అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం.. అని సినీ కవి వ్రాసాడు. నిజమే.. అందం లేకపోతే ఆనందమే లేదు. ఆనందం లేకపోతే ఇక ఆ జీవితానికి అర్థం ఏముంది? అందానికి మానవ జీవితంలో ఎంతో ప్రాధాన్యముంది. అందంగా ఉండాలని కోరుకోని వారెవరుంటారు? ఊహ తెలిసినప్పటి నుండి, ముసలి వారి వరకు అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు ఆరాటపడిపోతూంటారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చరిత్ర కందని కాలం నుంచీ అందం గురించి ప్రయత్నాలు మొదలయ్యాయంటారు, చరిత్రకారులు. చరిత్రనే ఎన్నో మలుపులు తిప్పిన ఘనత అందం సొంతం. అలనాటి రాణి క్లియోపాత్రా ప్రపంచ అందగత్తె అనిపించుకోవడానికి చేయని ప్రయత్నం లేదట. అంతటి అందగత్తెగా ప్రసిద్ధి గాంచడం వల్లనే కదా ఈజిప్టుకు అన్ని యుద్ధాలు వచ్చాయి. చివరికి సామ్రాజ్య పతనానికి దారి తీసాయి. ముంతాజ్ బేగం అందానికి దాసోహమవడం వల్లనే షాజహాన్ చరిత్రలో మరపురాని అద్భుత కట్టడం 'తాజ్‌మహల్'ని నిర్మించాడు, ప్రపంచానికి కానుకగా ఇచ్చాడు. భాగమతీ దేవి అందానికి సుల్తాన్ ముగ్దుడవ్వకపోతే హైదరాబాద్ నగరమే వెలిసి ఉండేది కాదు. 'ఆ రాణి ప్రేమ పురాణం, ఈ ముట్టడి కయిన ఖర్చులు... ఇవేవీ కావోయ్.. చరిత్ర సారం' అని మహాకవి ఎంత గింజుకున్నా చరిత్రలో అందం స్థానం అందానిదే.
కావ్యాలలో నాయిక అందాన్ని, అంగాంగ సౌందర్యాన్ని వర్ణించడానికే కవులకు ఎన్నో తాళపత్రాలు కేటాయించేవారు. శృంగార నైషధంలో కవి శ్రీనాధుడు, వారకాంతల అందాన్ని రసవత్తరంగా వర్ణిస్తాడు. శ్రీకృష్ణ దేవరాయలు తన ఆముక్త మాల్యదలో పల్లె పడుచుల అందాల్ని మాటల దోబూచులాటలలో చక్కగా, రసరమ్యంగా అభివర్ణిస్తాడు. అందరూ మానవ కాంతల అందాన్ని పొగిడితే, పోతన మాత్రం వీరికెవరికీ తీసిపోకుండా అందానికే అసూయ కలిగించే అంతటి అందగాడైన శ్రీకృష్ణుడు తన భాగవతంలో వర్ణిస్తాడు. 'నల్లని వాడు, పద్మనయనంబుల వాడు, కృపా రసంబు పైజల్లెడు వాడు..... చెల్వల మానధనంబు దోచెనే, మల్లియలార, మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే' అంటూ కృష్ణుడు అందాన్ని కళ్ళకు కట్టినట్టుగా వర్ణిస్తాడు. ఇక అన్నమయ్య కీర్తనలలో వేంకటేశ్వరుని అందాన్ని పొగుడుతూ ఉండే కీర్తనలే ఎక్కువ. 'ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు' అంటూ బాల కృష్ణుని అందాన్ని వేడుకగా నోరారా కీర్తించాడు. ఆదిశంకరాచార్యులు 'సౌందర్య లహరి'లో సృష్టి అంతటా నిండి ఉన్న జగజ్జనని సౌందర్యాన్ని మనోహరంగా చాటారు.
ఇదంతా బాగానే ఉంది. మరి అసలు అందం అంటే ఏమిటి? ఆధునిక కాలంలో, పాశ్చాత్య సంస్కృతిని వేలం వెర్రిగా అనుసరించే వారిలో అందం పట్ల దృక్పధం మారిపోతోంది. అందాన్ని కూడా మిగిలిన భౌతిక వస్తువుల మాదిరిగానే కొలతల్లో బంధించే సంస్కృతి ఇప్పుడు బాగా ప్రబలింది. అందాల పోటీల పుణ్యమా అని ఇపుడు ప్రతి అమ్మాయి అందంగా కనబడాలని ఆరాట పడిపోవడం చూస్తున్నాం. అమెరికా నుంచి అమలాపురం వరకు ప్రతి ఊళ్ళోను అందాల పోటీలు జోరుగా సాగిపోతున్నాయి. వీటికి ఊతం ఇస్తూ, ప్రతి ఊర్లోను, ఆ మాటకొస్తే, ప్రతి సందులోను బ్యూటీ పార్లర సంఖ్య పెరిగిపోయింది. ఎంత ఖర్చయినా పర్వాలేదు - అందంగా కనబడాలనే యువతులు / యువకుల సంఖ్య పెరిగిపోతోంది. అమ్మాయిలయితే జీరో సైజ్ - బ్యూటీ పార్లర్లు, అబ్బాయిలయితే సిక్స్ ప్యాక్ - జిమ్‌లు.. అంతే తేడా. ఇక వీధుల నిండా, గోడల నిండా, పత్రికలు, టి.వి.లు, సినిమాలు 'ఎందెందు వెతికిన అందందే గలడు చక్రి సర్వోపగతుండు' అని పోతన సెలవిచ్చినట్లు, ఇక్కడా అక్కడా అననేమి? ప్రతి చోటా అందాల ఆరపోతలే. అంగాంగ ప్రదర్శనలే. హీరో హీరోయిన్ల దగ్గర నుండి కాలేజీకి వెళ్ళే పిల్లల వరకు ఎవరు ఎంత చిన్న బట్టలు వేసుకుని, ఒళ్ళు కనబడేలా చేసుకుంటే వాళ్ళు అందగత్తెలు / అందగాళ్ళుగా చలామణి అయిపోతున్నారు. ఈ పిచ్చి బాగా ముదిరి లేపనాలు, ఔషధాలతో సరిపెట్టుకోకుండా, సర్జరీల వరకు వెళ్ళింది. అందానికి పైపై మెరుగులు దిద్దుతామంటూ మొదలుపెట్టిన ప్లాస్టిక్ సర్జన్లు రెండు చేతులా హాయిగా సంపాదిస్తున్నారు. పర్సు, ఒళ్ళు రెండూ గుల్లయిపోయినా ఎవరూ లెక్కచేయడం లేదు.
నిజానికి అందమనేది భౌతిక పరమైనది కానే కాదు, పైపై సోకులతో అందరికీ ప్రదర్శించేది కాదు. అందం ప్రధానంగా మానసికమైనది. రాముడు నల్లని వాడే, కాని రాముడంటే ఎంతో అందగాడు. మందస్మిత వదనారవిందుడు. అంటే ఎప్పుడూ చిరునవ్వు పెదవులపై తారాడే మోము కలవాడు. వినయ సంపన్నుడు, విలువల పట్ల అపారమైన నమ్మకం కలవాడు, ఆడిన మాటను తప్పని వాడు. అందుకే రామయ్య వెంట జనం పరుగులు తీసారు. మనసుల్ని రమింపచేసేంతటి అందం కలిగిన వాడు కాబట్టే ఆయన రాముడయ్యాడు. బోసి నవ్వుల గాంధీ తాతలో ఏ అందం ఉందని? ఆ నిష్కల్మష యోగి ఏ మేకప్ వేసుకున్నాడని... ఆడవారు తమ ఒంటి మీద నగలను ఆయన జోలిలో వేసేవారు? ఆ ముఖంలో ప్రతిఫలించింది మనసులో ఉన్న ఆత్మ సౌందర్యం. అదే కోట్లాది భారతీయులను ఒక్క తాటిపై నడిపించింది. మదర్ థెరిసా అందాన్ని, ఆమెలో కొట్టొచ్చినట్టు కనిపించే సేవా భావ సౌందర్యాన్ని కొలవగలిగే కొలతలు ఉంటాయా? ప్రపంచమంతా ఆమె సేవలను ఎందుకు గుర్తించింది? ఇక్కడ కూడా సమాధానం ఆత్మ సౌందర్యమే.
భౌతిక సౌందర్యానికి కొన్ని పరిమితులున్నాయి. అది అశాశ్వతమైనది. ఈ రోజు మిస్ యూనివర్స్ అవ్వచ్చు. రేపు ఆమె ముఖం ఎవరూ గుర్తించరు. ఎందుకంటే సంవత్సరం తిరిగేసరికి మరో కొత్త మిస్ యూనివర్స్ తయారు. ఈ రోజు టాప్ హీరోయిన్ అవ్వచ్చు, రేపు ఏజ్ బార్ అయ్యాక ముఖం చూసే వాళ్ళే కరువు. ఎప్పటికీ తరిగిపోనిది ఆత్మ సౌందర్యం మాత్రమే. నమ్మిన విలువల్ని కాపాడుకుంటూ, పది మందితో మంచితనాన్ని పంచుకుంటూ, లోక కళ్యాణం కోసం పాటుపడే వాళ్ళది నిజమైన ఆత్మ సౌందర్యం. అది ఎన్నటికీ వాడిపోదు, ఎవరు వచ్చినా దాని గొప్పతనం పోదు. ఎవరు ఎంత అందంగా ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవరు మంచి దారిలో వెళతారో, ఎవరు పది మందికి వెలుగు చూపిస్తారో, ఆ వెలుతురులోనే వాళ్ళ సౌందర్యం ప్రకాశిస్తుంది... తర తరాల వరకు, యుగ యుగాల వరకు. అదే నిజమైన అందం.. అలాంటి అందమే మనసుకి నిజమైన ఆనందం.

Good post. chaalaa baagaa cheppaaru.
ReplyDeleteNice post!
ReplyDeleteI like your blog very much. Good post.But you also mentioned that "Tajmahal was by sajahan". But its not true.
ReplyDelete