కొత్త బంగారు లోకం ఎప్పుడు వస్తుందంటే...
1. ఏ పెన్ డ్రైవ్ పెట్టినా కంప్యూటర్ కి వైరస్ రాకుండా వుండాలి.
2. ఏ ప్రోగ్రాం రన్ చేసినా బగ్స్ రాకుండా వుండాలి. బ్లూ స్క్రీన్స్ అసలు రాకూడదు.
3. ఎప్పుడు నెట్ కి కనెక్ట్ అయినా కనీసం 2 ఎం.బి. స్పీడ్ వుండాలి.
4. ఇన్స్టాల్ చేసిన ఏ ప్రోగ్రాం అయినా ఏక్టివేషన్లు, డబ్బులు కట్టడం వంటివి ఏమి చెయ్యకుండానే పనిచేసేయ్యాలి.
5. ఇప్పుడు మా వీధి చివర ఏమి జరుగుతుందో గూగుల్ ఎర్త్‌లో చూడగలగాలి.
6. ఎలుకలు, మీటలు (కీ బోర్డ్, మౌస్) అవసరం లేని కంప్యూటర్ కావాలి.
7. ఏ కొత్త పార్ట్ కనెక్ట్ చేసినా డ్రైవర్స్ కోసం అస్సలు అడగకుండానే పనిచేసెయ్యాలి.
8. ఎంతసేపు కంప్యూటర్ ముందు కూర్చున్నా, బ్లాగింగ్ చేసినా నాన్న తిట్టకూడదు..
8. ఇక చివరిగా... నేను బ్లాగులో ఏ చెత్త రాసినా కనీసం వెయ్యిమంది చూడాలి. ఓ వంద కామెంట్లు రావాలి.
దేవుడా.. అటువంటి కొత్తబంగారు లోకంలోకి నన్ను తీసుకువెళ్ళు.
ఇంకా ఇలాంటి కోరికలు మీకుకూడా వుంటే ఇక్కడ చెప్పండి. అందరం కలిసే ప్రార్ధిద్దాము...
Monday, January 18, 2010
Sunday, January 17, 2010
బెస్ట్ బ్లాగ్ పోటీలు 2009... మొదటి 10 బ్లాగుల్లో సరదా కూడా వుంది...
ఆంధ్ర లేఖ.కాం వారు నిర్వహించిన 2009 సంవత్సరపు అత్యుత్తమ బ్లాగ్ పోటిల్లో మొదటి పది బ్లాగుల్లో నా బ్లాగ్ కూడా ఎన్నిక కావడం చాలా సంతోషాన్ని కలిగించింది. క్లారిటి, విషయం మరియు ఆదరణలని అనుసరించి ఈ ఎన్నిక జరిగింది. దీనికి ముందుగా ఆంధ్ర లేఖ వారికి బ్లాగ్ ముఖంగా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను. ఇంతకాలం నేను సరదాగా రాసినా, సీరియస్ విషయాలు రాసినా మీ అందరి ఆదరాభిమానాలతోనే ఇంతటి గౌరవం పొందడం సాధ్యం అయింది. మీ అందరి ఆదరాభిమానాలకీ మరొక్క సారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఇప్పుడు ఈ పది బ్లాగుల్లో వుత్తమమయిన వాటి కోసం సందర్శకుల అభిప్రాయం అడుగుతున్నారు. మీకు నా బ్లాగ్ నచ్చినట్లయితే, http://www.andhralekha.com కు వెళ్ళి అడుగు భాగంలో వున్న Opinion Poll కి వెళ్ళి, నాకు vote చెయ్యగలరు.ధన్యవాదాలతో..
మీ..
ఎస్పీ జగదీష్.
మీ..
ఎస్పీ జగదీష్.
Subscribe to:
Posts (Atom)