సమకాలీన సినిమాల్లో చారిత్రక నేపధ్యమున్న చిత్రాలు రావడం కొంచెం అరుదుగానే జరుగుతోంది. వచ్చిన కొన్ని సినిమాలు కూడా చరిత్రను వక్రీకరిస్తూ, కమర్షియల్ హంగుల్ని అద్దుకున్నవి అయి ఉంటున్నాయి. కాని, చరిత్రను ఏ మాత్రం వక్రీకరించకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఏ మాత్రం తక్కువ కాకుండా, అత్యున్నత భారతీయ విలువల్ని, భారతీయులు నమ్ముకున్న ధర్మంపై నిర్మించబడ్డ శిఖర సమానమైన ఆదర్శాలని, ఆ ఆదర్శాలను పాటించే క్రమంలో ప్రాణాల్ని సైతం తృణప్రాయంగా విడిచిపెట్టే మహోన్నత కథా ప్రాభవానికి ఆధునిక సినిమా రూపమే సంజయ్ భన్సాలీ దర్శకత్వం వహించిన 'పద్మావతి'.
మేవార్ మహారాణి పద్మావతి అపురూప సౌందర్యవతి. రాజపుత్ర రాజయిన రతన్‌సింగ్‌ను వివాహమాడుతుంది. అదే సమయంలో భారతదేశంపైకి దండెత్తిన అల్లావుద్దీన్ ఖిల్జీ పద్మావతి సౌందర్యం గురించి విని, ఆమెను ఎలాగైనా పొందాలని చిత్తోడ్‌ఘడ్ కోటపైకి దండెత్తుతాడు. కాని, విజయం సాధించలేకపోతాడు. ప్రాచీన భారతీయ ఇంజినీరింగ్ నిపుణతతో నిర్మించిన ఆ కోట ముందు, రాజపుత్రుల పరాక్రమం ముందు ఖిల్జీ సేనలు పరాజయం పాలవుతాయి. చివరికి తమకు మాత్రమే సొంతమైన కుతంత్రంతో కోటలోకి ప్రవేశించిన ఖిల్జీకి రాణి పద్మావతి దక్కిందా లేదా అనేది సినిమా కథ.
నేటి యువత తప్పని సరిగా చూసి, ఎంతో నేర్చుకోవలసిన కథ ఇది. ప్రేమ పేరుతో ప్రతి అడ్డమైన, నీచ మనస్తత్వం కలిగిన వారందరూ దర్శకులుగా అవతారమెత్తి, నానా చెత్తా సినిమాలుగా తీసి, యువతను కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నారు. అటువంటి సినిమా చూసిన వాళ్ళందరూ అదే జీవితం అనుకుంటూ రకరకాల నేరాల్లో చిక్కుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌ని చూడముచ్చటగా, రిచ్‌గా తీర్చిదిద్దారు. మేకప్, ఎడిటింగ్, డైరెక్షన్, బ్యాక్‌గ్రౌండ్.. ఒకటేమిటి అన్ని విధాలుగా కూడా అత్యున్నత స్థాయిలో ఒక హాలీవుడ్ మూవీని చూసిన ఫీల్‌ని కలిగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఆనాటి కోటగోడలు, వస్త్రధారణ, నగలు, అలంకరణ వంటి ఏ విషయంలోను రాజీ పడలేదు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఒక పక్క నుండి భారతీయులు నమ్ముకున్న ఆదర్శాల గురించి గర్వపడుతూనే, ఒక రాజకుటుంబం పరాయి మతాల మూర్ఖత్వానికి ఎలా బలయిపోయిందో చూస్తూంటే గుండెల్ని మెలిపెడుతున్న బాధ కలుగుతుంది.
భారతీయులు ప్రతీ విషయాన్ని ధర్మంతో ముడిపెట్టారు. ఆఖరికి యుద్ధం కూడా ధర్మ బద్దంగానే చేసారు. కొన్ని వేల సంవత్సరాలుగా ధర్మంతోనే పెనవేసుకుపోయిన భారతీయులకి, ఎటువంటి ధర్మంతో పనిలేకుండా, ఎదుటి వాడిని కొల్లగొట్టడం, బలవంతంగా దోచుకోవడం, పరాయి వారి భార్యను చెరపట్టడం, అందుకు ఎంతకైనా తెగించి, అడ్డదిడ్డంగా యుద్దం చేయడం వంటివి బొత్తిగా కొత్త. అందుకే అవతలి శత్రువుని కూడా ధర్మబద్దంగా ఎదుర్కోవాలని భావించి, చివరికి వారి కరవాలానికే బలయిపోయారు. ఈ విధంగానే ముస్లిం, క్రైస్తవ పాలకులు హిందూ దేశాన్ని ఆక్రమించి, ఇక్కడి సంపదను, స్త్రీలను, వారసత్వాన్ని దోచుకోగలిగారు.
సహజంగానే హిందూ జాతి గొప్పదనాన్ని, వారి ఔన్నత్యాన్ని చాటిచెప్పే ఎటువంటి ప్రయత్నానికైనా మీడియాలో ప్రాచుర్యం లభించదు. ఇటీవల విడుదలైన ఒక మానసిక రోగి సినిమా గురించి మాత్రం అటు మీడియాలోనీ, ఇటు వెబ్‌లోను ప్రచారం హోరెత్తిపోయింది. ఆ సినిమా చూడకపోతే అసలు యూత్ కాదన్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ నేటి యువత అది కాదు తెలుసుకోవలసింది.. రతన్‌సింగ్ స్థానంలో ఉండవలసిన యువతని ఖిల్జీ స్థానంలోకి దిగజార్చేసి, అదే నిజమైన హీరోయిజం అన్నట్లుగా హైలైట్ చేస్తున్నారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క యువతీ యువకుడు తప్పని సరిగా చూసి, మన నిజమైన సాంప్రదాయ విలువల్నీ, వాటిని కాపాడడం కోసం పూర్వీకులు పడ్డ తపననీ, చేసిన త్యాగాన్ని తెలుసుకుని, గుర్తుంచుకుని, ఆచరించడమే మన పూర్వీకులకు మనమిచ్చే నిజమైన నివాళి.