Pages

Tuesday, December 15, 2009

నేనూ నిరాహార దీక్ష చేస్తా.. నాకూ ఒక రాష్ట్రం ఇస్తారా.... ప్లీజ్....

నాకూ ఒంటి నిండా పని లేకుండా పోయింది... ఎంతసేపూ చిన్న చిన్న వ్యాపారాలు ఏమి చేస్తాం? శుభ్రంగా నిరాహార దీక్ష అని పేరు చెప్పి కాస్సేపు తిండి తినకుండా కూర్చుంటే... ఆ పై అమ్మ దీవెన లభిస్తే నేను కూడా ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్య మంత్రి అయిపోవచ్చు.

ఏమిటీ పనికి మాలిన సోది అనుకుంటున్నారా?.. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది చూస్తుంటె అదే అనిపిస్తుంది. కాస్త కడుపుకి అన్నం తింటున్న వాడెవడికయినా సేం ఫీలింగ్ వస్తుంది. అసలింత అర్జంటుగా రాష్ట్రాన్ని ముక్కలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పమంటే ఎవరూ చెప్పరు. పోని తెలంగాణా వాళ్ళకు జరిగిన అన్యాయం ఏమిటో ఎవరూ చెప్పరు. అదేదో బ్రహ్మ పదార్ధం అనుకుంటా. మనకు అర్ధం కాదు. పూర్వం నుంచి తెలంగాణా వాదాన్ని తెరపైకి తెస్తున్న వారందరికీ రాజకీయ దురుద్దేశ్యం తప్ప మరొకటి వున్నట్టు కనబడదు. రాష్ట్రాన్ని భాషా ప్రయుక్తంగా అంటే భాషల వారీగా విడదీసినప్పుడు తెలుగు వాళ్ళందరు ఒకే నేలపై సంఘటితంగా వుండాలని కోరుకుంటేనే కదా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది? మళ్ళీ ఇప్పుడేమిటీ గోల? మనం వున్నది ప్రజాస్వామ్యంలోనే కదా.. మనకు కావలసినవి శాసన సభలో పోరాడి సాధించుకోవచ్చు. ఇలా ఎవరికి వారు తమకు అన్యాయం జరుగుతోందని రోడ్లెక్కి కొట్టుకుంటే, ప్రతీ ఒక్కరికి ఒక్కో రాష్ట్రం ఇవ్వడం మొదలు పెడితే దేశాన్ని కనీసం ఒక వంద ముక్కలు చెయ్యాలి. బహుశా అంతకన్న ఎక్కువయినా ఆశ్చర్య పడనక్కర్లెదు.

భారత దేశ చరిత్రని పరిశీలిస్తే పూర్వం నుండి, ఈ దేశంలో అనేక రకాలయిన ప్రజలు సహజీవనం సాగిస్తున్నారు. వారు ఏ సంస్కృతికి చెందిన వారయినా, ఏ భాష మాట్లాడే వారయినా, ఏ మతానికి చెందిన వారయినా ఇక్కడ చక్కటి ఐకమత్యంతో ఒకే ఒక భారతీయత అనే భావంతో వున్నారు. అయితే మధ్య యుగాల్లో ప్రాంతాల వారిగా ఎక్కువయిన పోరాటాల వల్ల స్తానిక రాజులకి ఒకరికొకరికి పడక, వీళ్ళళ్ళొ వీళ్ళు కొట్టుకుచచ్చి దేశాన్ని ముందుగా ముస్లింలకి, తరువాత యూరోపియన్స్ కి అప్పచెప్పారు. ఇంక వాళ్ళు పెట్టే బాధలు పడలేక మనందరం ఏకమై భారతీయులమనే భావనతో స్వాతంత్ర పోరాటం చేసాము.. సాధించుకున్నాము.. స్వాతంత్రం వచ్చిన తరువాతయినా ఇంకా మిగిలిపోయిన సంస్తానాల్ని భారతావనిలో విలీనం చేయడం అనే కార్యక్రమం సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వుక్కు మనుషుల కృషి ఫలితంగా అఖండ భారతావని ఆవిర్భవించింది.

ఇప్పుడు కె.సి.ఆర్ లాంటి వాళ్ళని చూస్తుంటే మళ్ళీ చరిత్ర పునరావృతమవుతుందేమో అనిపిస్తుంది. దేశాన్ని మళ్ళి కుక్కలు చింపిన విస్తరి చేస్తారేమో అనిపిస్తుంది... అలాంటి చిల్లర రాజకీయ నాయకుల్ని, మతిలేని వాళ్ళని అదుపులో పెట్టుకోలేక పోవడం వల్లనే నేడు ఈ దుస్తితి వచ్చింది. ఎందుకూ పనికిరాని కె.సి.ఆర్ ప్రసంగాలని, వాడు చేసే అర్ధం లేని పనులని కూడా రోజూ మెయిన్ హెడ్డింగుల్లో, కలర్ ఫోటోల్లో వేసి ప్రజలందరికి వాడినొక పెద్ద నాయకుడిగా ఇమేజ్ కల్పించిన మీడియాకి కూడా ఈ పాపంలో భాగం వుందని చెప్పక తప్పదు. అడగ్గానే రాసిచ్చెయ్యడానికి ఇదేమీ ఆయన సొంత జాగీర్దారు కాదు కదా. కోట్లాది ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన సున్నితమయిన అంశం.

కె.సి.ఆర్ అడిగాడు కదాని తెలంగాణా ఇచ్చెస్తే దేశం ఇంకా వంద ముక్కలవుతుంది. రేపు మళ్ళి ఇదే కె.సి.ఆర్ పత్యేక తెలంగాణా దేశం కావాలని నిరాహార దీక్ష చెయ్యడని నమ్మకమేమిటి? అప్పుడు కూడా ఇలాగే హైదరాబాద్ ప్రత్యేక దేశం ఏర్పాటు చేస్తారా? ఒకవేళ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా ఇస్తే, ఇప్పటికే హైదరాబాద్ వున్న వుగ్రవాదుల్ని ఆణచడంలో ఆ చిన్న రాష్ట్రానికి వున్న శక్తి సరిపోతుందా... ఒక వేళ ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల లాగా తెలంగాణా పూర్తిగా వుగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోతే దాన్ని నిరోధించే సత్తా ఈ వూసరవెల్లి రాజకీయ నాయకులకి వుంటుందా?

ఇక్కడ తెలంగాణా ఇవ్వాలా వద్దా అనేది కాదు సమస్య.. అసలు తెలంగాణా రాష్ట్రం అవసరమా కాదా అనేదే... గొడవలనేవి ఎక్కడయినా వుంటాయి... అన్యాయం అనేది ఎక్కడయినా జరుగుతుంది.. అది భార్యా భర్తల మధ్య కావచ్చు.. అన్నదమ్ముల మధ్య కావచ్చు.. అత్తా కోడళ్ళ మధ్య కావచ్చు. ప్రతీ దానికి విడిపోవడమే పరిష్కారం అనుకుంటే ఇంక మనకు చుట్టుపక్కల కలిసుండే వాళ్ళెవరు కనిపించరు. చచ్చి సాధించేదేమీ వుండదు.. విడిపోయి బావుకునేదేమీ వుండదు. కలిసి వుంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. ప్రతీ సమస్యకీ ఒక పరిష్కారం వుంటుంది. అది సరయిన సమయంలో కనుక్కోవడంలోనే విజ్ఞత వుంటుంది...

రాజకీయమంటే ప్రజల బలహీనతలతోను, వారి భావోద్వేగాలతోనూ ఆడుకోవడం కాదు.. నిజంగా మనస్ఫూర్తిగా వారి బాగుకోసం కృషి చేసిన వారే ధీరోదాత్తులుగా చరిత్రలో నిలబడతారు.. అంతే గాని చవకబారు రాజకీయాలు చేసి, తెలుగు జాతిని నిలువునా విడదీసి, వారి ఆత్మ గౌరవాన్ని బజారు కీడ్చి, ప్రపంచం ముందు తలవంచుకొనేలా చేస్తున్న కె.సి.ఆర్. వంటి నాయకుల్ని చరిత్ర, భావి తరాల ప్రజలు క్షమించరు...

12 comments:

  1. memu already modalettam

    sarath gaaru - jai nallagonda
    shashank gaaru - hyderabad rastra samithi

    nagaprasad gaaru - jai anathapuram ,jai tadipatri

    nenu - jai kurnool - jai allagadda ani ...chaala modalettasamu ...meere alasyam cheppandi ... meeke desam raastram kaavaalo ?

    ;-) ....

    siggu leni prajalaku enni chepthe vintaru sir ?
    mandu pondu vindulaku votlu vese neecha mundmopi janalam mari ... managathi inthe ... :-(

    ReplyDelete
  2. పెద్దగ అనకయ్య బాబు మల్ల చెంగాలిచ్చుకుంటా వచ్చి రాసారు ఆంధ్రోల్లు అంటారు

    నాకు ప్రత్యెక ఒంగోలు కావాలి

    ReplyDelete
  3. ఇప్పుడు చూడండి వచ్చి ఓ పది you tube video link లు ఇస్తారు, లెకపొతె cut & paste ఒ పది ఎంగ్లిపీసు కామెంట్లు పెడతారు. రండి బాబూ రండి :)

    ReplyDelete
  4. సరే మీరందరూ అలా డిసైడ్ అయిపోయేకా నేనెందుకు ఊరుకుంటానూ... జై గోదావరి రాష్ట్రం.. (మా రెండు జిల్లాలు కలిపి)

    ReplyDelete
  5. అబ్బే! రాష్ట్రాన్ని ఏం చేసుకుంటారండి? ఢిల్లీలో మేడం ముందు చేతులు కట్టుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రాదు.

    అడిగితే ప్రత్యేక దేశమే అడగాలి. :)

    నేను కూడా మా అనంతపురం జిల్లాని ప్రత్యేక దేశం చెయ్యాలని ఉద్యమం ప్రారంభించాను. :)

    http://nagaprasadv.blogspot.com/2009/12/blog-post_14.html

    ReplyDelete
  6. నేనూ ఒక సరికొత్త దేశం డిమాండ్/ఏర్పాటు చేస్తున్నాను. నా టపా కోసం చూడండి.

    ReplyDelete
  7. ఇదేదో బావుంది. ఆ మధ్యన రచయిత్రి అరుంధతి రాయ్ బీజేపీ ప్రభుత్వమ్మీద ఆగ్రహించి, తనొక్కత్తే ప్రత్యేక దేశంగా తీర్మానించుకుంది.

    ReplyDelete
  8. @ కొత్తపాళీ
    నిజమే? అయితే నేనూ ఇందులో ముందుంటా. ఇకనుంచీ నా కలం పేరు శరత్ 'కాలం' అని కాకుండా శరత్ 'దేశం' అని మార్చేస్తానని తీర్మానిస్తున్నాను.

    ReplyDelete
  9. నేనొప్పుకోను ఖైరతాబాద్, పంజాగుట్ట, బషీర్ బాగ్, హిమాయత్ నగర్ ఇలా దేశాలు చేయాలంతే...ఎవరి బస్తీ వాళ్లకో దేశం చేస్తే పోయేదేముంతంట??

    ReplyDelete
  10. అసలు ఈ కె సి ఆరు,మధు యాక్షీ గాడూ సర్వే గాడూ ఈ 5 ఎళ్ళలో వాళ్ళ ఎంపీ నిధులతో వాళ్ళ నియోజకవర్గం లో ఎమి వూడబొడిచారో కాస్థ చెపుతారా

    ReplyDelete
  11. well said,jai Dhone, nene CM

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.