మనసున్న ఒక మంచి మనిషి ఇక లేడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. నమ్మిన వారికి ప్రాణాలయినా ఇవ్వడానికి సిద్దపడే ఆపద్బాంధవుడు మరిక లేడు.. ఆపన్నుల, రోగుల పాలిట "ఆరోగ్య శ్రీ" ఇక కనబడడు..
ఏది ఏమయినా అందరి చేత "అందరివాడు"గా పిలిపించుకున్న మన ముఖ్య మంత్రి గారు ఇంతటి ఘోర పరిస్తితుల్లో మరణించడం, మనం నేర్చుకోవలసిన ఎన్నో గుణపాఠాల్ని ఎత్తి చూపుతుంది. ఒక రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాంకేతికంగా ఎటువంటి పరిస్తితుల్లో ఉందో తనిఖి చేసే నాధుడు కూడా కరువయ్యాడా? ఇంత పెద్ద ఆంధ్ర ప్రదేశ్ లో... హతోస్మి... పైగ కాలం చెల్లిన హెలికాప్టర్లో ప్రయాణం.. అదీ ఎన్నో రిపేర్లు అయింది... రాడార్ వ్యవస్త పనిచేయంది... కమ్యూనికేషన్ వ్యవస్త పనిచేయనిది... కనీసం కూలిపోతే ఆ సంగతిని ప్రసారం చేయలేని ట్రాన్స్‌మిటర్ వున్న హెలికాప్టర్‌లోనా ఇంతగా ప్రేమించే ఒక మనిషిని పరలోకాలకి సాగనంపాము.. ఇంత కన్నా సిగ్గు చేటు వుంటుందా... చంద్రుడి మీదకి, అంగారకుడి మీదకు తరువాత వెళదాము.. ముందు భూమి మీద సరిగ్గా నడవడం, ఎగరడం చేతనయితే అప్పుడు మిగతావి ఆలోచించవచ్చు.
ఇప్పటికయిన, మంత్రులూ, అధికారులూ కళ్ళు తెరచి ఒకటి ఆలోచించుకోవాలి.... లంచాలు దొబ్బే నాయకులు, అధికారులు వున్నత కాలం, చేసే పనిలో నిజాయితీ లోపించినంత కాలం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే వుంటాయి. ఈ రోజు మన ముఖ్య మత్రినే కోల్పోయాము.. రేపు మీ ఇంట్లోనే మరొకరికి ఇలా జరగవచ్చు. సంపాదించేది శాశ్వతం కాదు.. మంచితనమే మనం వెంట తీసుకువెళ్ళేది. ప్రజల గుండెల్లో నిలిచివుండేది కూడా ఆ మంచితనమే. అనుక్షణం ప్రజా క్షేమమే తలచి, వారి అభ్యున్నతే తన జీవిత లక్ష్యంగా అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి మన రాజశెఖర్ రెడ్డి గారు. అలాంటి మంచి మనిషి రాజశేఖర్ రెడ్డి గారు ఒక మంచి మనిషిగా రాష్ట్ర, దేశ ప్రజలందరి హృదయాలలో ఎప్పటికీ నిలిచే వుంటాడు... వై.యస్.ఆర్.. అమర్ రహే... జైహింద్...
em cheppaalanukuni em cheptunnav.. kaavalsindi nijaayiti, avineeti rahita samajam.. madyalo manchitanam enduku vachindi..
ReplyDeleteoka manchi vyakthi eppatiki chanipodu.. athani manchitanam eppatiki mana gundello athaniki pranam posthundi..
ReplyDeletewww.amberalertgps.com site
ReplyDeletesorry to know that they failed to communicate with ground. They should use this product