్!!!

    ఎంత మంది మనసులు నోచుకున్తున్నాయో తెలుస్తుందా!!

    ఇది తెలియని వారు విజ్ఞులు ఎలా అవుతారు మీరే ఆలోచించండి.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.