Sunday, September 13, 2020
చాలా కాలం తరువాత.... మరలా మీ ముందుకు...
సరదా బ్లాగ్ వీక్షకులకు నమస్కారం. నేను కొన్ని వ్యక్తిగత కారణాల వలన బ్లాగింగ్ కు దూరం అయ్యాను. ఇప్పుడు మరలా మీ అందరిని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో వలే ఇకమీదట కూడా నేను పెట్టబోయే బ్లాగులను చదివి ఆనందిస్తారని, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
Sunday, June 23, 2019
గోదారమ్మకి దిక్కెవరు...?
వేసవి కాలం సెలవులకి పిల్లలతో కలిసి రాజమండ్రి విహార యాత్రకు వెళ్ళాము. ముందుగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దగ్గర కొంత సేపు ఆగాము. గోదావరి అందాల్ని ఆస్వాదించి, అక్కడి నుండి రాజమండ్రి వెళ్ళాము. గోదావరి గట్టు వెంబడి కార్పొరేషన్ వాళ్ళు పెంచిన అందమైన గార్డెన్స్ చూడడానికి రోడ్ పక్కన కార్ పార్క్ చేసి, లోపలికి వెళ్ళాము. చాలా అందంగా తీర్చిదిద్దారు. తీరా లోపలికి వెళ్ళాక, మురుగు కంపు వచ్చింది. ఎక్కడి నుండి వచ్చిందా అని రైలింగ్ నుండి కిందకి చూస్తే, పట్టణంలో ఉన్న మురుగునీటి కాలువని డైరెక్ట్‌గా గోదావరి నదిలోకి పెట్టేసారు. ఎక్కడెక్కడి మురుగు, ప్లాస్టిక్, చెత్త అంతా గోదావరిలోకి ప్రవహిస్తుంది. చూసి చాలా బాధేసింది. గోదావరిని తల్లిలా, దైవంలా భావిస్తూనే మురుగు నీటితో కలుషితం చేయడం సబబు కాదు. ఆ నీటినే గోదావరి కింద ఉన్న కొన్ని వందల గ్రామాల వారు త్రాగు నీటిగా, సాగు నీటిగా వాడుతూ ఉంటారు. అటువంటి పవిత్రమైన నదిలోకి ఇలా నిర్దాక్షిణ్యంగా మురుగు నీటిని వదలడం చాలా తప్పు.
నదులను దేవతలుగా పూజించే సంప్రదాయం మనది. ఒక పక్క పూజలు చేస్తూనే మరో పక్క నదులను కలుషితం చేయడం మనకే చెల్లింది. ఇతర దేశాల్లో, ముఖ్యంగా యూరప్ దేశాలలో నదులను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. లండన్ మధ్య నుండి ప్రవహిస్తున్న థేమ్స్ నది కానివ్వండి, పారిస్ నగరంలో ప్రవహిస్తున్న డాన్యూబ్ నదిని కాని, అక్కడి ప్రజలు చాలా గౌరవంగా చూసుకుంటారు. మనలాగా పూజలు, పండుగలూ చేయకపోయినా, నదుల్ని కలుషితం కానివ్వరు. నీరు స్వచ్ఛంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ నీటిలో ఉండే జలచరాలకు కూడా ఎటువంటి హాని కలుగనివ్వరు.
ఇదే శ్రద్ధ మనమెందుకు తీసుకోలేము. గోదావరి, కృష్ణాతో పాటుగా రాష్ట్రంలో ప్రవహించే జలవనరుల్ని జాగ్రత్తగా కాపాడుకుని, ముందు తరాలకి అందించవలసిన బాధ్యత మనందరి మీదా ఉంది. ప్రభుత్వం, అధికారులు దీని మీద శ్రద్ద వహించి, మురుగు నీటిని ఆధునిక పద్దతుల ద్వారా శుద్దిచేసి, దాన్ని మొక్కలు పెంచడానికి, ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల నీరు పరిశుభ్రంగా ఉండడమే కాకుండా, ప్రజల్ని అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
Monday, August 13, 2018
మూర్ఖత్వానికి పరాకాష్ట
కొన్ని మతాలలో మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపే వృత్తాంతం ఇది. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని వైజ్ఞానికంగా రుజువు చేసినందుకు గెలీలియోకు మరణశిక్ష విధించారు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం శాస్త్రీయ జ్ఞానం కొద్దిగా కూడా లేనివాళ్ళ చేత వ్రాయబడిన మత గ్రంధాన్నే ఇప్పటికీ ప్రామాణికంగా తీసుకుంటామనే మత పెద్దల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కాని, అప్పటికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతదేశం వైజ్ఞానికంగా ఎంతో ముందడుగు వేసింది. ప్రాచీన ఖగోళవేత్త అయిన ఆర్యభట్ట - భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని ప్రపంచానికి చాటిచెప్పాడు. వేదాలకి అనుబంధంగా ఉండే జ్యోతిషశాస్త్రంలో కూడా వివిధ గ్రహ గతుల్ని ఖచ్చితంగా లెక్కలు కట్టడమే కాకుండా, సూర్యునికి, భూమికి మధ్య దూరాన్ని, భూగోళ వైశాల్యాన్ని, చంద్రుని వ్యాసార్థాన్ని ఇప్పటి లెక్కలకు సరిపోయే రీతిలో సిద్ధాంతాల్ని రూపొందించి ఉంచారు. ఏ ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు ఏ ఏ రాశుల్లో సంచరిస్తాయో, సూర్య, చంద్ర గ్రహణాల అవధుల్ని, అవి ఎప్పుడు సంభవిస్తాయో కూడా పూర్తి శాస్త్రీయంగా లెక్కించగలిగారు. అదీ మన భారతీయ శాస్త్రవేత్తల, మహర్షుల గొప్పదనం.
Sunday, July 15, 2018
అందం చాటున దాగివున్న ముప్పు - ఆడపిల్లలూ.. జాగ్రత్త...
అమ్మాయిలకున్న బలం - బలహీనత - రెండూ వారి అందం... అందంగా కనబడడం కోసం ఏమైనా చేయడానికి, ఏదైనా పూసుకోవడానికి, ఎంతైనా ఖర్చుపెట్టడానికి వారు సిద్ధం అయిపోతూ ఉంటారు. ఇదిగో... సరిగ్గా ఇదే బలహీనతని సొమ్ము చేసుకోవడానికి వీధి చివర ఉండే బ్యూటీ పార్లర్ నుండి బహుళజాతి కంపెనీలు వరకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి. రకరకాలుగా ప్రలోభ పెట్టి, తెల్లగా లేకపోతే అదేదో పెద్ద నేరం అయినట్టు, అందరిలోను ఆకర్షణీయంగా కనబడకపోతే ఇక బ్రతుకే లేనట్లుగా ప్రకటనలు గుప్పిస్తూ ఉంటాయి. అది చూసి, ఎంతో మంది ఆడపిల్లలు, ముఖ్యంగా టీనేజ్‌లో ఉన్న పిల్లలు, టి.విలోను, పత్రికల్లోను కనబడే ప్రకటనలు చూసి, ఆయా బూడిదలు... సారీ... ఫేస్ పౌడర్లు కొనుక్కుంటూ ఉంటారు. కంపెనీలకు కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెడుతూ ఉంటారు.
సరిగ్గా అలాంటి సౌందర్య సాధనాలు తయారుచేసే కంపెనీపైనే అమెరికాలో కొందరు మహిళలు కేసుపెట్టారు. ఆ కంపెనీ తయారు చేసే పౌడర్‌లో వాడే ఆస్బెస్టాస్ వల్ల అండాశయ కేన్సర్ వచ్చిందని కొందరు మహిళలు కోర్టుకెక్కారు. ఎన్నో పరీక్షలు నిర్వహించిన తరువాత, వైద్య నివేదికలు పరిశీలించిన తరువాత వారు చెప్పింది నిజమేనని కోర్టు తెల్చి, వారికి 31,000 కోట్ల రూపాయిలు పరిహారం చెల్లించాల్సిందిగా తీర్పు వెలువరించింది. (ఇక్కడ నేను పెట్టిన న్యూస్ క్లిప్పింగ్ - ఈనాడు పత్రికలో 13-7-2018 తేదీన ప్రచురితమైనది). ఈ తీర్పు అందం వెంట పరుగులు తీసే యువతరానికి కనువిప్పు కావాలి.
బహుళ జాతి సంస్థలు కేవలం లాభాలపైనే దృష్టి సారించి, ఎన్నో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా అమెరికన్ కంపెనీలు నైతిక విలువలకి పూర్తిగా తిలోదకాలిస్తాయి. లాభాల కోసం ఎంతకైనా దిగజారతాయనేది ఎన్నో ఉదంతాలలో రుజువయింది.. ఇక ముందు కూడా రుజువవుతూనే ఉంటుంది. ధమ్స్ అప్ యాడ్‌లో కింద చిన్న చిన్న అక్షరాలతో ఇది ఆరోగ్యానికి హానికరం అని మీరు గమనించే ఉంటారు. కాని సౌందర్య సాధనాలు (ఫేస్ పౌడర్లు, ఫెయిర్ అండ్ లవ్లీ క్రీములు, బాడీ లోషన్లు) లో ఎటువంటి హానికర రసాయనాలు వాడతారో, వాటిని ఎలా తయారుచేస్తారో ఎవరికీ తెలియదు. అవి శరీరంపై దీర్ఘ కాలంలో ఎటువంటి దుష్ప్రభావాలు చూపుతాయో ఎవరూ చెప్పరు. ఒక వేళ ఎవరైనా చెప్పే ప్రయత్నం చేసినా, డబ్బుతోను, అధికారంతోను వారి నోరు నొక్కే ప్రయత్నం చేస్తారు. బాధ్యత లేని రాజకీయ నాయకులు, లంచాలు మరిగిన ప్రభుత్వ అధికారులు వారికి కొమ్ము కాస్తూ ఉంటారు. అందుకే ప్రజలు తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవాలి.
అమ్మాయిలు కూడా అందం అంటే కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాదు అని గుర్తు పెట్టుకోవాలి. కేవలం ఫెయిర్ అండ్ లవ్లీ వాడినంత మాత్రం అందంగా కనబడతామనే అపోహను మానుకోవాలి. అటువంటివి వాడడం వలన స్కిన్ ఎలర్జీ వంటి వాటిలో మొదలై, కేన్సర్ వంటి భయంకరమైన జబ్బుల బారిన పడతారు. చర్మం తెల్లగా రావడం కోసం వాటిలో ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతారు. అవి దీర్ఘ కాలంలో శరీరంలో చేరి వివిధ అవయవాల పనితీరుని దెబ్బతీసి, చివరకు మరణానికి చేరువ చేస్తాయి. పైగా వాటిని కొనడం కోసం పెట్టే డబ్బు, కుటుంబ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక పౌడర్ రాసుకోవడం వలన ఒక జబ్బు వస్తే, మళ్ళీ వాటిని నివారించడం కోసం మరో క్రీమ్ రాసుకోవడం... ఇదో విషవలయంలా మారుతుంది.
మరో ముఖ్య విషయం... ఎటువంటి క్రీములు, లోషన్లు, పౌడర్లు వాడకపోయినా మన అమ్మమ్మలు, నాన్నమ్మలు ఎంత ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా ఉన్నారో వారిని అడిగి తెలుసుకోండి. భారతీయుల సౌందర్యానికి ముఖ్య కారణం వారుపాటించే సంప్రదాయ సౌందర్య చిట్కాలే. పూర్తి ఆయుర్వేద పరంగా, ప్రకృతిలో సహజంగా దొరికే పసుపు, సున్నిపిండి శరీరానికి పట్టించి, నలుగు పెట్టి స్నానం చేసేవారు. గంధం చెక్క అరగదీసి, ఆ గంధాన్ని ముఖానికి పట్టిస్తే, చర్మం చల్లబడి, గంధం, పసుపు మంచి యాంటీ బయోటిక్‌గా పనిచేసి, మొటిమలు, బాక్టీరియా వంటివి రాకుండా నివారించి చర్మాన్ని ఎప్పుడూ ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి. ఆరోగ్యంగా ఉంటే అదే అందం... అటువంటి అందమే నిజమైన సౌందర్యం...

Subscribe to:
Posts (Atom)