Pages

Saturday, March 10, 2012

జ్యోతిష్యం గురించి కొన్ని వాస్తవాలు - అపోహలు (పార్ట్- 1)

       జ్యోతిశ్శాస్త్రం గురించి ఎన్నో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న వాదోపవాదాలు ఇప్పుడు కొత్త రూపు సంతరించుకున్నాయి. వేదిక మారింది. తెలుగు బ్లాగులే ఆ వాదాలకి వేదిక. అత్యంత ప్రాచీనమైన భారతీయ శాస్త్ర సాంకేతిక విషయాలకి పట్టిన గతే ఇపుడు జ్యోతిశ్శాస్త్రానికి కూడా పట్టబోతోందనేది సుస్పష్టం. దీనికి కారణం ఈ శాస్త్రంపై అనేక మందికి ఉన్న అపోహలు మాత్రమే.

    జ్యోతిషం నిజంగా శాస్త్ర బద్దమైనదేనా, లేదా అది కేవలం వట్టి కల్పన మాత్రమేనా, మనుషుల బలహీనతలతో ఆడుకోవడానికి కొంత మంది మేధావులు తయారు చేసిన వట్టి అబద్దాలతో కూడిన పుస్తకం మాత్రమేనా? ఇవన్నీ పరిశీలించే ముందు మనకు మనం ఒక అభిప్రాయానికి రావడం మంచిది. ఎవరో చెప్పింది విని, రాసింది చదివి, మనకంటూ ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచకుంటే అది అన్ని వేళలా సరైనది కాకపోవచ్చు, మనం తప్పు దారి పట్టే అవకాశం కూడా ఉంది. అందుకే ముందు మన బుద్దికి పదును పెడదాం... అంటే తార్కికంగా ఆలోచిద్దాం. దేవుడు మనకు బుర్ర ఇచ్చింది అందుకే కదా...

    ఈ విశాల విశ్వంలో ప్రతీ అణువు మరో అణువుని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. ఇది క్వాంటం మెకానిక్స్‌లో మొదటి సూత్రం. అతి చిన్న పరమాణువు మొదలుకొని, నక్షత్ర మండలాల వరకు ఉన్న కోటాను కోట్ల పరమాణువులు నిత్యం అదృశ్యంగా ఒకదానితో ఒకటి సంభాషించుకుంటూ ఉంటాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఆ అణువులు అలా పరస్పర ఆధారితాలు కాకపోతే మనం ఇప్పుడు చూస్తున్న విశ్వమే మన కళ్ళ ముందు సాక్షాత్కరించేదే కాదు. అంతెందుకు ఇప్పుడు ఇలా మనం మాట్లాడుకునే వాళ్ళమే కాదు. మన శరీరంలోని అతి చిన్న కణం, మరో కణం మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి కొన్ని కోట్ల కణాలు కలిసి, భూమిచేత ఆకర్షించబడి ఉన్నాయి. ఈ భూమి తన కన్నా పెద్దదైన నక్షత్రం - సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. మరలా ఆ సూర్యుడు తన గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు వంటి వాటిటో కలిసి పాలపుంత (మిల్కీవే గెలాక్సి) చుట్టూ తిరుగుతున్నాడు. ఈ పాలపుంత కూడా గుర్తు తెలియని మరో అద్భుత శక్తి చుట్టూ తిరుగుతోంది అంటారు. అంటే, ఈ విశ్వంలోని ప్రతి అణువు మరో అణువు చుట్టూ తిరుగుతుంది. ఆఖరికి బ్రహ్మాండం కూడా. ఆ తిరగడం కూడా ఎంతో ఖచ్చితత్వంతో.... ఎంత ఖచ్చితత్వమంటే పరమాణు గడియారంలో కొలవగలిగినంత... మిల్లీ సెకనులో అరసెకను కూడా తేడా రానంత... ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. విశ్వంలో అణువులన్నీ పరస్పర ఆధారితాలు మరియు అత్యంత ఖచ్చితమైన విశ్వ నియమాల ప్రకారం అవి నడుచుకుంటున్నాయి.

    ఇక జ్యోతిష శాస్త్రం విషయానికి వద్దాం. విశ్వంలో ఉండే ప్రతి గ్రహం, నక్షత్రం అంత నిర్దుష్టంగా ప్రవర్తిస్తున్నపుడు భూమి మీద ఉన్న మానవ జీవితం మాత్రం ఎందుకింత గందరగోళంగా ఉంది? దీనిపై ప్రాచీన ప్రపంచంలో ఎన్నో ఆలోచనలు, పరిశీలనలు జరిగాయి. ఒకసారి గ్రహాలు, నక్షత్రాల నడవడికను, దానిలోని నిర్ధుష్టాన్ని కనిపెట్టిన తరువాత, మానవ జీవిత విధానం కూడా వాటికి అనుగుణంగా ఉందేమో అన్న భావన ప్రాచీన సమాజంలో తలెత్తి ఉంటుంది. ఆ విదంగా గ్రహాలకు, నక్షత్రాలకు, మానవ జీవితానికి ఉండే సంబంధాన్ని ఆపాదిస్తూ ప్రతిపాదించబడిందే జ్యోతిశ్శాస్త్రం.

    ఈ ప్రకృతిలో... ఆ మాటకొస్తే ఈ విశ్వంలో ఉండే ప్రతీ అణువు ఒక నిర్ధిష్ట విధానంలో ప్రవర్తిస్తూ ఉంటుంది. అది మనకు ఎంత గందరగోళంగా కనిపించినా సరే... చర్మంపై ఉండే కణాలను భూతద్దంతో పరిశీలిస్తే, అవి ఒక రకంగా ఉన్నట్టు అనిపించవు. గందరగోళంగా, గజిబిజిగా ఉంటాయి. కాని దూరం నుంచి చూస్తే మాత్రం కణాలన్నీ కలిసి ఒక చక్కటి ఆకారంగా... మనిషిగా కనిపిస్తాయి. ఆపిల్‌ కంపెనీ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్‌ జాబ్స్‌ చెప్పిన సూత్రం ఇదే. కనెక్టింగ్‌ డాట్స్‌... జీవితంలో జరిగే ఎన్నో సంఘటనలు అర్ధం పర్థం లేనివిగా కనిపిస్తాయి. కానీ వాటన్నిటినీ కలిపితే వాటిలో అర్థం ఉంటుంది.... అవన్నీ కలిస్తే... అదే జీవితం. ప్రతి మనిషి జీవితం వ్యక్తిపరంగా చూస్తే, ఎటువంటి అర్థం ఉండక పోవచ్చు. కాని, అందరినీ కలిపి, ఒక పద్దతి ప్రకారం వర్గీకరిస్తే, జీవితం యొక్క మౌలికాంశాల్లో ఏకరూపత మనకు అర్థం అవుతుంది. మనుషుల్ని ప్రవర్తనా పరంగా, ఆలోచనల పరంగా, జీవన విధాన పరంగా విడదీసి చూస్తుంది జ్యోతిశ్శాస్త్రం.

మానవులపై గ్రహాల ప్రభావం వుంటుందా?: 
జ్యోతిషాన్ని విమర్శించే వాళ్ళు ముందుగా చూపే కారణం... ఎక్కడో ఆకాశంలో ఉండే గ్రహాలు, అంత కన్నా దూరంగా ఉండే నక్షత్రాలు మానవ జీవితంపై, వారి ప్రవర్తనపై ఎటువంటి కారణాన్ని చూపలేవు అనేది. ఎక్కడో ఉండే కుజ గ్రహం (మార్స్‌ లేదా అంగారకుడు) భూమిపై ఒక సూదిని కూడా కదిలించలేడు, యుద్దాలకి, ప్రకృతి వైపరీత్యాలకి కారణం అవుతాడా.. అంటూ ఎగతాళి చేస్తారు. వీళ్ళందరికీ గురువయిన న్యూటన్‌ కనిపెట్టిన గ్రహబలం సిద్ధాంతం ఆధారంగా ఒక గ్రహం మనిషిపై చూపించే ప్రభావం కన్నా, ఇంట్లో వెలిగే బల్బు మానవ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని లెక్కలు కట్టి మరీ వాదిస్తారు. కాని కఠోర వాస్తవం మరోలా ఉంది. దాన్ని మనం నమ్మక తప్పదు.

    జ్యోతిషంలో ముఖ్యమైన గ్రహం, మానవ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపేది.. చంద్రుడు. చంద్రుడి ప్రభావం మనిషి మనసుపై అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే చంద్రుడు మనసుకి అధిపతి. ఈ ప్రతిపాదనకి మూల కారణం కూడా వివరిస్తాను. భూమిపై సముద్రంలో సంభవించే ఆటు పోట్లకి కారణం చంద్రుడే అన్న సంగతి అందరికీ తెలిసిందే. అమావస్య, పౌర్ణమి రోజుల్లో ... చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినపుడు సముద్రంలో కొన్ని వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నీటి బుగ్గ పైకి లేస్తుంది. అది పైకి బోర్లించిన గిన్నెలా సముద్ర జలాల్లో కనిపిస్తుంది. చంద్ర భ్రమణంతో పాటుగా ఆ నీటిబుగ్గ సముద్రంపై తేలియాడుతూ ప్రయాణిస్తుంది. దాని వల్లనే పోటు వచ్చి, సముద్ర జలాలు ఉప్పొంగుతాయి. దీని వల్ల చంద్రుడి ప్రభావం భూమిపై ఉందని నిర్ధారణ అయింది. మనిషి శరీరంలో కూడా నూటికి 70 శాతం నీరు మాత్రమే ఉంటుంది. మనిషి ప్రవర్తనను నియంత్రించే మెదడులో అయితే 96 శాతం నీరు ఉంటుంది. అది చంద్రుడిచే ఆకర్షించబడుతుంది. అందుకే అమావస్య, పౌర్ణమి రోజుల్లో మానసిక వ్యాధిగ్రస్తులకి పిచ్చి ఎక్కువవుతుంది. చంద్రుడి వల్ల ప్రేరేపించబడతారు కాబట్టి వారిని ఇంగ్లీష్‌లో లూనాటిక్స్‌ (లూనార్‌ అంటే చంద్రుడు) అని వ్యవహరిస్తారు. అంటే ఇక్కడ మానవ మెదడుపై చంద్రుడి ప్రభావం నిజమని తేలింది.

    ఇక సూర్యుడు... భూమిపై ఉన్న సమస్త ప్రాణికోటికి, వృక్ష కోటికి ఏకైక ఆధార భూతుడు. ఆయన నుంచి వచ్చిన శక్తి రకరకాల రూపాల్లోకి మారి, భూమిలోకి, భూమి నుండి మొక్కల్లోకి, మొక్కల నుండి మనకి ప్రవహిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే రకరకాల రంగులు, తరంగ దైర్ఘా ్యలు (ఫ్రీక్వెన్సీలు) మొక్కలు, జంతువుల్లో ఎన్నో మార్పుల్ని కలుగజేస్తాయి. ప్రాణులకి ఎంతో అవసరమైన 'డి' విటమిన్‌ మొదలుకొని, ప్రాణ హానిని కలుగజేసే అతి నీలలోహిత కిరణాలు (ఆల్ట్రా వయోలెట్‌ రేస్‌) కూడా సూర్యుడిలోనే ఉద్భవిస్తాయి. సూర్యుడి తాపం 5 డిగ్రీలు పెరిగితే చాలు... భూమి మీద జీవరాశి మొత్తం అంతరించిపోతుంది. సూర్యుడు ప్రాణి కోటికి అత్యంత ముఖ్యమైన ఆధారం కాబట్టే సూర్యుడిని మన పూర్వీకులు 'సూర్య నారాయణుడు' అని నారాయణుడితో పోల్చారు. సూర్యుడికి ఉన్న విశిష్టతను, ప్రాచీన నాగరికతలన్నీ సూర్యుడినే ఎందుకు దైవంగా కొలిచాయన్న విషయాన్ని గురించి అత్యంత రహస్యమైన, విలువైన విషయాల్ని తరువాతి పోస్ట్‌లో వివరిస్తాను. దీన్ని బట్టి మానవ జీవితంపై సూర్యుడి ప్రభావం ఉందని తేలింది.

    ఇక మిగిలింది... ఇతర గ్రహాలు. బుధుడు మొదలుకొని, వరుణుడు (యురేనస్‌) వరకు గ్రహాలన్నీ సౌర కుటుంబంలో భాగమే. ముందు చెప్పుకున్నట్లుగా, గ్రహాలన్నీ పరస్పర ఆధారితాలు. సౌర కుటుంబంలో ఉన్న ఏ ఒక్క గ్రహాన్ని తొలగించినా సౌర కుటుంబం మొత్తం కుప్పకూలిపోతుంది. సూర్యుడు తన అఖండమైన శక్తితో ఏ విధంగా తనకు దగ్గరగా ఉన్న బుధ గ్రహాన్ని ఆకర్షించి ఉంచాడో, అంతే శక్తి వంతంగా తనకు అత్యంత సుదూరంలోని తోకచుక్కల్ని కూడా ఆకర్షించి, తన చుట్టూ పరిభ్రమించేలా చేసుకుంటున్నాడు. అత్యంత సాంద్రత కలిగిన గురు గ్రహం, నీటి కన్నా తక్కువ సాంద్రత కలిగిన శని గ్రహం కూడా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అదే విధంగా ప్రతి గ్రహం ఒక్కొక్క ప్రత్యేకమైన రీతిలో ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తూ ఉంటుంది. ఆయా గ్రహాల్లో ఉండే మూలకాల్ని బట్టి, అది విడుదల చేసే ఫ్రీక్వెన్సీ ఆధారపడి ఉంటుంది. సహజంగానే ఆ ఫ్రీక్వెన్సీ సౌర కుటుంబ మంతా వ్యాపిస్తూ ఉంటుంది.

    మానవ శరీరం కూడా ఒక యంత్రమే. ఇంకా మాట్లాడితే... ఈ విశ్వంలో ఒక భాగమే. విశ్వంలోని ప్రతి శక్తి, ఈ చిన్ని యంత్రంపై ప్రభావం చూపుతూనే ఉంటుంది. మానవ శరీరంలో ఎన్నో మూలకాలున్నాయి. అవి అత్యంత సూక్ష్మమైన మోతాదుల్లో ఉన్నాయి. మానవ ప్రవర్తనపై ఈ మూలకాలన్నీ ప్రభావం చూపుతూనే ఉంటాయి. ఒక్కొక్క మూలకం పెరిగినా లేదా తగ్గినా, అలా జరిగిన మనిషి భావోద్వేగాల్లో, ప్రవర్తనలో, ఆరోగ్యంలో ఎంతో తేడా రావడం మనం గమనించవచ్చు. ఆయా మూలకాలు, ఆయా గ్రహాల ఫ్రీక్వెన్సీ బట్టి ప్రభావితం అవుతాయి. దాన్ని బట్టే ఒక మనిషి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడం లేదా పతనమవ్వడం సంభవిస్తాయి. మనిషి ఆలోచనల్లో లేదా ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. మెదడులో ఒక చిన్న కణంలో సంభవించే మార్పు చాలు. కోపం రావడానికి గాని, ప్రేమ రావడానికి గాని. చంద్రుడు మన చేతిలో ఉన్న సీసాలో నీటిని ఏ విధంగాను ప్రబావితం చేయలేకపోవచ్చు. కాని, మెదడులో చెప్పుకోదగ్గ మార్పు తీసుకురాగలడు. అదే విధంగా కుజుడు భూమి మీది గుండు సూదిని కదల్చలేకపోవచ్చు. కాని, అదే కుజుడు భూగర్భంలో ఉన్న అపారమైన ఇనుప ఖనిజ ద్రవాన్ని (లావా) ఖచ్చితంగా ప్రభావితం చేసి, భూకంపాలను సృష్టించగలడు. ఇవన్నీ గ్రహ ప్రభావితాలే. ఇదే సూత్రం నక్షత్రాలకి కూడా వర్తిస్తుంది. ఇటువంటి సందర్భాలలో మనిషికి తెలిసిన భూమి మీది భౌతిక సూత్రాలు ఎందుకూ పనిచేయవు. అసలు గురుత్వాకర్షణ శక్తిని లెక్కగట్టడమే చాలా కష్టం. మనకి తెలిసిన సైన్స్‌ ప్రకారం కేవలం గురుత్వాకర్షణ శక్తి మాత్రమే ఇతంత బ్రహ్మాండమైన గ్రహాలని, నక్షత్రాలని, తోకచుక్కల్ని ఒక చోట కట్టిపడేసి, ఒకదాని చుట్టూ ఒకటి తిరిగేలా చేయడం, పైగా ఒక్కొక్క ఖగోళ వస్తువుకి మధ్యలో కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ అవన్నీ ఒకదానికొకటి ఆకర్షించబడి ఉంటాయి. అవన్నీ అలా బంధించబడి ఉండాలంటే కేవలం గురుత్వాకర్షణ శక్తి మాత్రం ఉంటే సరిపోదు. మధ్యలో ఇంకో పదార్థం ఉండి ఉండాలి. మనకి తెలియని ఆ పదార్థానికే కృష్ణద్రవ్యం (డార్క్‌ మేటర్‌) అని పేరుపెట్టారు మన ఖగోళ శాస్త్రజ్ఞులు. మనకు తెలిసిన ద్రవ్యం... భౌతిక పరమైనది ఈ విశ్వంలో 10 శాతం మాత్రమే. తెలియని ద్రవ్యం 90 శాతం ఉండొచ్చని అంచనా. ఆ డార్క్‌ మేటర్‌ విశ్వంలోని అన్ని శక్తుల్నీ ఎలా ప్రభావితం చేస్తుందే మన ఊహలకి కూడా అందదు. ఇలా గ్రహాలకి, మానవ జీవితానికి ఉన్న సంబంధాన్ని, మనిషి జీవితం కూడా కొన్ని ప్రకృతి సూత్రాలకి అనుగుణంగా నడుచుకుంటుందనే భావనని నిరూపించే ప్రయత్నమే జ్యోతిష శాస్త్రం. (ఇంకా వుంది)

24 comments:

  1. మీరు ఏంత కమ్మగావ్రాసినా ఇక్కడ చెదుగానె వుంటది.
    జ్యొతిష్యం ఒక శాస్త్రము అని అందరికి తెలుసు కాని నమ్మటానికి అభ్యంతరము. కారణము అది తెలిపె ఫలితభాగము లొ అందరకు సరయైన పట్టులేకపొవటము .
    ఇక మన విమర్శకులను గూడా యెమి అనలెము కారణము వారు చదువుకొన్న శాస్త్రం మొత్తం పాశ్చాత్యం ఇది "పంచేంద్రియాలతొ ప్రత్యక్షంగా అనుభూతమై,హెతువాదానికి నిలబడేదే 'సత్యం'గా పాశ్చాత్యం ఎంచుకొన్నది"
    .

    ReplyDelete
    Replies
    1. రమేష్ బాబుగారు. కమ్మగా ఉన్నదా చేదుగా ఉన్నదా లాంటివి చర్చనీయాంశాలు కావు. జ్యొతిష్యం ఒక శాస్త్రము అని అందరికి తెలుసునని అన్నారు. అందరూ శాస్త్రమే అని అంగీకరిస్తే చర్చ దేనికి? ఏదన్నా ఒక్ శాస్త్రంగా నిరూపణ కావాలంటే, అది సత్యశోధనకూ, కాలపరీక్షకూ నిలబడవలసినదే. ఫలభాగంలో లెక్కలేనన్ని సూత్రాలున్నాయి కదా? వాటిని శాస్త్రీయంగా పరిశోధించాలంటే అదేదో నీచమూ హేతువాదమూ అని తప్పించుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా? సూత్రీకరించిన వారు కేవలం దివ్యదృష్టితో చెప్పారంటే ఇంక మీతో వాదం ప్రయోజనం యేమిటి? ఒప్పుకోని వారు అజ్ఞానులని మీరూ, ఒప్పుకోదగ్గనిరూపణలు చూపలేని విషయాలు మాట్లాడె అజ్ఞాని మీరన ఆవలి పక్షమూ దూషించుకోవటం తప్ప వేరే యేమన్నా ప్రయోజనకరవాదం ఉంటుందా?

      Delete
  2. మీ ప్రయత్నం అబినందించదగ్గదే. కాని చాలావివాదాస్పదవిషయాలూ అవాస్తవాలూ అపోహలూ మీ మొదటిభాగంలోనే కనిపించాయి నాకు. కాబట్టి మీ వ్యాసం మరింత ఆజ్యం పోయగలదేమో కాని చర్చకు, యేమీ ప్రయోజనకారి అని అనిపించటంలేదు నాకు.

    పాలపుంత కూడా గుర్తు తెలియని మరో అద్భుత శక్తి చుట్టూ తిరుగుతోంది అంటారని ఒక వాక్యం ఉంది. పాలపుంత ఒక గెలాక్సీ అంటే నక్షత్రమండలం. విశ్వంలోని నక్షత్రమండలాలు పరస్పరం దూరంగా జరుగుతున్నాయని పరిశోధనలు ఋజువు చేసాయి. కాబట్టి విశ్వం వ్యాకోచిస్తున్నదని భావన యేర్పడింది. ఈ విషయంలో చాలా శాస్త్రపరిశోధనలు జరుగుతున్నాయి.

    విశ్వంలో అణువులన్నీ పరస్పర ఆధారితాలు మరియు అత్యంత ఖచ్చితమైన విశ్వ నియమాల ప్రకారం అవి నడుచుకుంటున్నాయన్న మీ statement నాకు తెలిసి అశాస్త్రీయం. మీ దగ్గర దీని విషయంలో యేమి ఋజువులు ఉన్నాయి?

    గ్రహాలకు, నక్షత్రాలకు, మానవ జీవితానికి ఉండే సంబంధాన్ని ఆపాదిస్తూ ప్రతిపాదించబడిందే జ్యోతిశ్శాస్త్రం అన్నారు. కాని యిది తొందరపాటు ఉటంకింపుగా అస్పష్టంగా ఉంది. కాలం అనేది భగవత్స్వరూపంగా ప్రతిపాదించబడింది భారతీయమైన సాంప్రదాయక ఆలోచనావిధానంలో. ఆకాశంలో, నక్షత్రాలు స్థిరబిందుపటలంగా గ్రహించి, గ్రహచలనం ద్వారా కాలం యొక్క గతిని అంచనా వేయటనికి అవకాశం గ్రహించబడింది. జీవుడు ప్రారబ్ధకర్మను అనుభవించటానికి జన్మను ధరించవలసి ఉంటుంది. అది జీవనగతిని నిర్దేశిస్తుంది. కాబట్టి అనంతకాలంలో జీవుని ప్రయాణాన్ని గ్రహస్థితులు గతులు ఆధారంగా అంచనా వేసేందుకు జ్యోతిషం అనే శాస్త్రం రూపొందింది.

    మానవ మెదడుపై చంద్రుడి ప్రభావం నిజమని తేలిందన్నది కూడా శాస్త్రీయంగా ఋజువుకాని విషయమే. దానికి సమర్ధింపుగా జోడించిన వాదన కూడా అశాస్త్రీయపంథాలోనే ఉంది. చంద్రుడి ప్రభావం భూమిపైనేకాదు అన్ని ఖగోళ వస్తువులు (objects) పరస్పరం ఆకర్షించుకుంటూనే ఉంటాయి. సముద్రజలాలపైన చంద్రాకర్షణలోని మార్పులు సులభంగా గోచరించటానిని బట్టి మానవసశరీరంలో నీటిశాతం హెచ్చుకాబట్టి అలాంటి ఆకర్షణాబేధాలు ఊహించటం పొసగదు. చంద్రుడు మన చేతిలో ఉన్న సీసాలో నీటిని ఏ విధంగాను ప్రబావితం చేయలేకపోవచ్చు. కాని, మెదడులో చెప్పుకోదగ్గ మార్పు తీసుకురాగలడనే వాదం కేవలం శాస్త్రజ్ఞానశూన్యతనే తెల్పుతుంది! కుజుడు భూగర్భంలో ఉన్న అపారమైన ఇనుప ఖనిజ ద్రవాన్ని (లావా) ఖచ్చితంగా ప్రభావితం చేసి, భూకంపాలను సృష్టించగలడు అనే మరొక విచిత్ర శాస్త్రజ్ఞానశూన్యవాదనకూడా తరువాత చూసి నవ్వు వచ్చింది.

    "ప్రతి గ్రహం ఒక్కొక్క ప్రత్యేకమైన రీతిలో ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తూ ఉంటుంది. ఆయా గ్రహాల్లో ఉండే మూలకాల్ని బట్టి, అది విడుదల చేసే ఫ్రీక్వెన్సీ ఆధారపడి ఉంటుంది. సహజంగానే ఆ ఫ్రీక్వెన్సీ సౌర కుటుంబ మంతా వ్యాపిస్తూ ఉంటుంది. " ఇది కేవలం అజ్ఞానజనిత వాదం. అన్నిగ్రహాలలోనూ అనేకానేకమూలకాలుంటాయి. ఈ ఫ్రీక్వెన్సీ ఊహ హాస్యాస్పదం.

    "పైగా ఒక్కొక్క ఖగోళ వస్తువుకి మధ్యలో కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ అవన్నీ ఒకదానికొకటి ఆకర్షించబడి ఉంటాయి. అవన్నీ అలా బంధించబడి ఉండాలంటే కేవలం గురుత్వాకర్షణ శక్తి మాత్రం ఉంటే సరిపోదు. మధ్యలో ఇంకో పదార్థం ఉండి ఉండాలి. " ఏం చెప్పాలి? ఈయనకు శాస్త్రజ్ఞానశూన్యం అని వేరే ఋజువులు కావాలా?

    అయితే యీ వ్యాసకర్తకు కృష్ణద్రవ్యం (డార్క్‌ మేటర్‌) ఒకటి ఉందని తెలిసింది. నిజమే అది. కృష్ణద్రవ్యం అనేదానిమీద ఇంకా శాస్త్రీయ పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అది గెలాక్సీలను ప్రభావితం చేస్తూ విశ్వం వ్యాకోఇంప జేస్తోందని భావిస్తున్నారు. కాని కృష్ణద్రవ్యంఖగోళ వస్తువులమధ్య ఆకర్షకంగా ఉంటోదన్న భావన యేమీ లేదు.

    ఇటువంటి అశాస్త్రీయమైన ఔత్సాహికవ్యాసాలు కేవలం గందరగోళాన్ని సృష్టించటానికే పనికి వస్తాయి

    ReplyDelete
    Replies
    1. మీ పరిధిలో మీరు చేసిన విశ్లేషణ బాగానే ఉంది. విజ్ఞానం అనేది మహా సముద్రం వంటిది. కేవలం మనకు తెలిసింది మాత్రమే జ్ఞానం అనుకోవడం, ఎదుటి వారు చెప్పింది హాస్యాస్పదం, అజ్ఞానం అనుకోవడంలోనే నిజమైన అజ్ఞానం దాగి ఉంది. నేను ముందుగా చెప్పినట్లుగా ముందు మన బుర్రను ఉపయోగించి, తర్కంతో ఆలోచించాలి. నేను వ్రాసింది సైన్స్‌ వ్యాసం మాత్రం కాదు. ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ కూడా విశ్వ నియమాల గురించి సిద్ధాంతాల్ని రూపొందించేటపుడు భౌతిక పరిశోధనల కన్నా మానసిక పరిశోధన శాలలోనే ఎక్కువ ఆవిష్కరణలు చేసారు. కొత్త ఆలోచనలు మాత్రమే విజ్ఞాన శాస్త్ర నూతన ఆవిష్కరణలకి, ప్రగతికి దోహదం చేస్తాయి.

      పాల పుంత విషయం: గెలాక్సీలన్నీ ఒకదానికొకటి దూరంగా వ్యాకోచిస్తున్నాయనేది బిగ్‌ బ్యాంగ్‌ థియరీ. అది కేవలం థియరీ మాత్రమే. ఇంకా నిరూపించబడలేదు. అదే సమయంలో నక్షత్ర మండలాలన్నీ ఒక కనిపించని ఇరుసు (ఏక్సిల్‌) చుట్టూ తిరుగుతున్నాయనేది జ్యోతిష సిద్ధాంతం. దానికి కేంద్ర బిందువుగా ధృవ నక్షత్రాన్ని గుర్తించారు. సుమారు పది వేల సంవత్సరాల వ్యవధిలో ధృవ నక్షత్ర స్థానంలో స్వల్ప మార్పుని గమనించవచ్చుననేది ఆధునిక జ్యోతిష పరిశోధకుల అభిప్రాయం.

      విశ్వంలో అణువులన్నీ పరస్పర ఆధారితాలు కాకపోతే, ఈ పాటికి మనం చూస్తున్న ఈ మహావిశ్వం కుప్పకూలిపోయి ఉండేది. దీనికి శాస్త్ర పరిజ్ఞానం, రుజువులు అక్కర్లేదు. విశ్వంలో కేవల శూన్యం (Absolute Space) అంటూ ఏదీ ఉండదు. అటువంటి శూన్యంలో కూడా గురుత్వ శక్తి, లేదా అలాటి మరో శక్తి పనిచేస్తూ ఉంటుంది.

      నాకు తెలిసినంత వరకు విశ్వంలోని ప్రతి అణువు తన మౌలిక ధర్మం ప్రకారం నడుచుకుంటూ ఉంటుంది. అణువుని విడదీస్తే పరమాణువు వస్తుంది. అణువులోని పరమాణువులన్నీ ఎలక్ట్రానులు, ప్రోటాన్లు, న్యూట్రానులు అని మూడు రకాలుగా ఉంటాయి. వీటిలో ఎలక్ట్రానులు ప్రోటాను చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలా తిరగడానికి అవసరమైన శక్తి ఎక్కడి నుండి వస్తుందో ఎవరికీ తెలియదు. పరమాణువుని క్వార్కులుగా కూడా విభజించవచ్చని శాస్త్రవేత్తల అభిప్రాయం. అది సాధ్యం అవుతుందో లేదో ప్రస్తుతానికి తెలీదు. ఏ అణువులో ఉండే పరమాణువులయినా తమకు నిర్దేశించిన ప్రకారం కాకుండా మరో రకంగా నడుచుకునే అవకాశం లేదు. ఈ వాదన ఏ రకంగా అశాస్త్రీయమో నాకు తెలీదు. దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే సేత్‌ లాయిడ్‌ వ్రాసిన ప్రోగ్రామింగ్‌ ది యూనివర్స్‌ (Programming the universe - Seth LLoyd) చదవండి.

      చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి లేకపోతే భూమి మీద ఏ విధంగా ఆటు పోట్లు వస్తాయో నాకు తెలీదు. ఈ విషయాన్ని నేను చిన్నతనంలో సోషల్‌ బుక్‌లోనే చదివినట్లు గుర్తు. ఇక మెదడు సంగతి - మెదడులో ఒక్క న్యూరాన్‌లో మార్పు వచ్చినా, ఎదుటి మనిషి మీద ప్రేమ, లేదా కోపం రావచ్చు. దాని కోసం ఎమ్‌.ఆర్‌.ఐ. స్కానింగ్‌ చేసినా ఫలితం ఉండకపోవచ్చు. భావోద్వేగాలు మెదడులో వస్తాయని తెలుసు గాని, వాటికి ప్రేరణ ఏమిటనేది న్యూరో సైన్స్‌లో ఇతమిత్థంగా వివరణ లేదు. దానికి చంద్రుడిని బాధ్యుడిగా చేసి చూడడంలో ఏ తప్పు కనిపించడం లేదు.

      ఒక్కో గ్రహంలోను ఒక్కో మూలకం ఎక్కువగా ఉందనేది ఎప్పుడో నిరూపితమైన వాస్తవం. అలాగే ప్రతీ మూలకం ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో స్పందిస్తూ ఉంటుంది. దానినే మనం సెల్‌ఫోన్లలో, కంప్యూటర్స్‌లో, ఇంటర్‌నెట్‌లో వాడుకుంటున్నాం. మీకు తెలియనంత మాత్రాన అది అబద్దమైపోదు. నాకు శాస్త్ర జ్ఞానం శూన్యం అనే ముందు మీకు ఏమి తెలుసో ఆలోచించుకోండి మహానుభావా..

      మనకు తెలిసినా తెలియకపోయినా, అడ్డుగోలుగా మనకు తెలిసిందే వాస్తవమనుకునే మీ లాంటి వాళ్ళ వల్లే భారత దేశం అపహాస్యం పాలవుతోంది. మీకు తెలిసిన విషయాన్ని సూటిగా చెప్పడంలో తప్పులేదు. అలాగే నా ప్రతిపాదన ఎందుకు తప్పో విమర్శనాత్మకంగా చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కాని ఎదుటి వారిని జ్ఞాన శూన్యులు అని కామెంట్‌ చేయడం మీలాంటి వాళ్ళు చేయదగ్గ పని కాదు. మరో మాట, ఇప్పటి వరకు మీకు బదులివ్వలేకపోవడం కేవలం నాకున్న పనుల ఒత్తిడి వల్లనే గాని, నా దగ్గర 'సరుకు' లేకపోవడం వల్ల మాత్రం కాదు.

      Delete
    2. Big Bang Theory నిరూపించబడలేదా? నిజమా? డాప్లర్ ఎఫెక్టూ, హబుల్ టెలిస్కోపూ అంతా మాయేనంటారూ?

      చందృడు-మానసిక ప్రభావం గురించి : ఏదో తెలీదుకాబట్టి, "ఇది" అనుకోవడానికి ఇదేమైనా జ్యోతిష్యమటమండీ? సైన్సు. ఆధారాలులేకుండా ఏవో చెప్పేస్తే నమ్మెయ్యడానికి శాశ్త్రవేత్తలేమీ, భారతీయ ప్రజల్లాగా గొర్రెలుకాదు.

      Frequncy అన్నపదానికి అర్ధాన్ని మీరు మరింతశోధించాలంటాను. ఒక వస్తువునుంచి వెలువడే "Frequncy", ఆవస్తువు స్వభావాన్నిబట్టిగాక, దాని చలనంపై లేదా గతిపై ఆధారపడిఉంటుంది. భూగ్రహాన్నే తీసుకుంటే దాన్ని periodicity ఒక సంవత్సరం. అంటే దాని "Frequncy" 1/365Hz అన్నమాట. ఈ "Frequncy ఉన్న ఇతరగ్రహాలకు సంబంధిఉంచిన తరంగాలు శోన్యంలో ప్రయాణించి మనదగ్గరకు చేరతాయా, చేరితే చేరేటప్పటికి ఎంతతీవ్రత ఉంటుంది అనేది ఒక ప్రశ్నైతే, మరి అదే "Frequency" ని వెలువరించే వస్తువులు మనచుట్టూ ఉన్నప్పుడు, అవిమాత్రం మనమీద ఎందుకు ప్రభావం కలిగించడంలేదు అనేది మరొక ప్రశ్నౌతుంది.

      యేదియేమైనా మీ post చాలా comedyగా ఉంది. నా స్నేహితులకి share చెయ్యబోతున్నాను. మీకు ఇంగ్లీషు పుస్తకాల్లోని "విద్యావిజ్ఞనం" చాలా అవసరం.

      భారతదేశం పాలవుతుంది ఇంకొకందుకూడానండోయ్. "ఋజువు"లవసరం లేదని అనుకుంటున్నందుకూ, ఇంకొకడు కష్టపడి కనుక్కున్న విషయాన్ని "మాకివన్నీ ఎప్పుడో యెప్పుడో తెలుసు" అని బుకాయిస్తున్నందుకూ, ప్రపంచానికి గత వందేళ్ళలో, పోనే గత వెయ్యేళ్ళలో ఏ కంట్రిబ్యూషనూ చెయ్యకున్నా, మావాళ్ళు మేధావులు అనుకుంటున్నందుకూనూ.

      Delete
    3. మీలాంటి గొర్రెలతో మాట్లాడడానికి నాకు టైం, ఓపిక రెండూ లేవు. నేను చెప్పినవి మీకు కామెడిగా అనిపిస్తే, మిమ్మల్ని చూసి నేనూ నవ్వుకుంటాను. American Scientist magazineలో 2009 సంవత్సరంలో universe గురించి పడ్డ వ్యాసం చదవండి. (సంచిక నాకు గుర్తు లేదు). మనకి తెలిసిందే లోకమనుకునే కూపస్త మండూకాలతో నేనేమీ వాదించలేను. అంతగా కావాలనుకుంటే, ఇండియా వదిలి తెల్లోడి దగ్గర కొలువు చేయండి.. వాళ్ళు చెప్పిందానికి yes sir అంటూ...

      ఎవడో కనిపెట్టింది మనమే కనిపెట్టామని బుకాయించట్లేదు. నువ్వు మాట్లాడే భాష ఇక్కడా కనిపెట్టబడిందే. మనదగ్గిర ఇంతటి విజ్ఞానం పెట్టుకుని ఎవరో చెప్పింది నిజమని తలూపుతున్నామనే నా బాధ.

      Delete
  3. సైన్స్ అత్యంత ఉదారత గల చల్లని తల్లి! మనిషిని బుజ్జగిస్తుంది లాలిస్తుంది.జోకొడుతుంది.అది తనలోని తప్పులను నిరంతరము సవరించుకొంటూ సత్యమనే సాగరము వైపుగా ఉరకలెత్తే సెలయేరు!దాని స్వభావాన్ని కొంతైనా అర్థము చేసుకోడానికి ప్రయత్నము చేయక పోయినా ఫర్వాలేదు.ఆమే పాలు తాగుతూ ఆమే చన్నులనే గుద్దకుండా ఉండాలని అశిస్తున్నా.

    ReplyDelete
  4. /ఈ విశాల విశ్వంలో ప్రతీ అణువు మరో అణువుని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. ఇది క్వాంటం మెకానిక్స్‌లో మొదటి సూత్రం.అతి చిన్న పరమాణువు మొదలుకొని, నక్షత్ర మండలాల వరకు ఉన్న కోటాను కోట్ల పరమాణువులు నిత్యం అదృశ్యంగా ఒకదానితో ఒకటి సంభాషించుకుంటూ ఉంటాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం./

    సంభాషించుకోవడం అంటే ఏమిటి? ఎలా? దీన్ని మరికొంతగా క్వాంటం ఫిజిక్స్ సూత్రాల ఆధారితంగా విశదీకరించండి.

    /మనిషి శరీరంలో కూడా నూటికి 70 శాతం నీరు మాత్రమే ఉంటుంది. మనిషి ప్రవర్తనను నియంత్రించే మెదడులో అయితే 96 శాతం నీరు ఉంటుంది./
    భూమ్మీద వున్న జంతువులన్నింటికి దాదాపు 70% నీరు వుంటుంది కదా,మరి ...

    /ప్రతి గ్రహం ఒక్కొక్క ప్రత్యేకమైన రీతిలో ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తూ ఉంటుంది. ఆయా గ్రహాల్లో ఉండే మూలకాల్ని బట్టి, అది విడుదల చేసే ఫ్రీక్వెన్సీ ఆధారపడి ఉంటుంది./
    గ్రహాలు స్వయం ప్రకాశకాలు కావని అంటారు కాదా? ఈ పౌనఃపున్యము(ఫ్రీక్వెన్సీ) ఎట్టిది?
    ----
    /సైన్స్ అత్యంత ఉదారత గల చల్లని తల్లి! మనిషిని బుజ్జగిస్తుంది లాలిస్తుంది.జోకొడుతుంది.అది తనలోని తప్పులను నిరంతరము సవరించుకొంటూ సత్యమనే సాగరము వైపుగా ఉరకలెత్తే సెలయేరు!/
    సైన్సు తల్లివంటిదన్న కవితావేశం, సెంటిమెంటూ బాగుంది, మరి జ్యోతిష్యం ఏమిటి?
    సైన్సు తల్లివంటిదన్న కవితావేశం, సెంటిమెంటూ బాగుంది, మరి జ్యోతిష్యం ఏమిటి? అది తప్పులను తనంతట తాను సవరించుకోవడం లేదు. ఎవరైనా సవరిస్తే ఆ తల్లి పురోగతి చెందుతుంది.

    ReplyDelete
  5. విశ్వం నిర్దిష్ట సూత్రాల ప్రకారం నడుస్తుంది. అందులో మనిషి తో సహా ప్రతీదీ పరస్పర ప్రభావితాలే . అయితే ఊహాజనితం నిజం కాదు. ఉన్నదానిని ఊహించి చెప్పడం సరికాదు. చెప్పే ప్రతీదానికి ఆధారం చూపాలి. అపుడే అది విజ్నానం అవుతుంది. అందరికీ ఉపయోగపడుతుంది.

    ReplyDelete
    Replies
    1. ఊహ చెయ్యటం పక్కా శాస్త్రీయమే! అయితే ఊహించి సూత్రీకరించినవాటిని పరీక్షకు పెట్టాలన్నదానిలో బేధాభిప్రాయం లేదు. అన్ని శాస్త్రాలలోనూ fundamental axioms ఉంటాయి. వాటి ఆదారంగా రూపొందిన ఊహలు నిరూపితమైనప్పుడే సిద్ధాంతాలవుతున్నాయి. తద్వారా ఆ fundamental axioms కూడా ప్రామాణికతను పొందుతున్నాయి.

      Delete
  6. జగదీశ్‌గారు, మీదంతా పాత వాదమే. చంద్రుని గురుత్వాకర్షణకి మెదడులోని నీరు కదలడం అనేది జరగదు. మెదడులోని నీటిపై చంద్రుని గురుత్వాకర్షణ ప్రభావం ఉండదని ప్రముఖ వైద్యుడు డాక్టర్ సమరం గారు కొట్టిపారేశారు. పౌర్ణమికో, అమావాస్యకో పిచ్చి పెరుగుతుందనేది కేవలం మూఢ నమ్మకం. చెరువులోని నీరు పౌర్ణమి నాడు కదలదు. ఎందుకంటే చెరువులోని నీటిపై భూమి యొక్క గురుత్వాకర్షణ ప్రభావమే ఎక్కువగా ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. సమరం గారు కేవలం పాపులర్ వైద్యుడు మాత్రమే.. ఆయన గురించి నేనేమీ చెప్పనక్కర్లేదు.. విజ్ఞులయిన వారికి అంతా తెలుసు..

      Delete
  7. పదిహేనేళ్ళ క్రితం స్వాతి పత్రికలో సమరం గారికి ఒక పాథకుడు ఇదే ప్రశ్న అడిగాడు, అమావాస్యకీ, పౌర్ణమికీ పిచ్చి పెరుగుతుందనేది నిజమేనా అని. సమరం గారు అదంతా మూఢ నమ్మకం అని అన్నారు. మనిషి శరీరంలోని కదలికల గురించి వైద్యులు కూడా చెప్పని విషయాలు తమకి తెలుసని జ్యోతిష్యులు చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకుంటేనే వాళ్ళ వ్యాపారం నడుస్తుంది.

    ReplyDelete
  8. ఇదిగో అబ్బాయి ప్రవీణు,

    సమరం ఏమి చెబ్తే అదంతా వేదమేమిటి ? తను చెప్పిందంతా నిజమనడానికి ఆధారాలు ఏమిటి ?

    జిలేబి.

    ReplyDelete
  9. జ్యోతిష్యులు చెప్పినది మాత్రం వేదమనుకోవాలా?

    ReplyDelete
    Replies
    1. వేదాలా!!? ఎర్రగురివిందెలకి విషవృక్షం లెవెల్ చాలు, .

      Delete
  10. మానవ శరీరం ప్రొటీన్ కణాల వల్ల కదులుతుంది. అంతే కానీ అది కేవలం నీటి వల్ల కదలదు. దీని ప్రకారం చూసినా జ్యోతిష్యుల వాదన తప్పే అని అర్థమవుతుంది.

    ReplyDelete
    Replies
    1. నీరు అంటే ఆక్సిజన్ : హైడ్రోజన్ 32:1 మరి ఆక్సిజన్ లేకుండా ప్రోటీను గాలిలో ఈదుతుందా?
      ఇక్కడెందుకుగాని, యెళ్ళి జిలేబమ్మ బ్లాగులో చర్చించరాదూ.

      Delete
  11. జ్యోతిష్యము లో మీరు సత్యము అనుకున్న ఏదైనా ఒక specific example ఇవ్వండి.
    అది ఎందుకు సత్యము కాదో నేను వివరించగలను.

    ReplyDelete
  12. తెలుగు భావాలు గారి బ్లాగ్‌లో నేను ఈ వ్యాఖ్య వ్రాసాను. పబ్లిష్ చేసే ధైర్యం అతనికి ఉందో లేదో నాకు తెలియదు. ఆ వ్యాఖ్య ఇది:
    >>>>>
    డైరెక్ట్‌గానే చెపుతున్నాను. మనిషి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోకుండా జాతకంలో ఏమి వ్రాసి ఉంటే అది జరుగుతుంది అని అనుకుంటే బాగుపడతాడా? మీ వ్యక్తిగత నమ్మకాలు మీ ఇష్టం. రేపు మీ పిల్లలు కూడా ఇలాంటి నమ్మకాలని నమ్మి చెడిపోతే మీరు చూసి ఆనందిస్తారా? మాకు చెప్పడానికి నువ్వు ఎవరు అని నన్ను అడుగుతారు. మనిషి యొక్క అభివృద్ధి భౌతిక ఆలోచనలతోనే జరుగుతుంది. అంతే కానీ జాతకంలో ఏమి వ్రాసుంటే అదే జరుగుతుంది అనుకుని జాతకాల మీద ఆధారపడితే అది అభివృద్ధి నిరోధకమే అవుతుంది. మంచి ముహూర్తంలో పుట్టినవాడు ఆఫీసర్ అవుతాడు, దుర్ముహూర్తంలో పుట్టినవాడు దొంగ అవుతాడు అనుకుందాం. రేపు మీ పిల్లవాడు కూడా నేను దుర్ముహూర్తంలో పుట్టాను కనుక నాకు చదువు అబ్బదు, నేను స్కూల్‌కి వెళ్ళను అని అంటే ఎలా ఉంటుంది? కుటుంబ విషయాలు ప్రస్తావించొద్దు అని మీరు అంటారని నాకు తెలుసు. ఎందుకంటే వ్యక్తిగత విషయాలకొచ్చేసరికి ఇలాగే మాట్లాడిన బ్లాగర్లు చాలా మంది ఉన్నారు.
    >>>>>

    ReplyDelete
  13. ChandraSekhar Jinka wrote:
    >>>>>
    జ్యోతిష్యము లో మీరు సత్యము అనుకున్న ఏదైనా ఒక specific example ఇవ్వండి.
    అది ఎందుకు సత్యము కాదో నేను వివరించగలను.
    >>>>>
    నక్షత్రాల ప్రభావం గురించి సమాధానం చెప్పలేక గ్రహాల ప్రభావం మాత్రం ఉంటుందని శాస్త్రీయంగా తేలింది అని చెప్పి గ్రహాల ప్రభావానికి కూడా శాస్త్రీయ ఋజువులు చూపించలేకపోయారు కదా. Bipolar disorder పైన అమావాస్య పౌర్ణమిల ప్రభావం ఏమీ ఉండదు అని డాక్టర్లే చెపుతోంటే, ప్రభావం ఉంటుందని ఆయన వ్రాసారు. జ్యోతిష్యులు ఎంత సైన్స్ పేరు చెప్పుకున్నా సైన్స్‌ని కాపీ కొట్టలేరు. అదే జ్యోతిష్యంలో ఉన్న ప్రధాన లోపం.

    ReplyDelete
  14. @Mandangi ధైర్యముంటే దమ్ముంటే బ్లాగులకు రాజీనామా చేసి, ఎర్రనిక్కరు వేసుకుని టాంకుబండ్ మీద చిందేసి, తెలంగాణ పట్లు నిబద్ధత నిరూపించుకో

    ReplyDelete
  15. మిగతా వారికి అన్ని సమాధానాలు నా తదుపరి పోస్టులో...

    ReplyDelete
  16. ఎంత చెప్పినా అర్ధం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు చెప్పిన విషయాలు సత్యాలు

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.