జనాలకి చదువు మీద మోజు పెరిగిందో లేక కార్పొరేట్లకి చదువు చెప్పాలని బుద్ది పుట్టిందో తెలీదు కాని, రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా కార్పొరేట్ సూల్స్, కాలేజీలు తామర తంపరగా పుట్టుకొచ్చేస్తున్నాయి. ఈ జాడ్యం దేశం మొత్తం మీద ఆంధ్రరాష్ట్రంలో ఎక్కువగా ఉందంటే అతిశయోక్తి కాదు. అసలే మనం ఆంధ్రులం - అందులోను ఆరంభశూరులం. ఏ పనైనా మొదలంటూ పెట్టం - మూడ్ వచ్చి మొదలు పెడితే మాత్రం అందరూ ఒకే పని చేస్తాం. ఒకేసారి కొన్ని వందల స్కూల్స్, కాలేజీలు స్థాపిస్తాం. ఒకేసారి కొన్ని పదుల ప్రాజెక్టులు మొదలుపెట్టేస్తాం - అవి పూర్తయినా అవ్వకపోయినా మనకనవసరం. సక్సెస్ అయినా కాకపోయినా పట్టించుకోం. ఎదుటి వాడు చేసాడు కాబట్టి మనం కూడా చేసెయ్యాలి - అంతే... ఎదురింటి వాడి కొడుకు డాక్టరో - ఇంజినీరో అయ్యాడు కాబట్టి మనం కూడా మన పిల్లల్ని ఇంజినీర్ చేసేయాలి. మన తెగులు ఇలా తగులడింది కాబట్టే - ఒక ప్రఖ్యాత కార్పొరేట్ స్కూల్ మంచి క్యాప్షన్ పెట్టింది - అందరికీ కనబడేలా - హోర్డింగ్‌ల్లో - ''మా స్కూల్లో వేసే ప్రతి అడుగు - ప్రతి అడుగు ఐ.ఐ.టి / మెడిసిన్‌వైపు మాత్రమే '' అంటూ ఊదరగొట్టి పాడేస్తున్నారు. పిల్లలు ఏమయి పోయినా పర్లేదు - వారికి డాక్టర్ అవ్వాలని లేకపోయినా - ఆరోగ్యం నాశనమయిపోయినా - జీవితం మీద విరక్తి పుట్టినా - చివరికి ఆత్మహత్య చేసుకున్నా - వాళ్ళు ఇంజినీరో, డాక్టరో అయిపోవాల్సిందే. మనం అప్పులు చేసయినా సరే వాళ్ళని కార్పొరేట్ స్కూల్లో చేర్పించాల్సిందే..
ఇదంతా ఎప్పుడూ చెప్పుకునేదే కాని - విద్య కూడా వ్యాపారమయిపోయిన తరువాత ఈ విద్యా వ్యాపారస్తులు పవిత్ర విద్యాసంస్థల్ని ఎలా తయారు చేసారో తలుచుకుంటే మనసుకి బాధ కలుగుతుంది. ఒకప్పుడు కాలేజ్ అంటే విశాలమైన ప్రాంగణం - చుట్టూ పచ్చటి చెట్లు - ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ - ఎన్ని ఉండేవని... అవన్నీ గత కాలపు హిమసమూహాలు... ఇప్పుడన్నీ కోళ్ళ ఫారాలే... అందుకే సరదాగా - కోళ్ళఫారాలకి - కార్పొరేట్ కాలేజీలకి చిన్నపోలిక...
1. కోళ్ళ ఫారం పెట్టడానికి చిన్న షెడ్ ఉంటే చాలు - చుట్టూ గ్రౌండ్ కూడా అక్కర్లేదు. కాలేజ్‌కి కూడా అదే షెడ్ సరిపోతుంది.
2. ఒకో వరుసలో దగ్గర దగ్గరగా ఎన్ని కోళ్ళయినా సర్దవచ్చు. అవి అటూ ఇటూ తిరగడానికి కూడా స్థలం అవసరం లేదు - కాలేజ్‌లో కూడా అంతే... చదవడం తప్ప వేరే పనేముంటుంది తప్ప? అందుకే ఒక సెక్షన్‌లో ఎంతమందినయినా దగ్గరగా ఇరికించి కూర్చోబెట్టవచ్చు.
3. కోళ్ళు గుడ్లు పెడితే మంచి లాభం - పిల్లలు ఎన్ని ర్యాంకులు పెడితే కాలేజీకి అంత లాభం.
4. గుడ్లు పెట్టిన తరువాత కోళ్ళని కూడా అమ్మేసుకోవచ్చు - ర్యాంకులు వచ్చిన తరువాత పిల్లల్ని వేరే కాలేజీలకి కమీషన్ పద్దతిని అమ్ముకోవచ్చు.
5. కోడి గుడ్డు పెట్టిందా లేదా అనేది ముఖ్యం గాని - దాని మనసుతో మనకి పనేముంది? - పిల్లలకి ర్యాంక్ వచ్చిందా లేదా అన్నది ముఖ్యంగాని వాళ్ళు ఎలా పోతే మనకేం?
6. ఎక్కువ గుడ్లు పెట్టాలి అంటే కోళ్ళకి రోజూ 24 గంటలూ తిండి పెడుతూనే ఉండాలి. దానికి టైమూ పాడు అక్కర్లేదు - పిల్లలకి మంచి ర్యాంకు రావాలంటే 24 గంటలూ బండబట్టీ పట్టిస్తూనే ఉండాలి. దానికి టైమ్ టేబుల్ అంటూ ఏదీ ఉండదు. నిద్ర వస్తున్నా - ఆకలేస్తున్నా - నీరసంగా ఉన్నా - చదువుతూనే ఉండాలి. కనీసం చదివినట్టు నటించాలి.
ఇవండీ... ఇంకా చాలా ఉండొచ్చు. మీకేమైనా గుర్తొస్తే మా అందరితోను పంచుకోండి...