అవినీతిపై అన్నా హజారే సంధించిన దీక్షాస్త్రం - కోట్లాది భారతీయుల గుండె గొంతుకులను ప్రతిబింబించింది. ఈ పోరాటాన్ని రెండో స్వాతంత్య్ర పోరాటంగా అన్నా అభివర్ణించడాన్ని ఎవరూ తప్పుబట్టలేరు. ఎందుకంటే 1947లో మనకు రాజకీయ స్వాతంత్య్రం లభించిననాటి నుండి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి చూసుకుంటే - మిగతా దేశాలతో పోల్చిచూసుకుంటే అది అసలు అభివృద్ధే కాదు. ఇంకా సామాన్య ప్రజల జీవితాలు అలా సామాన్యంగానే ఉండిపోయాయి. మౌలిక సదుపాయాల కల్పన కూడా - అంటే సరైన రోడ్లు, తాగడానికి మంచినీరు, నాణ్యమైన విద్యుత్తు వంటి అనేక అవసరాలు దేశంలో అధిక శాతం మందికి అందుబాటులో లేవు. నేడు దేశం ఉన్న ఈ దుస్థితికి అవినీతి మాత్రమే సంపూర్ణ బాధ్యత వహించాలి. దేశంలో సహజవనరులకు గాని, మేధో వనరులకి గాని, శ్రామిక వనరులకి గాని ఏలోటు లేదు. అయితే ఈ వనరులన్నీ దోపిడీకి గురవుతున్నాయి. సృష్టించబడిన సంపద అంతా కేవలం కొద్దిమంది చెప్పు చేతల్లోకి వెళ్ళిపోతోంది. నిజమైన కష్టం పడే సామాన్యుడికి, మధ్య తరగతి జీవులకు ఎటువంటి అదనపు సౌకర్యాలు అందడం లేదు. అన్నా చెప్పిన మాటల్లోని ఆంతర్యం ఇదే. అవినీతి వటవృక్షానికి మూల స్థంభాలు అధికారాన్ని చెలాయిస్తున్న రాజకీయ నాయకులు, అధికార గణం - వారి అనుచర - బంధు గణాలు మాత్రమే. జనలోక్‌పాల్ బిల్లుతో అవినీతిని అరకట్టగలమా - అంటే దానికి పూర్తిగా కాదు అనే సమాధానమే వస్తుంది. అది అందరికీ తెలిసిన సత్యమే - కాని 'చీకటిని తిడుతూ కూర్చునే కంటే - చిరుదీపం వెలిగించాలి' అన్నట్లుగా ఎవరూ చేయలేని పనిని 77 ఏళ్ళ ఒక 'యువకుడు' సాధించబూనడం, పోరాటపటిమతో ముందుకు నడవడం చూసి, దేశంలో యువత అంతా 'మీ వెనుక మేమున్నాం' అంటూ కదం తొక్కుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంచితే అసలు అవినీతికి మూల కారణాలేమిటి? అని ఆలోచిస్తే సందర్భోచితంగా ఉంటుంది.
1. రాజకీయ కారణాలు: అవినీతికి మూల కారణాలు మన దేశ చరిత్రలోనే ఉన్నాయి. దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చిందని అందరూ అనుకుంటూ ఉంటారు. కాని అప్పుడు మనకు లభించింది కేవలం రాజకీయ - అధికార మార్పిడి మాత్రమే. భారతదేశాన్ని కొల్లగొట్టడానికి బ్రిటీష్ తెల్ల దొరలు చేసుకున్న చట్టాల్నే - భారతీయుల్ని ఇబ్బందుల పాలు చేయడానికి వారు తయారు చేసిన శిక్షాస్మృతుల్నే మనం యధాతథంగానో, కొద్ది పాటి మార్పులతోనే మన నల్ల దొరలు కూడా అనుసరిస్తున్నారు. మన దేశం యొక్క సామాజిక, ఆర్థిక పరిస్థితులకు తగిన విధంగా పరిపాలనా విధానాన్ని, అధికార యంత్రాంగాన్ని మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది.
దానికి తోడు భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ హయాంలోనే మొదటి అవినీతి ఘట్టం వెలుగుచూసి, పార్లమెంటును కుదిపేసింది. దీనిని వెలుగులోకి తీసుకువచ్చింది కూడా ఆయన అల్లుడు, ఇందిరా గాంధీ భర్త అయిన ఫిరోజ్ గాంధీయే. భారతీయ సైన్యానికి జీపులు కొనుగోలు చేసినపుడు భారీస్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి కారణం - మన మొదటి ప్రధానమంత్రి - మంత్రివర్గానికే భారతదేశం పట్ల ప్రేమ లేకపోవడం. దానికితోడు మన దేశానికి స్వాతంత్య్రం పోరాటం ద్వారా వచ్చి ఉంటే ఆ కసి, పట్టుదల వేరే విధంగా ఉండేవి. ఒక సమాన్యుడు నాయకుడు అయి ఉంటే - జనం బాధ ఆయనకు తెలిసేది. ఒక ఫ్రెంచి విప్లవం కానివ్వండి - ఒక రష్యన్ విప్లవం కానివ్వండి - ఒక జపాన్ పునర్నిర్మాణం కానివ్వండి - ఇవన్నీ ప్రజల కష్టాల నుండి, వారి బాధల నుండి పుట్టాయి - జనంలోంచి వచ్చిన నాయకుల్ని తయారు చేసాయి. వారి దేశాలను ఆ స్థాయిలో నిలబెట్టాయి. కాని, పుట్టుకతోనే ఒక కోటీశ్వరుడిని - వ్యసనపరుడిని - స్త్రీలోలుడిని దేశ ప్రధాన మంత్రిగా చేయడం వల్ల సామాన్యుల బాధలు ఆయనకు తెలియకుండా పోయాయి. మనకు 1947లో జరిగింది అధికార మార్పిడి మాత్రమే - నిజమైన స్వాతంత్య్రం కాదు.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే - చట్టసభలకు పోటీ చేసే వ్యక్తుల విషయంలో ఎటువంటి నిబంధనలు లేకపోవడం. అప్పట్లో గాంధీగారి మాట విని చదువులు మాని, స్వాతంత్య్ర పోరాటంలో అందరూ పాల్గొన్నారు కాబట్టి, నాయకుల విద్యాస్థాయి విషయంలో ఎటువంటి నిబంధలు విధించలేదు అంటారు. కాని వాస్తవం పరిశీలిస్తే ఆనాడు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారిలో ఎంతో మంది విద్యాధికులు ఉన్నారు. కేవలం పరిపాలన విషయంలో అటువంటి వారు అడ్డం కాకూడదని, - మనం చెప్పినట్టు వినే అలగా జనం, పామర జనం అయితే మన అధికారానికి ఎటువంటి అడ్డంకులు ఉండవని, రాజ్యాంగ తయారీలోనే అటువంటి నిబంధనను కావాలనే నెహ్రూ ప్రభుత్వం చేర్చలేదని సులభంగా గ్రహించవచ్చు. మరొక ముఖ్యమైన నిబంధన - రాజకీయాల్లో ఉండే వ్యక్తి ఎన్ని సంవత్సరాలైనా అదే పదవిని పట్టుకుని వేళ్లాడవచ్చు. అది కూడా నెహ్రూ తనకు అనుకూలంగా చేసుకున్న చట్టమే - అదే అమెరికాలో అధ్యక్ష పదవికి కేవలం రెండు సార్లు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంటుంది. అధ్యక్షుడు ఎంత సమర్థుడైనప్పటికి మూడో అవకాశం ఇవ్వరు. కొత్త నీరు రావాల్సిందే - కొత్త ఆలోచనలు ఉరకలెత్తవలసిందే - అప్పుడే దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడానికి అవకాశం లభిస్తుంది. ఒళ్ళంతా రోగాలు పెట్టుకుని, సరిగా నడవలేని, కళ్లు కూడా సరిగా కనబడని వారు కూడా ఈనాడు మన నాయకులే - ఎంత దౌర్భాగ్యం? ఈ నిబంధనల వల్లే అధికారం - పదవి అనేది ఒక ఇంటి వారసత్వంగా మారిపోయింది. లేకపోతే ఇంత పెద్ద దేశంలో మనకు యువ నాయకులే లేకుండా పోయారా? ఉన్నారు - కాని యువతకు అవకాశం ఇవ్వకుండా, ముసలివాళ్ళే ఎప్పటికీ అధికారంలో ఉంటే ఇక యువతకు రాజకీయాల్లో పాల్గొనాలనే ఆసక్తి ఎందుకుంటుంది?
2. సామాజిక మార్పులు: అవినీతికి మరో ముఖ్య కారణం - మనలో ఈ దేశం మనది అనే భావన లేకపోవడం. భారత దేశ చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్న హిందువులు - కొన్ని వందల సంవత్సరాలుగా ఇతరుల చేతిలో దోపిడీకి గురవుతూనే ఉన్నారు. 13వ శతాబ్ది నుండి ముస్లింలు, 17 శతాబ్ది నుండి క్రైస్తవుల చేతిలో దేశం పూర్తి దోపిడీకి గురయ్యింది. దాని వల్ల ఆర్థిక అభద్రతాభావం భారతీయులలో పేరుకుపోయింది. అది వారి అలవాట్లలో గమనించవచ్చు. దొరికినప్పుడే ఎక్కువ తినేసి - తిండి లేనపుడు పస్తు పడుకోవడం అనే భావన భారతీయుల్లో అంతర్లీనంగా ఉంది. అదే భావనతో అవకాశం దొరికినపుడే దోపిడీకి బరితెగిస్తున్నారు. తమకు అవసరం ఉన్నా లేకపోయినా వేల - లక్షల కోట్ల రూపాయిలు దోచేస్తున్నారు. దీనికి సరైన విద్యావకాశాలు లేకపోవడం కూడా ఒక కారణం - ముందు భారతీయులందరినీ కుల, మత, భాషా బేధం లేకుండా చైతన్య పరచగలగాలి. వక్రీకరించబడిన చరిత్ర కాకుండా, ఉన్నదున్నట్లుగా చరిత్రను భారతీయుల ముందు ఉంచాలి. మన శక్తి మనకు తెలిసేలా - దేశం పట్ల, తోటి సమాజం పట్ల బాధ్యత తెలిసేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. భూకంపం, సునామీ వంటి దారుణమైన విపత్తులు వచ్చినపుడు కూడా క్యూలో నుంచుని, రేషన్ తీసుకున్న జపాన్ సమాజం మనకు ఆదర్శం కావాలి. వారి క్రమశిక్షణ మనకు స్ఫూర్తిని కలిగించాలి. ఎదుటి వాడిది ఏ విధంగానైనా కాజేయాలనే స్వార్థమే అవినీతికి మూల కారణం.
3. చట్టాల్లో మార్పులు: అన్నా హజారే కోరుతున్నదీ ఇదే. గ్రామ సర్పంచ్ దగ్గర్నుండి - ప్రధాన మంత్రి వరకు అవినీతికి పాల్పడే వ్యక్తి ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా సరే - వారు కఠినంగా శిక్షించబడాలి. ధన సంపాదనకు రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఒక మార్గం కాదని అందరూ గ్రహించాలి. అవి ప్రజలకు సేవ చేయడానికి లభించే అవకాశంగా తెలియరావాలి. ప్రజలకు మంచి చేయాలి తప్పితే వారి సొమ్మును కొల్లగొడదామనుకుంటే చట్టం చూస్తూ ఊరుకోదనే భావన సమాజంలో కల్గించాలి. వీటితో పాటుగా కుల సంఘాలని రద్దు చేయాలి, ప్రాంతీయవాదాల్ని మొగ్గలోనే తుంచేయాలి. మతం పేరు చెప్పి విధ్వంసం సృష్టించేవారిని నామరూపాలు లేకుండా చేయాలి. నేతలతో పాటుగా దేశ సమగ్రతకు ముప్పు తెచ్చే ప్రతీ ప్రాంతీయ శక్తిని, కుల, మత శక్తుల్ని అదుపులోకి తీసుకుని కఠిన శిక్షలు విధించాలి. అప్పుడే అవినీతి సమూలంగా అంతమవుతుంది.
అన్నా చెప్పిట్లుగా ఇది నిజంగా రెండో స్వాతంత్య్ర సంగ్రామమే. దేశ రాజకీయ, అధికార, సామాజిక, ఆర్థిక రంగాల్లో, ప్రజల మనస్తత్వాలలో సమూల ప్రక్షాళన జరగవలసిన సమయం ఆసన్నమయింది. 77 ఏళ్ల యువకుడు నడిపిస్తున్న ఈ పోరాటానికి మద్దతు తెలపవలసిన నైతిక బాధ్యత మనందరి పైనా ఉంది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు అని హజారే అన్నట్లుగా ఇదొక సువర్ణావకాశం - జారవిడుచుకుంటే మళ్లీ రాదు. అందుకే - జై అన్నా హజారే.

Well, I agree
ReplyDeleteyou are correct, i support Anna
ReplyDeleteచాలా బాగా చెప్పారు.
ReplyDeleteపౌర సమాజ సభ్యుడు అన్నా హజారేకు మద్దతు ప్రకటించుదాం, అవినీతిని భారతదేశం నుంచి తరిమి వేద్దాం ....
ReplyDelete