దేశ ఆర్థిక రాజధానిపై ఉగ్రవాద రాక్షస మూకల దాడుల పరంపరలు కొనసాగుతూనే ఉన్నాయి. జూలై 13వ తేదీన సంభవించిన పేలుళ్ళు కేవలం పాత ఘటనలకు కొనసాగింపు మాత్రమే. ఇంకా ఇటువంటి అకృత్యాలు ఎన్నో చూడాల్సి రావచ్చు. అది ముంబయిలో కావచ్చు, హైదరాబాద్‌లో కావచ్చు, మరెక్కడైనా కావచ్చు. కాని బలయ్యేది అమాయక ప్రజలు మాత్రమే. ఇటువంటి సంఘటనలు జరిగినపుడు మీడియా వాళ్ళకి పండగే పండగ. చూపించిందే చూపించి, చెప్పిందే చెప్పి, జనాల్ని భయపెడుతూ ఉంటారు. న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి జరిగినపుడు కూడా విమానాలు భవనాల్ని కూల్చివేయడం మీడియాలో వచ్చిందే తప్ప, అక్కడ చనిపోయిన వారి మృతదేహాల్ని క్లోజప్‌లో చూపించి, భయపెట్టినట్లు గుర్తులేదు. కాని మన మీడియాలో మాత్రం పొద్దున్నే లేచి ఏ పేపర్ తిరగేసినా ముందు పేజీలో భారీ సైజులో రక్తసిక్తం చేసిపారేసారు. మీడియా కొంచెం సంయమనం పాటిస్తే బాగుండును.
ఎప్పటిలాగే పేలుళ్ళు జరిగిన వెంటనే ప్రధాని, కేంద్ర రక్షణ మంత్రి - మహారాష్ట్ర సిఎంతో ఫోన్‌లో మాట్లాడేసారు. హోంమంత్రిగారు ఇది ఉగ్రవాదుల దుశ్చర్య అని శెలవిచ్చారు. ఇంచుమించు అన్ని రాజకీయ పార్టీలు ఇది దురదృష్టకర సంఘటన అంటూ తీవ్రంగా ఖండించేసారు (దేనితో ఖండించారో నాక్కూడా తెలియదు). కాని ఎవరి నోటి వెంటా కూడా ఈ చర్యకు పాల్పడ్డ ఉగ్రవాదుల్ని వెంటనే ఏరిపారేస్తాం (విచారణ లేకుండా) అని మాత్రం అనడం లేదు. బిన్‌లాడెన్ విషయంలో అమెరికా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ప్రపంచానికి మార్గదర్శనం కావాలి. విచారణ మాట దేవుడెరుగు. దొరికిన వాడిని దొరికినట్టే చంపి పారేసింది.కనీసం మృతదేహం కనిపించకుండా మహాసముద్రంలో విసిరిపారేసింది. అలా చేస్తే మరొకడు భయపడతాడు గాని, చేతికి దొరికిన నిందితుల్ని కూడా విచారణ పేరు చెప్పి శిక్షించకుండా కాలయాపన చేయడం ప్రమాదకర సంకేతాల్ని సమాజానికి పంపిస్తుంది. అదే తప్పు మరోసారి పునరావృతమయ్యేలా చేస్తుంది.
ఆకలి కోసం ఒక చిన్న దొంగతనానికి పాల్పడితే అందరం కలిసి, చావచితక్కొట్టేస్తాం - అంతెందుకు - కొంచెం రక్తం తాగిన పాపానికి దోమని ఒక్క దెబ్బతో చంపిపాడేస్తాం. అంతే గాని పాపం దోమ - జీవకారుణ్యం -దానికేమీ తెలీదు - దోమకి ఆహారం పెడదాం అని ఎవరమైనా ఆలోచిస్తామా? అలాంటిది అమాయకులైన సాటి మనుషుల నిండు ప్రాణాన్ని కిరాతకంగా బలిగొంటున్న వారికి శిక్ష వెయ్యనక్కర్లేదా? ప్రత్యేక రాష్ట్రాలు కావాలి అంటూ రోడ్లెక్కే నేతలు ఇలాంటి నరరూప రాక్షసుల ప్రాణాలు తీయండి అంటూ నినాదాలు ఎందుకు చేయరు? ఎందుకంటే - వారికి ఓట్ల బ్యాంకు కావాలి కాబట్టి - ఒక వర్గం వారి సానుభూతి కావాలి కాబట్టి. మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు - దేశ ప్రజలు మాత్రం సంయమనం పాటించాలి. జరిగినదంతా పీడకలలా మర్చిపోవాలి. ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ చేస్తుంది. దోషులు పాకిస్థాన్‌లో ఉన్నారని తేలుతుంది. తప్పితే హైదరాబాద్‌లో హాయిగా ఉండినా ఉండొచ్చు. కాని పట్టుకొనే ధైర్యం, వారిని కాల్చి చంపే ధైర్యం మన పాలకులకి లేదు. ఇంకా ఇలాంటివే సహిస్తూ ఉంటే ప్రపంచ దేశాల్లో మనల్ని గొప్ప దేశంగా చూడనే చూడరు. చేతకాని చవట దద్దమ్మల్లా చూస్తారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కార్యాచరణకి పూనుకోవాలి. ఇప్పటకే ప్రభుత్వం వద్ద బందీలుగా ఉన్న తీవ్రవాదులందరికీ మరణ శిక్షను అమలు చేయాలి. మనిషిని చంపిన వాడికి విచారణ అనవసరం. ఎందుకంటే అది కక్షతో చేసింది కాదు - మతోన్మాదంతో చేసింది. ఏ పాపం తెలియని అమాయకుల్ని ఏ కారణం లేకుండా చంపే అధికారం ఎవరికీలేదు. ఉగ్రవాదానికి పాల్పడేది ఎవరైనా కానివ్వండి - ఏ మతమైనా - ఏ కులమైనా - ఏ ప్రాంతం వారైనా వారు శిక్షని అనుభవించే తీరాలి. ఉగ్రవాదుల్ని చంపిన పోలీసులకి / సాయుధదళాలకి ప్రత్యేక రివార్డులు ప్రకటించాలి. దేశంలో ఏ వర్గం లేదా కొన్ని వర్గాల వారు తప్పుచేసినా శిక్ష పడదు అనే అభిప్రాయానికి రాకుండా చట్టం ముందు అందరూ సమానమే అనిపించేలా చట్ట సవరణ జరగాలి. రెడ్ హాండెడ్‌గా పట్టుబడ్డ ఉగ్రవాదుల్ని గరిష్టంగా వారం రోజుల వ్యవధిలోనే విచారణలు పూర్తిచేసి మరణ శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రభుత్వం పట్ల ప్రజలు నమ్మకంతో ఉండగలుగుతారు. తమ బతుక్కి భరోసా ఉందనే భద్రతా భావంలో ఆనందంగా ఉంటారు.
(మహాకవి రాసిన కవితకి అనుకరణ)
దేవుడా.... రక్షించు ఈ దేశాన్ని...
ఓటు బ్యాంకు రాజకీయాల నుండి
ముసలి అసమర్థ నాయకుల నుండి
గాంధీ వన్నె కుటుంబాల నుండి
కపట కాషాయ ధారుల నుండి
ప్రాంతీయ వాదాల నుండి
కులాల బారి నుండి
జీహాద్, క్రూసేడ్ యుద్ధాల నుండి
ఉగ్రవాదుల నుండి.....
దేవుడేడి...........
????????????????

Well said.I agree with you.
ReplyDeletewho asked to you watch it ? CHANGE the CHANNELL
ReplyDeleteకరెక్టన్నా... కాకపోతే విచారణ జరగాలి కానీ అది త్వరితగతిన జరగాలి సక్రమంగా జరగాలి. జరిగిన తరువాత శిక్షలు అంటే నిక్కచ్చిగా అమలుజరగాలి. అసలు... తీవ్రవాదులకి వేరే శిక్షాస్మృతి ఉండాలి. అందులో మరణశిక్ష అత్యంత తేలికపాటిశిక్షయివుండి మిగిలిన శిక్షలు మరింత కఠినంగా వుండాలి. ఆ శిక్షలనుభవించినవాళ్ళ అనుభవాలు తెలిసిన వాళ్ళు... దేశంవైపు తేరిపార చూడటానిక్కూడా ముమ్మారు ఆలోచించాలి. స్వర్గమూ, అప్సరసలూ ఏమోగానీ దొరికితే కుక్కబ్రతుకేనన్న జ్ఞానమూ, అలా దొరక్కుండాపోవడం జరగదన్న భయమూ ఎప్పుడూ ఉండాలి.
ReplyDeleteDude
ReplyDeletesolution is in post it self, you are not electing a Govt which will do that, vote and take time to make people vote to that Govt which implement all those solutions you suggesting..
manam intlo kurchoni tv lu chustu enjoy cheyyali,
evado vochi anni solutions implement cheyyali.
If this many people's death moves you a bit from you daily TTP routine, be a political activist and make people elect proper Govt.
Agree with Indian Minerva.
ReplyDeleteYou are right Indian Minerva. I totally agree with you.
ReplyDelete