దైవం ఎవరు? దైవత్వం అంటే ఏమిటి? అంటే, అందుకు నా సమాధానం దైవం, దైవత్వం అనుభవించాల్సినవే గాని నిర్వచనానికి అందేవి కావు.
దైవం తిరుగులేని సంపూర్ణ శక్తి. మన కళ్ళ ఎదురుగా కనిపించే అన్ని అంశాలూ ఆ శక్తి నుండే వచ్చాయి. చివరికి ఆ క్రమంలో మానవులమైన మనం కూడా. ఇవన్నీ వస్తాయి... పోతుంటాయి. నేడు చూసినవి రేపు కనిపించవు. ఇటువంటి అశాశ్వతాలన్నీ ఆ శాశ్వతం నుండి వచ్చి మళ్ళీ అందులోనే చేరతాయి. అదే దైవం. ఆ శక్తే దైవత్వం.
ఆ తర్వాతి ప్రశ్న దేవుడు ఎవరు అనేది. తనకన్నా శక్తివంతమైనది. తన చర్యలన్నింటినీ శాసించేది, తనకు తెలియని వాటినన్నింటినీ తెలిసిన ఒక మహత్తర శక్తికి మానవుడు ఇచ్చిన పేరు భగవంతుడు.
ఆ పదం ఇచ్చి, ఆ తర్వాత దానిని నిర్వచించే యత్నం చేశాడు. ఆ భగవంతుని చుట్టూ అర్థం లేని అంశాలు జోడించాడు.
నేను చూపించిన వారే భగవంతుడు, అదే విశ్వసించాలి అంటూ నా బాల్యంలో బోధనలు చేసి నన్నొక నాస్తికురాలిగా మారేంతగా హింస పెట్టారు.
భారతదేశం వచ్చిన తరువాతే భగవత్ తత్వం నాకు అర్థమైంది. భగవంతుడు విశ్వవ్యాప్తి చెందిన వాడు. మానవుడి పరిణామానికి ముందే ఉన్నది దైవత్వం. మానవుడు అంతమైనా ఆ దైవత్వం ఉంటుంది. ఆ విషయం అర్థం చేసుకుని ప్రజలందరినీ దైవత్వం వైపు మరల్చేందుకు ఏర్పరచినవి మందిరాలు. అందులోని విగ్రహాలు కేవలం రాతి బొమ్మలు కావు. అటువంటి బొమ్మలు బయట మనకెన్నో కనిపిస్తాయి. కాని వాటిలో దైవత్వం కనిపించదు.
ఆ విగ్రహాలలో నిక్షిప్తం చేయబడిన ఒక మహత్తర శక్తి దైవత్వం. మహనీయులే ఆ ప్రతిష్ట చేయగలరు. అందులోని శక్తి స్వచ్ఛమైనది. వాస్తవమైనది. మానవుడు పూజలు చేయవలసింది ఆ శక్తికి. గ్రహించవలసింది ఆ శక్తిలోని భాగాన్ని.
ఆ దైవమే మనుషులకు సరైన మార్గం చూపుతుంది. మానవుడిని ధర్మబద్దమైన జీవితంలో నడిపించగలిగిన శక్తి స్వరూపానికి బద్దులై జీవించడం అలవరచుకోవాలి.
- మదర్ (అరవిందాశ్రమం)
(స్వాతి వారపత్రిక 29-6-2012 సంచికలో ఊపర్‌వాలా శీర్షిక నుండి గ్రహీతం)

చక్కటి పోస్ట్ ను అందించినందుకు ధన్యవాదాలండి.
ReplyDeleteమదర్ బుక్స్ చదవండి చాల బావుంటాయి
ReplyDelete