తెలుగు వారందరికీ, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగ్రవాదం లేకుండా ఉండాలని, ప్రేమోన్మాదులు యాసిడ్ దాడులు చెయ్యకుండా ఉండాలని, అవినీతి లేని రోజు రావాలని, మరీ ముఖ్యంగా ధరలు పెరగకుండా ఉండాలని, ఇలా చాలా కోరికలున్నాయి గాని, ప్రస్తుతానికి అవి తీరకపోయినప్పటికి, ఎప్పటికయినా తీరాలని, దానికి ఈ సంవత్సరమే నాంది కావాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
ఇక, నేను ఇవ్వబోయే కానుక విషయం... చక్కటి తెలుగు పంచాంగం కాలండర్. తిరుమల తిరుపతి దేవస్తానం ఆస్తాన సిద్దాంతి అయిన బ్రహ్మశ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి గారు రచించిన నూతన సంవత్సర పంచాంగం కాలండర్ PDF ఫైల్ ని మీకు కానుకగా అందిస్తున్నాను. మల్టి కలర్‌లో డిజైన్ చేసిన ఈ కాలండర్, దేశ, విదేశాలలో వున్న తెలుగు వారికి నచ్చుతుందని, వుపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆ ఫైల్‌కి సంబందించిన లంకెలు ఈ క్రింద ఇచ్చాను. మీ వీలుని బట్టి ఎక్కడినుంచయినా download చేసుకోవచ్చు.
rapidshare
mediafire
మీకు నా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
ReplyDelete