కొత్త బంగారు లోకం ఎప్పుడు వస్తుందంటే...
1. ఏ పెన్ డ్రైవ్ పెట్టినా కంప్యూటర్ కి వైరస్ రాకుండా వుండాలి.
2. ఏ ప్రోగ్రాం రన్ చేసినా బగ్స్ రాకుండా వుండాలి. బ్లూ స్క్రీన్స్ అసలు రాకూడదు.
3. ఎప్పుడు నెట్ కి కనెక్ట్ అయినా కనీసం 2 ఎం.బి. స్పీడ్ వుండాలి.
4. ఇన్స్టాల్ చేసిన ఏ ప్రోగ్రాం అయినా ఏక్టివేషన్లు, డబ్బులు కట్టడం వంటివి ఏమి చెయ్యకుండానే పనిచేసేయ్యాలి.
5. ఇప్పుడు మా వీధి చివర ఏమి జరుగుతుందో గూగుల్ ఎర్త్‌లో చూడగలగాలి.
6. ఎలుకలు, మీటలు (కీ బోర్డ్, మౌస్) అవసరం లేని కంప్యూటర్ కావాలి.
7. ఏ కొత్త పార్ట్ కనెక్ట్ చేసినా డ్రైవర్స్ కోసం అస్సలు అడగకుండానే పనిచేసెయ్యాలి.
8. ఎంతసేపు కంప్యూటర్ ముందు కూర్చున్నా, బ్లాగింగ్ చేసినా నాన్న తిట్టకూడదు..
8. ఇక చివరిగా... నేను బ్లాగులో ఏ చెత్త రాసినా కనీసం వెయ్యిమంది చూడాలి. ఓ వంద కామెంట్లు రావాలి.
దేవుడా.. అటువంటి కొత్తబంగారు లోకంలోకి నన్ను తీసుకువెళ్ళు.
ఇంకా ఇలాంటి కోరికలు మీకుకూడా వుంటే ఇక్కడ చెప్పండి. అందరం కలిసే ప్రార్ధిద్దాము...
:) :)
ReplyDeleteవైర్లెస్ పవర్/కరెంట్ కావాలి!
ReplyDeleteగూగుల్ ఎర్తులో మా ఇంట్లో ఏం చేసుకునేది మాత్రం కనిపించకూడదు!
మీ కోరికలు బాగున్నాయి. కొత్త టపాలేమి వ్రాయట లేదా.
ReplyDelete