Pages

Friday, May 14, 2010

గత 5000 సంవత్సరాల కాలంలో భారతదేశం ఎందుకు ఇతర దేశాల మీద దాడి చెయ్యలేదు?

ఒక సందర్భంలో మన మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారికి వచ్చిన అనుమానం. నిజమే గత చరిత్రని పరిశిలించి చూస్తే భారత దేశం ఎప్పుడూ తనంత తానుగా ఇతర దేశాల మీద దాడి చెయ్యలేదు. ఎప్పుడూ ఇతర దేశాల నుండి ధనం కోసం, బంగారం కోసం, మత వ్యాప్తి కోసం చేసే యుద్ధాల నుంచి ఆత్మ రక్షణ చేసుకోవడమే సరిపోయింది. ఇక్కడ ప్రబలంగా వున్న వైదిక జీవిత విధానంలో యుద్ధాలకి చోటే లేదు. (దీన్నే తరువాతి కాలంలో హిందూ మతమని మన మీదెక్కి తొక్కిన వాళ్ళు అంటే మనమూ చంకలు గుద్దుకుంటూ దానికి తందాన అంటున్నాము). నిజం చెప్పాలంటే ప్రపంచంలోని రెండు ప్రధాన మతాలయిన క్రైస్తవ, ఇస్లాం మతాలు తమ మత వ్యాప్తి కోసం మధ్య యుగాల్లో రక్తాన్ని ఏరులై పారించాయి. క్రైస్తవ మత యుద్ధాన్ని "క్రూసేడ్" అని, ముస్లిములు మతవ్యాప్తి కోసం చేసే యుద్ధాన్ని "జీహాద్" అని అంటారు. కాని మన సంస్కృతిలో మతానికన్నా మనిషికే ప్రాధాన్యత ఎక్కువ. ఇతర మతాల్లో, ఒకవ్యక్తి తాను అనుసరించే మతాన్ని మిగావారు అనుసరించకపోతే, వారు సొంత కొడుకయినా, కూతురయినా, భార్య అయినా, ఆఖరికి ప్రాణ స్నేహితుడయినా సరే, కత్తికి బలిపెట్టామని వారి "పవిత్ర గ్రంధాల్లో" రాసి వుంటుంది. కాని మతాన్ని బలవంతంగా ఇతరులపై రుద్దమని ఏ హిందూ సిద్ధాంతమూ చెప్పలేదు.

వేదాల్లో వున్న శ్లోకాల్ని ఒకసారి పరిశిలిస్తే మనవారు ప్రపంచ శాంతికి, సాటి మనిషి వున్నతి కోసం ఎంత పరితపించారో మనకి అర్ధ్మ అవుతుంది. "సర్వేత్ర సుఖినస్సంతు" అంటే మానవులందరూ సుఖంగా వుండాలి, "సర్వేసంతు నిరామయా" అందరూ ఆరోగ్యంగా జీవించాలి, "సర్వే భద్రాణి పశ్యంతు" అంటే అందరూ భద్రంగా వుండాలి అని అర్ధం. ఇటువంటి ఉదాత్త భావనలని ప్రపంచంలో ఏ మతమయినా చెప్పగలిగిందా? భగవద్గీతలో "విజ్ఞుడయిన వాడు ఒక ఏనుగులోనూ, పక్కనే వున్న కుక్క లోనూ, కుక్కని తినే చండాలునిలోనూ, సద్బ్రహ్మణుడిలోనూ పరమాత్మని దర్శిస్తాడు" అని చెప్పబడినది. అంతటి సమదర్శిత్వ భావన ఎప్పటికయినా మరో గ్రంధంలో చూడగలమా? మనం మనుషులమే కాకుండా, ప్రతీ ప్రాణిని తమతో సమానంగా భావించమని చెప్పే వున్నతమయిన సంస్కృతి గురించి, దేవుడు సృష్టించిన జంతువులన్నీ తమ ఆహారం కోసమే అని వాదించే వారికి ఏమని చెపితే తెలుస్తుంది? భూమి తల్లిగా భావించి, నదిని అమ్మగా ప్రేమించి, గాలిని దేవుడిగా ఆరాధించే వారి గురించి, పైవన్నీ వ్యాపార వస్తువులుగా భావించి, ప్రకృతిలో వున్న ప్రతీదీ అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి అని భావించే వారికి ఎలా చెపితే అర్ధం అవుతుంది? కూర్చున్న కొమ్మను నరుక్కోవడమూ, ప్రకృతిని నాశనం చేయ్యడం ఇదేగా మనం నాగరికులం అనుకునే వాళ్ళు చేసేది? తాగే మంచి నీళ్ళని కూడా కొనుక్కుని బ్రతకాల్సి వస్తుందంటే ఇంతకన్నా సిగ్గుమాలిన విషయం ఇంకోటి వుంటుందా?

అసలు విషయానికి వస్తే హిందూ మతంలో వుండేది సర్దుబాటుతత్వం. వేద కాలం నుండి దాని మౌలిక సిద్ధాంతంలో వుండే వైవిధ్యంవల్ల ఎదురయిన ప్రతీ సవాలునీ సమర్ధవంతంగా ఎదుర్కొని ఈ నాటి స్తితికి చేరింది. ఈ మతంలో (నిజానికి హిందుత్వాన్ని మతం అంటే నేను ఒప్పుకోను, అది ఒక జీవిత విధానం) వున్న ఈ గుణం వల్ల ప్రాచీన యుగంలో బౌద్ధ, జైన మతాలు పుట్టినా, తరువాతి కాలంలో క్రైస్తవ, ముస్లిం మతాలు దాడి చేసినా సజీవంగా వుండగలిగింది. అయితే ఇంత మంచి విధానాన్ని ఎవరూ పనిగట్టుకుని (అంటే అబధాలు చెప్పి, భయపెట్టి, యుద్ధాలు చేసి) మతమార్పిడులు చేయ్యకపోవడం వలన మిగిలిన ప్రాంతాల్లో అది వ్యాప్తి చెందలేకపోయి వుండవచ్చు. అలాగని హిందువులు చేతగానివాళ్ళు కారు, సహనం కొంచెం ఎక్కువ. అయితే ఎంతటి సహనానికయినా ఒక హద్దు వుంటుంది. పిల్లి మామూలుగా చాలా మంచిది. ఎవరయిన వస్తుంటే అది పక్కకి తప్పించుకు పారిపోతుంది. కాని అదే పిల్లిని ఒకగదిలో తాళం పెట్టి కొట్టడానికి ప్రయత్నించారనుకోండి ఎదురు తిరుగుతుంది, ఆత్మ రక్షణ కోసం ప్రయత్నిస్తుంది. ముఖమంతా రక్కి పారేస్తుంది. హిందూ మతంలో వుగ్రవాదం అంటూ ఏర్పడదు. ఒకవేళ ఏర్పడినా, అది తాత్కాలికం మాత్రమే.

అందుచేత భారతదేశం గత 5000 సంవత్సరాలలోనే కాదు, మరో 10000 సంవత్సరాల తరువాతయినా సరే మరే దేశం మీదకీ యుద్దానికి వెళ్ళదు.

11 comments:

  1. జగదీష్ గారూ,
    మీరు చెప్పిన దాంట్లోనిజం ఉంది. మీరు చెప్పిన విషయాలతో పాటు ఇంకొన్ని నిజాలు.
    మనం ఇతర దేశాల మీద దండెత్త లేదనటం పూర్తి గా నిజం కాదు. ఐతే మిగిలిన వాళ్ళ తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఉదహరణ కి చోళ రాజులు మలేషియా,మరియూ ఇండోనేషియా ల ను కోలోనైజ్ చేశారు.
    మనం ఇతర దేశాలపై దండెత్తక పోవటానికి మనకి ఉన్న కొన్ని బలహీనతలు కూడా కారణం. మన వాళ్ళకి వాళ్ళలో వాళ్ళే కుమ్ములాడుకోవటం సరిపోయింది. కులాల మధ్యా, రాజ్యాల మధ్యా ఎప్పుడూ తగాదాలే. ఒకప్పుడు ప్రగతిశీలమైన వర్ణ వ్యవస్థ క్రీస్తు శకానికొచ్చేసరికి ఎదుగూ బొదుగూ లేక, తన పరిమితులకి చేరింది. దని వలన ప్రాపంచిక మైన అభివృధ్ధి కుంటు పడింది. ఇంకా బయటి వాడి పై దండెత్తే సమయం ఎక్కడిది. ఇక పోతే మన వాళ్ళు క్రీస్తు శకం లోకి వచ్చే సరికి ఆయుధాల ఆధునీకరణ లో మిగిలిన దేశాల కంటే బాగా వెనుక పడి పోయారు. ఒక వేళ బయటి వాళ్ళ పై దండెత్తినా గెలిచేవాళ్ళు కాదు. ఆ సంగతి తెలిసే బయటి వాళ్ళ జోలికి వెళ్ళకుండా వీళ్ళ లో వీళ్ళే కుమ్ములాడుకున్నారు. బయటి వాడు వచ్చినప్పుడు వీళ్ళలో ఒకరు వాడి తొత్తులు గా మారారు.
    మనం అన్ని రకాలు గా ఉన్నతులం అనుకోవటం వలన మనకు సంతోషం గా ఉంటుంది. కానీ మనకి చాలా బలహీనతలు కూడా ఉన్నాయి . వాటిని కూడా గుర్తు పెట్టుకొని,అవి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకొంటేనే ఏ జాతి ఐనా వృధ్ధి లోకి వచ్చేది.

    ReplyDelete
  2. మన వాళ్ళకి వాళ్ళలో వాళ్ళే కుమ్ములాడుకోవటం సరిపోయింది
    _________________________________________

    Exactly. ఇంక బయట వాళ్ళ మీద దండెత్తడానికి తీరికెక్కడా?

    ReplyDelete
  3. What above two persons said is not true.
    The reason is we are united as much of time as we were fighting internally. For eg, during time of Chandra Gupta, all of India was united. After him, Asokha even though initially went for war, then immediately tried to spread Buddhism. Even our Andhra's great Satavahanas defended whole India for more than 450 years but never went outside for war. The main reason is what you have mentioned is one reason and the other reason is this.
    Why would a king wants to go for war? Because he either wants glory or gold. We are the richest in whole world and why else should we go to war with a poor country?

    ReplyDelete
  4. ఒకే చక్రవర్తి పాలనలో (కనీసం, ఉపఖండంలో అధికభాగం) ఉన్న సందర్భాల్లో మనోళ్లూ ఇతర దేశాల మీదకి దండెత్తారు, గెలిచారు, ఏలుకున్నారు. కంబోడియా నుండి మలేసియా దాకా ఉదాహరణలున్నాయి. కనుక 5000 ఏళ్లలో మనం ఎవరి మీదకీ దండెత్తలేదనటం సరికాదు.

    ఇక, ఆ దండయాత్రలు విరివిగా జరగకపోవటానికి పైన ఒక కారణం ఆల్రెడీ చెప్పేశారు (మనలో మనం కుమ్ములాడుకోటం). రెండో కారణమూ ఉంది: వనరుల లేమితో సతమతమయ్యే దేశాలే ఇరుగు పొరుగు రాజ్యాలపై తరచూ దండయాత్రలకి తెగబడతాయనేది చరిత్ర మనకి చెప్పే విషయం (గ్రీస్, రోమ్, ఇంగ్లండ్, జపాన్, etc). ఆ విషయంలో భరతఖండానికి లోటు లేదు కాబట్టి ఆవారా మనవాళ్ల దాడుల సంఖ్య తగ్గిపోయింది.

    ReplyDelete
  5. బాగుందండీ జగదీశ్ గారూ మీ పోస్ట్. చక్కటి విషయాలు తెలిసినవి మీ నుంచి వ్యఖ్యాకారుల నుండీ.

    ReplyDelete
  6. To the anonymous above:
    What you said was true during the early part of the 5000 years.That is during BCs Even Satavahana's regime was during early 100s after christ.But siruation changed around 400 AD.From then on we have become a failed subcontinent.

    ReplyDelete
  7. @ బొందలపాటి గారు.. & మలక్‌పేట రౌడి గారు.. మీతో కొంత వరకూ మాత్రమే ఏకీభవిస్తాను. మీరు చెప్పిన వాటిలో మనలో మనం కుమ్ములాడుకోవడం అన్నది చాలా కరెక్త్. ఇప్పటికీ కూడా మనకి బుద్ది రాలేదని కె.సి.ఆర్ లాంటి వాళ్ళని చూస్తే తెలుస్తుంది. నిజమయిన అభివృద్ధి కోసం పాటుపడకుండా, ప్రాంతాలవారీగా గొడవలు పెట్టుకుంటున్నాము. ఇవి గాక కుల సంఘాలు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువయ్యాయి. ఇటువంటి వాటిని మొదట్లోనె అరికట్టకపోతే మనం మళ్ళీ మధ్య యుగాల్లోకి వెళ్ళిపోతాము.

    @ అనానిమస్ గారు.. & అబ్రకదబ్ర గారు... మీరు చెప్పినది కూడా నిజమే. ఆ రోజుల్లో మన దేశమే ప్రపంచంలోకెల్లా ధనిక దేశం. ఇక మనకి బయటి వాళ్ళ సంపదతో పనేమిటి?

    @ లక్కరాజు గారు... మీకు తెలీయడమే మాకు కావలసింది.

    @ ఆంధ్రుడు గారు... ఇప్పటికయినా మనం కళ్ళు తెరవకపోతే మీరు ఆఖరన చెప్పినట్లుగా వుండిపోతామేమోనని భయం వేస్తుంది..

    ReplyDelete
  8. నిధులు,వనరులు లేకనే ఆంధ్ర వారు తెలంగాణా మీద దండెత్హర?..... :)

    ReplyDelete
  9. మంచి టపా.. చాలా బావుందండీ మీ విశ్లేషణ..
    మన దేశంలో బౌద్ధం ఎలా అంతరించింది..
    అనే విషయం పై ఏమైనా సమాచారం ఉందాండీ మీదగ్గర!!

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.