Monday, January 26, 2009
మనుషులు గర్జిస్తారా? మాట్లాడతారా?
సాధారణంగా మనుషులందరూ ఏదో ఒక భాష మాట్లాడుతుంటారని తెలుసు. జంతువులయితే, ఆయా జాతుల స్వభావాన్ని బట్టి వాటి భాషకి ఒకో పేరు పెట్టడం జరిగింది. అంతవరకు ఓ.కే. కానీ ఈ మధ్యన ఏ పేపర్ చదివినా, ఏ టి.వి చూసినా, ఒకతే గర్జన, ఘీంకారాలు కనిపిస్తున్నాయి. కొన్నాళ్ళ పాటు యువ గర్జన గురించి విన్నాము. బహుశా యువకులందరూ మాట్లాడ్డం మానేసి, గర్జిస్తున్నారేమో అనుకున్నాను. తరువాత కొన్నళ్ళకి మాల గర్జన, మాదిగ గర్జన, వెలమ గర్జన, కమ్మ గర్జన అంటూ అన్ని గర్జనలు వినిపించాయి. ఇప్పుడు కొత్తగా మహిళా గర్జన కూడా త్వరలో నిర్వహిస్తామని ఒక రాజకీయ పార్టీ వారు ప్రకటించారు. నాకు తెలిసినంత వరకు సింహాలు మాత్రమే గర్జిస్తాయి. మరి ఈ మనుషులు గర్జించడమేమిటో. హాయిగా మనుషులందరూ కూర్చుని మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి కదా. రాజకీయ పార్టిలకి ప్రజల సమస్యల మీద ఎటువంటి చిత్తశుద్ది లేనంత కాలం, జనాలకి గేలం వేసే ఇటువంటి చౌకబారు సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే వుంటాయి. నిజంగా ప్రజలకి మేలు చేసే ఏ నాయకుడిని గాని, రాజకీయ పార్టీని గాని జనం ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. అటువంటి వారు ఎటువంతి గర్జనలూ చెయ్యనక్కరలేదు. హాయిగా మాట్లాడితే చాలు, జనం అర్ధం చేసుకుంటారు. అందరూ ఈ విషయం గుర్తెరిగి ఇకపై హాయిగా మాట్లాడుకుంటారని ఆశిస్తూ, అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
Thursday, January 1, 2009
పంచాంగం కాలండర్ మీకు నచ్చిందా?
అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు,
నేను తెలుగు పంచాంగం కాలండర్‌ని అంతర్జాలంలో పెడదామనుకున్నపుడు ఈ ఆధునిక యుగంలో అందునా, కంపూటర్ వాడేవాళ్ళకి పంచాంగంతో ఏమి పని ఉంటుందా అని ఆలోచించాను. కాని నా ఊహ తప్పని తేలింది. నిన్నటి నుండి ఇప్పటి వరకు సుమారుగా 80 మందికి పైగ, ఈ ఫైల్‌ని దిగుమతి చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. దీనితో రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని ఫైల్స్ మీకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. సాధారణంగా ప్రింటింగ్ ప్రెస్ వద్ద వుండే ఫైల్స్ ఎటువంటి అచ్చుతప్పులు లేకుండా, ఒరిజినల్ PDF files ఉంటాయి. మేము ప్రింట్ చేసే వాటిలో అందరికీ ఉపయోగపడే మంచి పుస్తకాలని వీలు దొరికినప్పుడల్లా మీకు అందజేస్తూంటాను. నా ఈ ప్రయత్నాన్ని మీరందరూ సహృదయంతో ఆదరించి అభినందిస్తారని ఆశిస్తున్నాను.
గమనిక: ఈ కాలండర్ గురించి మీ అమూల్యమయిన సూచనలు, సలహాలు నాకు తెలియచేయండి.
నిన్న download చేసుకోని వారికోసం కాలండర్ లంకెలు మరలా ఇస్తున్నాను.
rapidshare
mediafire

Subscribe to:
Posts (Atom)